మూడవ సామాన్య ఆదివారం
యెషయా 8:23-9:3
1 కొరింతి 1:10-13,17
మత్తయి 4:12-23
ఈనాటి దివ్య పఠనాలు దేవుడు వెలుగుగా ఉండి, తన
ప్రజలను అంధకారము నుండి వెలుగులోనికి నడిపిస్తారు అనే అంశం గురించి
బోధిస్తున్నాయి.
ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు అవసరం, లేకుంటే మన అందరి
జీవితాలు అంధకారంలాగా మారతాయి. చీకటిలో మనం ప్రయాణం చేయలేము అందుకే యావే దేవుడు తన
ప్రజలను వాగ్దాత భూమికి నడిపించుటకు రాత్రి అగ్నిస్తంభమై వారికి ముందుగా నడిచి
దారి చూపించారు.
దేవుని యొక్క వెలుగును వెంబడించినట్లయితే మనందరి
జీవితాలు ఆనందమయంగా ఉంటాయి. ఈరోజు మనందరం కూడా ఒక వెలుగులాగా ఉండాలి అనే అంశం
గురించి దివ్య పఠనాలు బోధిస్తున్నాయి.
ఈనాటి మొదటి పఠనం లో దేవుడు ఇస్రాయేలు ప్రజలను
వెలుగులోనికి నడిపించిన విధానంను తెలుసుకుంటున్నాం.
ఇశ్రాయేలు ప్రజలు తమ యొక్క అపనమ్మకం వలన, అవిశ్వాసం వలన చేసిన తప్పిదాల వల్లనే అంధకారంలోనికి
పంపబడ్డారు.
క్రీస్తుపూర్వం 733 వ సంవత్సరంలో అసీరియా రాజు దండెత్తి వచ్చి, సెబూలూను, నప్తాలి భూభాగాల్ని ఆక్రమించాడు, అప్పుడు ఇశ్రాయేలు
ప్రజలు దేవునికి మనవి చేయుటకు బదులుగా ప్రక్కన ఉన్న ఇరుగుపొరుగు, రాజుల యొక్క సహాయంను కోరారు, వారి యొక్క శక్తి సామర్థ్యాల మీదనే ఆధారపడ్డారు అందుకనే
ఇశ్రాయేలు పూర్తిగా పతనం అయిపోయింది.
తిగ్లాత్ పీలేసర్ దురాక్రమణాల అనంతరం ఉత్తర పాలస్తీనా
(ఇశ్రాయేలు) భూభాగమంతా యూదేతర జాతులకు నివాసంగా మారిపోయింది, అన్య మతాలకు, అన్నయ్య
దేవతారాధనలకు నిలయమైంది, ఫేనేసియ
దేశస్తులు, సమరీయులు అక్కడ నివసించేవారు ఇశ్రాయేలు ప్రజల యొక్క
అంధకారమేమిటంటే వారి యొక్క పతనమైన జీవితం, వారి యొక్క
బానిసత్వం, స్వేచ్ఛ లేకపోవటం దేవుని విస్మరించి జీవించడమే వారి
యొక్క అంధకారపు జీవితం.
మనందరి జీవితాలలో కూడా కొన్ని చీకటి క్షణాలు ఉంటాయి
మనం ఎంతగానో ప్రేమించే వారు చనిపోవడం,
- మన యొక్క జీవిత
స్వామిని కోల్పోవడం.
- అనుకున్నది
జరగకపోవటం.
- అయినవారు దూరం
అవటం.
- అనుకోకుండా
అస్వస్థతకు గురికావటం.
- ప్రమాదానికి
గురికావటం.
- జీవితం అంతా
అతలాకుతలం అవటం.
- విజయం
సాధించకపోవడం.
- జీవితం మనకు
అనుగుణంగా లేకపోవడం.
ఈ విధంగా చాలా చీకటి క్షణాలు మన జీవితంలో ఉంటాయి, చీకటి క్షణాలు శాశ్వతమైనవి. చీకటి తరువాత దేవుని యొక్క వెలుగు మనకు
అందజేయబడుతుంది.
ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో గొప్ప అంధకారం
ఏమిటంటే వారి యొక్క బానిసత్వమే.బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు నిరాశలో
ఉన్నారు. ఎందుకంటే వారిలో వెలుగు లేదు. బానిసత్వంలో ఉన్న సమయంలో వారి యొక్క జీవితం
కష్టాలతో, బాధలతో ఇబ్బందులతో చీకటమయమయ్యింది. ఆకలి దప్పికలకు అలమటిస్తూ అనేక
సమస్యలు ఎదుర్కొన్నారు.
అంతటి అంధకార పరిస్థితులు ఏర్పడినందుకు ఇస్రాయేలు
ప్రజలు తమ యొక్క దేవుణ్ణి, రాజులను, ప్రవక్తలను నిందించేవారు.
వారి యొక్క నిరుత్సాహ సమయాలలో అన్య దైవముల నుండి
సలహాలను పొందేవారు. నిజమైన యావే దేవుని మరిచిపోయారు. దేవుని యొక్క ఒడంబడికను, ఆజ్ఞలను మరచిపోయారు, అందుకే వారు తిగ్లాత్ పీలేసర్ చేతిలో ఓటమిని చవిచూచారు.
అస్సిరియా బానిసత్వంకు తీసుకొని పోబడ్డారు.
అంతా కోల్పోయిన ప్రజలకు యెషయా ప్రవక్త సంతోషకరమైన
విషయమును తెలియజేశారు, అదేమిటంటే అంధకారమున నడిచిన ప్రజలు వెలుగును చూస్తారు అని.
ఎవరైతే తమ యొక్క జీవితంలో కష్టాలు, బాధలు దేవుని కొరకు
అనుభవిస్తారో వారు దేవుని సంతోషమును చూస్తారు అని అర్థం.
మన యొక్క విశ్వాసం కూడా అంధకారంలో మొదలై వెలుగుకు
ప్రయాణమైపోతుంది.
దేవుని యొక్క వెలుగు మనమేమిటో తెలియజేస్తుంది, కేవలం
ఆయన యొక్క వెలుగులో మన యొక్క బలహీనతలు, పాపం, బలాలు అన్నీ తెలుసుకొనవచ్చు.
ఈనాటి రెండవ పఠనం లో పునీత పౌలు గారు కొరింతు సంఘంలో
ఉన్న వారందరికీని ఒక కుటుంబం లాగా కలిసిమెలిసి జీవించమని కోరుచున్నారు.
సంఘంలో ఉన్న విశ్వాసుల మధ్య ఎటువంటి విభజనలు లేకుండా
ఐక్యంగా ఉండాలని పౌలు గారి కోరిక.
కొరింథీలో ఉన్న కొందరు ఆపోలో అనుచరులు అని, క్రీస్తు అనుచరుడని కొందరు, పేతురు అనుచరులని కొందరు, పౌలు అనుచరులని వివిధ రకాలుగా విభజించబడ్డారు, అది సరి అయినది కాదు ఎందుకంటే అందరూ కూడా ప్రకటించేది క్రీస్తు ప్రభువును గురించియే.
- క్రీస్తు
విభజించబడలేదు
- క్రీస్తును
గురించి మా సువార్త ప్రకటన
- క్రీస్తునందే
జ్ఞానేస్నానం పొందుచున్నాం కాబట్టి అందరూ కూడా క్రీస్తునకు చెందిన వారం కాబట్టి
కలిసిమెలసి ఐక్యంగా జీవించాలి అని పౌలు గారు తెలుపుచున్నారు.
ఏసుక్రీస్తు యొక్క నామమును విశ్వసిస్తున్న అందరూ ఒకటై
ఉండాలి.
కొందరు ఆపోలో అనుచరులుగా మారారు ఎందుకంటే ఆయన దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి, ధర్మశాస్త్రమును క్షుణ్ణంగా చదివిన వ్యక్తి, అలాగే దైవ సంబంధిత పతనాలలో దేవుని కొరకు మాట్లాడే వ్యక్తి అందుకే ఆయనను వెంబడించేవారు.
- కొందరు పేతురు అనుచరులు ఎందుకంటే ఆయన దేవుని చేత
నాయకునిగా ఎన్నుకోబడిన వ్యక్తి.
- కొందరు పౌలు యొక్క అనుచరులు ఎందుకంటే ఆయన అన్యుల యొక్క
అపోస్తులుడు హృదయ పరివర్తనం చెంది దేవుని యొక్క సువార్తను ప్రకటించిన వ్యక్తి.
- కొందరు వారి యొక్క విశ్వాసం వలన క్రీస్తు ప్రభువు
యొక్క అనుచరులుగా మారారు.
ఒకే సంఘంలో వివిధ రకాల అనుచరులను చూసిన పౌలు గారు మీరందరూ ఎటువంటి వర్గము, బేదము లేకుండా అందరూ కూడా ఒకే హృదయం, మనసు, ఆలోచన కలిగి జీవించాలని తెలుపుచున్నారు.
ఆనాడు కొరింతు లో ఉన్న భేదాభిప్రాయాలు ఈనాడు మన మధ్యలో
కూడా ఉన్నాయి.
కొన్ని కొన్ని ప్రాంతాలలో, విచారణలలో ప్రజలు వారి
యొక్క భాషను బట్టి, ప్రాంతమును బట్టి, వారి యొక్క వర్గమును బట్టి, సంపదలను బట్టి, విభజించబడుతున్నారు, దానిని పౌలు గారు ఖండిస్తూ తెలిపిన మాట ఏమిటంటే యేసు ప్రభువు
ఒక్కరే కాబట్టి ఆయనను విశ్వసించే మనందరం కూడా ఒకటిగా కలిసిమెలిసి జీవించాలి.
సంఘాలలో ఎటువంటి విభజనలు లేకుండా జీవించాలంటే మనందరం
స్వార్థమును ప్రాంతీయ అభిమానం ను విడిచిపెట్టి దేవుని యొక్క వాక్కు చేత నడిపించబడాలి.
దేవుని యొక్క వాక్కు మన జీవితాలను మార్చిన సందర్భంలోనే అందరూ ఒకే మనస్సు, ఆలోచన కలిగి జీవించగలరు.ఈనాటి సువిశేష పఠనం లో యేసు ప్రభువు తన యొక్క సువార్త పరిచర్యను ప్రారంభించిన విధానంను తెలుసుకుంటున్నాం.
బాప్తీస్మ యోహాను చరసాలలో బంధింపబడిన తర్వాత
యేసుప్రభు తన యొక్క పరిచర్యను, దైవ రాజ్య స్థాపనను ప్రారంభించారు.
ఏసుప్రభు జేబులోను, నెప్తాలి ప్రాంతాలలో నివాసం ఏర్పరచుకొని తమ యొక్క బోధను ప్రారంభించడంలో యెషయా ప్రవక్త యొక్క ప్రవచనం నెరవేరింది.ఈ జెబూలోను, నెప్తాలి ప్రాంతపు ప్రజలు పాపంలో చిక్కుకున్న ప్రజలకు చిహ్నం. క్రీస్తు ప్రభువు ఈ లోకానికి రాకముందు అందరూ దాదాపుగా అంధకారంలో జీవిస్తున్న వారే మరణపు నీడలో మూలుగుతున్న వారే, పాప కోపంలో చిక్కుకున్నవారే, అన్య దైవములను పూజించేవారే, అలాంటి దేనా వ్యవస్థలో ఉన్న మానవులపై క్రీస్తు జ్యోతి ప్రకాశిస్తుంది.
యేసు ప్రభు ఈ లోకమునకు వెలుగు - యోహాను 8: 12.
ఎవరైతే ఆయనను విశ్వసించి జీవిస్తారో వారి యొక్క
జీవితాలు అంధకారంలో ఉండకుండా వెలుగులో ఉంటాయి - యోహాను 12:46.
అంధకారంలో ఉన్న ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చుటకు ఏసు
ప్రభువు ఈ లోకంలో జన్మించారు.
మనం పాపం చేసిన ప్రతి సందర్భంలో అంధకారంలోనికి
వెళుతున్నాం, అందుకే క్రీస్తు ప్రభువు మనలను రక్షించి మనలో వెలుగును నింపుచున్నారు.
పాపం చేయని ప్రతివాడు
వెలుగు వలె ప్రకాశవంతంగా, నీతిగా, నిజాయితీగా, ఆనందంగా జీవించగలడు.
మానవుల యొక్క జీవితం చీకటి వెలుగుల మధ్య ఉంటుంది
చీకటి వెలుగుల మధ్య ఎప్పుడు ఘర్షణ జరుగుతుంటుంది, అందువల్లనే క్రైస్తవ జీవితం అనేది
ఒక పోరాటం అని పిలుస్తాం.
ఏసుప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చారు, ఈ లోకంలో ఉన్న
అందరికీ వెలుగునిచ్చుటకు ఆయన వచ్చారు.
- దేవుని యొక్క
వెలుగు సంతోషామునకు గుర్తు.
- దేవుని యొక్క
వెలుగు నిరీక్షణకు గుర్తు.
- దేవుని యొక్క
వెలుగు రక్షణకు గుర్తు.
- దేవుని యొక్క
వెలుగు ప్రేమకు గుర్తు.
- దేవుని యొక్క
వెలుగు ఆనందమునకు గుర్తు.
ఆయన వెలుగును పొందిన మనం ఇతరులకు కూడా వెలుగును
పంచాలి అనేక మంది ఇంకా చీకటినే ఇష్టపడుతున్నారు చీకటినే ప్రేమిస్తూ
జీవిస్తున్నారు.
మనందరం క్రీస్తు జ్యోతిని కలిగి ఉన్నాము మన యొక్క జ్ఞాన
స్నాన సమయంలో పొంది ఉన్నాము ఆ వెలుగులో జీవించాలి.
ఏసుప్రభు తన యొక్క పరిచర్య ప్రారంభించినప్పుడు ఎవరైతే
తన యొక్క అవసరతలో ఉన్నారో వారి చెంతకు వెళ్లారు - లూకా 5:31-32, లూకా 19:10.
ఏసుప్రభు తన పరిచర్య ద్వారా అంధకారంలో ఉన్న వారిని
వెలుగులోకి నడిపించారు- యోహాను 8: 12,12:35-36,రోమి 23:12.
తన పరిచర్య ద్వారా మరణించిన వారిని జీవింప చేశారు -
యోహాను 5:24.
ప్రభు యొక్క పరిచర్య ద్వారా అనేకమంది అక్రమ మార్గముల
నుండి అవినీతి నుండి, పాపం నుండి, చెడు వ్యసనముల నుండి, వెలుగునకు నడిపించబడ్డారు.
ప్రభువు పరిచర్య మొదటిగా హృదయ పరివర్తనం అనే అంశం మీద ప్రారంభమైంది, హృదయ పరివర్తన
ద్వారానే మనలోకి వెలుగు వస్తుంది క్రీస్తు ప్రభువు ఇచ్చిన వెలుగులో మనం నడిస్తే ఇక
అంధకారంలో మనం ఉండము.
ఈనాటి సువిశేష రెండవ భాగంలో యేసు ప్రభువు తన సేవకై శిష్యులను పిలుస్తున్నారు.
ఏసుప్రభు గలీలియో ప్రాంతమంతా పర్యటించారు, ఎవరైతే తన
యొక్క వాక్కును ఆలకించుటకు సిద్ధంగా ఉన్నారు వారి చెంతకు ఏసు ప్రభువు వెళ్లారు.
ఏసుప్రభు తన యొక్క సేవకు జాలరులను ఎన్నుకుంటున్నారు, ఆయన కాలంలో మామూలుగా సేవకులే గురువులను ఎన్నుకునే వారు, కానీ ఏసుప్రభువు మాత్రం
భిన్నంగా ఉంటున్నారు ఆయనే ప్రజల స్థలాలకు వెళ్లి తన సేవకై కొంతమందిని
ఎన్నుకుంటున్నారు.
దేవుడు మనల్ని వెతుకుతూ వస్తున్నారు, శిష్యులను వెతికి
తన సేవకే ఎన్నుకొన్నారు జాలరులు సాధారణమైన వ్యక్తులు అయినప్పటికీ ప్రభువు వారిని
తన సేవకు వెన్నుకుంటున్నారు వారి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి కాదు వారిని
ఎన్నుకొన్నది, వారి యొక్క అందుబాటులో ఉండే విధానం బట్టి "He did not see there ability at rather there availablity." తన పనిని ఎవరైతే
సక్రమంగా చేస్తారో వారినే దేవుడు ఎన్నుకుంటున్నారు.
ఎందుకు ప్రభువు జాలరులను ఎన్నుకుంటున్నారు అని మనం
ఆలోచిస్తే మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు.
1. చేపలు పట్టే
వారికి (జాలరులకు) సహనం ఎక్కువ.
2. జాలరులకు ధైర్యం
ఎక్కువ.
3. తమ ప్రాణాలు
త్యాగం చేయడానికి వారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.
4. జాలరులు పట్టుదల
కలిగిన వారు.
5. ఏ సమయంలో ఎక్కడకు
చాపలు పట్టడానికి వెళ్లాలో బాగా తెలిసినవారు.
6. తమ ప్రయత్నంను
విడిచిపెట్టని వారు.
జాలరులకు చాలా ఓర్పు, తెలివి, సహనం నెమ్మదితనం ఉంటాయి
అందుకే ప్రభువు వారిని తన యొక్క సేవకై ఎన్నుకుంటున్నారు.
ఏసుప్రభు వారి యొక్క సామర్థ్యం బట్టి వారిని
ఎన్నుకోవడం లేదు కానీ వారు ఎప్పుడూ కూడా ఎంతటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా
మరియు అందుబాటులో ఉంటారు కాబట్టి వారిని ఎన్నుకుంటున్నారు.
ఏసుప్రభువు సామర్దులను తన పని కోసం ఎన్నుకోవడం లేదు, పేతురు ఆంధ్రేయ, యోహాను, యాకోబులు తమ పనిలో నిమగ్నమై ఉన్న వారిని దేవుడు
ఎన్నుకుంటున్నారు.
- మోషే గొర్రెలు
మేపే సమయంలో దేవుడు ఆయన్ను ఎన్నుకున్నారు.
- దావీదు రాజు
గొర్రెలు కాచే సమయంలో దేవుడు తనను పిలిచారు.
- అదేవిధంగా
శిష్యులను కూడా చేపలు పట్టే సందర్భంలో తన సేవకు పిలుస్తున్నారు.
ఏసుప్రభు పిలిచిన వెంటనే ఆయన యొక్క మాటను అనుసరించి
సమస్తమును పరిత్యజించి ఆయన్ను వెంబడించారు. వారు అన్నీ విడిచిపెట్టుటకు సిద్ధంగా
ఉన్నారు దేవుని వెంబడించారు మనం కూడా ప్రభువు కొరకు సిద్ధంగా ఉండాలి.
ఈ శిష్యులలో మనం చూసే గొప్ప విషయం ఏమిటంటే కలిసి పని
చేయుట అన్నదమ్ములుగా ఉన్నవారు కలిసిమెలసి పనిచేస్తున్నారు. ఈనాడు ఎంతమంది
అన్నదమ్ములు కలిసి పనిచేస్తున్నారు.
ఏసుప్రభు శిష్యులను ఒక వెలుగుగా ఉండుటకు
పిలుస్తున్నారు తమ యొక్క బోధన ద్వారా పరిచర్య ద్వారా వారు అనేకమందిలో ఉన్న
అంధకారమును తొలగించి వెలుగును నింపారు.
మనం కూడా ప్రభువు యొక్క వెలుగుని ఇతరులకు పంచుతూ
సంతోషంగా జీవించూద్దాం.
Fr. Balayesu OCD
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి