25వ సామాన్య ఆదివారము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
25వ సామాన్య ఆదివారము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, సెప్టెంబర్ 2022, శనివారం

ఇరువది అయిదవ సామాన్య ఆదివారము

 

                               25 సామాన్య ఆదివారము

 ఆమోసు 8:- 4-7

1తిమోతి 2:- 1-8

లూకా 16:- 1-13

             ఈనాటి మూడు పఠనముల ద్వారా దేవుడు మనలను తన యందు ఆధారపడిజీవించు  శిష్యుల సేవకులలాగా జీవిస్తూఈలోగా ఆశలకు దూరముగా జీవించుటకు ప్రయత్నించాలి అని తెలియజేస్తు న్నాయి.

 మొదటి పఠనము :

ఈనాటి మొదటి పఠనము ముఖ్యముగా "ధనవంతుల అన్యాయపు దోపిడి" మరియు "పేదల కష్టాలను లేదా శ్రమలను"  గూర్చి తెలియజేస్తుంది.

ఎందుకు ఇలా ఆనాటి కాలములో జరిగినది అని మనము ఆరా తీస్తే మనకు అర్ధం అయ్యే అంశము ఏమిటంటే: యూదా దేశాన్ని ఉజియా రాజు మరియు ఇశ్రాయేలీయులను యరొబాము రాజు పరిపాలించిన కాలములో సామ్రాజ్యము బాగా విస్తరించి ఎంతో అభివృద్ధి చెందింది. మరియు ఆర్ధికంగా పుంజుకుందిఅయితే అభివృద్ధితో పాటు కష్టనష్టాలు కూడా ఎదురయ్యాయి ఇటువంటి సమయములోఎవరు చిత్తశుద్ధితో ఆలోచించకుండాఅవినీతితో జీవించడం మొదలుపెట్టారుఇటువంటి సమయములో దేవాతో దేవుడు తన సేవకుడిగా ఆమోసు ప్రవక్తను ఎన్నుకొని ఈప్రజల దగ్గరికి పంపిస్తూ, వారు చేసిన పాపాలను గుర్తు చేస్తూవారికి ఒక మంచి జీవితమును ఇవ్వడానికి ప్రయాసపడుతున్నాడు.

  మరి వారు చేసిన పాపములు ఏమిటి అంటే:

    1.    దీనుల తలమీద కాలుమోపుచు అంటే, ఒక సాధారణ ప్రజలను ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ, వారిని బానిసలుగా చేస్తూ, పేదలుగాఉన్నవారి  జీవితములను నాశనము చేస్తున్నారని భావంవారి చేసే మోసముదోపిడి ఏమిటంటే,

2.వారి ప్రలాభాలకోసం దేవునికే కేటాయించేటటువంటి పవిత్రమైనరోజు విశ్రాంతిదినము ఎప్పుడు దాటిపోవును అని తలంచుచున్నారు.

3.గోధుమలను అమ్మినపుడు కొలమానములను తగ్గించి, తూకములను పెంచుచున్నారు.

4.దొంగ త్రాసులతో జనులను మోసగించుచున్నారు.

 5.తాలు గోధుమలను ఎక్కువ ధరలకు అమ్మతున్నారు.

6.బాకీలు చెల్లింపలేని చెప్పుల జోడు వెలకూడా చెల్లింపలేని పెదాలను వారి బానిసలుగా చేసుకొనుచున్నారు.

 7 .చచ్చుధాన్యములను అమ్ముకోవచ్చు అని వారు తలంచుచున్నారు.

దేవుడు  అంటున్నాడు మత్త:5 :3 లో : "దీనాత్ములు ధన్యులు దైవారాజ్యము వారిదని". ఈనాడు ఈమొదటిపతనములో ఉన్నటువంటి దీనులకుపేదప్రజలకు తన రాజ్యమును ఇవ్వడానికి తన సేవకుడైనటువంటి ఆమోసును వారిదగ్గరకు పంపించి అతని ద్వారా వారికి విముక్తిని కలుగజేస్తున్నాడు.

 దేవుడు వారికి విమోచనను కలిగించాలను కుంటున్నాడులూకా సువార్తలో చూస్తేదేవుడు ఇలా అంటున్నాడు"పీడితులకు విమోచన కలిగించుటకు అయన నన్ను పంపెను (లూకా:4:18), అని అంటున్నాడుఅంటే యేసుప్రభువు ఈలోకానికి వచ్చినది ప్రతిఒక్క వ్యక్తికి కూడా విడుదలనువిమోచనమును కలిగించుటకు వచ్చి వున్నాడు అని తెలియజేస్తుంది.

దేవుడు ఈలోకమునకు వచ్చినది ధనవంతులకోసం  కాదు, అధికారులకోసం కాదు, రాజుల కోసం కాదు. కానీ పాపాత్ముల కోసందీనులకోసం, మరియు అవసరాలలో వున్నవారిని ఆదుకోవటం కోసం వచ్చివున్నాడు. అందుకే తన పనిని తన శిష్యుల ద్వారా చేస్తున్నాడు. కాబట్టి మనందరి లక్ష్యం ఏమిటంటే దేవుడు నియమించిన పనిని సంపూర్తిగా చేయాలి.

రెండవ పఠనము:

  ఈనాటి రెండవ పఠనమును మనము పునీత. పౌలు  గారు తిమోతికి వ్రాసిన మొదటి లేక నుంచి తీసుకొనబడినది. అయితే లేఖ యొక్క అంతరార్ధం ఏమిటంటేదైవ సంఘముకోసంమరియు వారి రక్షణార్ధము కోసం మనము రాజుల కోసంఅధికారుల కోసం ప్రార్ధన చేయాలి అని తెలుపుచున్నాడు.

  ఎందుకు రాజుల కోసంఅధికారుల కోసంఇంకా ప్రతిఒక్క ప్రజలకోసం ప్రార్ధన చేయాలి అంటే

1 .సత్ప్రవర్తన కలిగిన జీవితమును గడపడానికి.

2 .సంపూర్ణమగు దైవ భక్తితో జీవించడానికి.

3 .ఎటువంటి ఒడిదుడుకులులేని ప్రశాంతజీవితమును జీవించడానికి.

  ప్రతిఒక్క రాజు కూడా తన రాజ్యమును సత్ప్రవర్తన కలిగిన రాజ్యముగా తీర్చిదిద్దాలి. తన రాజ్యములో ఎటువంటి వర్గభేదాలు తారతమ్యాలుఒడిదుడుకులుఅశాంతిమనస్పర్ధలులే కుండా జీవించాలిఅప్పుడే ఆరాజ్యములో ఉన్నటువంటి రాజు మరియు అధికారులు తమ పనిని సక్రమముగా నిర్వర్తించినవారవుతారుఅందుకుగాను మనమందరముకూడా ప్రతియొక్క రాజు కోసంఅధికారుల కోసం ప్రార్ధన చేయాలి అని పు.పౌలుగారు తనకు ప్రీతిపాత్రుడైనటువంటి తిమోతికిఈలేఖను ప్రేమగా, సంతోషముగా వ్రాస్తున్నాడు.

  కాబట్టి మనమందరం ముఖ్యముగా ముందుగా చేయవలిసిన పని ఏమిటంటే ప్రార్ధన చేయాలి. ప్రార్ధనే మనలను దేవుని చెంతకు నడిపిస్తుందికాబిట్టి మనమందరము కూడా ఈలోక వ్యక్తులను, వస్తువులనువనరులను ఇష్టపడకమన మధ్యలో ఉన్నటువంటి దేవుని మాత్రమే ఇష్టపడుతూఎల్లయెడల క్రోధముగానితర్కముగాని లేకుండా చేతులుజోడించి భక్తితో ప్రార్ధన ఛేధ్ధాం (Iతిమో:2:8). అలా  చేసిన ప్రార్ధన ద్వారా  ప్రతివ్యక్తి కూడా దేవునియొక్క దీవెనలతో వినయము కలిగి జీవిస్తాడు.

     దేవుడంటున్నాడు, "తన్ను నమ్ము వారికి, తన్ను వెదకువారికి ప్రభువు మేలుచేయును" (విలా:3 :25 -26 ) అని. ఇంకా జెఫ:1:6 లో,"ప్రభువు నీ నడుమనున్నాడు" అంటున్నాడు దేవాతి దేవుడయినటువంటి మన యేసు ప్రభువు మనకు తండ్రికి మధ్యవర్తిగా వుండి మన రక్షణార్ధమై తనను తాను అర్పించుకున్నాడు. ఎందుకంటే, మనము రక్షింపబడాలని అయన కోరిక (Iతిమో:2 :5 -6). కాబిట్టి మనమందరము కూడా ఈలోక వ్యక్తులను, వస్తువులను, వనరులను ఇష్టపడక, మన మధ్యలో ఉన్నటువంటి దేవుని మాత్రమే ఇష్టపడుతూ, విశ్వాసపూరితమైన జీవితమును జీవించడానికి  పట్టుదలతో ప్రార్ధన చేస్తూ జీవిద్దాo.

 సువిశేష పఠనము :

  ఈనాటి సువిశేష పఠనము ముందుచూపుకలిగిన గృహనిర్వాహుకుడి ఉపమానమును మనము చూస్తున్నాం. ఈ ఉపమానమును మనము చదివినప్పుడు మనకు కొంచెం వింతగా అనిపిస్తుంది. కానీ ఇందులో అందరాని నిగూడ అర్ధం దాగివుంది.

మొదటిది,  దేవుని రాకకోసం సిద్ధపాటు కలిగి జీవించాలి అని తెలియజేస్తుంది.

రెండవదిగా, ధనము ద్వారా స్నేహితులను చేసుకోమని తెలియజేస్తుంది.

ఉదా: పేదలకు సహాయం చేయడం, ఆపదలో వున్నవారికి సహాయపడటం.

మూడవదిగాప్రతిఒక్క సేవకుడు వెలుగు బిడ్డలుగా ఉండాలని సూచిస్తుంది. ఎందుకంటే వీళ్ళు దేవునియొక్క ఆత్మచే నింపబడినవాళ్లు. దీనిద్వారా ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిస్తూ, ఇతరులను ఆధ్యాత్మిక లేక పరిశుద్ధ బాటలో నడిపిస్తారు.

      లోక సంబంధ ప్రజలు అంటే: ఈలోక ఆశలకు, ఆశయాలకు, చెడు వ్యసనాలకు, చెడు జీవితమునకు అలవాటుపడి జీవించేవారు.

ముందుగా ఉపమానమును యేసు ప్రభువు తన శిష్యులకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే వారుకూడా గృహ నిర్వాహకుడివలె జాగరూపత కలిగి జీవిచాలని అదేవిధముగా తన తండ్రియొక్క నివాస స్థలములో వారు పాలి భాగస్థులవ్వాలని దేవుని కోరిక.

అయితే అందుకుగాను శిష్యులు ఏమి చేయాలి?

    ముందుగా, ప్రతియొక్క శిష్యుడు కూడా వారు చేసినటువంటి పాపాలను నేరాలను కూడా గుర్తుచేసుకొని తగిన పశ్తాతాపమును పొందాలి. ఎందుకంటే, ఈనాటి సువిశేష మొదటి వచనంలో, ఒక ధనవంతుని వద్ద ఉన్నటువంటి గృహ నిర్వాహకుడు తన సంపదను (దేవుడు ఇచ్చు దీవెనలనుజీవితమును) అంతా వృధా చేస్తున్నాడని నేరము మోపాడు (లూకా: 16:1). ఇక్కడ ధనవంతుడు ఎవరయ్యా అంటే, దేవుడు.గృహనిర్వాహకుడు-శిష్యులు.

దేవుడు తన జీవితములో ఇచ్చినటువంటి దీవెనలను అర్ధం చేసుకోలేక తన స్వార్ధముకోసం ఈలో ఆశలలో పడిపోతున్నాడుఅప్పుడు యజమానుడు తనను పిలిచి, లెక్కలను అప్పగింపుము,నీవు ఇక నా గృహనిర్వాహకుడిగా పనికిరావు అని అంటుంన్నాడు (లూకా :16:2). ఇది ప్రతిఒక్క శిష్యునికి కూడా దేవుడు వారి తప్పులను ఏదో ఒక విధముగా తెలియజేస్తుంటాడుఅప్పుడు ప్రతిఒక్క శిష్యుడు చేసే పని ఏమిటంటే,

1 .దేవుని యొక్క గొప్పతనమును అర్ధం చేసుకోవాలి.

2 .తాను చేసిన తప్పులకు గానూ పశ్చాత్తాపపడాలి.

3 .దేవునియందు తన పాపములను ఒప్పుకోవాలి.

4 .దేవునియొక్క దీవెనలను పొందాలి.

1 .దేవుని యొక్క గొప్పతనమును అర్ధం చేసుకోవాలి:

       సేవకుడు తన యజమానుడు తనజీవితములో చేసిన గొప్పతనమును గుర్తుచేసుకున్నాడుతన యజమానుడు తన (సేవకునిమీద నమ్మకము ఉంచి, తాను దూర దేశమునకు వెళ్ళాడుఅన్నిటి మీద అధికారమును తనకు అప్పగించాడుసేవకునిగా వున్న అతడ్ని తన సంపదకు అధికారిని చేస్తున్నాడు.

 ఉదాతప్పిపియిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు తండ్రి స్వీకరించి తనతో ఒకటిగా చేర్చుకున్నాడు.

2 .తాను చేసిన తప్పులకు గానూ పశ్చాత్తాపపడాలి:

ఇదంతా గ్రహించిన సేవకుడు పశ్చాత్తాపపడుచున్నాడుఇది ఎలాంటి పశ్చాత్తాపముఅంటేతాను మారక పోతే తన యజమాని పనిలోనుండి తీసివేస్తాడేమోనని భయపడి పశ్చాత్తాపపడితాను చేయవలిసిన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాడు.

  కర్తవ్యం ఏమిటంటే:

1 .యజమానుని ఋణస్థులను పిలిచాడు.

 2 .ఋణస్థుల ఋణములను తగ్గించాడు.

3 . ఋణస్థులను సంతోషపరిచాడు.

4 .యజమానుడు సేవకుని మెచ్చుకున్నాడు.

      ఇక్కడ ప్రతిఒక్క శిష్యుడు కూడా సేవకుని పోలి జీవించాలి. ఎందుకంటేప్రతిఒక్క శిష్యుడు  తన దగ్గరకు వచ్చేటటువంటి విశ్వాసులకు ఆధ్యాత్మికంగా వారికి సహాయ పడాలివారు ఆధ్యాత్మికలో ఎదగలేనప్పుడు వారికి సహాయం చేయాలి

ఇక్కడ సేవకుడు చేసిన పనేమిటి:

1 .ఋణస్థులను పిలిచాడు.

2 . వారి సామర్ధ్యమును భట్టి వారి యొక్క రుణమును తగ్గించాడు.

  "చెడ్డవాడిని డబ్బులిచ్చి వదిలించుకోవాలట- మంచివాడిని డబ్బులిచ్చి సంపాదించుకోవాలట".

  రక్షణ చరిత్రలో ఎంతోమంది, అల్పమయిన దానికై అధికమైనదానిని కోల్పోయారు.

ఉదాఅల్పమైన పండుకోసం అవ్వ ఆదాము దేవుడితో నివసించు అవకాశాన్ని కోల్పోయారు.(అది:3:22-23)

 పూట భోజనం కోసం తండ్రి దీవెనలను కోల్పోయిన ఏశావు (ఆది:25:27-34).

 పశుసంపదకోసం రాజరికాన్నే కోల్పోయిన సౌలు రాజు (Iసమూ:15:1-24)

స్త్రీ కోసం ఆత్మ బలాన్ని కోల్పోయిన సంసోను.(న్యాయ:16:1-31 )

ఆస్తికోసం దైవ రాజ్యాన్నే కోల్పోయిన యువకుడు (మత్త: 19:16-29 ).

ఇలా ఎంతో మంది అల్పమైన వాటికై ప్రాకులాడి చివరికి ఏమి సాధించలేక పోయారు.

  కానీ ఈనాటి సువిశేష పఠనంలో ఉన్నటువంటి సేవకుడు మాత్రం ముందుచూపు కలిగిన వ్యక్తి అని చెప్పుకోవచ్చుఎందుకంటే తన తప్పులన్నీ తన యజమానికి తెలిసినవి అని తనకు తెలిసిన వెంటనే ఏమిచేయాలో అలోచించి, దానికి తగ్గట్టుగా చేసాడు. దాని ఫలితం తాను తన యజమానినుండి పొందాడు.

యజమానుని ఋణము తగ్గించడానికి కారణము:

      ముందుగా సేవకుడు తన యజమానుని ఆస్తిని తన ఇష్టానుసారంగ ధనము మీద  ఆశతో ప్రజలకు ఎక్కువ పన్నులకు, వడ్డీలకు ఇచ్చాడుకానీ తనను గురించి తెలుసుకున్న యజమానుని దగ్గర నుంచి కోల్పోబోతున్న తన పనిని తిరిగి సంపాదించడానికి, మరియు ఒకవేళ తన యజమానుడు అతడ్ని వెళ్లగొడితే, తెరిగి వీళ్ళయినా చేరదీస్తారన్న ఒక చిన్న ఆశతో వారి ఋణములను తగ్గిస్తున్నాడు. దాని ద్వారా వారు తన స్నేహితులుగా మారుతున్నారు.

 మరి ప్రతి ఒక్క శిష్యునికి వుండవలిసిన లక్షణాలు ఏమిటంటే:

         1.దేవునియొక్క రాకకోసం ఎదురుచూడాలి.

          2.ప్రతియొక్క శిష్యుడు కూడా ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించాలి.

          3.పేదప్రజలకు సహాయము చేయాలి.

          4.దేవునియొక్క ప్రేమను ఈలోకమంతటా తెలియజేయాలి.

 మరి కుటుంబజీవితములో మనము ఎలాంటి జీవితమును జీవించాలి:

       1 . ఒకరినొకరు అర్ధం చేసుకొని జీవించాలి.

        2 .ఒకరికొకరు సహాయము చేసుకుంటూ జీవించాలి.

       3 .ఒకరినొకరు ప్రేమించుకోవాలి.

చివరి వచనంలో దేవుడు ఇలా అంటున్నాడు, "దైవమును, ద్రవ్యమును సేవింపలేరు" అని. ఎందుకంటే దైవము, ద్రవ్యము ఒకటికాదుదేవుడు మనకు జీవితమును ఇస్తే ధనము మాత్రము మన ప్రాణములను తీసుకునేలా చేస్తుందికాబట్టిమనము ఇద్దరు యజమానులు సేవించు సేవకులుగా కాక ఒకే ఒక యజమానికి సేవచేసే సేవకుడిగా ఉండటానికి ప్రయత్నం చేయాలిఎందుకంటే మన  సాదారణ జీవితములో ఒక వైపు దేవుడినిదైవమును ఒకేలాగా చూస్తూవున్నాంఒకొక్కసారి ధనంకోసం దేవుడినే మర్చిపోతున్నాం.  లూకా:16:13 లో చెప్పిన విధముగా: సేవకుడు ఇద్దరు యజమానులు సేవింపజాలడుఏలయనవాడు ఒకరిని ద్వేషించునుమరొకరిని ప్రేమించును అనిధనమునకు  ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకుండా నీకు జీవితమును ఇచ్చినటువంటి దేవాతి దేవునికి, నీతో వుంటున్నటువంటి, నిన్ను ప్రేమిస్తున్నటువంటి  నీ కుటుంబీకులకు ప్రాధాన్యత ఇవ్వడానికి మనము వెనకంజ వేయకుడదు. 

   కాబట్టి ఈనాటి మూడు పఠనముల ద్వారా దేవుడు మనలను తన యందు ఆధారపడిజీవించు శిష్యుల/సేవకులలాగా జీవిస్తూ, ఈలో ఆశలకు దూరముగా జీవించుటకు ప్రయత్నించాలి అని తెలియజేస్తున్నాడుకాబట్టి ఇలాంటి జీవితమును జీవించడానికి ప్రయాసపడదాం.ఆమెన్.

 

 బ్రదర్.యన్.జోసెఫ్ మారియో .ఓసిడి.         

 

ఇరవై ఎనిమిదవ ఆదివారము

సొలొమోను జ్ఞానం గ్రంధం 7:7-11 హెబ్రియులు 4:12-13 మార్కు 10:17-30  క్రీస్తునాదునియాందు ప్రియా సహోదరి సహోధులరా, ఈనాడు మనమందరం కూడా సామాన్య కాల...