యేసు ఆజ్ఞలు - దేవుని స్నేహితులుగా మారే మార్గం | యోహాను 15:9-17
యేసులా జీవించుట -దేవుని స్నేహితుడవుట
యోహాను 15: 9-17
నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమయందు నెలకొనియుండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని యుండునట్లు మీరును నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొనియుందురు. "నా ఆనందము మీయందు ఉండవలయుననియు, మీ ఆనందము పరిపూర్ణము కావలయుననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించినటులనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితులకొరకు తన ప్రాణమును ధారపోయువానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడును లేడు. నేను ఆజ్ఞాపించినవానిని పాటించినచో మీరు నా స్నేహితులైయుందురు. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇకమీదట నేను మిమ్ములను దాసులని పిలువక, స్నేహితులని పిలిచెదను. ఏలయన, నేను నా తండ్రివలన వినినదంతయు మీకు విశదపరచితిని.మీరు నన్ను ఎన్నుకొనలేదు. కాని, నేను మిమ్ము ఎన్నుకొంటిని. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్లి ఫలించుటకును, మీఫలము నిలిచియుండుటకును, మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమకలిగి ఉండవలయునని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను.
యోహాను సువిశేషంలోని ఈ భాగం యేసు ప్రభువు మరియు తండ్రి మధ్య ప్రేమ, ఆయన మనలను ఎలా ప్రేమించారో అటువంటి ప్రేమ ఒకరిమీద ఒకరు కలిగి ఉండటం గురించి బోధిస్తుంది. ఆయన వలె ఎలా మనము కూడా ప్రేమించగలం అంటే కేవలం ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారానే, అపుడే ఆయన ప్రేమలో నెలకొని ఉండటం జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది.
1. యేసు ప్రభువు మరియు తండ్రి మధ్య ఉన్న నిత్య ప్రేమబంధం
"నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమయందు నెలకొనియుండుడు." ఈ మాటలలో విశ్వసృష్టికే మూలాధారమైన ఒక అద్భుతమైన దైవిక సత్యం దాగి ఉంది. యేసు ప్రభువు మరియు పరలోకపు తండ్రి మధ్య ఉన్న ప్రేమ తాత్కాలికమైనది కాదు, అది కాలానికి అతీతమైన నిత్యమైన ప్రేమ. ఈ భూమిపై మానవరూపిగా యేసు ప్రభువు జీవించిన ప్రతి క్షణంలోనూ ఆయన తండ్రి ప్రేమను అనుభవిస్తూనే ఉన్నారు, ఆ ప్రేమను తన పరిచర్య ద్వారా లోకానికి వ్యక్తపరుస్తూనే ఉన్నారు.
దైవిక ప్రేమకు చారిత్రక సాక్ష్యాలు:
జనన సమయపు ఆనందం: యేసు ప్రభువు ఈ లోకంలో మానవ రక్షణ కొరకు జన్మించినప్పుడు, ఆకాశమండలంలో దేవుని దూతలు అపరిమితమైన ఆనందాన్ని వ్యక్తపరిచారు. "సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగును గాక" అని దూతలు పాడిన కీర్తన, తండ్రి తన కుమారుని ద్వారా భూమిపై కురిపించిన ప్రేమకు మొదటి సంకేతం.
బాప్తిస్మ సమయపు సాక్ష్యం: యేసు ప్రభువు యొర్దాను నదిలో బాప్తిస్మము తీసుకొని నీటిలో నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు, ఆకాశము తెరవబడి, దేవుని ఆత్మ పావురము వలె ఆయన మీదికి రావడం చూచారు. అప్పుడు, "ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను" అని పరలోకము నుండి ఒక గంభీరమైన స్వరము వినిపించింది. ఇది తండ్రికి కుమారునిపై ఉన్న అపారమైన ప్రేమకు బహిరంగ ప్రకటన.
రూపాంతర కొండపై దైవ సాక్ష్యం: రూపాంతర కొండపైన కూడా మోషే, ఏలీయాల ఎదుట యేసుప్రభువు ప్రకాశించినప్పుడు, తండ్రి మరొక్కసారి ఇదే సాక్ష్యాన్ని ఇస్తూ, "ఈయన మాట వినుడి" అని ఆజ్ఞాపించాడు.
జనన సమయపు ఆనందం: యేసు ప్రభువు ఈ లోకంలో మానవ రక్షణ కొరకు జన్మించినప్పుడు, ఆకాశమండలంలో దేవుని దూతలు అపరిమితమైన ఆనందాన్ని వ్యక్తపరిచారు. "సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగును గాక" అని దూతలు పాడిన కీర్తన, తండ్రి తన కుమారుని ద్వారా భూమిపై కురిపించిన ప్రేమకు మొదటి సంకేతం.
బాప్తిస్మ సమయపు సాక్ష్యం: యేసు ప్రభువు యొర్దాను నదిలో బాప్తిస్మము తీసుకొని నీటిలో నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు, ఆకాశము తెరవబడి, దేవుని ఆత్మ పావురము వలె ఆయన మీదికి రావడం చూచారు. అప్పుడు, "ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను" అని పరలోకము నుండి ఒక గంభీరమైన స్వరము వినిపించింది. ఇది తండ్రికి కుమారునిపై ఉన్న అపారమైన ప్రేమకు బహిరంగ ప్రకటన.
రూపాంతర కొండపై దైవ సాక్ష్యం: రూపాంతర కొండపైన కూడా మోషే, ఏలీయాల ఎదుట యేసుప్రభువు ప్రకాశించినప్పుడు, తండ్రి మరొక్కసారి ఇదే సాక్ష్యాన్ని ఇస్తూ, "ఈయన మాట వినుడి" అని ఆజ్ఞాపించాడు.
ప్రార్థన మరియు సాన్నిహిత్యం:
యేసు ప్రభువు దైనందిన జీవితాన్ని పరిశీలిస్తే ఆయనకు తండ్రితో ఉన్న నిరంతర సాన్నిహిత్యం మనకు స్పష్టమవుతుంది. ఆయనకు ఒక అలవాటు ఉండేది. ప్రతిరోజూ తెల్లవారుజామునే, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే లేచి, ఏకాంత స్థలములకు లేదా కొండలకు వెళ్లి తండ్రితో ప్రార్థనలో గడిపేవారు. పగటిపూట వేలాది మంది ప్రజలకు పరిచర్య చేసినప్పటికీ, అద్భుతాలు సృష్టించినప్పటికీ, రాత్రి సమయాల్లో తండ్రి పాదాల చెంత చేరి తన ఆత్మను రిఫ్రెష్ చేసుకునేవారు.
ఆయన చేసిన ప్రతి అద్భుతానికి ముందు, లేదా తరువాత తండ్రికి కృతజ్ఞతలు చెల్లించడం మనం చూస్తాము. ఉదాహరణకు, లాజరును సమాధి నుండి లేపే ముందు, "తండ్రీ, నీవు నా మాట వినినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను" అని ప్రార్థించారు. ఐదు రొట్టెలు, రెండు చేపల అద్భుతంలోనూ పరలోకం వైపు కండ్లు నిగిడ్చి స్తుతించారు.
తండ్రి చిత్తమే ఆహారము:
యేసు ప్రభువు సమరయ స్త్రీతో మాట్లాడిన సందర్భంలో తన శిష్యులతో ఒక గొప్ప మాట అంటారు: "నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పనిని సంపూర్ణము చేయుటయునే నాకు ఆహారమై యున్నది." భౌతికమైన ఆహారం కంటే తండ్రి ఆజ్ఞను పాటించడమే ఆయనకు శక్తిని ఇచ్చేది.
రాబోయే శ్రమలు, అవమానాలు, కొరడా దెబ్బలు, చివరకు సిలువ మరణం ఎంత భయంకరమైనవో ఆయనకు ముందే తెలుసు. గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థిస్తూ, "నా తండ్రీ, సాధ్యమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము; అయినను నా యిష్టప్రకారము కాదు, నీ చిత్తప్రకారమే కానిమ్ము" అని తండ్రి చిత్తానికి పూర్తిగా లోబడ్డారు. మానవజాతి రక్షణ తండ్రి కోరిక అని తెలిసి, ఆ కఠినమైన సిలువ శ్రమలను అనుభవించడానికి నిశ్చయించుకున్నారు. ఇందుకే యేసు ప్రభువు, "నేనును నా తండ్రియును ఏకమై యున్నాము" అని ధైర్యంగా ప్రకటించగలిగారు.
2. దేవుని ఆజ్ఞలు పాటించుట - పరిపూర్ణ నిత్యానందకారకం
"మీరు నా ప్రేమయందు నెలకొనియుండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని యుండునట్లు మీరును నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొనియుందురు. నా ఆనందము మీయందు ఉండవలయుననియు, మీ ఆనందము పరిపూర్ణము కావలయుననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను."
"మీరు నా ప్రేమయందు నెలకొనియుండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని యుండునట్లు మీరును నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొనియుందురు. నా ఆనందము మీయందు ఉండవలయుననియు, మీ ఆనందము పరిపూర్ణము కావలయుననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను."
ఈ వాక్యాలలో యేసుప్రభువు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సూత్రాన్ని వెల్లడిస్తున్నారు. దేవుని ప్రేమలో ఎలా స్థిరంగా కొనసాగాలి? దానికి ఉన్న ఒకే ఒక్క మార్గం: ఆయన ఆజ్ఞలను పాటించడం.
యేసు ప్రభువు చూపిన విధేయత:
యేసు ప్రభువు భూమిపై జీవించినప్పుడు, "నేను దేవుని కుమారుడిని కదా, నేను ఎందుకు ఈ నియమాలను పాటించాలి? ఎందుకు తండ్రి సంకల్పానికి లోబడాలి?" అని ఎన్నడూ అనుకోలేదు. ఆయన పరిపూర్ణ దేవుడైనప్పటికీ, పరిపూర్ణ మానవునిగా తండ్రి ఆజ్ఞలకు పూర్తిగా విధేయత చూపారు. ఆ విధేయత ఎంతటిదంటే, అది సిలువ మరణం పొందునంతగా తన్ను తాను తగ్గించుకొనే స్థాయికి వెళ్ళింది. ఈ సంపూర్ణ విధేయత వలనే ఆయన ఎల్లప్పుడూ తండ్రి ప్రేమలోనే నెలకొనియున్నాడు. తండ్రి ఆయనను ఒక్క క్షణం కూడా విడనాడలేదు (సిలువపై మానవ పాప భారాన్ని మోసిన ఆ ఒక్క క్షణం తప్ప).
నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది?
ఈ లోకం ఇచ్చే ఆనందం తాత్కాలికమైనది. ధనము, పదవులు, భోగభాగ్యాలు ఇచ్చే సంతోషం క్షణికం. కానీ, దేవుని ఆజ్ఞలను పాటించడం ద్వారా లభించే ఆనందం నిరంతరమైనది, పరిపూర్ణమైనది. యేసుప్రభువు తన శిష్యులకు ఇచ్చే ఆనందం లోకసంబంధమైనది కాదు, అది ఆత్మ సంబంధమైన శాంతి.
మనం దేవుని వాక్యాన్ని విని, దాని ప్రకారం జీవించినప్పుడు, మన హృదయంలో ఒక అద్భుతమైన తృప్తి కలుగుతుంది. "నేను నా ప్రభువు చిత్తాన్ని నెరవేర్చాను, ఆయనను సంతోషపెట్టాను" అనే అంతర్గత సాక్ష్యం మనకు లభిస్తుంది. ఈ ఆనందం శ్రమలలోనూ, కష్టాలలోనూ కూడా మనలను స్థిరంగా ఉంచుతుంది. దేవుని ఆజ్ఞలను భారంలా కాకుండా, ఆయనపై ఉన్న ప్రేమతో పాటించినప్పుడు, ఆ ఆజ్ఞలే మనకు నిత్యానందకారకాలుగా మారతాయి.
3. యేసు ఆజ్ఞల అనుసరణ - దాసుని నుండి స్నేహితునిగా మార్పు
యేసు ప్రభువు ఈ భాగంలో తన శిష్యులకు ఇచ్చిన ప్రేమ ఆజ్ఞ అత్యంత ఉన్నతమైనది, సాటిలేనిది. "నేను మిమ్మును ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ."
పాత నిబంధన కాలంలో దేవుని ఆజ్ఞలు పది నిబంధనలుగా, కఠినమైన చట్టాలుగా ఉండేవి. కానీ యేసు ప్రభువు వాటన్నింటినీ ఒకే ఒక్క ప్రేమ ఆజ్ఞ క్రిందికి తీసుకువచ్చారు. ఆ ప్రేమ కేవలం మాటలతో సరిపెట్టుకునేది కాదు, చేతలలో, త్యాగంలో చూపించవలసిన ప్రేమ.
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment