హెరోదు పదవి కాంక్ష - పసిబిడ్డల హత్యలు ఆధ్యాత్మిక ధ్యానం | కార్మెల్ శోభ
హెరోదు పదవి కాంక్ష - పసిబిడ్డల హత్యలు
ధ్యానము: "ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి శిశువునకు చంపుటకు హెరోదు వేదకబోవుచున్నాడు" అని చెప్పాడు. ఎందుకు హెరోదు యేసు ప్రభువును చంపుటకు వేదకబోవుచున్నాడు? హెరోదు రాజుతొ తూర్పునుండి వచ్చిన జ్ఞానులు, యూదుల రాజుగా పుట్టిన శిశువు నక్షత్రం చూచి, ఆయనను మేము ఆరాధించుటకు వచ్చాము, ఆయన ఎక్కడ జన్మించారు అని వారు అడిగారు. హెరోదు రాజు అధికార వ్యామోహం కలిగినవాడు. తన సొంత కుమారులను కూడా అధికారం కోసం చంపించినవాడు, అందుకే ఆరోజులలో హెరోదు కుమారునిగా కంటే హెరోదు దొడ్డిలో పందిగా పుట్టటం మేలు అనే నానుడి ఉండేది. తన అధికారమునకు అడ్డుగా ఎవరు వచ్చిన, దానిని సహించని వ్యక్తి హెరోదు. మరియొక రాజు పుట్టాడు అని తెలువగానే ఆ శిశువును, ఎలా అయిన చంపాలి అనే ఆలోచన హెరోదుకు వస్తుంది. మనుషుల అంతరంగాలు పూర్తిగా తెలిసిన దేవుడు హెరోదు చేయబోయే ఘోరాన్ని యోసేపుకు తెలియజేసాడు.
"నీవు లేచి, బిడ్డను తల్లిని తీసుకొని, ఐగుప్తునకు పారిపోయి, నేను చెప్పు వరకు అచటనేయుండుము" అని యోసేపును దేవదూత ఆదేశించెను. "అంతట యేసేపులేచి, ఆ బిడ్డను, తల్లిని తీసుకొని, ఆ రాత్రియందు ఐగుప్తునకు వెళ్ళి, హెరోదు మరణించునంత వరకు అచటనే ఉండెను. " ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని" అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు అట్లు జరిగెను. ప్రభువు దూత చెప్పినట్లుగా యోసేపు మరియమ్మను, బాల యేసును తీసుకొని ఐగుప్తుకు వెళుతున్నారు. హెరోదు మరణించినంతవరకు పవిత్ర కుటుంబం ఐగుప్తు లోనే ఉంటుంది. ఈ ఇద్దరు కూడా తమ బిడ్డ కోసము పడిన కష్టం చాలా గొప్పది. వీరు ఇద్దరు కూడా తమ కుమారుని కొరకు జీవిస్తున్నారు. మనతో పాటు ఉన్న వారు అపాయములో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలో వీరు చెబుతున్నారు. దేవుడు ఎందుకు ఐగుప్తుకు వెళ్ళమని చెబుతున్నారు? కారణం ఏమి అయి ఉండవచ్చు అంటే, ఐగుప్తు హెరోదు పరిదిలో లేదు, అక్కడ చాలా మంది యూదులు ఉన్నారు. మరల హొషయ ప్రవక్త చెబుతున్నట్లుగా నేను నా కుమారున్నీ ఐగుప్తు నుండి పిలిచాను అనే ప్రవచనం వెరవేరుతుంది.
యేసు ప్రభువును హెరోదు చంపించలేకపోయాడు. కాని తన అధికారమునకు ఎవరు ఆటంకంగా ఉండకూడదు అనుకునే హెరోదు, ఆ శిశువును ఎలాగైన చంపాలి అని బేత్లెహేము మరియు ఆ పరిసర ప్రాంతములో ఉన్న రెండేండ్లు మరియు అంతకంటే తక్కువ వయసు ఉన్న చిన్న బిడ్డలను చంపిస్తున్నాడు. ఎవరు ఈ చిన్న బిడ్డలు ? ఈ చిన్న బిడ్డలు అందరు కూడా ఎవరు కాపాడుటకు లేనివారు, ఏ మాలిన్యం లేని వారు. పవిత్రంగా ఉన్నవారు. యోసేపు, మరియమ్మ లాంటి వారు తోడు లేని వారు.
