18, సెప్టెంబర్ 2021, శనివారం

25వ సామాన్య ఆదివారము

25వ సామాన్య ఆదివారము

సొలొమోను జ్ఞానగ్రంధము 2 : 12 , 17 -20 

యాకోబు 3 : 16  - 4 : 3 

మార్కు  శుభవార్త 9  : 30  - 37 


ఈనాటి దివ్య గ్రంధ పఠనాలు నీతిమంతుడు మరియు దుష్టుడి జీవితం గురించి మాట్లాడుతున్నాయి. క్రీస్తు శిష్యులుగా, క్రైస్తవులుగా మనం నీతిమంతుని జీవితం జీవించి క్రీస్తువలె సేవక రూపం దాల్చాలని  ఆహ్వానిస్తున్నాయి.

మొదటి పఠనాన్ని గమనించినట్లయితే క్రీస్తు పూర్వం 50 వ సంవత్సరములో  అలెగ్జాండర్ పరిపాలన కాలములో ఇశ్రాయేలు ప్రజలను  బానిసలుగా తీసుకొనిపోయినపుడు ఆ ప్రవాస  కాలములో కొంతమంది అక్కడ మిగిలిపోయారు తరువాత కొంతమంది తిరిగి వచ్చారు. మిగిలిపోయినవారు అక్కడ గ్రీకు సంస్కృతికి మరియు తత్వ శాస్త్ర విధానానికి ప్రభావితమై హీబ్రూ సంస్కృతిని విడి  జీవించారు, తిరిగి వచ్చినవారు హీబ్రూ సంస్కృతికి కట్టుబడి ఉన్నారు. ఆలా కట్టుబడిన వారిని నీతిమంతులుగాను, విడనాడిన వారిని దుష్టులు గాను  పరిగణించారు.

​స్వల్పకాలిక జీవిత ఆనందం తో   శోక మయమైన జీవితం మరణం తథ్యం. పూర్వుల సంప్రదాయములు, ధర్మ శాస్త్రానికి  కట్టుబడి దేవుని ఆజ్ఞలను పాటించువారు దేవుని జ్ఞానం కలిగిన వారు.  వారు ఏ విధముగా ఉంటారు అంటే కీర్తన కారుడు చెప్పినట్లు ప్రభువుని ధర్మ శాస్త్రమును ఆనందముతో చదివి ధ్యానించువాడు, అన్యాయమును ఎదిరించువాడు, దుష్టులకు, పీడితులకు ఆశ్రయము, చెడును ద్వేషించువాడు, దైవ ప్రజకు వెన్ను దన్నుగా నిలిచేవాడు.

సువిశేష  పఠనంలో మూడు అంశాలను చూస్తాము అవి 

చివరి గమ్యము 

మొదటి స్థానము 

చిన్నపిల్లల మనస్తత్వము 

యేసు ప్రభువు జెరూసలేముకు ప్రయాణము అంటే చివరి ఘట్టమునకు ప్రయాణము తన సిలువ, మరణ, పునరుత్థానమును  సూచిస్తుంది. ప్రభువు తాను ఈ లోకము నుండి భౌతికంగా వెళ్ళేముందు తన శిష్యుల హృదయాలలో తన సందేశాన్ని ఉంచాలని కోరుకున్నాడు. ఒక నాయకుడు తాను  వెళ్లిపోయిన తరువాత కూడా తన శిష్యులు పాటించడానికి కొన్ని నియమాలను, నిబంధనలను ఇస్తాడు కానీ ప్రభువు వారి హృదయాలలో ఉంచాలని కోరుకున్నారు. అందుకే తన మరణ, పునరుత్థానముల  గురించి చర్చిస్తూ తాను ఈ లోకమునకు వచ్చిన పని నెరవేర్చారా లేదా అని తెలుసుకుంటున్నారు. ఇది ఈలా ఉండగా శిష్యులు మాత్రమూ మొదటి స్థానము గురించి ఎవరు గొప్ప అన్న విషయము గురించి చేర్పించు కొనుచున్నారు. వారి మాటలు విని, వారి  హృదయములను ఎరిగి వారిని అడిగినప్పుడు సిగ్గుతో ఏమి బదులివ్వకుండా నిశ్శబ్దముగా ఉండిపోయారు. అంటే వారు చేర్చించుకొనేది తప్పు అని ఎరిగారు. దీనిని ఎరిగిన ప్రభువు అంటున్నారు ఎవడైతే చిన్నపిల్లల మనసు కలిగి ఉంటారు అట్టి వారు మొదటి వ్యక్తిగా ఉంటారు. నువ్వు సేవకుడిగా ఉండి   చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటే, నువ్వు నీతిమంతునిగా పరిగణించబడాలంటే ఈ యొక్క మనస్తత్వం కలిగి ఉండాలి. చిన్నపిల్లలవలె కపట జీవితము    లేకుండా ఉండాలి.
 By Br. Lukas

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...