23, ఆగస్టు 2024, శుక్రవారం

దర్శన గ్రంథము 21:9- 14 యోహాను1:45-51

పునీత బర్తలోమయి అపోస్తులుడు 

దర్శన గ్రంథము 21:9- 14 యోహాను1:45-51

ఫిలిప్పు నతనయేలును కనుగొని, "మోషే ధర్మశాస్త్రమునందును, ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడినవానిని మేముకనుగొంటిమి. ఆయన యేసేపు కుమారుడును, నజరేతు నివాసియునగు యేసు" అని చెప్పెను. "నజరేతునుండి ఏదైనా మంచి రాగలదా? అని నతనయేలు అడుగగా, "వచ్చి చూడుము" అని ఫిలిప్పు పలికెను. నతనయేలు తన యొద్దకు వచ్చుటను చూచి, అతనిని గూర్చి యేసు "ఇదిగో!కపటము లేని నిజమైన యిస్రాయేలీయుడు" అని చెప్పెను. "మీరు నన్ను ఎట్లు  ఎరుగుదురు?" అని నతనయేలు అడుగగా యేసు, "ఫిలిప్పు నిన్ను పిలువక పూర్వమే, నీవు అంజూరపుచెట్టు క్రింద ఉండుటను నేను  చూచితిని" అని సమాధానమిచ్చెను. "బోధకుడా! నీవు దేవుని కుమారుడవు, యిస్రాయేలు రాజువు" అని   నతనయేలు పలికెను. "నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచితిని, అని చెప్పినందువలన నీవు నన్ను విశ్వసించుచున్నావా?  ఇంతకంటే గొప్పకార్యములను నీవు చూడగలవు" అని యేసు చెప్పెను. ఇంకను, "మీరు పరమండలము తెరువబడుటయు, దేవునిదూతలు మనుష్యకుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుటయు చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" అని పలికెను. 

ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాడు మనం పునీత బర్తలోమియో గారి పండుగను కొనియాడుకుంటున్నాము. పునీత బర్తలోమయి గారు పన్నెండు మంది శిష్యులలో ఒకరు. ఈయన గలిలియాలోని కానా గ్రామ నివాసి. వీరికి మరో పేరు నతనయేలు. నతనయేలు పవిత్ర జీవితం గడుపుతున్న యూదుడు. ఆయన రక్షకుడి  రాకకోసం నిత్యం ప్రార్ధనలు చేసే భక్తుడు. ఫిలిప్పుగారికి ఆప్తమితృడు. అదేవిధంగా బాప్తిస్మ యోహాను శిష్యుడు. ఫిలిప్పు గారు మేము మెస్సియ్యను కనుగొంటిమి అని చెప్పగానే నతనయేలు యేసు ప్రభువును కలుసుకునేందుకు ఫిలిప్పు గారితో పాటు బయలు దేరాడు. యేసు ప్రభువు వారిని చూడగానే ఇదిగో కపటము లేని నిజమైన యిస్రాయేలీయుడు అని అంటున్నాడు.  నతనయేలు అనగా నిష్కళంకమైన నిజాయితీ కలవాడని అర్ధం. నతనయేలు బోధకుడా! నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు. క్రీస్తు కొరకు ఎదురు చూసి ఆయనను కనుకొని ఆయన కొరకు జీవిస్తూ, ఆయన క్రీస్తు సేవ చేసి, క్రీస్తు ప్రభువుని సాక్షిగా తన ప్రాణమును ధారపోసి రక్త సాక్షిగా మరణించాడు. 

క్రిస్తునాధుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా పవిత్ర నగరమైన యెరూషలేమును గూర్చి వింటున్నాం. ఆ యెరూషలేము నగరము ఒక అమూల్యమైన రత్నము వలెను, సూర్యకాంతమణి వలెను.  స్ఫటికము వలే స్వచ్ఛముగను ఆ నగరము ప్రకాశించెను అని ఆ యెరూషలేము యొక్క విశిష్టతను వింటున్నాం. పండ్రెండు ద్వారములు. వాటిపై పండ్రెండు మంది దేవదూతలు, ఆ ద్వారములపై పండ్రెండు గోత్రముల పేర్లు వ్రాయబడినవి అని అదే విధంగా ఒక్కొక్క ప్రక్కకు మూడేసి ద్వారములు ఉండెను. తూర్పున మూడు, దక్షిణమున మూడు ఉత్తమున మూడు పశ్చిమమున  మూడు అన్ని కలిపి  పండెండు ద్వారములు, ఆ నగరపు గోడ 12 శిలలపై నిర్మింపబడినది. ఆ రాళ్లపై క్రీస్తు ప్రభువుని  పండ్రెండు మంది అపొస్తలుల పేర్లు వ్రాయబడి ఉన్నవి.. 

ప్రియా విశ్వాసులారా 12 అనే సంఖ్య పరిపూర్ణతకు గుర్తు, అధికారానికి గుర్తు, పండ్రెండు యిస్రాయేలీయుల తెగలు, పండ్రెండు మంది అపోస్తులులు, పండ్రెండు ద్వారములు, పండ్రెండు పునాదులు ఇక్కడ 12 అంటే దేవుని చిత్తం పరిపూర్ణము అని అర్ధం. ఎంతో మంది ఆ నూతన యెరూషలేములో చేరాలని, ప్రవేశించాలని ప్రయత్నించారు. ఇప్పుడు క్రైస్తవులమైన మనం ఆ అందమైన దేవుని రాజ్యంలో చేరాలంటే దేవుని అనుసరించి, మంచి మార్గంలో నడవాలి అప్పుడు ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశిస్తాము. 

ఈనాటి సువిశేష పఠనంలో దేవుడు క్రీస్తు ప్రభువు తన వద్దకు వచ్చుచున్న నతనయేలును చూసి ఇదిగో కపటము లేని నిజమైం యిస్రాయేలీయుడు అని చెప్పాడు. ఈనాడు మనం వాక్యంలో వింటున్నాము. ఫిలిప్పు ఎప్పుడైతే నతనయేలును కలిసి మేము మెస్సియ్యను కనుగొంటిమి . ఆయన  యేసు నజరేతు నివాసి అని చెప్పగానే అక్కడ నుండి మంచి ఏదైనా రాగలదా ? అని నతనయేలు అనగానే వచ్చి చూడుము అని ఫిలిప్పు పలికాడు. 

ప్రియా విశ్వాసులారా మన సంఘలలో మన జీవితాలలో మన కుటుంబాలలో మనం నిజమైన మెస్సియ్యను కనుగొనాలంటే మనము కూడా దేవుని సన్నిధానానికి వచ్చి చూసి ఆయన గొప్ప కార్యాలు, మహిమ శాంతిని అనుభవించాలి. క్రీస్తు చెంతకు రావాలి. నతనయేలు క్రీస్తు ప్రభుని చెంతకు వచ్చి, ఆ దేవుని అనుభవించి,  క్రీస్తు ప్రభువునితో బోధకుడా నీవు దేవుని కుమారుడవు యిస్రాయేలు రాజువు అని సాక్ష్యం ఇస్తున్నాడు. మరి మనం మన జీవితాలలో,  నీ , నా మన అనుభవం ఏమిటి?  ఆ నజరేయుడైన యేసును అనుభవిస్తున్నామా! ఆయన దేవుని కుమారుడని, యిస్రాయేలు రాజు అని గుర్తించగలుగుతున్నామా! లేదా ! ఆత్మ పరిశీలన చేసుకుందాం.     

ప్రార్ధన: ప్రేమమయుడవైన దేవా నీవు దేవుని కుమారుడవు, లోక  రక్షకుడవు, యిస్రాయేలు రాజువు. మేము నీవద్దకు వచ్చి మిమ్ము ప్రేమిస్తూ, సేవిస్తూ  నిన్ను మా జీవితాలలో తెలుసుకొనే భాగ్యం మాకు దయచేయండి. నతనయేలు మిమ్ము తెలుసుకొని, నీ శిష్యుడుగా మారి, నీ  వాక్యాన్ని లోకాన బోధించి ఒక గొప్ప   పునీతుడుగా మారినట్లు మేము కూడా మారె భాగ్యం మాకు దయచేయండి. ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD

యెహెఙ్కేలు 37:1-14 మత్తయి 22:34-40

యెహెఙ్కేలు 37:1-14 మత్తయి 22:34-40


యేసు సద్దూకయ్యుల నోరు మూయించెనని పరిసయ్యులు విని, వారు అచటికి కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ఆయనను పరీక్షింపవలెనని "బోధకుడా! ధర్మ శాస్త్రము నందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది?" అని అడిగెను. అందుకు యేసు ప్రత్యుత్తరముగా "నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణమనస్సుతోను ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకొనునట్లు నీ పొరుగువానిని ప్రేమింపవలెను అను రెండవ ఆజ్ఞయు ఇట్టిదే. మోషే ధర్మ శాస్త్రము ప్రవక్తల ఉపదేశములు అన్నియు ఈ రెండాజ్ఞల పైననే ఆధారపడియున్నవి" అని సమాధానమిచ్చెను

క్రీస్తునాధుని యందు ప్రియమైన విశ్వాసులారా ఈనాటి మొదటి పఠనములో దేవుడు యెహెఙ్కేలు ప్రవక్తను ఎండిన ఒక లోయలోనికి పంపిస్తున్నాడు. ఆ ప్రవక్త  అటు ఇటు తిరుగుతూ దానినిండ ఉన్నా ఎండిన ఎముకలను చూసినప్పుడు ఆ అస్థికలు మరల జీవింపగలవా, అని దేవుడు  అంటున్నాడు.  అప్పుడు ఆ ప్రవక్త ఆ సంగతి నీకే తెలియును అని అంటున్నాడు.   

దేవుడు  ఆ ప్రవక్తతో ఇలా అంటున్నాడు నీవు ఈ అస్తికలకు ప్రవచనము చెప్పుము. ఎండిన ఎముకలతో ప్రభువు పలుకులు ఆలింపుడు అని చెప్పుము. ఆ ప్రవక్త దేవుని వాక్కును, సందేశాన్ని వినిపించుచుండగా ఎముకలు ఒకదానితో నొకటి అతుక్కొన్నవి. దేవుడు ఎండిన ఎముకలకు మరల ఊపిరిని  పంపి జీవించేలా చేసాడు. మరల వారిని బ్రతికించేను. వారు మహా సైన్యమైరి. 

ప్రియ విశ్వాసులారా  దేవుడు అంటున్నాడు ఈ ఎముకలు యిస్రాయేలీయులందరికిని చిహ్నముగా ఉన్నవి. ఎందుకంటే వారు మేము అస్తికల వలే ఎండిపోయితిమి. మా ఆశ విఫలమైంది. మేము మృతులతో సమానమైతిమి అని పల్కుచున్నారు. అందుకు దేవుడు  మీ సమాధులను తెరచి మిమ్ము లేపినప్పుడు మీరు నేను ప్రభువునని గుర్తింతురు అని అంటున్నాడు. మీరు జీవించునట్లు చేయుదును. మీరీ  దేశమున వసించునట్లు చేయుదునని మాట ఇస్తున్నాడు.

ప్రియా విశ్వాసులారా మనం కూడా మన జీవితాలలో బాధలు కష్టాలు అనుభవిస్తున్నప్పుడు సర్వశక్తివంతుడైన దేవుణ్ణి మర్చిపోతం. అంత శూన్యం అనుకుంటాం. మన జీవితాలు ఎంత చీకటిమయం అయినా మన బ్రతుకులు అణగారిపోయిన  మన స్థితి ఎలా ఉన్నా దేవుడు ఒక్క మాటతో మనకు జీవం పోసి లేవనెత్తుతాడు. మనలను నడిపిస్తాడు.  మన దేవుడు మాట తప్పే దేవుడు కాదు. ఆయనకు సమస్తము సాధ్యమే. జీవమునకు కర్త మన ప్రభువె.  మరి నీవు నేను నమ్ముతున్నామా , ఆత్మ పరిశీలన చేసుకుందాం. 

ఈనాటి సువిశేషంలో మనం వింటున్నాం ధర్మ శాస్త్రోపదేశకుడు క్రీస్తు ప్రభువును పరీక్షింపవలెనని  "బోధకుడా ధర్మ శాస్త్రమందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది? అని అడిగాడు. అందుకు  క్రీస్తు ప్రభువు రెండు ప్రధానమైన ఆజ్ఞలను ఆ వ్యక్తికీ తెలియజేస్తున్నాడు. అవి ఏమనగా 1. నీ దేవుడైన  ప్రభువును నీవు పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. అదే విధంగా నిన్ను నీవు ప్రేమించుకొనునట్లు నీ పొరుగువానిని ప్రేమింపుము. మోషే  ధర్మ శాస్త్రము, ప్రవక్తల ఉపదేశములు అన్నియు ఈ రెండు  ఆజ్ఞల పైనే ఆధారపడివున్నవి. 

ప్రియ విస్వసులారా మనం దేవుణ్ణి నిజమైన మనస్సుతో, పూర్ణ మనస్సు , పూర్ణ  హృదయంతో పూర్ణ  ఆత్మతో ప్రేమించగలుగుతున్నామా? మనలో చాలా మంది దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెపుతుంటాం, కాని పరిపూర్ణ హృదయంతో ప్రేమించలేకపోతున్నాం. ఈలోకాన్ని ఈ లోకంలో ఉన్న అందచందాలను  చూసి, వస్తువులను, సంపదలను, వ్యక్తులను ప్రేమిస్తూ, దేవునికి మొదటి స్థానము ఇవ్వలేకపోతున్నాము. అదేవిధంగా తోటివారిని ప్రేమించలేకపోతున్నాం. నేటి సమాజంలో ఎక్కడ చూసిన గొడవలు, హత్యలు, దోపిడీలు, కొట్లాటలు ఎక్కువైపోతున్నాయి. ఎవరి స్వార్ధం వారు చూసుకుంటున్నారు. కాని తమ తోటి వారిని చూసి ప్రేమించలేక పోతున్నారు. సహాయం చేయలేకపోతున్నారు. ఇతరులను  నశనము చేస్తూ, భాదిస్తు ఇబ్బందుల పాలు చేస్తున్నారు. స్వచ్ఛమైన ప్రేమ ఈలోకంలో కరువైపోతుంది. స్వార్ధ పరమైన ప్రేమలు నటనలు ఎక్కువై పోతున్నాయి. మరి మనం నిజంగా స్వచ్ఛమైం ప్రేమతో పూర్ణ హృదయంతో దేవుణ్ణి  మన తోటి వారిని ప్రేమించగలుగుతున్నామా ఆలోచించండి. 

ప్రార్ధన: ప్రేమమయుడైన దేవా నీవు సర్వశక్తిమంతుడవు. జీవ నదిని మాలో ప్రవహింపచేసి మాకు జీవమును దయచేయుము.  నీవు మాకు ఒసగిన ఆజ్ఞలను మేము పూర్ణ మనస్సుతో , హృదయంతో, ఆత్మతో పాటించగల శక్తిని నాకు దయచేయండి తండ్రి ఆమెన్. 

ఫా. సురేష్ కొలకలూరి OCD

ఆగమన కాలము 2 వ ఆదివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం  బారుకు 5:1-9, ఫిలిప్పీ 1:4-6, 8-11, లూకా 3:1-6 ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని కొరకు మార్గమును సిద్ధం చేయుటను గు...