అంతమంది చిన్న బిడ్డలను హెరోదు చంపనవసరం లేదు. కాని పదవి వ్యామోహం, అధికార దాహం అనేవి మనలను ఎటువంటి హత్యలను, ఘోరాలను కూడా చేయుటకు ప్రేరేపిస్తుంది. వివేకము కోల్పోయేవిధంగా చేస్తుంది. ఆ చిన్న బిడ్డలు పెరిగి, అధికారానికి రావాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది, అంత కాలం హెరోదు బ్రతకడు అనే విషయం కూడా ఆలోచించలేక పోయాడు. మన ఆలోచనలను కూడా అధికారం వ్యామోహం చంపివేస్తుంది.
"రామాయందు ఒక ఆర్తనాదము వినపడెను. అది ఒక మహారోదనము. రాహెలు తన బిడ్డలకొరకై విలపించుచుండెను. వారి మరణము వలన కలిగిన దుఃఖము నుండి ఆమె ఓదార్పు పొందకుండెను" అని యిర్మీయా ప్రవక్త పలికిన వాక్కు నెరవేరెను." ఎందుకు రాహెలు ఏడుస్తుంది అంటే, రాయహేలును యాకోబు ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. ఆమెకు చాలా సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు. తన అక్కకు పిల్లలు పుట్టారు. పిల్లలు లేరు అనే బాధను ఆమె చాలా ఎక్కువగా పొందింది. పిల్లల కోసం చాల ఆశ పడింది. ఆమె చనిపోయిన తరువాత రామా వద్ద సమాది చేశారు. ఇంత మంది చిన్న బిడ్డలను చంపినప్పుడు ఆ తల్లి బిడ్డలకోసము విలపిస్తుంది.ఆమెనుఓదార్చుటఅలవికానటువంటిది.
క్రిస్మస్ సంతోషానికి కొద్ది రోజుల
తర్వాతే మత్తయి సువార్త
మనకు ఒక హృదయవిదారకమైన
దృశ్యాన్ని చూపిస్తుంది — బెత్లెహేమ్‌లో
రెండేళ్ళలోపు పసిబిడ్డల హత్య. ఈ సంఘటన చదవడానికి
కష్టంగా ఉంటుంది. కానీ
ఇందులో మనకు ఎంతో లోతైన ఆధ్యాత్మిక
సందేశం ఉంది.
హేరోదు ఎవరు?
హేరోదు మహారాజు రోమా
అధికారంతో యూదయాను పరిపాలించాడు.
అతడు గొప్ప నిర్మాణాలు
చేశాడు — యెరూసలేం దేవాలయాన్ని
విస్తరించాడు. కానీ లోపల
అతడు భయంకరమైన అభద్రతాభావంతో
జీవించాడు. తన సింహాసనానికి
ఏ ముప్పు
వచ్చినా తొలగించేవాడు — సొంత
కొడుకులను కూడా చంపాడు.
జ్యోతిష్కులు 'యూదుల రాజు'
పుట్టాడని చెప్పినప్పుడు, హేరోదు
హృదయంలో భయం రాజుకుంది.
పదవి కాంక్ష అతన్ని
అంధుడిని చేసింది — పసిబిడ్డలను
సైతం చంపే స్థాయికి
దిగజారాడు.
పదవి కాంక్ష యొక్క ప్రమాదం
హేరోదు పాపం కేవలం
హత్య కాదు — అది పదవి పట్ల
అతిగా అంటుకుపోవడం. మన
జీవితంలో కూడా ఈ ప్రమాదం ఉంది.
మనం పదవులకు, గుర్తింపులకు,
పేరుప్రతిష్టలకు ఎంత అంటుకుపోతామో
అంత మన హృదయం కఠినపడుతుంది.
సెయింట్ జాన్ ఆఫ్
ది క్రాస్
చెప్పాడు: 'ఏ వస్తువుపైనైనా
అతిగా ప్రేమిస్తే, అది
మన హృదయాన్ని
దేవుని నుండి దూరం చేస్తుంది.' హేరోదు తన పదవిని దేవుని
కంటే ఎక్కువగా ప్రేమించాడు
— అదే అతని పతనం.
పసిబిడ్డల రక్తం — నిర్దోషుల బాధ
ప్రవక్త యిర్మియా యొక్క
మాటలు నెరవేరాయి: 'రామాలో
ఒక అరుపు
వినబడింది — రాహేలు తన
పిల్లల కోసం విలపిస్తోంది,
ఓదార్పు పొందలేకపోతోంది.' ఈ
తల్లుల వేదన నిజమైనది.
దేవుడు వారి కన్నీళ్ళను
చూశాడు.
నిర్దోషుల బాధ మనకు
ఒక ప్రశ్న
లేపుతుంది: దేవుడు ఎందుకు
అనుమతించాడు? ఇది విశ్వాసానికి
పరీక్ష. కానీ బైబిల్ చెప్తోంది — దేవుడు ప్రతి
నిర్దోషి కన్నీటిని లెక్కపెడతాడు.
వారు పోగొట్టుకున్నారని కాదు
— వారు దేవుని సన్నిధికి
చేరుకున్నారు.
యోసేపు — విధేయత యొక్క చిత్రం
ఈ సంఘటనలో మరొక
పాత్ర ఉంది — యోసేపు.
దేవదూత స్వప్నంలో చెప్పగానే,
రాత్రే లేచి మరియమ్మను,
శిశువును తీసుకుని ఈజిప్టు
వెళ్ళాడు. ఆలస్యం చేయలేదు,
సందేహించలేదు.
మన జీవితంలో కూడా
దేవుడు మనల్ని కొన్నిసార్లు
'రాత్రే లేచి' నడవమని
పిలుస్తాడు — ఆలోచించే సమయం
లేకుండా, ప్రణాళిక లేకుండా.
ఆ విధేయత
మనల్ని మరియు మన ప్రియమైన వారిని
కాపాడుతుంది.
ఈనాడు మన జీవితంలో హేరోదు
హేరోదు కేవలం చరిత్ర
పుస్తకంలో వ్యక్తి కాదు.
పదవి కాంక్ష, అహంకారం,
ఇతరులను నాశనం చేసైనా
సరే పైకి వెళ్ళాలనే
కోరిక — ఇవి నేటికీ మన సమాజంలో,
మన హృదయాల్లో
ఉన్నాయి.
ప్రభువు మనల్ని అడుగుతున్నాడు:
'నీ హృదయంలో హేరోదు
ఉన్నాడా? నువ్వు నీ పదవికోసం, నీ మానం కోసం ఇతరులను
హాని చేశావా?' ఇది
కఠినమైన ప్రశ్న — కానీ
నిజమైన ప్రశ్న.
ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన : ప్రభువా! మీరు జన్మించినప్పుడు ఎంతో ఆనందపడిన యోసేపు, మరియ తల్లి మిమ్ములను అధికార దాహం, పదవి కాంక్ష కలిగిన వారి నుండి కాపాడుటకు ఎంతో కష్టపడ్డారు. మీరు మీ పరిచర్య మొదలు పెట్టిన తరువాత కూడా ఇటువంటి ఆలోచనలు ఉన్న వారు, మిమ్ములను అనేక విధాలుగా కష్ట పెట్టుటకు ప్రయత్నించారు. ప్రభువా! మేము కూడా కొన్ని పర్యాయాలు ఇటువంటి పదవి, అధికారం వంటి కోరికలకు, ఆశలకు లోనవుతాము. అటువంటి సమయాలలో నిజమైన జ్ఞానంతో ప్రవర్తిస్తూ, మిమ్ములను అనుసరించెలా చేయండి. యోసేపు మరియతల్లి మిమ్ములను కాపాడినట్లు ఇటువంటి అపాయములకు లోనయె వారికి సహాయం చేసేలా మమ్ము దీవించండి. చనిపోయిన చిన్న బిడ్డలలో, వారి ఆలోచనలలోకాని, మాటల్లో కాని, పనులలో కాని ఎటువంటి చెడు లేకుండా, నిర్మలముగా ఉన్నారో అటువంటి మనసును మాకు దయచేయండి. అటువంటి బిడ్డలను రక్షించు అవకాశము మాకు అనుగ్రహించండి. ప్రభువా, మా హృదయాల్లో పదవి కాంక్ష, అహంకారం, ఇతరులను హాని చేసే ఆలోచనలు ఉంటే వాటిని నాశనం చేయి. బెత్లెహేమ్ పసిబిడ్డల రక్తం మనల్ని హెచ్చరిస్తోంది — నిర్దోషులను హాని చేయడం ఎంత పెద్ద పాపమో. మేము యోసేపు వలె నీ మాటకు విధేయులై జీవించే కృప మాకు ఇవ్వు. ఆమేన్.ఆమెన్
Comments
మీ అభిప్రాయాలు, ప్రశ్నలు క్రింద రాయండి:
Post a Comment