శత్రువులను ప్రేమింపుడు ఆధ్యాత్మిక ధ్యానం (మత్తయి 5) | కార్మెల్ శోభ
మత్తయి 5: 43-48
సువిశేషం: "నీ పొరుగువానిని ప్రేమింపుము; నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పిబడిన దానిని మీరు వినియున్నారుగదా! నేనిపుడు మీతో చెప్పునదేమన : మీ శత్రువులను ప్రేమింపుడు. మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్ధింపుడు. అపుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఏలయన, ఆయన దుర్జనులపై , సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపజేయుచున్నాడు. సన్మార్గులపై , దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపజేయుచున్నాడు. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును? సుంకరులు సైతము అటులచేయుట లేదా?మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియజేసినచో మీ ప్రత్యేకత యేమి? అన్యులు సహితము ఇట్లు చేయుటలేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక!
నీ పొరుగు వానిని ప్రేమింపుము: దేవుని ప్రేమకు పరిపూర్ణ మార్గం
సమాజపు ఆలోచన – దేవుని వాక్యం
మానవ చరిత్రలో అత్యంత శక్తివంతమైన, విప్లవాత్మకమైన బోధన ఏదైనా ఉందంటే, అది యేసు ప్రభువు బోధించిన "ప్రేమ సిద్ధాంతం" మాత్రమే. సాధారణంగా లోకంలో ఒక సామెత లేదా వాడుక ఉంది: "నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమించు, నిన్ను ద్వేషించే వారిని నువ్వు ద్వేషించు లేదా దూరం పెట్టు." యేసు ప్రభువు కాలంలో కూడా ధర్మ శాస్త్ర బోధకులు, పరిసయ్యులు ప్రజలకు ఇలాగే బోధించేవారు.
"నీ పొరుగు వానిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన మాటను మీరు విన్నారు గదా!"
కాని మనం పాత నిబంధన గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, లేవీయకాండము 19:18 లో "నీ పొరుగువానిని నీవలె ప్రేమింపవలెను" అని వ్రాయబడి ఉంది. అలాగే ద్వితీయోపదేశకాండంలో కూడా పొరుగువాని పట్ల చూపించవలసిన బాధ్యతలను దేవుడు మోషే ద్వారా వివరించాడు. అయితే, ఎక్కడా కూడా "నీ శత్రువును ద్వేషింపుము" అని దేవుని వాక్యం నేరుగా చెప్పలేదు. మానవులు తమ సొంత స్వార్థ ఆలోచనలతో, వ్యావహారిక సౌలభ్యం కోసం "పొరుగువానిని ప్రేమించు" అనే మాటకు వ్యతిరేకంగా "శత్రువును ద్వేషించు" అనే వాక్కును వారంతట వారే తగిలించుకున్నారు.
ఎందుకంటే, మనల్ని ఇష్టపడేవారిని ప్రేమించడం చాలా సులభం. కానీ, మనల్ని అనవసరంగా ద్వేషించే వారిని, మన నాశనాన్ని కోరుకునే వారిని ప్రేమించడం మానవ నైజానికి అసాధ్యమైన విషయం. దానికి శారీరక బలం సరిపోదు; దానికి అత్యున్నతమైన ఆత్మీయ ఎదుగుదల, దైవిక స్వభావం అవసరం.
మీ శత్రువులను ప్రేమింపుడు: యేసు ప్రభువు విప్లవాత్మక బోధన
యేసు ప్రభువు కొండమీద ప్రసంగిస్తున్నప్పుడు, అక్కడ చేరిన జనసమూహానికి ఆయన చెప్పిన మాటలు తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగించి ఉంటాయి. ఎందుకంటే, రోమన్ల పరిపాలనలో యూదులు అనేక హింసలను అనుభవిస్తున్నారు. అటువంటి సమయంలో, "మీ శత్రువులైన రోమన్లను ప్రేమించండి" అని చెప్పడం వారికి అసాధ్యమైన విషయంగా అనిపించి ఉండవచ్చు.
మనం కూడా తరచుగా ఇలాగే ఆలోచిస్తుంటాం: "నన్ను నడిరోడ్డుపై అవమానించిన వాడిని నేనెలా ప్రేమించాలి? నా కుటుంబానికి కీడు తలపెట్టిన వ్యక్తికి నేను ఎలా మేలు చేయగలను?"
దీనికి సమాధానం దేవుని ప్రేమ స్వరూపంలో ఉంది. ఈ విశ్వంలో మానవుడిని లొంగదీసుకోగలిగే ఏకైక ఆయుధం "ప్రేమ" మాత్రమే.
ద్వేషానికి ప్రతిరూపం ద్వేషం: మనం ఒకరిపై కోపం చూపిస్తే, అవతలి వాడు అంతకంటే ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తాడు. పగకు పగ, దెబ్బకు దెబ్బ అనే సూత్రం సమాజంలో శాంతిని తీసుకురాలేదు, కేవలం స్మశాన వైరాగ్యాన్ని మాత్రమే మిగుల్చుతుంది.
ప్రేమకు దాసోహం: కానీ, పగ ఉన్న చోట మనం ప్రేమను వర్షింపజేసినప్పుడు, ఎదుటి వ్యక్తి హృదయం ఎంత కఠినమైనదైనా సరే, అది కరిగి తీరుతుంది. ప్రేమ ఎదుట శత్రుత్వం మోకరిల్లుతుంది. మొదటిలో వారు మన ప్రేమను చూసి కోపగించుకోవచ్చు, అవహేళన చేయవచ్చు. కానీ కాలక్రమేణా, ఆ దైవిక ప్రేమ వారి అంతరాత్మను వేధిస్తుంది. వారు మారుమనస్సు పొంది, సమాజంలో అనేకులకు మార్గదర్శకులుగా మారతారు. అందుకే దేవుడు మానవుడు ఎన్ని పాపాలు చేసినా, ఆయనను ప్రేమిస్తూనే ఉన్నాడు, తన సిలువ చెంతకు ఆహ్వానిస్తూనే ఉన్నాడు.
హింసించే వారి కొరకు ప్రార్థన: ఆదిమ క్రైస్తవుల ఆదర్శం
యేసు ప్రభువు కేవలం మాటలతో సరిపెట్టలేదు, "మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుందురు" అని ఆజ్ఞాపించారు. ఈ ఆజ్ఞను ఆదిమ క్రైస్తవులు అక్షరాలా పాటించారు.
1. ప్రథమ సాక్షి స్తేఫాను గారి ఆదర్శం
అపొస్తలుల కార్యములలో మనం చూస్తాం, స్తేఫాను గారు దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తున్నప్పుడు, యూదులు ఆయనపై పగబట్టి, పట్టణము వెలుపలికి లాక్కొని పోయి రాళ్లతో కొట్టి చంపసాగారు. ఆ భయంకరమైన వేదనలో, ప్రాణం పోయే స్థితిలో కూడా స్తేఫాను గారు పగ తీర్చుకోమని దేవుడిని అడగలేదు. ఆయన మోకరించి, యేసు ప్రభువు సిలువపై పలికిన మాటలను స్మరిస్తూ:
"ప్రభువా, వీరి మీద ఈ పాపము మోపకుము" అని పెద్ద శబ్దముతో పలికి చనిపోతున్నాడు. (అపొస్తలుల కార్యములు 7:60)
2. రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవుల సహనం
రోమా చక్రవర్తులు ఆదిమ క్రైస్తవులను సింహాలకు ఆహారంగా వేస్తున్నప్పుడు, సజీవంగా తగలబెడుతున్నప్పుడు కూడా క్రైస్తవులు పాలకులను శపించలేదు. వారి కోసం కన్నీళ్లతో ప్రార్థించారు. ఎందుకంటే దైవజ్ఞానము, వివేకము కలిగిన విశ్వాసికి ఒక విషయం బాగా తెలుసు: "సత్యం తెలియని అజ్ఞానము వలనే వీరు మమ్మల్ని హింసిస్తున్నారు." ఒక అంధుడికి దారి తెలియక పక్కన ఉన్నవాడిని ఢీకొడితే మనం ఎలా కోపగించుకోమో, అలాగే ఆత్మీయ అంధత్వంలో ఉన్న శత్రువులను చూసి క్రైస్తవులు జాలిపడ్డారు కానీ పగ తీర్చుకోలేదు.
