21 వ సామాన్య ఆదివారం
హెబ్రీ 12 : 5 - 7 ,11 - 13
లూకా 13 : 22 - 30
ఎవరు రక్షింపబడతారు ?
ఈనాడు తల్లి తిరుసభ 21 వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతుంది. ఈ నాటి మూడు పఠనాలు రక్షణ అందరకని, రక్షణ పొందటానికి నియమ నిబంధనలు పాటించడం తప్పనిసరి అని, రక్షణకు చేర్చే మార్గము ఇరుకైన మార్గమని ప్రస్తావిస్తున్నాయి. వీటిని మనం మూడు ముఖ్యంశాల ద్వారా ధ్యానిస్తూ అర్ధం చేసుకుందాం.
1. రక్షణ అందరికి:-
ఈ నాటి మొదటి పఠనంలో యెషయా 66:18,21 లో చూస్తున్నాము ప్రతి మానవుడు దేవుడు ఒసగే రక్షణకు పిలవబడ్డాడు. రక్షణ ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే పరిమితం కాదు, ఇది అందరికి. దేవుని దృష్టిలో అందరు సమానులే కుల, మత, వర్గ, జాతి, రంగు అనే విభేదాలు ఏమీలేవు కానీ ఆనాటి ప్రజలు యూదులకు మాత్రమే రక్షణ అని భావించేవారు. ఆ భావనే వాళ్ళను నిర్లక్ష జీవితాన్ని జీవించేటట్లు చేసి పాపమునకు దారితీసి రక్షణకు దూరం చేసింది అందుకే ఈ నాటి సువార్త పఠనంలో కూడా ప్రభు అంటున్నారు మొదటి వారు కడపటి వారు అగును, కడపటివారు మొదటి వారగును లూకా 13:30 దేవుని దృష్టిలో ప్రభు ప్రభు అనే పిలిచేవారు కాదు కానీ ఆయన ఆజ్ఞలు పాటించే వారు. నీవు ప్రభువు ప్రభువు అని పిలుస్తున్నావేమోకాని ఆయన ఆజ్ఞలను పాటించకపోతే కడపటివాడవే. ఈ నాటి మొదటి మరియు సువార్త పఠనంలో చుస్తునాము ఆయన రక్షణ సువార్త వ్యాపనకు అన్య జాతులకు, అన్య ప్రజలకు కూడా ఆయన సువార్త దూతలను పంపుతున్నాడు ఎందుకు అంటే
1. తిరిగి తనలో సఖ్య ప్రరుచుకొనే విధానాన్ని నెరవేర్చుటకు.
2. రక్షణ సువార్త వ్యాప్తి ద్వారా మనలను ప్రోగు చేసేది ఆయన మహిమ నిమిత్తము.
3. దీని ద్వారా దేవుడు మనలను ఆయన రక్షణ సువార్తికులుగా తయారు చేస్తున్నారు
2. దేవుని శిక్ష మన రక్షణ కొరకే :-
తల్లిదండ్రులు పిల్లలను శిక్షించేది, దండించేది వారిపైన కోపం వల్ల కాదు ప్రేమ వలన అదే విధంగా దేవుడు మనలను శిక్షించేది మన పైన ప్రేమవలన (హెబ్రీ12:5,7,11,13) చూస్తున్నాము. మన క్రైస్తవ జీవితంలో ఏదైనా కష్టం వచ్చినపుడు మన విశ్వాసాన్ని కోల్పోయి దేవుడు ఉన్నదా లేదా అని ప్రశ్నిస్తాము గుర్తుంచుకో కష్టం, నష్టం, బాధ శాశ్వతం కాదు ఇవన్నీ కొద్దికాలమే. ప్రతి నిరుత్సహం ప్రోత్సహానికి, ప్రతి కష్టం సుఖానికి దారితీస్తుంది కాబట్టి విశ్వాసంలో స్థిరంగా ఉండి ఈ కష్టాలను అధికమించు. శిక్ష క్రమశిక్షణకు (హెబ్రీ 12:7) క్రమశిక్షణ రక్షణకు దారితీస్తుంది. ప్రభువు మనలను శిక్షించినపుడు శ్రద్ధ వహించాలి, మందలించినపుడు నిరుత్సహ పడకూడదు (హెబ్రీ 12:5) ఎందుకంటె తాను ప్రేమించు వానిని శిక్షించును తాను స్వీకరించువానిని దండించును (హెబ్రీ 12:6) కాబట్టి దేవుని శిక్ష మన నాశనానికి కాదు మన శ్రేయషుకు మరియు రక్షణకు మాత్రమే. ఎవ్వరు నశించడం దేవునికి ఇష్టం ఉండదు అందుకే రక్షించబడాలన్నదే ఆయన ప్రగాఢ వాంఛ.
3 . ఇరుకైన మార్గం - రక్షణ మార్గం :-
ఏవరు పరలోకానికి వెళతారు ఎవ్వరు నరకానికి వెళతారు మనము ఇప్పుడు చెప్పగలమా క్రీస్తు ప్రభువు ఎంత మంది రక్షణ పొందుతారు అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలేదు (లూకా 3:23) కానీ రక్షణ చేర్చే మార్గాన్ని ఎన్నుకోమని ఆ మార్గం ఇరుకైన మార్గమని సమాధానమిస్తున్నారు. అనేకులు ఈ ద్వారమున ప్రవేశింప ప్రయతింతురు కానీ అది వారికీ సాధ్యపడదు (లూకా13:24) సాధ్యపడనపుడు ఎవరు రక్షింపబడతారు ఎవ్వరైతేనడుము కట్టుకొని,నిష్ఠతో, ఆ కంఠ దీక్షతో, సరైన సమయములో ఈ మార్గములో ప్రవేశిస్తారో వారే రక్షింపబడతారు. ఎవరు ఈ మార్గం ఈ మార్గం క్రీస్తే.థామస్ గారు ప్రభువుతో మార్గాన్ని ఎరుకపరచమని అడిగినపుడుప్రభువు "నేనే మార్గమును, సత్యమును, జీవమును నా మూలమున తప్ప యెవ్వడును తండ్రి యొద్దకు రాలేడు (యోహాను 14:5,6) అని చెప్పెను.ఇరుకైన మార్గములో ప్రవేశించండి అంటే క్రీస్తుప్రభువును అనుసరించటమేఅనుసరించాల్సింది పాదాల కదలిక ద్వారా కాదు జీవిత మార్పు ద్వారా. జీవితమార్పు మన కోర్కెలను, చిత్తాలను ప్రక్కన పెట్టి ఆయన ఆజ్ఞలను పాటించటంద్వారా జరుగుతుంది. ఈ నాటి రెండవ పఠనంలో కూడా ఋజు మార్గములనే అనుసరించామని ఆహ్వానిస్తున్నాయి (హెబ్రీ12:12,13)ఇరుకైన మార్గంలో ప్రవేశించాలి అంటే మనలను మనము వినమ్రులను చేసుకోవాలి. క్రీస్తే మన మార్గం,సత్యం, జీవం కావాలి. క్రీస్తు లాగా మనం మరణం వరకు దేవునికి విధేయులము కావాలి (ఫిలిప్పి2:8)ఈ ఇరుకైన మార్గమంలో ప్రవేశించడానికి ప్రతి నిత్యం జాగరతతో, సమసిద్ధతతో ఉండాలి లేకపోతె ద్వారములు మూయబడతాయి రక్షణ పొందలేము అప్పుడు అబ్రాహాము, ఈసాకు, యాకోబు, ప్రవక్తలందరును పరలోక రాజ్యమున ఉండుట చూచి ఏడ్చుచు పండ్లు కోరుకుక్కోవాలి ఈలాగున కాక రక్షణ అందరికాని గ్రహించి రక్షణకు చేర్చు ఇరుకైన క్రీస్తు మార్గములో ప్రవేశిదాం. రక్షణ పొందటానికి కృషిదాం. ఇతరులకు సువార్తను అందించుదాం. ఆమెన్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి