ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఫీచర్ చేయబడింది

పవిత్ర గ్రంధంలో ఉపవాసం

 లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తిని త్రాగుచున్నారేల?" అని కొందరు యేసును ప్రశ్నించిరి. అందుకు యేసు "పెండ్లి కుమారుడు ఉన్నంతవరకు విందునకు వెళ్ళినవారు ఉపవాసము చెయుదురా? పెండ్లి కుమారుడు తమ వెంట ఉన్నంత వరకు ఆ ఇంటి వారిచేత ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారిని ఎడబాయుకాలము వచ్చును. అపుడు వారు ఉపవాసము చేయుదురు" అని వారితో పలికెను. యేసు వారికి ఇంకను ఈ ఉపమానమును చెప్పెను: "ప్రాత గుద్దకు మాసికవేయుటకు క్రొత్త గుడ్డను ఎవరు చింపుదురు? అటుల చేసిన యెడల క్రొత్త గుడ్డ చినిగి పోవుటయేకాక, అది ప్రాత గుద్దకు అతుకుకొనదు. అట్లే కొత్త ద్రాక్షారసమును ప్రాత తిత్తులలో ఎవరును పోయరు. అటుల పోసిన యెడల ఆ ప్రాత తిత్తులు పిగులును, ఆ రసము నేలపాలగును, తిత్తులు నశించిపోవును. కనుక, క్రొత్త రసమును క్రొత్త తిత్తులలోనే ఉంచవలయును. ప్రాత రసమునకు అలవడినవాడు క్రొత్త రసమును  తాగుటకు ఇష్టపడడు. అతడు ప్రాతరసమే మేలు అనును".   ధ్యానము:   ఉపవాసం : పశ్చాత్తాపం వ్యక్తం చేయుటకు, దేవుని రాకకు ...

కార్మెల్ పర్వత ఆరోహణం


ఓ గాఢాంధకార  రాత్రి 
ప్రియుని మీద కోరిక తో దహించుకు పోతూ 
 ఓ ఆనంద సమయాన    
నేను బయటకు కనపడకుండా  పోయాను 
నా ఆత్మ మొతం నిశ్చలంగ ఉంది 

2   అంధకారం లో సురక్షితంగా ,
రహస్య నిచ్చెన తో మరువేషం లో
ఆ  అదృష్ట  భాగ్యం
అంధకారం లో  దాగిఉన్నా
నా ఆత్మ ఇప్పుడు నిచ్చలంగా ఉంది

3 ఆ సంతోషకర   రాత్రి
రహస్యంగా నన్నెవరు   చూడకుండా ,
నేను కూడా ఏమి చూడకుండా
ఏ దీపం  లేక మార్గ చూపరి  లేకుండా
నా హృదయములో రగిలే దీపం తప్ప

4 ఇది నన్ను నడిపించగా
మధ్యాన్నపు వెలుగు కంటే ఎక్కువుగా
అతను నా కోరకు వేచిఉన్న చోటుకు
ఆయన నాకు బాగా  తెలుసిన
ఎవరు కనపడని చోటుకు

5 ఓ మార్గచుపరి అయ్యిన రాత్రి
ఓ తోలి సంధ్య కంటే   అందమైన  రాత్రి
ఓ ఐక్యం చేసిన రాత్రి
ప్రేయసిని  తన ప్రియునితో
ప్రియురాలుని తన ప్రియునిలో  మారుతున్న రాత్రి

6 నా   పుష్పిస్తున్న ఏద మీద
నా ప్రియుని కోసమే నే ఉంచిన
చోట  తాను పడుకొని నిద్రిస్తుండ
 నేను తనను లాలన చేస్తుండగా
అక్కడ దేవదారు వీచగా  ఓ చిరు గాలిలో

7 ఎప్పుడు  ఆ చిరుగాలి బురుజు నుండి విచిందో
తన వెంట్రుకలు విగినప్పుడు
తాను నా మెడను గాయపరిచాడు
తన  మృదువువైన చేతితో
నా ఇంద్రియాలని స్తంభింపచేస్తూ

8 నన్ను  నేను పరీత్యంజించి మరియు మరిచిపోయి
నా ప్రియుని మీద నా మొమును వాల్చి
అన్నియు నిలిచిపోగా నా నుండి నేను వెడలిపోతిని
నా జాగ్రత్తలన్ని వదలి
లిల్లీల మధ్య  మరచిపోతిని 

కామెంట్‌లు