ఆదివార ప్రసంగాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆదివార ప్రసంగాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, ఆగస్టు 2024, ఆదివారం

19వ సామాన్య ఆదివారం

 19వ సామాన్య ఆదివారం 

రాజుల మొదటి గ్రంథం 19:4-8, ఎఫెసీ 4:30-52 యోహాను 6:41-51

ప్రియ విశ్వాసులారా ఈనాటి మొదటి పఠనంలో ఏలియా ప్రవక్త గురించి   వింటున్నాము. ఏలీయా ప్రవక్త బాలు ప్రవక్తలందరిని చంపినా తరువాత యేసెబేలు రాణి ఏలియాతో నేను నిన్ను చంపిస్తాను అని చెప్పగానే ఆయన దేవుణ్ణి కలుసుకొవడానికీ, తన ప్రయాణము ప్రారంభించి మార్గంలో  దేవునితో  ప్రభూ ఈ బాధ ఇక చాలు! నా ప్రాణమును తీసుకొనుము  అని మోర పెట్టుకున్నాడు. అప్పుడు దేవుడు ఏలియాను ఆదరించి, ఆకలిని తీర్చిన తరువాత , ఆ శక్తితో  తన ప్రయాణం  నలువది రోజులు నడిచి దేవుని కొండయైన హోరేబు చేరుకున్నాడు. 

ప్రియా విశ్వాసులారా దేవుని వాక్కు ప్రజలకు అందించి ఆత్మబలంతో ఎన్నో గొప్ప కార్యాలు చేసి రోషంతో దేవుని కొరకు జీవించి యావే దేవుడే నిజమైన దేవుడని నిరూపించి, ఎంతో మంది బాలు ప్రవక్తలను చంపి కార్మెల్ కొండపై దేవుని ఘనతను చాటించిన ఏలీయా ప్రవక్త, యేసెబేలు రాణి చంపిస్తుందేమో అని భయపడ్డాడు. మన జీవితాల్లో కూడా మనం ఎన్నో గొప్ప కార్యాలను దేవుడిచ్చే శక్తితో చేస్తూ ఉంటాం. కాని ఎలియా వలె మనం కూడా ఏమైనా కష్టాలు, బాధలు వచ్చినప్పుడు, ప్రభూ  ఇక చాలు నా ప్రాణమును తీసుకొనుము అని అంటూవుంటాం. ప్రియ విశ్వాసులారా మనము దేవుని కొరకు, దేవుని చిత్తం కొరకు నిలబడితే దేవుడు ఎల్లా వేళల మన పక్షమున ఖచ్చితముగా ఉంటూ, మనలను ఆదరిస్తూ, మన ఆకలిని తీర్చుతాడు. మనలను నడిపిస్తుంటాడు. మరి ఈ గొప్ప ప్రేమను దేవుని నడిపింపును అర్ధం చేసుకొనగలుగుతున్నామా లేదా ఆలోచించండి. 

రెండవ పఠనములో వింటున్నాం. మనము దేవుని ప్రియమైన బిడ్డలం కనుక దేవుని పోలి జీవించాలి అని వాక్యంలో స్పష్టంగా చెబుతున్నారు దేవుడు. అదేవిధంగా క్రీస్తు ప్రభువు మనలను ప్రేమించి మన కొరకై తన ప్రాణములను సమర్పించెను. కాబట్టి క్రీస్తు వలె మనం ప్రేమతో నడుచుకోవాలి అని వాక్యం తెలియజేస్తుంది. అదేవిధంగా మన జీవితంలో ఏమి ఉండాలి ఏమి ఉండకూడదు అని తెలియజేస్తుంది. వైరము, మోహము, క్రోధము అనే వాటిని వదలి పెట్టాలి అరుపులుగాని,  అవమానముగాని  ఏ విధమైన ద్వేషభావముగాని,  అసలు మనలో మన కుటుంబాలలోగాని మన మనసులలోగాని ఉండకూడదు. కాని ప్రియా మిత్రులారా ఈలోక  జీవితంలో ప్రేమకు బదులుగా గొడవలు, ప్రతి విషయానికి అరుపులు, కేకలు, అల్లరులు అవమానాలు ఎక్కువై పోతున్నాయి. వీటన్నిటికీ కారణం స్వార్ధం, గర్వం, అసూయ, ఓర్వలేని తనం, అందుకే వాక్యం సెలవిస్తుంది. ఏ విధమైన ద్వేషభావమైన మనలో అసలు ఉండకూడదు.   ఈ లోకంలో స్వార్ధం, నటన, మోసం ఎక్కువగానే కనపడుతుంది, ఈ లోకంలో ఎక్కడ చూసిన స్వార్ధ బుద్దితో ఉన్నవారే ఎక్కువ ఉన్నారు. అన్ని నాకే, అంత నాకే, అన్ని నేనే అనే స్వార్ధం అదేవిధంగా నటన అన్నిటిలో,, అన్ని రంగాలలో అన్ని విధులలో ఎంతో మంది నటిస్తూ నటన జీవితం జీవిస్తున్నారు. అదేవిధంగా ఎక్కువమంది  ప్రజలు ఇతరులను  అవమానిస్తున్నారు, లేదా అవమానింపబడుతున్నారు. 

ప్రియమిత్రులారా ఆలోచించండి మనం ఏవరిని అవమానించకూడదు. ఎవరిని ద్వేషించకూడదు.  క్రీస్తుని బిడ్డలుగా, యేసు క్రీస్తుని విశ్వాసులుగా మనము ఎలా ఉండాలి అంటే పరస్పరము దయను, మృదుత్వమును మరియు క్షమాగుణమును కలిగి ఉండాలి. మన పరలోకపు తండ్రి దయామయుడు. మృదుత్వంకలిగి క్షమించి ప్రేమించే ప్రేమ మయుడు. కాబట్టి మనము పరస్పరం ప్రేమ కలిగి ఉండటానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించుదాం. 

సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు అంటున్నారు. "పరలోకము నుండి దిగివచ్చిన జీవముగల ఆహారము నేనే. అది విని  యూదులు గొణగసాగారు. ఈ యూదులు క్రీస్తు ప్రభువును తృణీకరించారు. క్రీస్తును కేవలం ఒక మానవునిగా మాత్రమే వారు చూస్తున్నారు. కాని దేవుని కుమారుడుగా అంగీకరించలేకపోతున్నారు. ఆయనపై నిందలు వేస్తూ వ్యతిరేకిస్తున్నారు. ఆయనను గురించి ప్రశ్నించుకుంటూ గొణుగుతున్నారు. ప్రియ విశ్వాసులారా మనలో చాలామంది యూదుల వలె అపనమ్మకంతో క్రీస్తుని నిజ దేవుడు కాదని అనుమానిస్తుంటాము. కొన్ని సార్లు మనము కూడా గొణుగుకుంటూ దేవుణ్ణి పరీక్షిస్తుంటాం. దేవునిపై మనము కూడా నిందలు వేస్తూ వ్యతిరేకిస్తుంటాము.   

ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము ఎలా ఉన్నాము అందుకే క్రీస్తు ప్రభువు అంటున్నాడు. తనను పంపిన  తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడును నా యొద్దకు రాలేడు. మిత్రులారా మనము దేని ద్వారా లేక ఎవరి ద్వారా ఆకర్షింప బడుతున్నాము, ఆలోచించండి. అనేక విధాలుగా మనము ఆకర్షింపబడుతున్నాం. మరి మనము దేవుని ద్వారా ఆకర్షింపబడుతున్నామా! దేవుని వాక్యానికి ఆకర్షింపబడుతున్నామా! ఆలోచించండి. అదేవిధంగా క్రీస్తు ప్రభువు నన్ను విశ్వసించువాడు నిత్య జీవం పొందును అని అంటున్నాడు. మనము నిత్య జీవం పొందాలంటే ఏమి చేయాలి అంటే ఆయనను విశ్వసించాలి. ఒక గొప్ప విశ్వాసిగా విశ్వాస జీవితం జీవించాలి. అదే విధంగా క్రీస్తు ప్రభువు అంటున్నాడు ఈలోకము అనగా మనం జీవించుటకు ఆయన ఇచ్చు ఆహారము తన దేహము. అంటే ఎవరైనా క్రీస్తు శరీర రక్తాలను, దివ్యసత్ప్రసాదమును విశ్వాసంతో  స్వీకరిస్తారో, వారు నిరతము జీవిస్తారు. మరి మనము నిజమైం విశ్వాసంతో క్రీస్తుని శరీర రక్తాలను స్వీకరిస్తున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. 

ప్రార్ధన: జీవము గల దేవా, మాకు నీ జీవమును నీ శక్తిని ఇచ్చి నడిపింపుము. ఆనాడు ఏలియా ప్రవక్తను పోషించి, బలపరచి, నడిపించినావు. మమ్ము కూడా అదే విధముగా నడిపించుము. మేము మాలోని చేడు గుణములు విడనాడి నిన్ను పోలి నీ బిడ్డలుగా జీవించే అనుగ్రహం మాకు దయచేయుము. అదేవిధంగా మీ విశ్వాసులుగా పరస్పరం దయను,మృదుత్వమును మరియు క్షమించే గుణములను కలిగి జీవిస్తూ, పరలోకం నుండి దిగివచ్చిన జీవముగల ఆహారం  నీవే అని గుర్తించి, విశ్వసించి, నీ శరీర రక్తాలను విశ్వాసంతో స్వీకరించి నిత్య జీవం పొందే భాగ్యం దయచేయండి. ఆమెన్. 

ఫా. సురేష్ కొలకలూరి OCD

3, ఆగస్టు 2024, శనివారం

18 వ ఆదివారం

 18 వ ఆదివారం 

నిర్గమ ఖాండం 16:2-4,12-15 ఎఫెసి 4:17,20-24  యోహాను 6: 24-35

అక్కడ యేసుగాని , శిష్యులు గాని లేకుండుటచూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫ ర్నామునకు పోయిరి.  ప్రజలు సరస్సు  ఆవలివైపున యేసును కనుగొని  "బోధకుడా!  మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితిరి?" అని అడిగిరి. "మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు. నా సూచక క్రియలను చూచి కాదు అని  మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్యజీవమును చేకూర్చు శాశ్వత  భోజనమునకై శ్రమింపుడు. మనుష్యకుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలయన  తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు  ముద్రను వేసియున్నాడు"  అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు "దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలయును?" అని వారడుగగా, యేసు "దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు. అదియే దేవుడు మీ నుండి కోరునది"  అని చెప్పెను. అంతట "నిన్ను   విశ్వసించుటకు మాకు ఎట్టిగురుతు నిచ్చెదవు? ఏ క్రియలు చేసెదవు?" అని వారు మరల ప్రశ్నించిరి. "వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను. అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను" అని వారు ఆయనతో చెప్పిరి. "పరలోకమునుండి వచ్చిన ఆహారమును మీకిచ్చినది మోషేకాదు. కాని, నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకమునుండి దిగివచ్చి, లోకమునకు జీవమును ఒసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను"  అని యేసు వారితో అనెను. "అయ్యా ! ఎల్లప్పుడును ఆ ఆహారమును మాకు ఒసగుము" అని వారు అడిగిరి. అందుకు యేసు "నేనే జీవాహారమును, నాయొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు. నన్ను విశ్వసించువాడు  ఎన్నడును దప్పికగొనడు" 

ఈనాడు దేవుడు మనకు ఇచ్చే సందేశం. 

మొదటి పఠనం : దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పరీక్షిస్తున్నాడు. 

రెండవ పఠనంలో మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొని క్రీస్తునందు నూతన  జీవితాన్ని ప్రారంభించండి. 

సువిశేష పఠనం: దేవుడు తనను వెదుకుతూ వచ్చిన ప్రజలకు అశాశ్వతమైన  భోజనముకై శ్రమింపుడు అంటు నేనే జీవము గల ఆహారాన్ని అని  తెలియజేశాడు. 

ప్రియా విశ్వాసులారా మొదటి పఠనములో ఇశ్రాయేలు ప్రజలు మోషే మరియు అహరోనులు మీద నేరము మోపుతున్నారు. ఎందుకు అంటే వారు మోషేతో మేము ఐగుప్తులో చచ్చిన బాగుండేది. అక్కడ మేము మాంసమును , రొట్టెను కడుపారా భుజించితిమి. ఇప్పుడు మేమందరం ఈ ఎడారిలో ఆకలితో మలమల మాడి చంపబడడానికి మీరిద్దరు మమ్ము ఇక్కడకు తీసుకొని వచ్చారా అని దూషించారు. యిస్రాయేలు ప్రజలు, శరీరానికి దాని అవసరాలకు లొంగిపోయి, వారు పొందిన స్వతంత్రాన్ని, బానిసత్వము నుండి  రక్షణను, విడుదలను మర్చిపోయిదైవసేవకులను  దూషించారు. కాని  దేవుడైన యావే నిర్గమ  16:4లో వారు నా ధర్మములను పాటింతురో లేదో తెలుసుకొనుటకై వారిని  ఈ విధంగా పరీక్షింతును అని అంటున్నాడు. ప్రభువు ప్రేమతో వారికి ఆకాశము నుండి మన్నాను మరియు వారు కడుపునిండా భుజించడానికి పూరేడు పిట్టలను దయచేసి, యావేనైన నేను మీ దేవుడనని తెలియజేశాడు. 

