పునీత యోసేపు
పునీత యోసేపు - నీతిమంతుడు
దేవుడు ఇస్సాకు రిబ్కా లను, తోబియాతు సారాలను కలపడం వలన మానవులకు తగిన వారిని వారి జీవిత భాగస్వాములుగా చేస్తారని మనకు తెలుస్తుంది. అటువంటప్పుడు మరియమాత కన్యకగా తన కన్యత్వాన్ని కోల్పోకుండా దేవుని కుమారుణ్ణికి జన్మను ఇస్తుంది . ఆమెలో ఎటువంటి పాపము లేదు , ఆమె దేవుని కుమారునికి జన్మనివటం వలన దేవుని తల్లి అవుతుంది. ఈమెకు ఇంత గొప్ప వ్యక్తికీ ఎటువంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేస్తారు అంటే దానికి సమాధానము పునీత జోజప్ప గారు. ఖచ్చితముగా ఆయనలో అనేక ప్రత్యేకతలు కలిగి ఉండాలి. ఏమిటి ఆ ప్రత్యేకతలు అంటే, పవిత్ర గ్రంధములో అయన ఒక్క మాట మాట్లాడనప్పటికీ అతని ప్రవర్తన ,జీవనశైలి , దైవాంకిత జీవితం స్పష్టముగా కనపడుతూవుంటాయి. అందుకే పవిత్రగంధము ఆయనను నీతిమంతుడు అని సంభోదిస్తుంది. పునీత యోసేపు గారి జీవితం ఆయన ఆంతరంగిక గుణగణాలను తెలియజేస్తుంది. పునీత యోసేపుగారు యూదా తెగకు చెందిన దావీదు వంశస్తుడు. గలీలియ ప్రాంతంలోని నజరేతు నివాసి. నైతికత, దైవచిత్తనికి విధేయత, విశ్వాసం, కుటుంబ రక్షణ వంటివి పునీత యోసేపు నుండి మనం నేర్చుకోవచ్చు.
యోసేపు దయార్ధ హృదయం
మోషే ధర్మ శాస్త్రం ప్రకారంగా ఒక వ్యక్తి తన భార్యకు వ్యభిచారకరనముగా విడాకుకులు ఇవ్వవచ్చు. ఈ విడాకులనేవి రెండు రకాలుగా ఇచ్చేవారు. మొదటిగా ఒక స్త్రీ చేసిన తప్పును అందరికి చెప్పి ఆమెను శిక్షించవచ్చు, ఆమెను అవమానపరచి ఆమెకు విడాకులు ఇవ్వవచ్చు. రెండవ విధము ఏమిటి అనగా, ఒక స్త్రీ వ్యభిచారము చేసినట్లు నిరూపణ అయ్యినట్లయితే ఆమె కుటుంబానికి ఎటువంటి అనర్ధము జరగకుండా, సాక్ష్యం కలిగివుండి, ఆ స్త్రీని రహస్యముగా కేవలం ఇద్దరి సమక్షంలో విడనాడవచ్చు. పునీత యేసేపు గారి దయార్ధహృదయాన్ని మనము ఇక్కడ చూస్తాము. తన భార్య తన ప్రమేయము లేకుండా, గర్భం దాల్చిన తరువాత, ఆమె కుటుంబానికి ఎటువంటి అపకీర్హ్తి కలగకూడదని రహస్యముగా ఆమెను విడనాడాలి అని కాంక్షించాడు. ఆమెను అవమానపరచాలి అని అనుకోలేదు. దేవుడు ఏర్పాటు చేసే ప్రతి జంట ఇలానే ఉంటారు ఏమో? వీరు ఇద్దరు వారి ఆశయాల కంటే దేవుని చిత్తమును నెరవేర్చుటకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు.
యోసేపు పవిత్రత
పునీత యేసేపు గారి పవిత్రత చాల గొప్పది . దేవుడు పరమ పవిత్రుడు. తన కుమారుణ్ణి ఈ లోకానికి ఒక స్త్రీ ద్వారా తీసుకురావడానికి ముందుగానే ఆమెను పవిత్ర పరిచాడు,ఆమెలో ఏ పాపమూ లేకుండా చేసాడు. తరువాత తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. దేవుని తల్లి మరియు దేవుని కుమారుని పవిత్రను ఆస్వాదించాలి అంటే, లేక అంతటి వారితో జీవించాలి అంటే అంతటి నిష్ఠ కలిగి జీవించేవారే వారి సాన్నిధ్యములో ఉండగలరు. పునీత యేసేపు గారు అంతటి పవిత్రులు. మరియతల్లి కన్యకగా ఉంది ఆమె కన్యత్వాన్ని కాపాడుతూ, ఆమె అంత పవిత్రముగా జీవించాలి అంటే పునీత యేసేపు వారి అంతటి పవిత్ర ఉండాలి. బిడ్డలను కలిగి ఉండటము దేవుని అనుగ్రహం అని సమాజం నమ్మే కాలంలో, తన బిడ్డల ద్వారా తాను మరణించిన బ్రతుకుతాను అని అనుకునే రోజులలో, లైంగిక జీవితానికి పూర్తిగా దూరమై, తన భార్య పవిత్రతను కాపాడుతూ వచ్చిన వ్యక్తి. దేవుని కుమారుని పెంపుడు తండ్రిగానే జీవించడానికి సిద్దమైన వ్యక్తిత్వం పునీత యోసేపు వారి సొంతం. పునీత యోసేపు వారికి పవిత్రంగా ఎందుకు వుండాలో పూర్తిగా తెలిసిన వ్యక్తి. దైవ సాన్నిధ్యంలో ఉండాలి అంటే పవిత్రంగా ఉండాలి. యోసేపు గారు యేసు ప్రభువుతో కలిసి ఉన్నారు. యేసు ప్రభువు బాల్యం యోసేపుతో గడిసింది.
దేవుని ఆజ్ఞల అనుచరుడు
ఎల్లప్పుడూ దైవఒడంబడికలకు అనుకూలముగా జీవించాలి అంటే దానికి ప్రార్థన మరియు దైవ జ్ఞానం అవసరము. యేసేపు గారు ప్రార్థనలో దిట్ట అని చెప్పా వచ్చు. ఆయనకు స్వప్నంలో దేవుదూతలు దర్శనము ఇస్తున్నారు. ఇవి నిజానికి ప్రార్థనలోని అంతస్తులు. అయన ప్రార్థనలో అంతగా ఎదిగారు కాబట్టే దేవుని దూతలు ఆయనకు దర్శనము ఇస్తున్నారు. జరుగబోయే విషయాలు చెపుతున్నారు. ప్రార్దిచేటి వంటివారు దేవునితో సత్సంభందాన్ని కలిగిఉంటారు. వారు దేవుని ఆజ్ఞలని పాటిస్తారు. అందుకే యేసేపు గారు దేవాలయములో యేసు ప్రభువును అర్పించడానికి తీసుకొనివెళుతున్నారు. ఇక్కడ మనము యేసేపు గారు దేవుని ఆజ్ఞలను పాటించుటలో ఎంత ఖచ్చితముగా ఉంటారో చూస్తాము. స్వప్నంలో దేవుని గురించి, దేవదూతల గురించి చూడటము, దేవునితో వారు దగ్గరగా ఉన్నారు అనే విషయాన్ని, వీరిని దేవుడు తన క్రియలకు, మరియు ప్రజలకు దేవునికి మధ్యవర్తులుగా ఉండుటకు ఎన్నుకోవడం మనం పవిత్ర గ్రంధంలో చూస్తాము. సహజంగా వీరు దైవ ఆజ్ఞలకు కట్టుబడి జీవించేవారు.
కుటుంబ కాపరి
పాత నిబంధనలో మనము యేసేపు గారిని చూస్తూ ఉంటాము అయనను ఫరో రాజు తన రాజ్య కోశాధికారిగా చేస్తారు. నూతన నిబంధనలో దేవుడు యోసేపును తన కుమారునికి, మరియు తన తల్లికి సంరక్షకునిగా నియమించుకున్నాడు. వారి ఆలనాపాలన చూసుకోవడనికి. ఇది నిజానికి దేవుని ప్రణాళిక ఎందుకంటే బాల యేసును అనేక ఆపదల నుండి కాపాడటానికి, దేవుడు దేవదూతలు ఏర్పాటు చేయవచ్చు కానీ యేసేపు గారిని నియమించుకున్నాడు అంటే యేసేపు గారి సంరక్షణ అంత గొప్పది. పునీత అవిలాపురి తెరెసమ్మ గారు యేసేపు గారి సంరక్షణ అంటే చాల ఆనందపడేది ఎందుకంటే అయన సంరక్షకుడిగా ఉంటె ఎవరు ఏమి చేయలేరు అని చెబుతారు. అందుకే ఆమె స్థాపించిన అన్ని ఆశ్రమాలకు ఈ పునీతుని పేరు పెట్టింది. తన కుటుంబమును అన్ని వేళల, అన్ని ఆపదల నుండి ఈ పునీతుడు రక్షించాడు. ఎప్పుడు యేసు ప్రభువు బాలునిగా ఆపదలో ఉన్న రాత్రి, పగలు తేడ లేకుండ కాపాడే పనిలో నిమగ్నమయ్యేవాడు. బాల యేసుని తీసుకొని, ఐగుప్తు పోవడం, మరలా నజరేతు రావడం, ఆయన కుటుంబాన్ని కాపాడటం ఇవి అన్నీ దేవుడు ఈయన మీద ఉంచిన నమ్మకానికి, ఈయన జీవించిన విధానానికి దేవుడు ఎటువంటి వ్యక్తులను తన పనికి ఎన్నుకుంటారో తెలుసుకోవచ్చు. యోసేపును ఎన్నుకోవడం దేవుని పని అయినప్పటికీ యోసేపు ఆ నమ్మకస్తునిగా జీవించిన తీరు అసమాన్యమైనది.
ప్రస్తుత కుటుంబాలకు పునీత యోసేపు మాతృక
ఈనాడు అనేక కుటుంబాలలో భార్యలను భర్తలు అనేక విధాలుగా అవమానపరచడం మనం చూస్తుంటాము. మనతో కలసి జీవించే వారికి ఎటువంటి గౌరవం మనం ఇవ్వకుండా, వారిని ఒక వస్తువులా చూస్తామో అప్పుడు మాత్రమే మనం అటువంటి ప్రవర్తన మనకు ఉంటుంది. ఈ పునీతుడు భార్యను అవమానమునకు గురిచేయుటకు ఇష్టపడలేదు. తన కుటుంబాన్ని రక్షించుకొనుటకు ఎంతటి విపత్కర పరిస్తితులు ఉన్న వాటి నుండి తన కుటుంబాన్ని కాపాడటానికి ప్రయత్నించాడు. మనకు కష్టంగా ఉన్నప్పుడు అందరినీ విడచి సౌఖ్యం కావాలని అనేక మంది తమ భాద్యతలను విడచి జీవిస్తుంటారు. కాని పునీత యోసేపు వారు తాను పెంపుడు తండ్రి అయినప్పటికీ ఆ కుటుంబం కోసం తన సౌఖ్యం విడనాడి, తన కుటుంబం కోసం మాత్రమే జీవించాడు కనుకనే ఆయన మరియమాత, యేసు ప్రభువ చేతులలో మరణించాడు. మంచి మరణం కొరకు ఈ పునీతుని మాధ్యస్తం అడుగుతారు.
ఈ పునీతుని అడుగు జాడలల్లో నడిచి అయనను మన అనుదిన జీవితములో అనుసరిద్దాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి