ABOUT US
కార్మెల్ శోభ బ్లాగ్ గురించి
కార్మెల్ శోభ
ఈ బ్లాగ్ తెలుగు క్రైస్తవ విశ్వాసులకు బైబుల్ సందేశాలు, కార్మెల్ సభ ఆధ్యాత్మికత, మరియు దైవ వాక్య ఉపదేశాలు అందించే ఒక ఆధ్యాత్మిక వేదిక. 2021వ సంవత్సరం నుండి ఈ బ్లాగ్ తెలుగు భాషలో క్రైస్తవ ఆధ్యాత్మికతను వ్యాప్తి చేస్తూ వస్తోంది.
"కార్మెల్ శోభ" అంటే కార్మెల్ పర్వతపు తేజస్సు మరియు అందం అని అర్థం. కార్మెల్ సభ ఆధ్యాత్మికత యొక్క సౌందర్యాన్ని తెలుగు పాఠకులకు అందించాలనే సంకల్పంతో ఈ బ్లాగ్ ప్రారంభమైంది.
రచయిత గురించి
ఫాదర్ అమృత్ రాజు వెల్లటూరి, OCD ఫాదర్ అమృత్ రాజు వెల్లటూరి డిస్కాల్స్డ్ కార్మెలైట్ సభకు (OCD) చెందిన గురువు. తమిళనాడు, కేరళ, ఏలూరు నందు కార్మెల్ సభలో సన్యాస జీవితమును అభ్యసించి జనవరి 6, 2014న పాల్వంచలో గురువుగా అభిషిక్తులయ్యారు. స్పెయిన్‌లో ఆధ్యాత్మిక శాస్త్రంలో (Spirituality) విద్యనభ్యసించిన వీరు, ఆరు సంవత్సరాలు ఫార్మేటర్‌గా, నొవిస్ మాస్టర్‌గా, సేవలందించారు. 2023 నుండి 2026 ఏప్రిల్ వరకు తమ ప్రొవిన్స్‌కు ప్రొవిన్షియల్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం తెలంగాణలోని కొత్తగూడెం భద్రాద్రి జిల్లా, సారపాకలోని సెయింట్ థెరిసా మొనాస్టరీకి సుపీరియర్‌గా సేవలందిస్తున్నారు. కార్మెల్ శోభ ద్వారా, తమ ఆధ్యాత్మిక అనుభవాన్ని, పవిత్ర గ్రంధ అధ్యయనాన్ని తెలుగు పాఠకులతో పంచుకుంటూ, బైబిల్ వ్యాఖ్యానాలు, కార్మెలైట్ ఆధ్యాత్మికత, మరియు పునీతుల జీవిత చరిత్రలపై రచనలు అందిస్తున్నారు.
Fr. Amruth Raju Vellaturi, OCD Fr. Amruth Raju Vellaturi is a priest of the Discalced Carmelite Order (OCD), ordained on January 6, 2014, in Palvancha. He studied spirituality in Spain and has served the Order for six years as a formator, including as novice master and master of theology students. He was Provincial of his province from 2023 to April 2026, and currently serves as Superior of St. Theresa Monastery, Sarapaka, Kothagudem Bhadradri district, Telangana. Through Carmel Shobha, he shares Telugu biblical commentary, Carmelite spirituality, and the lives of the saints, drawing on his formation, theological studies, and pastoral experience.
ఈ బ్లాగ్‌లో మీకు ఏమి దొరుకుతుంది?
అనుదిన దైవ ధ్యానం, ప్రతి రోజు బైబుల్ వాక్యం ఆధారంగా మీ హృదయాన్ని దేవుని వైపు నడిపించే ధ్యాన సందేశాలు.
ఆదివార ప్రసంగాలు, ప్రతి ఆదివారం పవిత్ర గ్రంథ పాఠాల వివరణ మరియు జీవిత అనువర్తనాలు. కాథలిక్ దైవార్చన ప్రకారం తెలుగులో పండుగ సందేశాలు , క్రిస్మస్, ఈస్టర్, పెంతికొస్తు, ఆగమన కాలం, తపస్సు కాలం, మరియమాత పండుగలు అన్ని ముఖ్యమైన క్రైస్తవ పండుగల గురించి లోతైన సందేశాలు.
బైబుల్ లోని రాజులు మరియు పితరులు అబ్రహాం, మోషే, దావీదు రాజు, సొలొమోను రాజు వంటి బైబుల్ వ్యక్తుల జీవిత చరిత్రలు మరియు వారి విశ్వాస పాఠాలు.
కార్మెల్ సభ పునీతులు సెయింట్ తెరేసా ఆవిలా, సెయింట్ జాన్ ఆఫ్ ద క్రాస్, సెయింట్ తెరేసా లిజియో వంటి కార్మెల్ సభ పునీతుల జీవితాలు మరియు ఆధ్యాత్మిక బోధలు.
అపోస్తులు మరియు పునీతులు క్రైస్తవ విశ్వాసానికి పునాది వేసిన అపోస్తులుల జీవిత విశ్వాస సాక్ష్యాలు.
మా లక్ష్యం
తెలుగు మాట్లాడే క్రైస్తవ విశ్వాసులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు డయాస్పోరాలో కూడా, వారి మాతృభాషలో దేవుని వాక్యాన్ని చదివి, ధ్యానించి, ఆధ్యాత్మికంగా ఎదగాలని ఈ బ్లాగ్ ఆకాంక్షిస్తోంది.
బైబుల్ కేవలం చర్చి గోడల మధ్య మాత్రమే ఉండకుండా, ప్రతి తెలుగు విశ్వాసి ఇంట్లో, హృదయంలో జీవంతంగా ఉండాలని, అందుకు ఈ బ్లాగ్ ఒక వారధిగా ఉండాలని మా సంకల్పం.
సంప్రదించండి
మీకు ఏదైనా ఆధ్యాత్మిక సందేహం ఉన్నా, బ్లాగ్ గురించి అభిప్రాయం చెప్పాలన్నా, లేదా నిర్దిష్ట అంశంపై సందేశం కోరుకుంటున్నా మా Contact Us పేజీ ద్వారా సంప్రదించవచ్చు.
మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో కార్మెల్ శోభ మీకు సహాయకారిగా ఉండాలని దేవుని దీవెన కోరుతున్నాము.
Fr. Amruth Raju Vellaturi, OCD