12, అక్టోబర్ 2024, శనివారం
28 వ సామాన్య ఆదివారం
ఇరవై ఎనిమిదవ ఆదివారము
5, అక్టోబర్ 2024, శనివారం
సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము
27 వ సామాన్య ఆదివారం
28, సెప్టెంబర్ 2024, శనివారం
సామాన్యకాలపు ఇరవై ఆరోవ ఆదివారం
సామాన్యకాలపు ఇరవై ఆరోవ ఆదివారం
26వ సామాన్య ఆదివారం
21, సెప్టెంబర్ 2024, శనివారం
25 వ సామాన్య ఆదివారము
25 వ సామాన్య ఆదివారము
సొలొమోను జ్ఞాన గ్రంధము 2 : 12 , 17 - 20
యాకోబు 3 : 16 - 4 : 3
మార్కు 9 : 30 - 37
క్రిస్తునాధుని యందు ప్రియ సహోదరి సహోదరులారా !
ఈనాడు తల్లి తిరుసభ 25 వ సామాన్య కాలపు ఆదివారములోనికి ప్రవేశిస్తుంది. ఈనాటి మూడు దివ్యగ్రంధ పట్టణాలు కూడా మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి అని ఆత్మపరిశీలన చేసుకోమని మనలను అందరిని కూడా ఆహ్వానిస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలి అంటే మన యొక్క బుద్ధి ప్రవర్తనలు ఏ విధంగా ఉంటున్నాయి అని మనలను మనము ప్రశ్నించుకోవలసిన సమయము. ఎందుకంటే ఈనాటి సువిశేష పఠనంలో మనము రెండు అంశాలను చూస్తున్నాము. యేసు ప్రభువు తన యొక్క శిష్యులకు తాను పొందబోయెటువంటి సిలువ మరణమును అటుపిమ్మట జరగబోయే పునరుత్తాన్ని గురించి ప్రభు తన యొక్క శిష్యులకు వివరిస్తూ ఉంటున్నారు. కానీ శిష్యులు మాత్రం మనలో ఎవరు గొప్ప అని వాదించుకుంటున్నారు. అంటే ఎవరు ప్రథముడు అని తమలో తాము వాదించుకుంటున్నారు. యేసు పలికిన మాటలను వారు గ్రహించలేక పోతున్నారు.
ఆ సమయములో యేసు వారికి ఒక గొప్ప ఉదాహరణను చెప్పడానికి ఈ విధంగా వారితో పలుకుతున్నారు. (మార్కు 9 : 37 ) "ఇట్టి చిన్నబిడ్డలలో ఒకనిని స్వీకరించువాడు నన్నును స్వీకరించు వాడు అగును. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు"అని ప్రభువు పలుకుతున్నాడు. తమలో తం,యూ ఎవరు గొప్ప అని వాదించుకుంటున్నవారికి ఒక గుణపాఠాన్ని ఒక చిన్న బిడ్డ ద్వారా వారికీ విశిదీకరిస్తున్నారు. అంటే చిన్న బిడ్డలు ఏ విధంగా అయితే ఒకరి పై ఆధారపడి జీవిస్తారో, నిర్మల మనసు కలిగి ఉంటారో, చెప్పిన మాటకు విధేయులై ఉంటారో, అలాగా మీరును మరీనా తప్ప మీలో ఎవడును గొప్పవాడు కాదు అని ప్రభు వారికి తెలియచేస్తున్నారు. ఆ చిన్న బిడ్డలవలె మనము జీవించాలి అంటే మనము ఎం చేయాలి అంటే మన యొక్క జీవిత విధానాన్ని మనము మార్చుకోవాలి. ఎపుడు కూడా దుస్తుల వాలే కాకుండా నీతిమంతులుగా మనయొక్క జీవితాన్ని మనము గడపాలి. యేసు ప్రభువు తన యొక్క జీవితము ద్వారా మనకు మనము ఏ విధంగా జీవించాలి అని మనకు నేర్పిస్తూ ఉన్నారు.
ఈనాటి మొదటి పఠనంలో మనము చూస్తున్నాము.యేసు ప్రభు తన యొక్క సిలువ మరణాన్ని గురించి సంబందించిన విషయములను మనము చూస్తున్నాము. సో. జ్ఞాన 2 : 18 -20 వచనాలలో మనము చూస్తున్నాము. క్రూరముగా అవమానింతుము, హింసింతుము, పరీక్షకు గురిచేయుదము, ఇతని సహన భావమెంత గొప్పదో పర్రెక్షించి చూతము అని యేసును గూర్చిన పలుకులను మనము చూస్తున్నాము. యేసు ప్రభు తనయొక్క సిలువ మరణము పొందెబోయే ముందు ఈ విధముగా అనేకమైన అవమానాలు, హింసలు, నిందలు పొందియున్నారు. కానీ చివరిగా యేసు పలికినటువంటి పలుకులు (లూకా 23 : 34 ) "తండ్రి వీరు ఏమిచేయుచున్నారో వీరికి తెలియడంలేదు, వీరిని క్షమించుము" అని వారిని క్షమించి వారికై ప్రార్ధన చేస్తున్నారు. మనము కుడి మన యొక్క జీవితంలో ఎపుడు కూడా ఒకరి పట్ల కఠినంగా కాకుండా ప్రేమ కలిగి జీవించాలి అని ప్రభు తన యొక్క జీవితం ద్వారా మనకు తెలియపరుస్తున్నారు.
ఒక మానవునిగా మన జీవితంలో అనేకమైన అవసరాలను మనము ఎదుర్కొంటు ఉంటాము. వాటిని మనము చేరుకోవాలి అంటే అనేకమైనటువంటి మార్గాలగుండా ప్రయాణిస్తాము. అది మంచిమార్గమే కానీ చెడు మార్గమే కానీ. ఈనాటి రెండొవ పఠనంలో మనము చూస్తున్నాము మానవుల మధ్య కలహాలు అనేవి ఏ విధంగా ఏర్పడుతున్నాయి? వాటికి గల కారణము ఎవరు? అసలు మనము చేయవలసిన పని ఏంటీ అని చూస్తున్నాము. యాకోబు 4:1 వచనంలో చూస్తున్నాము. మానవుల మధ్య అనేకమైనటువంటి భేదములు ఎలా పుడుతున్నాయి అంటే అది కేవలము మనలో ఉన్నటువంటి వ్యామోహములనుండి. అనేకమైనటువంటి కోరికలు, ఆశలు, ఆశయాలు ఉండడం ద్వారా వాటిని పరిపూర్తి చేసుకోవడానికి మన పొరుగువానికి హాని తలపెట్టడానికి కూడా మనము వెనుదిరగడంలేదు. అనేకమైన యుద్ధములు చేస్తున్నాం కానీ మనము చేయవలసిన పని మాత్రం చేయడంలేదు. ఏంటి అంటే మనకు కావలసిన వాటికోడం దేవునికి ప్రార్ధించడం లేదు. యాకోబు 4 : 2 -3 వచనాలలో మనము వింటున్నాం, మీరు కావలసినవి మీరు పొందలేక పోతున్నారు అంటే మీరు దేవునితో ఐక్యమై జీవించటంలేదు అని. మనయొక్క జీవితంలో మనకు కావలసిన వాటిని కానీ కావలసిన వారిని గని మనము సంపాదించుకోవాలి అంటే అది కేవలము దేవునితో ఐక్యమై జీవించడం ద్వారా మాత్రమే అని నంటే నీతిమంతమైన మార్గమున ఒక నీతిమంతునిగా మెలగడం ద్వారా జరుగుతున్నది.
నీతిమంతుని యొక్క లక్షణాలను మనము చూస్తున్నాం. స్నాతి ప్రథముడిగా ఉండాలి, స్నేహపూర్వకంగా ఉండాలి, మృదుమనసు కలిగి ఉండాలి. అంటే ఒక మాటలో చేపల అంటే క్రీస్తు ఏ విధంగా ఉన్నారో అదేవిధంగా మనము కుడి ఉండాలి. కానీ మనము ఏ విధంగా ఉంటున్నాం? విభుంనమైనటువంటి స్వభావము కలిగి ఉంటున్నాం.సువిశేష పఠనంలో మనము చూస్తున్నాం. క్రీస్తు తరువాత తాను స్థాపించబోయే రాజ్యాన్ని తన శిష్యులు కొనసాగించాలి అన్న ఉదేశ్యముతో వారికి తనను గురించి తాను చెప్పుకుంటూ ఉంటే శిష్యులు మాత్రం దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. వారిలో ఎవరు గొప్ప అని వాదించుకుంటున్నారు. యేసును అర్ధంచేసుకోలేక ఉంటున్నారు.
మరి మనము మన యొక్క జీవితంలో యేసును అర్ధం చేసుకొని జీవిస్తున్నామా ? తండ్రి దేవుని యొక్క ఆలోచనలను మనం అర్ధం చేసుకోవాలి అంటే ముందుగా మనము ఎం చేయాలి అంటే మనలో ఉన్నటువంటి భిన్నత్వాన్ని తొలగించుకొని అందరితో కలిసి ఏకత్వంగ జీవించాలి. అందరికి భిన్నంగా ఉన్నట్లయితే మన జీవితంలో మనమే కలహాలు సృష్టించుకున్నవాళ్ళం అవుతాం. అలా కాకుండా అందరితో కలిసి ఉన్నట్లయితే మనము దేవుని చేరగలుగుతాం. తనయొక్క శిష్యులు ఆయనతో కలిసి ఉన్నప్పటికీ ఆయనను అర్ధం చేసుకొనలేకపోయారు. ఎందుకంటే వారి యొక్క ఆలోచన విధానం యేసుయొక్క ఆలోచనలకూ అతీతంగా ఉంటూ ఉన్నాయి. మనము కూడా కొన్నిసార్లు ఈ విధంగా దేవుని యొక్క ఆలోచనలకూ విభిన్నంగా ప్రవర్థిస్తూఉంటాం. కారణము విధేయత లేకపోవడం. కాబట్టి మనము దేవునితో కలిసి జీవించాలి అంటే విధేయత కలిగి జీవించాలి. చిన్న బిడ్డల వాలే మారు మనసు కలిగి ఉండాలి.
ఎడిత్ స్టెయిన్ కార్మెల్ భవన్
జానంపేట
బ్రదర్. పవన్ కుమార్ ఓ. సి.25వ సామాన్య ఆదివారం
20, సెప్టెంబర్ 2024, శుక్రవారం
25 వ సామాన్య ఆదివారము
25 వ సామాన్య ఆదివారము
మార్కు 6 : 14 – 29
February 07 హెబ్రీ 13 : 1 - 8 మార్కు 6 : 14 – 29 ప్రభువు పేరు ప్రసిద్ధికెక్కెను. హేరోదు రాజు అది వినెను. "స్నాపకుడగు యోహాను మృతులలో ను...