దేవునికి అంత తెలుసు. మనకు ఏమికావలెనో,ఎప్పుడు కావలెనో ఏమి ఇవ్వాలో తెలుసు. కాబట్టి  దేవుడు మనలను  పరీక్షిస్తున్నాడని మనకు అనిపిస్తే మనము దేవుని ధర్మములను అంటే ఆయన ఆజ్ఞలను పాటిస్తే చాలు. అంత దేవుడే ఇస్తాడు. కాబట్టి పరీక్షింపబడినప్పుడు గొణుకుతూ, సణుగుతూ , ఎదురు తిరుగుతూ నేరం మోపుతూ కాకుండా దేవుని చిత్తానుసారం,  ఆజ్ఞానుసారం నడుచుకుందాం. 

సువిశేషంలో ప్రజలు క్రీస్తు ప్రభువును వెదుకుతూ వచ్చినప్పుడు, ప్రజలు ఎందుకు వచ్చారో వారి మనస్సులోని ఆలోచనలను తెలుసుకోని, మీరు రొట్టెను తిని సంతృప్తులైనందున నన్ను వెదుకుచున్నారు.  కాని నా సూచక క్రియలను చూసి కాదు అని ప్రజలకు చెప్పియున్నాడు. దీని ద్వారా మనము ఏమి తెలుసుకోవాలంటే, దేవునికి  మనము ఏమి చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో, మన మనస్సులోని ఆలోచనలు, ఆశలు ఏంటో తెలుసు. దేవుడు   మన ఉద్దేశాలు  ఎలాంటివి, మంచివా?  కాదా? అని ఖచ్చితంగా చెప్పగలడు. 

ఈనాడు ఎంతో  మంది ప్రజలు తమ స్వలాభాల కోసం, స్వష్టతల కోసం  దేవుని  వెదుకుచు వస్తున్నారు, కాని  నిజంగా దేవుణ్ణి నమ్మి రావడంలేదు. దేవునికి తెలుసు .  దేవుని దగ్గర నుండి అది కావాలి, ఇది కావాలి అని అడుగుతున్నారు. దేవా! నాకు నీవు కావాలి అని   ఎంత మంది అడుగుతున్నారు? వరాలు కావాలి, దీవెనలు కావాలి అని దేవుని దగ్గరకు వెళ్లేవారు చాలా మంది ఉన్నారు.  కాని ఆ వారలను దీవెనలను ఇచ్చే వార ప్రధాతను నాకు నీవు కావాలి అని ఎంత మంది అడుగుతున్నాం. 

క్రీస్తు ప్రభువు అంటున్నాడు, అశాశ్వతమైం దానికై శ్రమింపవలదు. మిత్రులారారా !  ఈనాటి సమాజంలో ఎంతో మంది అశాశ్వతమైన ఈలోక  వస్తువులు, ఈలోక,  వ్యామోహం ఈలోక  సంపదల కోసం శ్రమిస్తున్నారు. ఈ లోకం శాశ్వతంకాదు. మనము ఎల్లకాలం ఈలోకంలో ఉండము. ఈ అశాశ్వ తమైన వాటి కొరకు మనం పడే శ్రమ వృధా! కాని  క్రీస్తు ప్రభువు చెబుతున్నాడు. నిత్య జీవమును చేకూర్చు శాశ్వత  భోజనముకై శ్రమింపుడు అని అంటున్నాడు. మనము ఏ రకమైన  పనులు చేయాలి ఈ నిత్య జీవమును పొందాలంటే యోహాను 6: 35 వచనములో చెబుతున్నాడు. "నేనే జీవాహారమును, నాయొద్దకు వచ్చువాడు ఎప్పటికి ఆకలిగొనడు నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు. దీని అర్ధం ఏమిటంటే మనము దేవుని యొద్దకు రావాలి, దేవుని విశ్వసించాలి. అపుడు మనకు జీవం లభిస్తుంది. 

రెండవ పఠనంలో: మనము వింటున్నాం మన పాత స్వభావమును విడిచి, మీ మనస్తత్వమును నుత్నికరించుకొనుడు. అన్యుల వలె  ఆలోచనలు గలవారిగా మీరు ప్రవర్తించకండి. మీరు సత్యమైన నీతిని మరియు పరిశుద్దతను కలిగి క్రొత్త స్వభావమును ధరింపుము. దేవుని పోలికలా  జీవించండి అని పౌలుగారు తెలుయజేస్తున్నారు. మొదటి పఠనములో యిస్రాయేలు ప్రజలు తమ పాత స్వభావమును మార్చుకోవాలి. వారు దేవుని విధులను పాటించాలని సువిశేషంలో జనులు శాశ్వతమైన వాటికొరకు శ్రమించాలని చెబుతూ మనము నీతితో పరిశుద్ధతతో క్రొత్త స్వభావమును ధరించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. 

ప్రార్ధన: పరిశుద్దుడైన తండ్రి మా జీవితాలు  పరీక్షలకు గురైనప్పుడు మాకు ఓర్పును, శనమును దయచేయండి. మీ గొప్ప కార్యాలు మాయందు జరిగింపుము/ మేము మీ యొద్దకు వచ్చుటకు, మిమ్ము విశ్వసించుటకు జీవం పొందుటకు కావలసిన నీతిని పరిశుద్దతను మాకు దయచేయండి, మా పాట పాపపు  స్వభావమును మార్చుకొని నీ పోలిక  క్రొత్త స్వభావమును మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. 

ఫా. సురేష్ కొలకలూరి OCD

21, అక్టోబర్ 2022, శుక్రవారం

30వ సామాన్య ఆదివారం

 30వ సామాన్య ఆదివారం


సిరాక్ 35:12-14
2 తిమోతి 4:6-8, 16-18
లూకా 18:9-14 

క్రీస్తునాదునియందు ప్రియమైనటువంటి పూజ్య గురువులు మరియు దేవుని బిడ్డలైనటువంటి క్రైస్తవ విశ్వాసులారా.

ఈ నాడు తల్లి శ్రీసభ 30వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించియున్నది.ఈ నాటి మూడు దివ్య గ్రంథ పఠనములను గ్రహించినట్లైతే మూడు కూడా ముఖ్యమైనటువంటి ప్రార్థన జీవితం గురించి మనకు తెలియజేస్తున్నాయి.

దేవుడు మనలను సమృద్ధిగా మరియు పుష్కలంగా ఆశీర్వదించాడు. ఆయన తన ఆశీర్వాదాలను మనపై కుమ్మరిస్తూనే ఉన్నాడు. అదే సమయంలో, దేవుడు మనలను తనకు దగ్గరగా ఉండమని మరియు ప్రార్థించమని ఆహ్వానిస్తాడు. క్రైస్తవ మత ఆచరణలో ప్రార్థనకు ప్రముఖ స్థానం ఉంది. నేటి ప్రార్ధన యొక్క కొన్ని అంశాలను మరియు జీవితానికి దాని అన్వయాన్ని చర్చిస్తుంది. దేవుడు ముఖ్యంగా పాపి మరియు వినయస్థుల మాట వింటాడని పఠనాలు చెబుతున్నాయి. మానవులతో వ్యవహరించడంలో దేవుడు ఎందుకు పక్షపాతంతో వ్యవహరిస్తున్నాడని మనం తరచుగా ఆలోచిస్తాము. నేటి సువార్తలో, యేసు మనకు పరిసయ్యుడు మరియు పన్ను తీసుకొనే వ్యక్తి గురించి చెబుతాడు ఇది దేవునితో సరిగ్గా ఉండడానికి మార్గాన్ని చూపుతుంది.

వారిద్దరూ ప్రార్థన చేయడానికి ప్రత్యేక ప్రదేశానికి వెళ్లారు. దేవుడు తన చట్టాలను నిరంతరం ఉల్లంఘించే వారి కంటే వాటిని పాటించే మంచి వ్యక్తులను ఎక్కువగా వింటాడని కొన్నిసార్లు మనం అనుకుంటాము. ఉపమానంలో సూచించినట్లుగా అది ఖచ్చితంగా పరిసయ్యుని వైఖరి. నిజానికి వినయస్థుల ప్రార్థన మేఘాలను చీల్చుతుంది మరియు అది తన లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించదు.

నేటి మొదటి పఠనం పేదల పట్ల దేవుని శ్రద్ధ గురించి చెబుతుంది మరియు వారి ప్రార్థన స్వర్గ న్యాయస్థానాలకు చేరుకుంటుంది. ప్రభువును సేవించే వారు తమ ప్రార్థనలను ప్రభువు ఆలకిస్తారని ఆశించవచ్చు. మన ప్రార్థన జీవితం అనివార్యంగా మన జీవితాంతం అనుసంధానించబడిందని మొదటి పఠనం చెబుతుంది. ప్రభువు న్యాయాధిపతి, మరియు అతనిలో పక్షపాతము లేదు. అన్యాయానికి గురైన వాని ప్రార్థన వింటాడు. అనాథ లేదా వితంతువులు మొరపెట్టుకున్నప్పుడు వారి విన్నపాన్ని ప్రభువు ఆలకిస్తాడు. భగవంతుని చెవి పేదవారు మరియు వదిలివేయబడిన వారి వైపు మొగ్గు చూపుతుంది. విశ్వాసుల ప్రార్థనలు ప్రభువును సంతోషపరుస్తాయి మరియు అతని స్వర్గపు సింహాసనం ముందు వినబడతాయి. కానీ వినయస్థుల ప్రార్థనలు ప్రభువును తాకుతాయి మరియు నీతిమంతులకు న్యాయం చేయడానికి తీర్పును అమలు చేయడం ద్వారా సర్వోన్నతుడు ప్రతిస్పందించే వరకు అవి అతని హృదయాన్ని గుచ్చుతాయి. సిరాక్

ప్రార్థన ఒక బాణం దాని గుర్తుకు చేరుకోవడం గురించి మాట్లాడుతుంది, దేవుడు దానిని గమనించే వరకు అది మిగిలి ఉంటుంది. బలహీనులు మరియు వినయస్థులు సర్వశక్తిమంతుడైన దేవునితో వినికిడిని పొందుతారు.

పౌలు తిమోతికి వ్రాసిన రెండవ లేఖ నుండి నేటి రెండవ పఠనంలో, పౌలు యొక్క వినయానికి

ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. పౌలు తన నిష్క్రమణ సమయం వచ్చిందని చెప్పినప్పుడు, అతను మరణం యొక్క సామీప్య వాస్తవాన్ని చెబుతున్నాడు. అతని మరణం ఆసన్నమైంది మరియు అతను ఈ జీవితం నుండి నిష్క్రమించడం మరియు క్రీస్తు వద్దకు తిరిగి రావడం ఖాయం. అతను అప్పటికే తన జైలులో ఉన్నాడు. అతని మాటల ద్వారా, అతను జాలి కోరడం లేదు, లేదా అతను యేసు యొక్క పవిత్ర నామంలో చేసిన అన్నిటి గురించి గొప్పగా చెప్పుకోలేదు. మరోవైపు అతను తన డబ్బు,తన పని, తన సమయం మరియు ఇప్పుడు తన జీవితాన్ని దేవుడికి సమర్పించాడు. తాను మంచి పోరాటం చేశానని, మంచి పరుగు పందెం నడిపానని, విశ్వాసాన్ని నిలబెట్టుకున్నానని పౌలు ఇప్పుడు వాళ్లతో చెబుతున్నాడు. పౌలు తనతో లూకాను కలిగి ఉన్నాడు మరియు తిమోతి మరియు మార్కు తన స్థానానికి వస్తారని అతను ఆశించినప్పటికీ, అతను యేసు వలె విడిచిపెట్టబడ్డాడు. 

నేటి సువార్తలో, ప్రార్థన సందర్భంలో ఒక పరిసయ్యుడు మరియు పన్ను వసూలు చేసే వ్యక్తి యొక్క విచిత్రమైన ఉదాహరణ మనకు ఉంది. అతను మంచి వ్యక్తి అని నిరూపించడానికి పరిసయ్యుడు మరియు మా దగ్గర స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. అతను యూదుల ధర్మశాస్త్రాన్ని మరియు దేవుని ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించాడు. అతను మంచి యూదుడు బాధ్యతలను నమ్మకంగా గమనించాడు: అతను ప్రార్థించాడు, ఉపవాసం ఉన్నాడు మరియు భిక్ష ఇచ్చాడు. నిజానికి, అతను

దేవుని పట్ల తన వైఖరిలో చాలా ఉదారంగా ఉన్నాడు. అతను వారానికి రెండుసార్లు ఉపవాసం ఉండేవాడు, అయితే మతపరమైన యూదుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఉపవాసం ఉండేవాడు. వ్యవసాయ ఉత్పత్తుల లాభాల్లో దశమభాగాలు ఇవ్వాలని చట్టం ఆదేశించింది, అయితే పరిసయ్యులు అతని వద్ద ఉన్న ప్రతిదానిలో దశమ వంతులు ఇచ్చారు. అతని నీతి మోషే ధర్మశాస్త్రం సూచించిన ప్రమాణాలను గణనీయంగా మించిపోయింది. ఇంకా, దేవుడు అతనితో సంతోషంగా లేడు ఎందుకంటే అతను పూర్తిగా స్వీయ-కేంద్రీకృత వ్యక్తి. అతను ఇతరులలా కాదు, ముఖ్యంగా దేవాలయానికి ప్రార్థన చేయడానికి వచ్చిన భయంకరమైన పన్ను వసూలు చేసే వ్యక్తిని అతను మాటలతో దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. పరిసయ్యుడి వంటి పవిత్రమైన ఉదార ​​వ్యక్తిని దేవుడు రక్షించడం ఎంత అదృష్టమో అతను దేవునికి చెప్పాడు.

సువార్తలో చిత్రీకరించబడిన పన్ను వసూలు చేసే వ్యక్తిని చూస్తే అతను ఖచ్చితంగా పాపాత్ముడే. పన్ను వసూలు చేసేవారిని సామాజిక బహిష్కృతులుగా పరిగణించారు. వారు రోమ్ కోసం దొంగలుగా పరిగణించబడ్డారు.

పన్ను వసూలు చేసేవారు రోమన్లచే అణచివేయబడిన వారి సొంత  సంఘం నుండి పన్ను డబ్బు వసూలు చేసి వారికి మంచి వాటాను ఇచ్చారు. ఇక్కడ మనకు యూదుల చట్టాన్ని పాటించని ఒకరు ఉన్నారు. ఇతర పన్నువసూలు చేసేవారిలాగే, అతను కూడా మోసగాడు మరియు దోపిడీదారుడే. అతను నిజంగా ప్రపంచం ముందుపాపి, కానీ దేవుడు అతన్ని ప్రేమించాడు మరియు అతనిని ప్రేమిస్తూనే ఉన్నాడు. పన్ను వసూలు చేసేవాడు

దేవాలయాన్ని విడిచిపెట్టినప్పుడు, అతను దేవుని స్నేహితుడిలా చేశాడని యేసు చెప్పాడు, అయితే పరిసయ్యుడు క్షమాపణ అనుభవం లేకుండా వెళ్లిపోయాడు. పన్ను వసూలు చేసేవాడు పాపి అయినప్పటికీ, అతను తన పాపాలను ఒప్పుకున్నాడు మరియు దేవుని నుండి క్షమాపణ కోరాడని ఉపమానం చెబుతుంది.

పరిసయ్యుడు మరియు పన్ను వసూలు యొక్క ఈ ఉపమానం యొక్క సాధారణ వివరణ ప్రారంభ

పద్యం నుండి దాని సూచనను తీసుకుంటుంది. ఇది తమ సొంత ధర్మాన్ని నమ్మి, అందరినీ తృణీకరించే వారిని ఉద్దేశించి ప్రసంగించబడింది. ఉపమానం కూడా ఒక పరిసయ్యుడు మరియు పన్ను వసూలు చేసే వ్యక్తి యొక్క పాత్రలను ఉపయోగిస్తుంది కానీ సందేశం ప్రత్యేకంగా పరిసయ్యుడు లేదా పన్ను వసూలు చేసే వ్యక్తికి వ్యతిరేకంగా సూచించబడలేదు. ఈ ఉపమానాన్ని చదివిన వారిలో చాలామంది పరిసయ్యుడిని గర్విష్ఠుడని, స్వధర్మపరుడని,అహంభావి అని విమర్శిస్తూ, పన్ను వసూలు చేసే వ్యక్తిని వినయపూర్వకమైన వ్యక్తిగా పొగడాలని షరతు విధించారు. వాస్తవానికి, పరిసయ్యుడు స్వీయ-నీతిమంతుడు కాదు మరియు అతను మంచి పరిసయ్యుడు చేయవలసిన పనిని చేస్తాడు. మరోవైపు పన్ను వసూలు చేసేవాడు భూమి యొక్క శత్రువులకు సహకరించేవాడు. పరిసయ్యుడు చేసిన తప్పు ఏమిటంటే, అతను తన మతపరమైన మరియు వ్యక్తిగత విజయాన్ని తనకు తానుగా జమ చేసుకున్నట్లు అనిపిస్తుంది.

నేటి సువార్తలో లూకా మనకు చెప్పేదేమిటంటే, మనం ఎవరమైన సరే, మనలో ఎవరైనా ఉచ్చరించగల ఏకైక ప్రామాణికమైన ప్రార్థన పన్ను వసూలు చేసే వ్యక్తి ద్వారా మాత్రమే. అప్పుడు కూడా ధర్మానికి హామీ లేదు. ఇక్కడ యేసు సరళత మరియు వినయం గురించి మాట్లాడుతున్నాడు. తమను తాము తగ్గించుకొనేవారందరు హెచ్చించబడతారని ఆయన చెప్పాడు. మత్తయి సువార్తలో, చిన్న పిల్లవాడిలా వినయంగా మారేవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అని యేసు చెప్పిన మాటలు మనకు ఉన్నాయి. పరిసయ్యుడు మరియు పన్ను వసూలు చేసేవారి ఉపమానంలో, పరిసయ్యుడు తనను తాను నీతిమంతుడిగా ఎలా భావించుకున్నాడో మరియు పన్ను వసూలు చేసేవారిని ఎలా ఖండించాడో మనం విన్నాము.

ఆయన భూమిపై జీవించిన కాలంలో, పరిసయ్యులకు వ్యతిరేకంగా తప్ప యేసు చెప్పిన కఠినమైన

మాటలేవీ మనం వినలేము. యేసు వారితో కలిసిపోయాడు, అయినప్పటికీ అతను వారి ప్రవర్తన గురించి గట్టిగా మాట్లాడాడు. మత్తయిలో, పరిసయ్యులు మరియు సుంకరులను క్రీస్తు ఖండించడానికి పూర్తి అధ్యాయం అంకితంచేయబడింది. అతను వారిని తెల్లగా కడిగిన సమాధులు అని పిలుస్తాడు, చట్టాలను రూపొందించే వ్యక్తులు కానీ పాటించని వ్యక్తులు మరియు మొదలైనవి. నేటి ఉపమానంలో, అతను వారిని స్వీయ-నీతిమంతులుగా మాట్లాడుతున్నాడు. మనం నేర్చుకునే ఒక విషయం ఏమిటంటే, దేవుడు ఏ పాపాన్ని ఆమోదించడు, వినయంతో ఆయన వైపు తిరిగే పాపులందరికీ ఆయన దయ మరియు క్షమాపణ అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ఇది మన చిత్తశుద్ధి కోసం మనకు బహుమతిగా ఇవ్వబడిన దేవుని దయ మాత్రమే, ఇది మనలను ఆయన సన్నిధికి తీసుకువస్తుంది, మనకు మోక్షాన్ని తెస్తుంది, ఎందుకంటే మన దేవుడు దయగలవాడు మరియు అతను మానవాళిని ప్రేమిస్తాడు. “వినయుని  వ్యక్తి యొక్క ప్రార్థన మేఘాలను చీల్చుతుంది.

పరిసయ్యుల యొక్క ఈ విచారకరమైన కథ నుండి మనం నేర్చుకోవలసిన ఒక విషయం ఏమిటంటే,

దేవుడు ఏ పాపాన్ని ఆమోదించడు, అతని దయ మరియు అతని క్షమాపణ గర్విష్ఠులు తప్ప పాపులందరికీ అందుబాటులో ఉంటుంది. గర్వం అనే పాపాన్ని దేవుడు క్షమించడని కాదు, గర్వించే వ్యక్తి దేవుని క్షమాపణ కోరడు. కాబట్టి ఈ ప్రమాదకరమైన మరియు విధ్వంసక దుర్మార్గానికి వ్యతిరేకంగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రమాదకరమైనది ఎందుకంటే అది మన జీవితంలోకి ప్రవేశించిన తర్వాత మనల్ని నాశనం చేస్తుంది. ఇది వినాశకరమైనది ఎందుకంటే ఇది మనం ఆచరించే అన్ని మంచి ధర్మాలను మరియు మనం చేసే అన్ని మంచి పనులను నాశనం చేస్తుంది. సోదర ప్రేమ గర్వించె  హృదయంలో వర్ధిల్లదు, ఎందుకంటే గర్వించదగిన హృదయం చాలా స్వార్థంతో నిండి ఉంటుంది, అది ఇతరులకు చోటు లేదు. గర్వించదగిన వ్యక్తి తన ఆత్మగౌరవం కోసం మతాన్ని మరియు ధర్మాలను పాటిస్తాడు మరియు దేవుని కోసం కాదు కాబట్టి గర్వించే హృదయంలో దేవుని పట్ల నిజమైన ప్రేమ ఉండదు. ఉపమానంలోని పరిసయ్యుడు ఈ వాస్తవాన్ని ఋజువు చేస్తున్నాడు. అతను తన మంచి పనుల గురించి మాత్రమే ప్రగల్భాలు పలికాడు మరియు ప్రార్థన చేయలేదు. ఇంకా, అతను తన పక్కన ఉన్న వ్యక్తిని విమర్శిస్తూ గడిపాడు మరియు అతనిని తన సొంత సోదరుడిగా అంగీకరించడానికి నిరాకరించాడు. క్రైస్తవులమైన మనం ఆలా జీవించకుండా ఆ యొక్క సుంకరి వలే జీవించాలని, సాటి వారిని గౌరవించాలని ఈయొక్క పూజ బలిలో ప్రార్ధించుకుందాం

బ్రదర్ జోహెన్నెస్ ఓ సి డి 

13, ఆగస్టు 2022, శనివారం

20 వ సామాన్య ఆదివారము

20   సామాన్య ఆదివారము

యిర్మీయా 38 :- 4 - 6 , 8 - 10
హెబ్రీ 12 :- 1 - 4
లూకా 12 :- 49 - 53

 నాటి దివ్య పఠనాలు దేవుని కొరకు జీవిస్తే వారి జీవితంలో ఎదురయ్యే పరిణామాల గురించి తెలియజేస్తున్నాయి.

క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవునికి సాక్షులై జీవిస్తే వారి జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కోవాలిఅదే విధంగా హింసలకు గురి అవ్వాలి ఎన్ని నిందలైనఅవమానాలైన,దైవ శక్తితో ఎదుర్కొని దైర్యంగా నిలబడాలన్నదే  నాటి దివ్య పఠనాల సారాంశం. 

చాల సందర్భాలలో మనం దేవునికి సాక్షులుగా జీవించలేము ఎందుకంటె వచ్చే కష్టాలునిందలు అవమానాలు శారీరక హింసలు చాలా మందికి ఇష్టం ఉండవు అందుకే మధ్యలోనే విశ్వాసం కోల్పోతారు.

 నాడు మనమందరం కూడా దేవుని కొరకు దైర్యంగా నిలబడటం గురించి ధ్యానించాలిమనం దైర్యంగా దేవుని కొరకు మరణించడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనే అంశం అందరు ధ్యానించాలి.

 నాటి మొదటి పఠనంలో దేవుని కొరకు పని చేస్తున్న యిర్మీయా ప్రవక్త ఎదుర్కొనిన కష్టకాలం గురించి బోధిస్తుంది.

యిర్మీయా ప్రవక్త క్రీస్తు పూర్వం 650  సవత్సరంలో  580 మధ్య కాలములో జీవించారు కాలములో బాబిలోనీయుల యొక్క రాజ్యం గొప్పగా విస్తరిల్లినదినెబుకద్నెసరు బాబిలోనియా దేశానికి చెందిన శక్తివంతుడైన రాజు ఆయన క్రీస్తు పూర్వం 587  సంవత్సరములో యోహాయాకీమును బందీగా చేసుకొని అతని స్థానములో సిద్కియా అనే  వ్యక్తి రాజుగా నియమించారు.

సిద్కియా రాజు ఉన్న సమయంలో యిర్మీయా ప్రవక్త యూదాలో ప్రవచించారు అలాంటి సందర్భంలో రాబోయేటటువంటి వినాశనం గురించి ప్రవక్త ముందుగానే హెచ్చరించారు.

ప్రవక్త సత్యమును బోధించిన సందర్బములో తన సొంతవారే తనకు వ్యతిరేకముగా మారారుయిర్మీయా ప్రవక్త రాజును బాబిలోనియా రాజు దెగ్గర లొంగిపోమని చెప్పిన సందర్బములో అక్కడి రాజోద్యోగులు ఐగుప్తు రాజు యొక్క సహాయం కోరమని పలికారు దానికి కూడా వ్యతిరేకముగా అక్కడి రాజోద్యోగులు యిర్మీయా రాజద్రోహం చేస్తున్నాడని అతనిని హింసించారుదైవ శక్తి మీద ఆధారపడకుండా మానవ శక్తి మీద ఆధారపడ్డారు యూదా ప్రజలు.

యిర్మీయా కేవలం దేవుని యొక్క మాటలనే బోధించారు అయినప్పటికీ వారు ప్రవక్త మాటను వినలేదు యిర్మీయా బాబిలోనియా రాజుకు లొంగిపోయి ప్రాణహాని కలగకుండా చూసుకోమని ముందుగానే హెచ్చరించినప్పటికీ కొందరి స్వార్థం వలన ఆయన శారీరక హింసలు పొందాడు.

ప్రవక్త మాటలు దేవుని మాటలైనప్పటికీ అవి వారు గ్రహించలేక పోయారు అందుకే ఆయనను బావిలో పడవేశారు తన జీవితంలో ఎన్నిఇబ్బందులు వచ్చిన సరే యావే దేవుని యొక్క పిలుపును స్వీకరించి ఆయనకు సాక్షమిచ్చారు.

అనేక బాధలు పది ప్రభువుకు నిజమైన సేవకుడిగా నిలిచిపోయాడు యిర్మీయా ప్రవక్తను దేవుడు పిలిచినప్పుడు అతనికి తోడుగా ఉంటానని వాగ్దానం చేసారు కానీ తన జీవితంలో అనేక కష్టాలు అనుభవించారుతన యొక్క వ్యక్తి గత సువార్త సేవలో యిర్మీయా ప్రవక్త దేవుని యొక్క సేవ ఎట్టి పరిస్థితిలో మానుకోలేదు యిర్మీయా 20 ; 9

 నాడు యిర్మీయా జీవితం ద్వారా మనమందరం కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకోవాలి.

1.దేవునికి విధేయతచూపుటయిర్మీయా దేవుని యొక్క ప్రణాళికలు మాత్రమే యూదా ప్రజలకు ప్రకటించారు దేవుడు చేయమని చెప్పిన వన్నిసక్రమంగా నెరవేర్చారు.

2.సత్యమును ప్రకటించుట:యిర్మీయా ప్రవక్త కేవలం సత్యమునే బోధించాడుఅన్యాయముకు దూరంగా ఉన్నారు. దైర్యంగా దేవుని సత్యం ప్రకటించారు.

3. తిరస్కరణ అంగీకరించుటదేవుని కొరకు ఎన్ని రకాలైన సవాలులునిందలు ఎదుర్కొనటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు తన సొంత ప్రజలే తనను నిరాకరించిన సరే దేవునితో సంతోషమును వెదుకుతూ ముందుకు సాగారు.

4. భయపడకుండుటతాను పిలిచినా దేవుడు తోడుగా ఉంటారు అనే నమ్మకంతో అదే విధంగా తనను రక్షిస్తారనే ఆశతో యిర్మీయా దేనికి భయపడలేదుమన జీవితములో కష్టాలు బాధలు వచ్చినప్పుడు దేనికి కూడా బయపడనవసరం లేదు దేవుడు మనలను ఆదుకుంటారు.

5. ఓర్పు కలిగి జీవించుటతన యొక్క పరిచర్యలో శ్రమలు అనుభవించే సందర్బములో ఇశ్రాయేలు ప్రజలవలె దేవుడిని దూషించలేదుదేవుని మనస్సును అర్ధం చేసుకొని అన్ని ఓర్పుతో భరించారు.

యిర్మీయా ఏమి తప్పు చేయనప్పటికీ కష్టాలు అనుభవించారు అది ఆయనకు దేవుని యెడల ఉన్న ప్రేమకు చిహ్నం కాబట్టి ఆయన దేవునికి  విధంగా నైతే సాక్షి అయి జీవించారో మనమందరం అదే విధంగా జీవించాలి.

రెండవ పఠనంలో క్రొత్తగా క్రైస్తవులుగా ,మారిన యూదమతస్తులను బాల పరచటానికి రచయిత క్రీస్తు ప్రభువు యొక్క శ్రమల జీవితం గురించి బోధిస్తున్నారు.

రచయిత క్రీస్తు ప్రభువు యొక్క జీవితం గురించి ఇందుకు తెలుపుచున్నారంటే అప్పటి కాలంలో కొంతమంది యూదులు క్రైస్తవులుగా మారిన యూదులను తిరస్కరించే వారువారిని ప్రార్థనా మందిరముల నుండి వెడలగొటే వారువారి యొక్క కుటుంబాల నుండి వేరు చేసేవారు కాబట్టి వారిని ప్రోత్సహించుటకు వారి విశ్వాసాన్ని బలపరచుటకు  విధంగా క్రీస్తు ప్రభువును కూడా  తిరస్కరించారు మీరు నిరాశకు గురి కాకూడదు అని రచయిత తెలియచేశారు.

క్రీస్తు ప్రభువును కూడా సొంత ప్రజలే నిరాకరించారు కాబట్టి మీ జీవితంలో కూడా తిరస్కరణ ఎదుర్కోవాలి అని తెలిపారు అందుకే మన యొక్క ద్రుష్టి క్రీస్తు ప్రభవు మీద ఉండాలి.

క్రీస్తు ప్రభువు మీద దృష్టిని ఉంచి ఆయన వాలే ముందుకు దైవ చిత్తమును నెరవేర్చ సాగాలి.

క్రీస్తును అనుసరించే సందర్బములో మార్గ మధ్యలో ఎన్ని కష్టాలుఇబ్బందులు ఎదురైనా కానీ వాటిని ఆనందముతో తట్టుకొని ముందుకు వెళ్ళాలి అని యూదా మత క్రైస్తవులను ప్రోత్సహించారు.

క్రీస్తు ప్రభువు వలెమనమందరం కూడా దైవమును ప్రేమిస్తూ దేవునికి సాక్షులై జీవించాలి అని రచయిత తెలుపుచున్నారు కాబట్టి ఆయన కొరకు జీవిస్తూ సాక్ష్యమిచ్చి జీవించాలిమనం దేవుని మీద దృష్టిని ఉంచి ముందుకు సాగాలి మన ద్రుష్టి దేవుని నుండి మరలితే అన్ని కష్టాలు వస్తాయి, సంతోషంగా ఉండదు

పేతురు గారు ప్రభువును చూస్తూ నడిచినంత సమయం వరకు తాను పడిపోలేదుఎప్పుడైతే ప్రక్కకు చూసాడో అప్పుడు మునగ సాగాడు అదే విధంగా మనం క్రీస్తు ప్రభువును చూస్తూ నడిచినంత కాలం మనం దైర్యంగా ముందుకు సాగుతాం కాబట్టి ప్రభువును ఆదర్శంగా చేసుకొని మనం మన యొక్క విశ్వాస జీవితాన్ని జీవించాలి "never lose the sight of God".

 నాటి సువిశేష భాగంలో ప్రభువు రెండు ముఖ్యమైన విషయాలు తెలుపు చున్నారు.1 . ఆయన  వచ్చింది నిప్పును అంటించుటకు అని 

2 . ఆయన వల్ల విభజన ఏర్పడుతుందని

 రెండు విషయాలు అర్ధం చేసుకొనుటకు మనకి కొంచెం కష్టతరంగా ఉంటుంది కానీ  రెండు మాటలు (అగ్నివిభజనఅర్ధం చేసుకుంటే దానిలోనే నిజమైన క్రైస్తవ జీవితం దాగి ఉన్నది.

పవిత్ర గ్రంధములో అగ్నికి వివిధ రకాలైన అర్దాలున్నాయి.

1 . అగ్ని శుద్ధి చేస్తుంది సంఖ్య 31 : 23 , యెహెఙ్కేలు 22 : 19 - 22 .

2 . అగ్ని దేవుని యొక్క తీర్పుకు గుర్తు మత్తయి 5 : 22 , 18 : 9 , యెషయా 66 : 16 , ఆమోసు 7 : 4 , 2 పేతురు 3 : 7

3 . అగ్ని దేవుని యొక్క మహిమకు గుర్తు యెహెఙ్కేలు 1 : 4 , 13

4 . అగ్ని దేవుని యొక్క సంరక్షణకు గుర్తు 2 రాజు 6 : 17

5 . అగ్ని దేవుని పవిత్రతకు గుర్తు ద్వితీ 4 : 24

6 . అగ్ని పవిత్రతకు గుర్తు అపో 2 : 3

ప్రభువు అగ్నిని అంటించుటకు వచ్చారు అని అన్నారు అంటే అగ్ని ఏవిధంగా ఐతేఅన్నింటిని బయలు పరచి తేట తెళ్లము చేస్తుందో అదే విధంగా క్రీస్తు ప్రభువు కూడా తన యొక్క జీవితం ద్వారాపరిచర్య ద్వారా మంచి ఏదోచేదు ఏదోపాపమేదోపుణ్యమేదో అనే అంశాలు ప్రజలకు తేట తెల్లము చేశారుఅగ్ని శుద్ధి చేసిన విధంగా ప్రభువు తన యొక్క  వాక్కు ద్వారా మనలనుశుద్ధి చేసారు మనలను పవిత్రులుగా, పుణ్యాత్ములుగా  చేసారు

యేసు క్రీస్తు యొక్క మరణం మనమందరం పాపాత్ములం అనే అంశం తెలుపుచున్నదిఆయన మరణం మనల్నిమనం పాపులుగా తీర్పు చేసేలా ఉంటుంది మనమందరం ఆధ్యాత్మికంగా మరణించిన పాపాత్ములమే కాబట్టి యేసు ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని మనలో క్రొత్త జీవితమును పుట్టిస్తుంది.

అగ్ని మనల్ని ముందుకు వెలుగులాగా నడిపించిన విధంగా క్రీస్తు ప్రభువు యొక్క జీవితం మనల్ని పరలోకమునకు నడిపిస్తుంది.

రెండొవదిగా ప్రభువు  లోకములో విభజన తీసుకొని వస్తున్నారు అంటే ఎవరైతే క్రీస్తు ప్రభువుకు సాక్షులుగా ఉండాలనుకుంటారో ఎవరైతే సత్యంకోసం జీవిస్తారో వారులోకం నుండి, కుటుంబ సభ్యుల నుండి విభజింపబడతారు.

క్రీస్తు ప్రభువు యొక్క రాక ద్వారా  ప్రజలలో విభజన ఏర్పడింది తన కొరకు జీవించే వారు ఒక ప్రక్కన అదేవిధంగా అధికారుల వైపు జీవించే వారు ఒక ప్రక్కకు.

పునీత ఎడిత్ స్టెయిన్ గారు క్రీస్తు ప్రభువు కోసం జీవించే సందర్బములో తన యొక్క కుటుంబ సభ్యులు తనకు వ్యతిరేకముగా మారారు.

సాదు సుందర్ సింగ్ యేసు ప్రభువు కొరకు జీవించే సమయములో ఆయన యొక్క కుటుంబ సభ్యులు ఆయనకు దూరమయ్యారు.

మనం కూడా సత్యం కోసం జీవించేటప్పుడు ఇతరులు అసత్యం కోసం జీవించే సందర్బములో ఇద్దరి మధ్య సంధి కుదరదు అందుకే విభజన వస్తుంది.

 ప్రపంచం కోసం జీవించే వారు క్రీస్తు కొరకు జీవించే వారి మధ్య విభేదాలు వస్తాయి.

కుటుంబాలలో క్రీస్తు ప్రభువు కొరకు జీవించే వారు వేరే మతం కోసం జీవించే వారి మధ్య విభేదాలు వస్తాయి.

మన యొక్క క్రైస్తవ జీవితంలో ప్రభువు కొరకు జీవించే సందర్భాలలో కొన్ని వ్యతిరేకతలు వస్తాయి అయినప్పటికీ మనం దేవునికి సాక్షులుగా జీవించాలి.

దేవుని కొరకు జీవించే దానియేలుకుకష్టాలు ఎదురయ్యాయి దేవుని కొరకు జీవించే ప్రవక్తల జీవితాలలో కష్టాలు ఎదురయ్యాయి.

సైఫాను జీవితములోఆపోస్టుల జీవితములో అదే విధంగా తొలి క్రైస్తవుల జీవితములో కూడా కష్టాలు వచ్చాయి ఐన వారు దేవునికి సాక్షులుగా ఉన్నారు మనం కూడా దేవునికి సాక్షులుగా ఉండాలి.

 

ఫాదర్. బాల యేసు.  సి డి.

 

 

 

 

 

 

 

తపస్సుకాలపు రెండొవ ఆదివారము

తపస్సుకాలపు రెండొవ ఆదివారము ఆదికాండము 15:5-12, 17-18 ఫిలిప్పీయులు 3:17-4:1 లూకా 9:28-36           క్రీస్తునాధునియందు మిక్కిలి ప్రియ  దేవుని ...