దేవుని గుణం: పక్షపాతం లేని ప్రేమ
శత్రువులను ప్రేమించడం అనేది కేవలం ఒక నైతిక సూత్రం కాదు, అది సాక్షాత్తూ దేవుని యొక్క లక్షణం. దేవుడు పక్షపాతి కాడు. ఆయన సృష్టిని గమనిస్తే ఈ సత్యం మనకు సులభంగా అర్థమవుతుంది.
ఆయన చెడ్డవారి మీదికిని మంచివారి మీదికిని తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతుల మీదికిని అవినీతిమంతుల మీదికిని వర్షము కురిపించుచున్నాడు.(మత్తయి 5:45)
దేవుడు కేవలం ప్రార్థన చేసే వారి పొలాల్లోనే వర్షం కురిపించి, తనను తిట్టే వారి పొలాలను ఎండబెట్టడం లేదు. ఆయన సూర్యరశ్మి, గాలి, నీరు అందరికీ సమానంగా ఇస్తున్నాడు. ఈ లోకం మొత్తము మీద దేవుడు చూపిస్తున్న ప్రేమే మనకు ఆదర్శం కావాలి.
మనం ఈ లోకంలో ఎంత గొప్ప మేడలు కట్టినా, ఎంత ధనము సంపాదించినా, ఎన్ని ఉన్నత పదవులు అధిరోహించినా... దేవుని లాంటి క్షమాగుణాన్ని, ప్రేమను కలిగి ఉండకపోతే ఆ విజయాలన్నీ శూన్యమే అవుతాయి.
యేసు ప్రభువు ఒక సూటియైన ప్రశ్న వేస్తున్నారు: "మిమ్మును ప్రేమించువారినే మీరు ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును అలాగే చేయుచున్నారు కదా!"
యూదుల సమాజంలో సుంకరులను (పన్నులు వసూలు చేసేవారిని) అత్యంత పాపులుగా, ద్రోహులుగా చూసేవారు. యేసు ప్రభువు అంటున్నారు, లోకంలో పాపులు కూడా వారిని ప్రేమించే వారిని ప్రేమిస్తారు, వారి బంధువులకు వందనాలు చెప్తారు. మరి క్రీస్తును నమ్ముకున్న మనకు, లోకస్తులకు తేడా ఏమిటి? మనం వారి కంటే ఏ విధంగా శ్రేష్టులం? దేవుని నమ్మిన వానిగా, క్రీస్తు అనుచరునిగా నేను పరిపూర్ణత కలిగి జీవించాలి. ఆయన ప్రేమను, వాత్సల్యాన్ని శత్రువులకు సైతం పంచగలగాలి. ఇందుకోసమే ప్రభువు మనల్ని ప్రత్యేకించుకున్నాడు.
మన పిలుపు మరియు బాధ్యత
పరిపూర్ణత వైపు సాగడమే క్రైస్తవ జీవిత గమ్యం. "మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అయినట్లే మీరును పరిపూర్ణులుగా ఉండాలి అని ప్రభువు సెలవిచ్చారు. ఈ పరిపూర్ణత అనేది ఉపవాసాల వల్లనో, కేవలం ప్రార్థనల వల్లనో రాదు; శత్రువును సైతం క్షమించి ప్రేమించగలిగే హృదయాన్ని అలవర్చుకున్నప్పుడే వస్తుంది.
మన హృదయాలలో ఉన్న ద్వేషాన్ని, పగను సిలువ చెంత పారవేద్దాం. మనల్ని గాయపరిచిన వారిని క్షమిద్దాం. మనకు కీడు చేసిన వారికి మేలు చేద్దాం. అప్పుడే మనం నిజమైన దేవుని బిడ్డలముగా లోకంలో ప్రకాశించగలము.
ప్రార్థన
పరలోకమందున్న మా ప్రియ పరమ తండ్రి!
మా జీవితంలో అనేక పర్యాయాలు నేను నిజమైన క్రీస్తు అనుచరునిగా, మీ ప్రియ బిడ్డగా జీవించాలని ఆశపడుతున్నాను. కానీ, ఈ లోక ఆశలు, శరీర బలహీనతలు, ఇతరులు నా పట్ల చేసిన కీడును బట్టి నాలో కలిగిన చెడు అభిప్రాయాల వలన, నేను అనేకులను దూరం పెడుతున్నాను. ఎవరికీ నీ ప్రేమను చూపించకుండా స్వార్థంతో జీవిస్తున్నాను. తండ్రీ, నన్ను క్షమించండి.
నీవు మాత్రం నేను నీ వలె, పరలోకపు తండ్రి వలె పరిపూర్ణత కలిగి ఉండాలని కోరుకుంటున్నావు. నేను నీ వలె జీవించలేకపోయినందుకు, నీ ప్రేమను ఇతరులకు ప్రకటించే గొప్ప అవకాశాలను చేజార్చుకున్నందుకు నన్ను క్షమించండి ప్రభువా. నాలో ఉన్న అహంకారాన్ని, ప్రతికారేచ్ఛను, ఇతరులను ద్వేషించే కఠిన మనస్సును, గాయపరిచే హృదయాన్ని నా నుండి తీసివేయండి.
నన్ను హింసించే వారిని సైతం క్షమించే మనస్సును, నన్ను ద్వేషించే వారిని ప్రేమించే దైవిక సుగుణాలను నాకు దయచేయండి. ఎదుటివారిలో తప్పులను వెతకకుండా, వారి ఆత్మీయ అజ్ఞానాన్ని అంగీకరిస్తూ వారి రక్షణ కొరకు ప్రార్థించే వివేకాన్ని ప్రసాదించండి. ఎల్లప్పుడూ, ఏ పరిస్థితిలోనూ ఎవరిని ద్వేషించకుండా, అందరినీ నీ ప్రేమతో ప్రేమించే విశాల హృదయాన్ని నాకు ఇవ్వండి ప్రభువా. నన్ను నీ ప్రియ కుమారుని వలె, కుమార్తె వలె మార్చి, నీ మహిమ కొరకు వాడుకొనమని, మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్.
"నీ పొరుగు వానిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన మాటను మీరు విన్నారు గదా!"
కాని మనం పాత నిబంధన గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, లేవీయకాండము 19:18 లో "నీ పొరుగువానిని నీవలె ప్రేమింపవలెను" అని వ్రాయబడి ఉంది. అలాగే ద్వితీయోపదేశకాండంలో కూడా పొరుగువాని పట్ల చూపించవలసిన బాధ్యతలను దేవుడు మోషే ద్వారా వివరించాడు. అయితే, ఎక్కడా కూడా "నీ శత్రువును ద్వేషింపుము" అని దేవుని వాక్యం నేరుగా చెప్పలేదు. మానవులు తమ సొంత స్వార్థ ఆలోచనలతో, వ్యావహారిక సౌలభ్యం కోసం "పొరుగువానిని ప్రేమించు" అనే మాటకు వ్యతిరేకంగా "శత్రువును ద్వేషించు" అనే వాక్కును వారంతట వారే తగిలించుకున్నారు.
ఎందుకంటే, మనల్ని ఇష్టపడేవారిని ప్రేమించడం చాలా సులభం. కానీ, మనల్ని అనవసరంగా ద్వేషించే వారిని, మన నాశనాన్ని కోరుకునే వారిని ప్రేమించడం మానవ నైజానికి అసాధ్యమైన విషయం. దానికి శారీరక బలం సరిపోదు; దానికి అత్యున్నతమైన ఆత్మీయ ఎదుగుదల, దైవిక స్వభావం అవసరం.
మీ శత్రువులను ప్రేమింపుడు: యేసు ప్రభువు విప్లవాత్మక బోధన
యేసు ప్రభువు కొండమీద ప్రసంగిస్తున్నప్పుడు, అక్కడ చేరిన జనసమూహానికి ఆయన చెప్పిన మాటలు తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగించి ఉంటాయి. ఎందుకంటే, రోమన్ల పరిపాలనలో యూదులు అనేక హింసలను అనుభవిస్తున్నారు. అటువంటి సమయంలో, "మీ శత్రువులైన రోమన్లను ప్రేమించండి" అని చెప్పడం వారికి అసాధ్యమైన విషయంగా అనిపించి ఉండవచ్చు.
మనం కూడా తరచుగా ఇలాగే ఆలోచిస్తుంటాం: "నన్ను నడిరోడ్డుపై అవమానించిన వాడిని నేనెలా ప్రేమించాలి? నా కుటుంబానికి కీడు తలపెట్టిన వ్యక్తికి నేను ఎలా మేలు చేయగలను?"
దీనికి సమాధానం దేవుని ప్రేమ స్వరూపంలో ఉంది. ఈ విశ్వంలో మానవుడిని లొంగదీసుకోగలిగే ఏకైక ఆయుధం "ప్రేమ" మాత్రమే.
ద్వేషానికి ప్రతిరూపం ద్వేషం: మనం ఒకరిపై కోపం చూపిస్తే, అవతలి వాడు అంతకంటే ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తాడు. పగకు పగ, దెబ్బకు దెబ్బ అనే సూత్రం సమాజంలో శాంతిని తీసుకురాలేదు, కేవలం స్మశాన వైరాగ్యాన్ని మాత్రమే మిగుల్చుతుంది.
ప్రేమకు దాసోహం: కానీ, పగ ఉన్న చోట మనం ప్రేమను వర్షింపజేసినప్పుడు, ఎదుటి వ్యక్తి హృదయం ఎంత కఠినమైనదైనా సరే, అది కరిగి తీరుతుంది. ప్రేమ ఎదుట శత్రుత్వం మోకరిల్లుతుంది. మొదటిలో వారు మన ప్రేమను చూసి కోపగించుకోవచ్చు, అవహేళన చేయవచ్చు. కానీ కాలక్రమేణా, ఆ దైవిక ప్రేమ వారి అంతరాత్మను వేధిస్తుంది. వారు మారుమనస్సు పొంది, సమాజంలో అనేకులకు మార్గదర్శకులుగా మారతారు. అందుకే దేవుడు మానవుడు ఎన్ని పాపాలు చేసినా, ఆయనను ప్రేమిస్తూనే ఉన్నాడు, తన సిలువ చెంతకు ఆహ్వానిస్తూనే ఉన్నాడు.
హింసించే వారి కొరకు ప్రార్థన: ఆదిమ క్రైస్తవుల ఆదర్శం
యేసు ప్రభువు కేవలం మాటలతో సరిపెట్టలేదు, "మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుందురు" అని ఆజ్ఞాపించారు. ఈ ఆజ్ఞను ఆదిమ క్రైస్తవులు అక్షరాలా పాటించారు.
1. ప్రథమ సాక్షి స్తేఫాను గారి ఆదర్శం
అపొస్తలుల కార్యములలో మనం చూస్తాం, స్తేఫాను గారు దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తున్నప్పుడు, యూదులు ఆయనపై పగబట్టి, పట్టణము వెలుపలికి లాక్కొని పోయి రాళ్లతో కొట్టి చంపసాగారు. ఆ భయంకరమైన వేదనలో, ప్రాణం పోయే స్థితిలో కూడా స్తేఫాను గారు పగ తీర్చుకోమని దేవుడిని అడగలేదు. ఆయన మోకరించి, యేసు ప్రభువు సిలువపై పలికిన మాటలను స్మరిస్తూ:
"ప్రభువా, వీరి మీద ఈ పాపము మోపకుము" అని పెద్ద శబ్దముతో పలికి చనిపోతున్నాడు. (అపొస్తలుల కార్యములు 7:60)
2. రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవుల సహనం
రోమా చక్రవర్తులు ఆదిమ క్రైస్తవులను సింహాలకు ఆహారంగా వేస్తున్నప్పుడు, సజీవంగా తగలబెడుతున్నప్పుడు కూడా క్రైస్తవులు పాలకులను శపించలేదు. వారి కోసం కన్నీళ్లతో ప్రార్థించారు. ఎందుకంటే దైవజ్ఞానము, వివేకము కలిగిన విశ్వాసికి ఒక విషయం బాగా తెలుసు: "సత్యం తెలియని అజ్ఞానము వలనే వీరు మమ్మల్ని హింసిస్తున్నారు." ఒక అంధుడికి దారి తెలియక పక్కన ఉన్నవాడిని ఢీకొడితే మనం ఎలా కోపగించుకోమో, అలాగే ఆత్మీయ అంధత్వంలో ఉన్న శత్రువులను చూసి క్రైస్తవులు జాలిపడ్డారు కానీ పగ తీర్చుకోలేదు.
దేవుని గుణం: పక్షపాతం లేని ప్రేమ
శత్రువులను ప్రేమించడం అనేది కేవలం ఒక నైతిక సూత్రం కాదు, అది సాక్షాత్తూ దేవుని యొక్క లక్షణం. దేవుడు పక్షపాతి కాడు. ఆయన సృష్టిని గమనిస్తే ఈ సత్యం మనకు సులభంగా అర్థమవుతుంది.
ఆయన చెడ్డవారి మీదికిని మంచివారి మీదికిని తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతుల మీదికిని అవినీతిమంతుల మీదికిని వర్షము కురిపించుచున్నాడు.(మత్తయి 5:45)
దేవుడు కేవలం ప్రార్థన చేసే వారి పొలాల్లోనే వర్షం కురిపించి, తనను తిట్టే వారి పొలాలను ఎండబెట్టడం లేదు. ఆయన సూర్యరశ్మి, గాలి, నీరు అందరికీ సమానంగా ఇస్తున్నాడు. ఈ లోకం మొత్తము మీద దేవుడు చూపిస్తున్న ప్రేమే మనకు ఆదర్శం కావాలి.
మనం ఈ లోకంలో ఎంత గొప్ప మేడలు కట్టినా, ఎంత ధనము సంపాదించినా, ఎన్ని ఉన్నత పదవులు అధిరోహించినా... దేవుని లాంటి క్షమాగుణాన్ని, ప్రేమను కలిగి ఉండకపోతే ఆ విజయాలన్నీ శూన్యమే అవుతాయి.
యేసు ప్రభువు ఒక సూటియైన ప్రశ్న వేస్తున్నారు: "మిమ్మును ప్రేమించువారినే మీరు ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును అలాగే చేయుచున్నారు కదా!" యూదుల సమాజంలో సుంకరులను (పన్నులు వసూలు చేసేవారిని) అత్యంత పాపులుగా, ద్రోహులుగా చూసేవారు. యేసు ప్రభువు అంటున్నారు, లోకంలో పాపులు కూడా వారిని ప్రేమించే వారిని ప్రేమిస్తారు, వారి బంధువులకు వందనాలు చెప్తారు. మరి క్రీస్తును నమ్ముకున్న మనకు, లోకస్తులకు తేడా ఏమిటి? మనం వారి కంటే ఏ విధంగా శ్రేష్టులం? దేవుని నమ్మిన వానిగా, క్రీస్తు అనుచరునిగా నేను పరిపూర్ణత కలిగి జీవించాలి. ఆయన ప్రేమను, వాత్సల్యాన్ని శత్రువులకు సైతం పంచగలగాలి. ఇందుకోసమే ప్రభువు మనల్ని ప్రత్యేకించుకున్నాడు.
మన పిలుపు మరియు బాధ్యత
పరిపూర్ణత వైపు సాగడమే క్రైస్తవ జీవిత గమ్యం. "మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అయినట్లే మీరును పరిపూర్ణులుగా ఉండాలి అని ప్రభువు సెలవిచ్చారు. ఈ పరిపూర్ణత అనేది ఉపవాసాల వల్లనో, కేవలం ప్రార్థనల వల్లనో రాదు; శత్రువును సైతం క్షమించి ప్రేమించగలిగే హృదయాన్ని అలవర్చుకున్నప్పుడే వస్తుంది.
మన హృదయాలలో ఉన్న ద్వేషాన్ని, పగను సిలువ చెంత పారవేద్దాం. మనల్ని గాయపరిచిన వారిని క్షమిద్దాం. మనకు కీడు చేసిన వారికి మేలు చేద్దాం. అప్పుడే మనం నిజమైన దేవుని బిడ్డలముగా లోకంలో ప్రకాశించగలము.
ప్రార్థన
పరలోకమందున్న మా ప్రియ పరమ తండ్రి! మా జీవితంలో అనేక పర్యాయాలు నేను నిజమైన క్రీస్తు అనుచరునిగా, మీ ప్రియ బిడ్డగా జీవించాలని ఆశపడుతున్నాను. కానీ, ఈ లోక ఆశలు, శరీర బలహీనతలు, ఇతరులు నా పట్ల చేసిన కీడును బట్టి నాలో కలిగిన చెడు అభిప్రాయాల వలన, నేను అనేకులను దూరం పెడుతున్నాను. ఎవరికీ నీ ప్రేమను చూపించకుండా స్వార్థంతో జీవిస్తున్నాను. తండ్రీ, నన్ను క్షమించండి.
నీవు మాత్రం నేను నీ వలె, పరలోకపు తండ్రి వలె పరిపూర్ణత కలిగి ఉండాలని కోరుకుంటున్నావు. నేను నీ వలె జీవించలేకపోయినందుకు, నీ ప్రేమను ఇతరులకు ప్రకటించే గొప్ప అవకాశాలను చేజార్చుకున్నందుకు నన్ను క్షమించండి ప్రభువా. నాలో ఉన్న అహంకారాన్ని, ప్రతికారేచ్ఛను, ఇతరులను ద్వేషించే కఠిన మనస్సును, గాయపరిచే హృదయాన్ని నా నుండి తీసివేయండి.
నన్ను హింసించే వారిని సైతం క్షమించే మనస్సును, నన్ను ద్వేషించే వారిని ప్రేమించే దైవిక సుగుణాలను నాకు దయచేయండి. ఎదుటివారిలో తప్పులను వెతకకుండా, వారి ఆత్మీయ అజ్ఞానాన్ని అంగీకరిస్తూ వారి రక్షణ కొరకు ప్రార్థించే వివేకాన్ని ప్రసాదించండి. ఎల్లప్పుడూ, ఏ పరిస్థితిలోనూ ఎవరిని ద్వేషించకుండా, అందరినీ నీ ప్రేమతో ప్రేమించే విశాల హృదయాన్ని నాకు ఇవ్వండి ప్రభువా. నన్ను నీ ప్రియ కుమారుని వలె, కుమార్తె వలె మార్చి, నీ మహిమ కొరకు వాడుకొనమని, మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్.
Comments
మీ అభిప్రాయాలు, ప్రశ్నలు క్రింద రాయండి:
Post a Comment