లూకా సువార్త వ్యాఖ్యానాలు

లూకా సువార్తపై తెలుగులో అధ్యాయం వారీ వ్యాఖ్యానాలు మరియు ధ్యానాలు — మరియమాత అనుగ్రహం నుండి మైదాన ప్రసంగం, ఉపమానాలు, శిష్యరికపు పిలుపు వరకు. Fr. అమృత్ రాజు వెల్లటూరి, OCD రచనలు, వచనభాగాల క్రమంలో.

లూకా సువార్త వ్యాఖ్యానాలు — అధ్యాయం వారీగా పూర్తి తెలుగు వివరణలు

లూకా సువార్త యేసుక్రీస్తు కరుణను, పేదలపట్ల ఆయన ప్రేమను, ప్రార్థనా జీవితాన్ని ప్రత్యేకంగా చూపిస్తుంది. ఈ పేజీలో కార్మెల్ శోభ బ్లాగ్‌లో ప్రచురించిన లూకా సువార్త వ్యాఖ్యానాలన్నింటినీ అధ్యాయం క్రమంలో అందిస్తున్నాం. కొత్త వ్యాఖ్యానాలు చేరుతున్న కొద్దీ ఈ జాబితా పెరుగుతూ ఉంటుంది.

బాల్య కథనం, బాప్తిస్మం (అధ్యాయాలు 1–3)

అనుగ్రహ పరిపూర్ణురాలు మరియమాత

'నీవు కృపా పూర్ణురాలవు' - దేవదూత మరియకు చెప్పిన మాటల వెనుక దాగిన లోతైన అర్థం లూకా 1:26-38.

నిష్కళంక మాత మహోత్సవం (లూకా 1:26-38)

మరియమాత జన్మపాప రాహిత్యం, గాబ్రియేలు దూత శుభవచనం, అవ్వ–మరియల పోలిక మరియు దైవ ప్రణాళికకు లోబడటంపై క్యాథలిక్ ఆధ్యాత్మిక సందేశం.

విశ్వాసానికి ప్రతిరూపం మరియమాత (లూకా 1:39-45)

గర్భవతియైన మరియ ఎలిజబెతును కలిసినప్పుడు ఏం జరిగింది? విశ్వాసానికి ప్రతిరూపమైన మరియమాతపై ధ్యానం.

యేసు ప్రభువును దేవాలయంలో అర్పించుట

బాల యేసును దేవాలయంలో అర్పించడం వెనుక గల మోషే చట్టం ఏమిటి? సిమియోను ప్రవక్త ప్రవచనంపై Fr. అమృత్‌రాజు గారి లూకా 2 ఆధారిత అనుదిన దైవ ధ్యానం.

ప్రవక్తి అన్నమ్మ జీవితం (లూకా 2:36-38)

రేయింబవళ్ళు దేవుని సేవలో గడిపిన ప్రవక్తి అన్నమ్మ పొందిన భాగ్యం ఏమిటి? లూకా 2 ఆధారిత అనుదిన దైవ ధ్యానం.

యేసు ప్రభువు బాప్తిస్మం (లూకా 3:15-22)

యేసు ప్రభువు బాప్తిస్మ ఆదివారం ప్రసంగం — బాప్తిస్మం ప్రాముఖ్యత, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అర్థం.

ప్రారంభ పరిచర్య, మైదాన ప్రసంగం (అధ్యాయాలు 4–6)

స్వదేశంలో నిరాదరణ పొందిన ప్రభువు (లూకా 4:16-30)

మానవ జ్ఞానం కంటే దైవశక్తి ఎందుకు గొప్పది? నజరేతులో యేసు ప్రవచనం, నిరాదరణపై లూకా 4 మరియు 1 కొరింతి ఆధారిత దైవ ధ్యానం.

అధికారంతో పలికిన మాట - కఫర్నాములో యేసు (లూకా 4:31-37)

కఫర్నహూములో యేసు ప్రభువు అధికారంతో బోధించి, అపవిత్రాత్మను వెళ్లగొట్టిన సంఘటన (లూకా 4:31-37) ద్వారా నిజమైన ఆధ్యాత్మిక అధికారం అంటే ఏమిటో తెలుసుకోండి.

పేతురు అత్త స్వస్థత (లూకా 4:38-44)

యేసు ప్రభువు ప్రార్థన బంధం మరియు రోగుల స్వస్థత వెనుక ఉన్న ఆత్మీయ రహస్యం ఏంటి? లూకా 4 మరియు 1 కొరింతి 3 ఆధారిత అనుదిన ప్రత్యేక దైవ ధ్యానం.

మనుష్యులను పట్టు జాలరులు (లూకా 5:1-11)

రాత్రంతా వల వేసినా ఏమీ దొరకలేదు - యేసు మాటతో వేసిన వలలో ఏం జరిగిందో లూకా 5:1-11లో చూడండి.

యేసుతో సమృద్ధి – శిష్యుల పిలుపు (లూకా 5:1-11)

5వ సామాన్య ఆదివారం ప్రసంగం — యేసుతో జీవించినప్పుడు జీవితంలో సమృద్ధి ఎలా కలుగుతుందో లూకా 5:1-11 వివరిస్తుంది.

నీ పాపములు క్షమింపబడినవి (లూకా 5:17-26)

స్నేహితులు తనను పైకప్పు తెగగొట్టి దించారు - విశ్వాసం, పాపక్షమాపణ కలిసిన అద్భుతం లూకా 5:17-26.

ఉపవాసం గురించి యేసు బోధ – పవిత్ర గ్రంథంలో ఉపవాసం (లూకా 5:33-39)

పవిత్ర గ్రంథంలో ఉపవాసం ఎందుకు ప్రాముఖ్యమైనది? ఉపవాసం గురించిన ప్రశ్నకు యేసు ఇచ్చిన సమాధానం, క్రొత్త ద్రాక్షారసం ఉపమానం.

విశ్రాంతిదినానికి ప్రభువు ఎవరు? – లూకా 6:1-5 ధ్యానం

శిష్యులు వెన్నులు త్రుంచడం పరిసయ్యులకు వివాదాస్పదమైంది. యేసు దావీదు ఉదాహరణతో ఇచ్చిన సమాధానం మనకు ఏమి నేర్పుతుంది? లూకా 6:1-5పై లోతైన బైబిల్ ధ్యానం.

నీ చేయి చాపుము – లూకా 6:6-11 ధ్యానం

విశ్రాంతిదినాన ఊచచేయి గలవానిని యేసు స్వస్థపరచడం పరిసయ్యులకు ఆగ్రహం తెప్పించింది. మేలు చేయడం ఎప్పుడూ ఆలస్యం కాదని ఈ సంఘటన మనకు ఏమి నేర్పుతుంది? లూకా 6:6-11.

ధన్యతలు, అనర్థాలు - లూకా 6:20-26 మైదాన ప్రసంగం వ్యాఖ్యానం

లూకా 6:20-26 లో యేసు ప్రభువు బోధించిన నాలుగు ధన్యతలు, నాలుగు అనర్థాల లోతైన వ్యాఖ్యానం - పేదరికం, ఆకలి, దుఃఖం, నింద గురించి క్రీస్తు సందేశం.

శత్రు ప్రేమ – పరిపూర్ణ కనికరపు మార్గం (లూకా 6:27-38)

లూకా సువార్త 6:27-38 ఆధారంగా శత్రు ప్రేమ, క్షమాపణ మరియు దైవ కనికరం గురించి యేసు ప్రభువు బోధను వివరణాత్మకంగా, ఆధ్యాత్మిక అనువర్తనలతో తెలుసుకోండి.

లూకా 6:39-42: దూలం, నలుసు - గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గం చూపగలడా?

గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గం, గురు-శిష్య సంబంధం, దూలం-నలుసు ఉపమానాలు. ఇతరులను తీర్పు తీర్చే ముందు స్వీయ పరిశీలన క్రీస్తు బోధన.

మంచిచెట్టు, మంచిపండ్లు – రాతిమీద ఇల్లు (లూకా 6:43-49)

హృదయ కోశం, మాటల శక్తి, “ప్రభూ ప్రభూ” అనే పిలుపు వెనుక సవాలు మరియు రాతిమీద నిర్మించిన జీవితం గురించి లోతైన వ్యాఖ్యానం.

గలిలయ పరిచర్య (అధ్యాయాలు 7–9)

ఈ తరమువారిని ఎవరితో పోల్చుదును? (లూకా 7:31-35)

యోహాను, యేసు ప్రభువులపై వచ్చిన ఆరోపణలు, అంగడి వీధి పిల్లల ఉపమానం అర్థం, దేవుని ఆహ్వానాన్ని అంగీకరించడం గురించి వ్యాఖ్యానం.

నీ విశ్వాసము నిన్ను రక్షించినది (లూకా 7:36-50)

పరిసయ్యుడైన సీమోను ఇంట పాపాత్మురాలైన స్త్రీ యేసు పాదాలు కడిగిన సంఘటన — దేవుని క్షమాపణ, కృప, పశ్చాత్తాపం మరియు విశ్వాసంపై ధ్యానం.

యేసు వెంట నడిచిన స్త్రీలు (లూకా 8:1-3)

మగ్దల మరియమ్మ, యోహాన్న, సూసన్న — తమ వనరులతో యేసు పరిచర్యకు తోడ్పడిన స్త్రీల విశ్వాసం, ధైర్యం, సేవ గురించి ధ్యానం.

విత్తువాని ఉపమానం (లూకా 8:4-15)

దేవుని వాక్కు మన హృదయంలో ఎలా ఫలించాలి? నాలుగు నేలల స్వభావం మరియు కుటుంబాలు నేర్చుకోవాల్సిన పాఠాలు.

యేసు తల్లి, సోదరులు ఎవరు? (లూకా 8:19-21)

దేవుని వాక్యాన్ని విని పాటించడం ద్వారానే క్రీస్తు కుటుంబంలో సభ్యులమవుతామని యేసు బోధించిన వాక్యభాగంపై ధ్యానం.

పన్నెండుగురు శిష్యుల పంపకం (లూకా 9:1-6)

యేసు తన శిష్యులకు శక్తిని, అధికారాన్ని ఇచ్చి పంపిన తీరు — నిరాడంబరత, తిరస్కారాన్ని ఎదుర్కొనడం గురించి లోతైన ధ్యానం.

హేరోదు కలవరం – యేసు ఎవరు? (లూకా 9:7-9)

యేసు గురించిన వార్తలు విని హేరోదు కలవరపడ్డాడు. యేసు ఎవరు అనే ప్రశ్న ఆయన హృదయాన్ని ఎందుకు కదిలించింది, అదే ప్రశ్న మనల్ని ఎలా సవాలు చేస్తుంది అనే వ్యాఖ్యానం.

పేతురు విశ్వాస ప్రకటన – నీవు దేవుని క్రీస్తువు (లూకా 9:18-22)

పేతురు “నీవు దేవుని క్రీస్తువు” అని ప్రకటించిన క్షణం, యేసు తన శ్రమల గురించి చేసిన మొదటి ప్రవచనంపై వ్యాఖ్యానం.

మహిమ మధ్యలో సిలువ నీడ (లూకా 9:43-45)

యేసు తన మరణాన్ని రెండవసారి ప్రవచించిన ఘట్టం — మహిమ మధ్యలో సిలువ సందేశంపై చారిత్రక, ఆధ్యాత్మిక వ్యాఖ్యానం.

అందరికంటే అధికుడు ఎవడు? (లూకా 9:46-50)

చిన్నబిడ్డను ఉదాహరణగా చూపిస్తూ నిజమైన గొప్పతనం అంటే సేవ, వినయమేనని యేసు ప్రభువు బోధించిన వాక్యభాగంపై ధ్యానం.

యేసును అనుసరించడానికి వెల ఏమిటి? (లూకా 9:57-62)

యేసును అనుసరించాలనుకున్న ముగ్గురి సంభాషణ — శిష్యరికపు వెల, వాయిదా వేసే ధోరణి, వెనుకచూపు లేని హృదయం.

ఉపమానాలు, రాజ్య బోధన (అధ్యాయాలు 10–18)

పసిబిడ్డలకు దైవజ్ఞానము (లూకా 10:21-24)

జ్ఞానులకు మరుగైనది పసిబిడ్డలకు ఎందుకు వెల్లడైంది? యేసు ఆనందించిన దైవ రహస్యం. లూకా 10:21-24.

హృదయ పరివర్తన లేక నాశనమా? (లూకా 13:1-9)

తపస్సుకాలంలో హృదయ పరివర్తన ఎందుకు అవసరం? లూకా 13:1-9 ఆధారంగా తెలుగులో వాక్య వివరణ. మారు మనస్సు పొందకపోతే ఏమి జరుగుతుందో తెలుసుకోండి.

నిజమైన క్రీస్తు శిష్యుని లక్షణాలు (లూకా 14:25-33)

క్రీస్తును వెంబడించడంలోని షరతులు, సమస్తాన్ని త్యజించడం, సిలువను ఎత్తుకొని నడవడంపై 23వ సామాన్య ఆదివారం సందేశం.

తండ్రి ప్రేమ - హృదయ పరివర్తనకు పిలుపు (లూకా 15)

తప్పిపోయిన కుమారుని కథలో దాగున్న దేవుని అపారమైన ప్రేమ, క్షమాగుణం ఏమిటి? Fr. అమృత్‌రాజు గారి లూకా 15 అధ్యాయం ఆధారిత హృదయ పరివర్తన అనుదిన దైవ ధ్యానం.

అవినీతి పరుడైన గృహనిర్వహకుని యుక్తి (లూకా 16:1-8)

అవినీతిపరుడైన గృహనిర్వాహకుని యుక్తిని యేసు ఎందుకు ప్రశంసించాడు? ఆశ్చర్యకరమైన ఉపమానం లూకా 16:1-8.

ధనవంతుడు, లాజరు ఉపమానం – లూకా 16:19-31 వివరణ

ధనవంతుడు ఎందుకు నరకానికి పోయాడు? లాజరు ఉపమానం ద్వారా సంపద, పేదరికం, దేవుని రాజ్యం గురించి యేసు బోధ - లూకా సువార్త 16:19-31పై ఆధ్యాత్మిక వ్యాఖ్యానం.

సమరియుని కృతజ్ఞత (లూకా 17:11-19)

పదిమందిలో ఒక్కడే, అదీ అన్యుడైన సమరియుడు - కృతజ్ఞత చూపిన అతని కథ నేర్పే పాఠం లూకా 17:11-19.

దేవుని రాజ్యం అంటే ఏమిటి? అది ఎక్కడ ఉంది? (లూకా 17:20-25)

దేవుని రాజ్యం బయట ఎక్కడో లేదు - అది ఎక్కడ ఉందో యేసు ఇచ్చిన ఆశ్చర్యకరమైన జవాబు లూకా 17:20-25.

అంత్య దినములు ఎలా ఉండును? (లూకా 17:26-37)

నోవా, లోతు దినాల్లా ఉంటాయని యేసు హెచ్చరించిన అంత్య దినాలు ఎలా ఉంటాయో లూకా 17:26-37 వివరిస్తుంది.

ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు? (లూకా 18:9-14)

పరిసయ్యుడు, సుంకరి ఇద్దరూ ప్రార్థించారు. దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశించారో తెలుసా? లూకా 18:9-14.

యెరూషలేము, అంత్య కాల ప్రవచనాలు (అధ్యాయాలు 19–21)

జక్కయ్య జీవితంలో మార్పు (లూకా 19:1-10)

యేసును కలిసిన జక్కయ్య జీవితంలో వచ్చిన పరివర్తన — విశ్వాసులకు స్ఫూర్తినిచ్చే ఆచరణాత్మక పాఠాలు.

పునరుత్థానం నిజస్థితి (లూకా 20:27-38)

పునరుత్థానం తర్వాత పెళ్ళిళ్ళు ఉంటాయా అని సద్దూకయ్యులు యేసును ఇరికించాలని చూశారు - జవాబు లూకా 20:27-38.

పేద విధవరాలి రెండు కాసులు – నిజమైన అర్పణ ఏమిటి? (లూకా 21:1-4)

ధనవంతులు పెద్ద మొత్తాలు అర్పించారు, ఆ పేద విధవరాలు రెండు కాసులే వేసింది - నిజమైన అర్పణ ఎలా కొలవాలి? లూకా 21:1-4.

నిజమైన దేవుని సాన్నిధ్యం (లూకా 21:5-11)

ఆలయం కూలిపోతుందని యేసు ఎందుకు చెప్పాడు? నిజమైన దేవుని సాన్నిధ్యం ఎక్కడ ఉందో లూకా 21:5-11 వివరిస్తుంది.

శిష్యులకు ప్రభువు ఇచ్చు వివేకం (లూకా 21:5-19)

కష్టకాలంలో ఏం మాట్లాడాలో తెలియడం లేదా? శిష్యులకు ప్రభువు ఇచ్చిన వివేకం. లూకా 21:5-19 ధ్యానం.

క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించడం (లూకా 21:12-19)

హింసలు, ద్రోహాలు వస్తాయని ముందే హెచ్చరించిన యేసు - క్రీస్తు కొరకు సాక్షులుగా నిలబడటం ఎలా? లూకా 21:12-19.

దైవరాజ్యపు సూచనలు (లూకా 21:29-33)

అంజూరు చెట్టు చిగురించడం చూసి కాలాన్ని తెలుసుకున్నట్టు - దైవరాజ్యపు సూచనలు గుర్తించడం ఎలా? లూకా 21:29-33.

అప్రమత్తులై ప్రార్ధన చేయుడు (లూకా 21:34-36)

ఏ క్షణమైనా వస్తానంటాడు యేసు - అప్రమత్తులై ప్రార్థనలో సిద్ధంగా ఉండాలని లూకా 21:34-36 హెచ్చరిక.

శిలువ, పునరుత్థానం (అధ్యాయాలు 22–24)

క్రీస్తు రాజు పండగ – శిలువపై రాజు (లూకా 23:35-43)

1925లో స్థాపించబడిన క్రీస్తు రాజు పండగ అర్థం, శిలువపై రాజైన యేసు గురించి లూకా 23 ఆధారిత వివరణ.

📲 కొత్త లూకా వ్యాఖ్యానాలు ప్రచురించినప్పుడు మీకు తెలియజేయాలి?

WhatsApp Channel Join చేయండి

ఇతర విభాగాలు: మత్తయి సువార్త • మార్కు సువార్త • లూకా సువార్త • యోహాను సువార్త • బైబుల్ వ్యక్తుల జీవిత చరిత్రలు • ఆదివార ప్రసంగాలు