దైవభక్తుడైన యోసేపు
యాకోబునకు పండ్రెoడుగురు కొడుకులు కలరు. వారిలో యోసేపు చిన్నకుమారుడు. ఇతని తల్లి పేరు రాహేలు. తన తండ్రి స్థిరపడిన కనాను దేశమునందు యాకోబు నివసించెను. యోసేపు పనేడుసంవత్సరములు ప్రాయము కలవాడు. అతడింకను చిన్నవాడే. సోదరులతో కలిసి తండ్రి మందలను మేపెడివాడు.అతడు సోదరులు చేసిన చెడ్డ పనులు తండ్రికి చెప్పెను. ముదిమిన పుట్టిన బిడ్డడు కావున ఇశ్రాయేలు యోసేపును ఇతర కుమారులకంటే ఎక్కువగా ప్రేమించెను.అతనికి పొడుగు చేతుల నిలువుటంగీని కుట్టించెను.తమకంటే ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రుడగుటచే యోసేపును అతని సోదరులు ద్వేషింపసాగిరి. అతనితో ప్రియముగా మాట్లాడరైరి.
యోసేపు కలలు కనేవాడు. అతనికి చిన్ననాడే రెండు కలలు వచ్చాయి.మొదటికలఇది: అతడి సోదరులు పొలములో పైరుకోసి కట్టలు కట్టారు.కానీ సోదరులకట్టలు నిలువుగా నిలబడి వున్న అతనికట్టకు దండంపెట్టెను. అతడు సోదరుల మీద అధికారము నేర్పుతాడని ఈ కల భావము. రెండవకల ఇది: సూర్య చంద్రులు పదకొండు నక్షత్రాలు అతనికి నమస్కారం చేశాయి.సోదరులు తల్లి దండ్రులు యోసేపుకి దండం పెడతాయని ఈ కల యొక్క అర్ధము.ఈ కలలను విని తోబుట్టువులు యోసేపుపై మండిపడ్డారు.అతన్ని ఇంకా ద్వేషింపసాగారు.తండ్రి యోసేపుతో, నీసోదరులు షెకెములో మందలను మేపుచున్నారు.రమ్ము నిన్ను కుడా వారిదగ్గరకు పంపెదను అని అనెను .యోసేపు నేను సిద్ధముగావున్నాను అనెను.యోసేపు సోదరులు పట్టినబాటనే పోయి వారిని దోతానులో చూసేను.వారు ధారిణ ఉండగానే, అతనిని చూచిరి.
అతడు దగ్గరకు రాకముందే అతనిని చంపవలెనని అన్నలు కుట్ర పన్నిరి. ఇది విన్న రూబేను యోసేపును కాపాడగోరి అతనిని చంపవలదనెను.మనకీ రక్తపాతమేల? యోసేపును ఈ అడవిమండలి గోతిలో త్రోయుడు. అతనికి ప్రాణహాని చేయకుడు, అని వారితో చెప్పెను.యోసేపు సోదరుల దగ్గరకు వచ్చెను.వారు అతను ధరించిన పొడవుచేతుల నిలువుటంగీని తీసివేసి గోతిలో పడవేసెను.అప్పుడు యూదా అప్పుడు తన సోదరులతో యోసేపునుచంపి అతని చావును కప్పిపుచ్చిన మనకు మేలేమి కలుగును ? రండు, అతనిని ఇష్మాలీయులకు అమ్మివేయుదము అని అతనిని ఇరువది నాణ్యములకు అమ్మిరి.ఇష్మాయేలీయులు యోసేపుకి సంకెళ్లు వేసి ఆతనిని బానిసగా ఈజిప్తుకు కొనిపోయి ఫోతీఫరునకు అమ్మిరి.ఫోతీఫరు ఫరోరాజుకాడ వున్న ఉద్యోగి. రాజా సంరక్షకులకు నాయకుడు.
యోసేపు ఐగుప్తుదేశీయుడగు యజమాని ఇంటిలో ఉండెను.దేవుడు యోసేపుకు తోడుగా ఉండెను.కావుననే అతడు అంచెలంచెలుగాదీవించబడెను.అతడు చక్కనిముర్తిగలవాడు, అందగాడు. కనుక యజమాని భార్య అతనిమీద కన్ను వేసెను. తనతో శయింపమనిరమ్మని కోరెను. కానీ యోసేపు దానికి అంగీకరింపలేదు.ఒకనాడు, అతడు ఎప్పటి మాదిరిగా యజమానుని ఇంటిలోపలికి వెళ్లెను.ఇంటిబలగములోనివారు ఒక్కడైననూ అప్పుడు అక్కడ లేడు. యజమానుని భార్య అతనిపైబట్ట పట్టుకొని, శయనింపరమ్మని కోరెను.అతడు ఆ పైబట్ట ఆమె చేతులలో వదలివేసి, ఇంటినుండి బయటకు పారిపోయెను.తన చేతికి చిక్కిన యోసేపు పై బట్టను భర్తకు చూపించి అతడునన్ను మానభంగముచేయదలచి తన గదిలోనికి వచ్చాడని తన భర్తకు పిర్యాదు చేసింది.ఆ మాటలు విని యజమానుడు మండిపడెను.
ఇదివినిన యజమానుడుమండిపడి యోసేపును చెరసాలలో బంధించెను. అయిననూ దేవుడు యోసేపుకి తోడుగా ఉండెను.ఒక రోజు ఆచెరలోనికి ఇద్దరు కొత్త ఖైదీలు వచ్చారు. వారు ఫరోరాజు వంటవాడు, పానీయవాహకుడు.ఏదో నేరంపై ఆ ఇద్దరిమీద రాజు కోపపడెను. వారు యోసేపు చెరసాలలో త్రోయబడ్డారు.ఒక రోజు ఆ ఇద్దరికి వేరువేరు కలలు వచ్చాయి.యోసేపు స్వప్న వ్యాఖ్యానమునందు నిపుణుడు.అతడు ఆ ఇద్దరి కలలకు అర్ధం చెప్పాడు.పానీయవాహకుడికి మూడురోజులతరువాత ఫరోరాజు అతనిని విడుదలచేయించి,మరలా తనపనిని తనకు అప్పగిస్తాడని,వంటవానికి మూడు రోజులతరువాత ఫరో రాజు అతనిని ఉరి తీయిస్తాడని వివరించాడు.అది జరిగిన తరువాత, యోసేపు పానీయవాహకునితో నీవు నాకొక ఉపకారం చేసిపెట్టాలి,ఇక్కడ అన్యాయముగా నేను ఈ చెరలో త్రోయించబడ్డాను.నీవు ఫరోనుకలుసుకొనినప్పుడు,ఆ రాజుకి నాసంగతి తెలియజేసి,ఆయన నాపై దయపుట్టేలా చూడు అని చెప్పాడు.కానీ ఆ చెరనుండి విడుదల పొందిన పానీయవాహకుడు యోసేపును పూర్తిగా మర్చిపోయాడు. ఫరో ప్రభువు రెండు కలలుకనెను .
తెల్లవారిన తరువాత అతనికి మనస్సు కలవరపడెను .ఫరోరాజు ఉన్న ఆ దేశములో వున్న జ్ఞనులను పిలిపించి ,వారికి తన కలలుగూర్చి చెప్పెను .కానీ వారిలో స్వప్న ఫలములను వివరించు వాళ్ళు ఒక్కరు లేరాయెను. అంతట పానీయవాహకుడు తన యేలికతో ఈ నాటికి నేను చేసిన తప్పులు నాకు తెలిసి వచ్చినవి .ఒకసారి ఏలినవారు దాసులమీద కోప పడితిరి .అప్పుడు నన్నును వంటవానిని అంగ రక్షకుని, నాయకుని ఆదీనమునందుంచి చెరసాలలోఉంచిరి .ఒక రాత్రి మేమిరువురము కలలు గంటిమి .అవి వేరువేరు భావములు కలవి . చెరసాలలో మాతో పాటు ఒక హెబీయ పడుచువాడు ఉండెను. అతడు అంగరక్షానాయకుని సేవకుడు. మేమతనికి మా కలలు చెప్పుకొంటిమి .అతడు చెప్పునట్టే మా కలలు నిజములైనవి . నాకు కొలువు దొరికినది వంటవానిని ఉరితీసిరి.
అంతటా ఫరో రాజు యోసేపును పిలువనంపెను .సేవకులు అతనిని శీఘ్రముగా కొనివచ్చారు అప్పుడు, ఫరో రాజు యోసేపుతో తన కలలు చెప్పెను .దానికి యోసేపు దేవరువారు కన్నా కలలు రెండును ఒక్కటే దేవుడు తాను చేయబోవుపనిని ఏలినవారికి తెలియజేసెను. ఈజిప్తులో మొదటి ఏడేండ్లు పంటలు బాగాపండుతాయి. ధాన్యం సమృద్ధిగా లభిస్తుంది కానీ తరువాత ఏడేండ్లు దారుణమైన కరువు వస్తుంది. ప్రజలు తిండి లేక మలమల మాడి చస్తారు.అందుచేత రాజు ముందుగానే వివేకము ఉపాయముగల అధికారిని నియమించారు. ఆ ఉద్యోగి పంటలు బాగా పండిన ఏడేండ్ల కాలం లో ధాన్యాన్ని ప్రోగుచేసి ఆయానగరాలో నిలువచేయాలి .కరువు కాలం లో ఆగింజలను ప్రజలకు పంచిపెట్టాలి అలా చేస్తే దేశం కరువుకు బలికాకుండా ఉన్నటుంది అని యోసేపు దైవ జ్ఞానంతో రాజు కలలను వివరించెను. ఫరో అతనిని మించిన వివేకి ఉపాయశీలి లేడని ఎంచి కరువుకాలానికి ధాన్యాన్ని నిలువచేసే అధికారాన్ని యోసేపుకి అప్పచెప్పాడు. అతనిని దేశంలో రాజు తరువాత రెండో అధికారిని చేసాడు.
కానానులోకూడా కరువు వచ్చుటచే ఇతరులతోపాటు ఇశ్రాయేలుకుమారులు కూడా ధాన్యాన్ని కొనుటకై ఐగుప్తు దేశం వచ్చారు యోసేపు ఐగుప్తుదేశములో సర్వాధికారి కదా దేశప్రజలకు ధాన్యమును అమ్మేడివాడు అతడే .యోసేపుసోదరులువచ్చి అతనికి సాష్ట్గాoగ ప్రణామములు చేసిరి. అతడు సోదరులను చూసి గుర్తుపట్టెను. కానీ వారు అతనిని గుర్తుపట్టలేదు. యోసేపు నటించి పౌరుషంగా మాట్లాడాడు. అతనికి వారిని గూర్చికన్న కలలను కూడా జ్ఞప్తికి తెచుకొనెను. అతడు వారితో మీరు గూఢచారులు మా దుర్గములు లోటుపాటులు తెలిసికొనుటకు వచ్చితిరి అని అనెను .వారిని మూడు నాళ్లు పాటు చెరలో త్రోయి oచాడు.వాళ్ళు లబోదిబో మొత్తుకొని తమ కుటుంబ పరిస్థితులను తమ్ముని ముందు ఎరుకపరిచారు. తమ ముసలి తండ్రి యాకోబునీ గూర్చి తమ్ముడు బెన్యామీనును గూర్చివివరించారు .యోసేపు మీరు చెప్పేది నిజమైతే మీ తమ్ముడు బెంజమీనును ఇచటికి తీసుకుని రండి. అప్పటి దాకా మీలోఒక్కడు చేరలోఉండాలి అన్నాడు. షియోనుని బంధించి కారాగారంలో ఉంచి మిగిలిన సోదరులను ధాన్యాన్నితీసికొని వెళ్ళమన్నాడు. దానితో అన్నలకు పశ్చాత్తపం కలిగింది. వాళ్ళు పూర్వం తాము యోసేపుకి చేసిన ద్రోహానికి చింతించారు. సోదరులు ఆ చింతనతో ధాన్యాన్ని యింటికి తీసికొని వెళ్లారు. సోదరులుమొదటి సారి తెచ్చ్చుకొన్న ధన్నము ఐపోఇంది. వాళ్ళు రెండొవసారి ధాన్యానికి వచ్చారు .యాకోబు చాలా అనిష్టం గానే బెన్యామీనును వాళ్ళు వెంట పంపాడు. బెన్యామీనును తన సొంత తల్లి కి పుట్టిన వాడు కనుక యోసేపుకి సొంత తమ్ముడు . ఇతడు పుట్టగానే తల్లి చనిపోయింది. ఇతడు యోసేపు ఇల్లు వీడివచ్చిన తర్వాత పుట్టాడు . కనుక అతను తమ్ముడిని చూడ్డం ఇదే మొదటిసారి అతన్ని చూడగానే యోసేపుకి కన్నుల్లో నీళ్లు గిర్రున తిరిగాయి .వెలుపలికి వెళ్లి వెక్కివెక్కి ఏడ్చాడు. .యోసేపు అన్నలకు ఇంకా ఎక్కువ పశ్చాత్తపం పుట్టింప గోరాడు. అతడు తానుపానీయం సేవించే గిన్నెను బెన్యామీను గోతంలో పెట్టించాడు. .సోదరులు ధాన్యాము తీసికొని నగరం వీడి పొలిమేర వరకు వెళ్ళాక, వారి గోతాలు సోదాచేయంచాడు.
బెన్యామీనుపై నేరం మోపి, అందరిని తిరిగి తన చెంతకు రప్పించాడు. ఈ కారణంగా సోదరులు ఇరకాటంలో పడి, బిక్కముఖం వేసి కొని నిలబడ్డారు.యూదా తన చిన్న తమ్మునికి తాను పూటపడతానని అతనికి బదులుగా తాను చెరలో ఉంటానని, తమ్ముడిని తండ్రి వద్దకి పంపివేయమని విన్నవించుకున్నాడు .యోసేపు దు;ఖం ఆపుకోలేకపొయాడు. అతను సేవకులందరిని ఆవలకు పంపివేసి సోదరులకు తన్నుతాను తెలియజేసికొన్నాడు. ఎప్పుడో గతించాడనుకొన్న సోదరులు తమ్ముణ్ణి చూచి, దిగ్రాంతి చెందారు .యోసేపు దైవలీలలను వారికి వివరించాడు .మీరు నన్ను బానిసగా అమ్మివేసి నందుకు చింతించకండి. మీ ప్రాణాలను, ఐగుప్తు ప్రజల ప్రాణాలను నిలబెట్టడానికి మీకు ముందుగా దేవుడే నన్నిక్కడికి పంపాడు. నన్ను ఈ ఐగుప్తుకి ప్రధానమంత్రిని చేసింది భగవంతుడే అని చెప్పాడు. అతడు తన తండ్రిని కుటుంబ సమేతంగా ఈ ఐగుప్తుకి రప్పించి,సారవంతమైన గోషెను మండలంలో వారికి నివాసం కప్పించాడు. ఆ కుటుంబం వాళ్ళు మొత్తం డెభైమంది. యోసేపు యొక్క ఇద్దరు కొడుకులు ఎఫ్రాయిము, మనస్సే లను యాకోబు దత్తతు తీసికొన్నాడు. ఈ ఇద్దరు కుమారులతో కలసి ఇశ్రాయేలు గోత్రాలు పండ్రెడుఅయ్యాయి. తర్వాత యూదులు, లేవి, యోసేపులను గోత్ర కర్తలు గా లెక్కలోకి తీసికోలేదు. యాకోబు చనిపోయాక, సోదరులకు బెదరు పుట్టింది. కనుక వాళ్ళు ఓ కథ అల్లుకొని వచ్చారు.
తన తండ్రి యోసేపుకు వర్తమానం తెలియజేయమన్నాడు అని సోదరులు తన తమ్ముడు తో ఇలాపలికారు. తెలిసో తెలియకో నీ సోదరులు నీకు కీడు చేసారు. నీవు వాళ్లను క్షమించు వదలియేయి. ఈ మాటలు విని యోసేపు మనస్సు నొచ్చుకొన్నాడు.
అతడు వారితో మీరు నాకు కీడు తల పెట్టారు. కానీ దేవుడు ఆకీడును మేలుగా మార్చాడు. నన్ను మీకంటే ముందుగా ఎక్కడికిపంపి ఈ కరువు కాలంలో నేను మీ ప్రాణాలను, ఇంకా చాలామంది ప్రాణాలనునిలబెట్టేలా చేసాడు. కనుక జరిగిన దానికి మీరేమీ బాధపడకండి. నేను మిమ్ముమీ బిడ్డలను తప్పక కాపాడతాను అన్నాడు. యోసేపు ఈ ఐగుప్తులో నూటపది సంవస్సరాలు జీవించాడు . అది నీతిమంతుల ఆయుస్సు. అతడు చనిపోకముందు సోదరులను ఒక కోరిక కోరాడు. దేవుడు మిమ్ము ఈ దేశం నుండి మరలా కనాను మండలానికి తీసికొనిపోతాడు. అప్పుడు నా అస్థికలను మీవెంట కొనిపోండి అని చెప్పాడు. అతడు చెప్పెన విధంగా మోషే కాలంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి వెడలిపోయెనపుడు. పుణ్యపురుషుని, అస్థికలను గూడా తమవెంట తీసికొనిపోయారు.
-Br. Simon