6, డిసెంబర్ 2025, శనివారం

మత్తయి 15:29-37 ధ్యానం - ఏడు రొట్టెలు, చిన్న చేపల అద్భుతం

 మత్తయి 15:29-37

యేసు అక్కడ నుండి గలిలీయ సముద్ర తీరమునకు వచ్చి, కొండపైకి  ఎక్కి కూర్చుండెను. అపుడు జనులు గుంపులు గుంపులుగా కుంటివారిని, వికలాంగులను, గ్రుడ్డివారిని, మూగవారిని, రోగగును అనేకులను తీసికొనివచ్చి, ఆయన పాదసన్నిధికి చేర్చగా ఆయన వారిని స్వస్థ పరచెను. అపుడు మూగవారు మాటాడుటయు, వికలాంగులు అంగపుష్టి  పొందుటయు, కుంటివారు నడుచుటయు, గ్రుడ్డివారు చూచుటయు జనసమూహము కాంచి, విస్మయమొంది, యిస్రాయేలు దేవుని స్తుతించిరి. అనంతరం యేసు తన శిష్యులను పిలిచి, "ఈ జనులు  మూడు దినములనుండి ఇక్కడ ఉన్నారు. వీరికి తినుటకు ఏమియులేదు. వీరిని చూడ నాకు జాలి కలుగుచున్నది. వీరు మార్గ మధ్యమున అలసి సోలసి పడిపోవుదురేమో! వీరిని పస్తుగా పంపి వేయుట నాకు యిష్టము లేదు" అనెను. అపుడు శిష్యులు, "ఈ ఎడారిలో ఇంతటి జనసమూహమునకు కావలసినంత ఆహారము మనము ఎచటనుండి. కొనిరాగలము?" అని పలికిరి. అంతట యేసు "మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి?" అని వారిని అడిగెను. "ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నవి" అని శిష్యులు పలికిరి. ఆయన జనసమూహమును నేల మీద కూర్చుండుడని ఆజ్ఞాపించెను. పిమ్మట ఆయన ఆ ఏడు రొట్టెలను చేపలను తీసుకొని ధన్యవాదములు అర్పించి, త్రుంచి, తన శిష్యులకు ఈయగా వారు ఆ జనసమూహమునకు పంచి పెట్టిరి. వారు అందరు భుజించి సంతృప్తి చెందిరి. పిమ్మట మిగిలిన ముక్కలను ఏడు గంపల నిండ ఎత్తిరి. 

ధ్యానం: యేసు ప్రభువు గలిలీయా ప్రాంతానికి వస్తున్నాడు. ఆయన అంతకు ముందు కననీయ స్త్రీ విశ్వాసము గురించి చెప్పి ఆమె కుమార్తెను కాపాడాడు. అది చూసిన ప్రజలు, యేసు ప్రభువు అద్భుతాల గురించి తెలిసిన ప్రజలు ఆయనను వెంబడిస్తున్నారు. యేసు ప్రభువు అక్కడ నుండి గలిలీయా ప్రాంతానికి వచ్చి, అక్కడ  కొండను ఎక్కి కూర్చొని ఉన్నారు. ఆయన అద్భుతాలు చూసిన వారు, ఆయన మాటలను విన్నవారు అందరు ఆయనను వెంబడిస్తున్నారు. అద్భుతాలు చూసిన వారు అనేక మందిని గ్రుడ్డివారిని , కుంటివారిని, మూగవారిని, వికలాంగులను తీసుకొని వస్తున్నారు. ఎందుకు వారందరిని తీసుకొని వస్తున్నారు? వీరు అందరిని తీసుకొనిరావడానికి గల కారణం ఏమిటి అంటే వారు అందరు స్వస్థత పొందాలని, యేసు ప్రభువుని శక్తి తెలుసుకొని వారు ఆయన ద్వారా స్వస్థత పొంది మంచి జీవితం వారు పొందాలని, వారిని తీసుకొని వస్తున్నారు. కేవలం యేసు ప్రభువు ద్వారా స్వస్థత పొందాలని మాత్రమే కాదు, ఆయన మాటలను వినాలని వారు అందరు వస్తున్నారు. ఆయన చేసే అధ్భుతాలు మాత్రమే కాక ఆయన మాటలు జీవమైన మాటలు, అంతకు ముందు వారు ఇటువంటి జీవమైన మాటలు  వినలేదు. శిష్యులు , యేసు ప్రభువు మాటలు వినిన వారు, అధ్బుతాలు చూసిన వారు,  మిగినలిన వారందరు అక్కడకు రావడానికి ఉపయోగపడ్డారు. మనం కూడా ఆయన అనుచరులుగా కష్టాలు, బాధలలో ఉన్నవారిని, రోగులను, జీవవాక్కు అవసరంలో ఉన్నవారిని ప్రభువు ప్రభువు దగ్గరకు తీసుకొని రావాలి. అది వారు బాగుపడుటకు, పరిపూర్ణులు అవుటకు ఉపయోగపడుతుంది. 

వారి అందరిని ప్రభువు స్వస్థ పరిచారు. యేసు ప్రభువు అక్కడకు వచ్చిన ప్రతి వ్యక్తిని స్వస్థపరుస్తున్నారు. ఇక్కడ స్వస్థ పరచడం అంటే వారిలో ఉన్న లోపాలను తీసువేసి వారిని  పరిపూర్ణమైన వ్యక్తులుగా మారుస్తున్నారు. యేసు ప్రభువు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి, ఆయన అనుగ్రహం పొంది వెళుతున్నారు అంటే, అతను పరిపూర్ణమైన వ్యక్తిగా మారుతున్నారు అని మనకు అర్ధం అవుతుంది. అక్కడ జరుగుతున్న విషయాలను చూస్తున్న, యిస్రాయేలు ప్రజలు దేవున్ని స్తుతిస్తున్నారు. ఇది కేవలం అప్పటి ప్రజలు మాత్రమే కాదు, యేసు ప్రభువును నమ్మిన వ్యక్తులు జీవించే జీవితవిధానం కూడా, ఇతరులను  దేవున్ని స్తుతించేలా చేస్తుంది. అపోస్తులుల కార్యాలలో ఇది మనం చూస్తాము. అంతే కాదు ఇది  క్రీస్తు ప్రభువు అనుచరుల జీవిత విధానం, వీరి ప్రార్ధన ద్వారా ఇతరులు పొందే స్వస్థత కూడా మిగిలినవారు  దేవున్ని స్తుతించడానికి ఉపయోగపడుతుంది. అది చేయవలసిన బాధ్యత ప్రభువు అనుచరులుగా మన మీద ఉన్నది. 

"ఈ జనులు  మూడు దినములనుండి ఇక్కడ ఉన్నారు. వీరికి తినుటకు ఏమియులేదు. వీరిని చూడ నాకు జాలి కలుగుచున్నది. వీరు మార్గ మధ్యమున అలసి సోలసి పడిపోవుదురేమో! వీరిని పస్తుగా పంపి వేయుట నాకు యిష్టము లేదు" అనెను. యేసు ప్రభువు మన ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే కాదు, ఆయన మానవుల  భౌతిక అవసరాలను గురించి  కూడా ఎంతగానో శ్రద్ద కలిగి ఉంటారు. యేసు ప్రభువు అంతమందిని స్వస్థ పరచడం ఇది మనకు తెలియజేస్తుంది. ఇది మాత్రమే కాకుండా అక్కడ ఉన్న ప్రజలు అందరు మూడు రోజుల నుండి ఉన్నారు. వారు ఏమి తినలేదు. ఒకవేళ వారు అక్కడ నుండి వెళితే, మార్గ మధ్యలో శక్తిలేక పడి పోతారు ఏమో అని ప్రభువే వారికి భోజన వసతిని కలిపిస్తున్నారు. వారిని అలా పంపించి వేయడం ప్రభువుకు ఇష్టం లేదు అంటే మనం లేమితో ఉండాలి అని ప్రభువు కోరుకోవడం లేదు. ప్రభువునకు మనం అంటే చాలా ఇష్టం అందుకే మానవునికి సంభందించిన ప్రతి చిన్న విషయమును కూడా ప్రభువు అంత శ్రద్ద తీసుకుంటున్నారు. మన తల్లి, తండ్రి వలె ప్రభువు మనలను చూస్తున్నారు. 

అక్కడ వారి దగ్గర ఉన్నటువంటి ఏడు  రొట్టెలను చేపలను తీసుకొని దేవునికి అర్పించి వాటిని అందరికీ పంచుతున్నారు. ఇక్కడ మనం చూసే ఈ అధ్భుతం మనకు ఒక విషయం తెలియజేస్తుంది. మన దగ్గర ఉన్నది అందరం పంచుకుంటే, దేవుని దీవెన అక్కడ ఉంటుంది. అక్కడ ఎవరికి కోదువ ఉండదు.మరియు ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందుతారు. యేసు ప్రభువు చేసిన ఈ గొప్ప కార్యమును, మొదటి క్రైస్తవ సంఘము అవలంభించినది. వారి వద్ద ఉన్నదానిని వారు తీసుకొన వచ్చి, పంచుకొని బ్రతికారు, అందరికీ సమృద్దిగా లభించినది. ఎవరికి తక్కువ కాలేదు. ఇది మనం ప్రభువు వద్ద నుండి నేర్చుకోవాలి. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన: ఓ ప్రభువా! మీరు ఎంత ఉన్నతులు. అనేక మందిని వారికి ఉన్న వైకల్యం నుండి బయటకు తీసుకువచ్చి వారిని పరిపూర్ణ ఆరోగ్యవంతులను చేస్తున్నారు. వారిలో ఏ లోపం లేకుండా వారిని అందమైన దేవుని సృష్టిగా చేస్తున్నారు. మీ ఓర్పుకు, అనేక రకాలైన లోపాలతో బాధ పడేవారిని, పరిపూర్ణ వ్యక్తులుగా చేసిన మీ మంచి హృదయానికి కృతజ్ఞలు తెలుపుతున్నాను ప్రభువా. ప్రభువా! నాలో  కూడా అనేక లోపాలు ఉన్నవి, అవి మిమ్ములను చూచుటకు, మీ మాటలను వినిపాటించుటకు ఆటంకముగా ఉన్నవి, నాలో ఉన్న ఆ లోపాలను తీసివేయండి. నన్ను కూడా పరిపూర్ణమైన  వ్యక్తిగా మార్చుము. అలానే నేను కూడా మీ వద్దకు ఇతరులను తీసుకువచ్చేలా , ముందు నన్ను మీ నిజమైన అనుచరుడను చేయండి.  ప్రభువా! మీకు ప్రజలు పస్తులు ఉండి మీ వద్ద నుండి వెళ్ళడం ఇష్టం లేక వారికి కావలసిన అహరం ఇవ్వడానికి మీరు సిద్దపడ్డారు. వారికి కావలసిన అహరం వారికి ఇచ్చారు. ప్రభువా! నా జీవితంలో అనేక విషయాలలో మిమ్ములను నమ్మి మీ మాటలను వినాలని,  మీతో ఎప్పుడు ఉండాలని కోరికతో ఉన్నాను. ఆ ప్రజల ఆకలి తీర్చిన విధంగా నాకు ఏమి అవసరమో మీరే ప్రసాదించండి. ఆమెన్. 



5, డిసెంబర్ 2025, శుక్రవారం

సువార్తకారుడైన పునీత యోహాను చరిత్ర మరియు విశిష్టత | కార్మెల్ శోభ

 సువార్త కారుడైన యోహాను - ప్రియమైన శిష్యుడు 

 యోహాను 20: 2-8 

అంతట ఆమె సీమోను పేతురువద్దకు, యేసు ప్రేమించిన  మరియొక  శిష్యుని  యొద్దకు పరుగెత్తుకొని పోయి,  "వారు ప్రభువును  సమాధినుండి  ఎత్తుకొనిపోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము"అని చెప్పెను. అపుడు పేతురు, ఆ శిష్యుడు సమాధివైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరుగెత్తుచుండిరి. కాని, ఆ శిష్యుడు పేతరుకంటే వేగముగా పరుగెత్తి ముందుగ సమాధియొద్దకు చేరెను. అతడు వంగి నారవస్త్రములు అచట పడియుండుటను చూచెను. కాని, లోనికి వెళ్లలేదు. ఆ తరువాత సీమోను పేతురు వచ్చి,  సమాధిలో ప్రవేశించి, అచట పడియున్న నారవస్త్రములను, ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను. ఆ తుండుగుడ్డ నారవస్త్రములతోపాటు కాక, విడిగచుట్టి ఉంచబడెను. సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడ లోనికి వెళ్ళి చూచి నమ్మెను

ధ్యానం:  ఈ రోజు సువార్తకారుడు పునీత యోహాను గారి పండుగను కొనియాడుతున్నాము. ఈ పునీతుని గొప్పతనం, యోహాను సువార్తను చదివినప్పుడు మనకు తెలుస్తుంది. సువార్తను నలుగరు సువిశేషకారులు రాసినప్పటికి యోహాను సువిశేషం ఒక ప్రత్యేకత కలిగిఉన్నాది. యోహాను గారు యేసు ప్రభువు శిష్యులలో ఒకరుగా ఉన్నారు. ప్రతి సువిశేషమునకు ఒక గుర్తు ఉన్నది. యోహాను సువిషమునకు ఉన్న గ్రద్ద గుర్తుగా ఉన్నది. ఎందుకు గ్రద్ద గుర్తుగా ఉన్నది అని ఒక సారి మనం పరిశీలించినట్లయితే, ఒక విషయం మనకు తెలుస్తుంది. అది గ్రద్ద ఆకాశంలో ఎక్కడో విహరిస్తున్నప్పటికి భూమిమీద ఉన్న కీటకాన్ని కాని లేక అది ఏమి పట్టుకోవాలనుకున్నదో దానిని ఖచ్ఛితముగా ఎటువంటి పొరపాటు లేకుండా అది దానిని పట్టుకోగలదు. గ్రద్దకు ఖచ్చితమైన గురి ఉన్నది. యోహాను  సువిశేషంలో మొదటి నుండి యేసు ప్రభువు దేవుడు అనే విషయమును వెల్లడి చెస్తున్నారు. మిగిలిన సువిశేష కారులు యేసు ప్రభువు పుట్టుకతోటి, లేక ఆయన జ్ఞానస్నానంతో మొదలు పెడుతున్నారు. కాని యోహాను మాత్రం తన సువిశేషాన్ని యేసు ప్రభువు ఎలా తండ్రితో కలిసి ఉన్నాడని మరియు ఏవిధముగా ఆయన దేవుడు అనే విషయాన్ని సువిశేషం మొదటి నుండి చెబుతున్నారు. 

యోహాను సువిశేషం, ఎందుకు యోహాను ఈ సువిశేషాన్ని రాశారో తెలియజేస్తుంది.   యోహాను మూడు సార్లు తన సువిశేష ఉద్దేశ్యం ఏమిటి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. సువిశేష మొదటిలో , మధ్యలో మరియు చివరిలో ఎందుకు ఆయన సువిశేషం రాసినది తెలియజేస్తున్నాడు. ఏమిటి ఆ ఉద్దేశ్యం అంటే, యేసు ప్రభువును అందరు విశ్వసించాలి, ఆయనను విశ్వాసించిన వారికి నిత్యజీవం ఇవ్వబడుతుంది అనే విషయాన్ని తెలియజేయడమే ఈ సువిశేష ఉద్దేశ్యం. ఈ సువిశేషం రెండు భాగాలుగా చేసిన మొదటి భాగం 7 అద్భుతాలు యేసు ప్రభువు చేస్తున్నారు. ఈ ఏడు అద్భుతాలు కూడా దేవుడు మాత్రమే చేయగలిగేటువంటి అద్భుతాలు. ఎంతటి గొప్ప వారు అయినప్పటికీ  దేవుడు కాకపోతే ఆయన చేసిన అద్భుతాలు ఎవరు చేయలేరు. యేసు ప్రభువు ఎవరు అనే విషయాన్ని యోహాను సువిశేషకారుడు యేసు ప్రభువు ఇచ్చే అనుగ్రహమును బట్టి తెలియజేస్తున్నాడు.  అవి ఏమిటి అంటే, యేసు ప్రభువు జీవ జలం, యేసు ప్రభువే జగజ్యోతి, యేసు ప్రభువే జీవహారం. యేసు ప్రభువే జీవ వాక్కు.యేసు ప్రభువే తండ్రి వద్దకు మార్గము.  ఈ సువిశేష రెండవ భాగాన్ని మహిమ పుస్తకం అంటారు. ఈ భాగంలో ఎలా యేసు ప్రభువు తండ్రి పవిత్రాత్మలతో కలసి ఉన్నది. మనం ఎలా దేవునితో కలసి ఉండవచ్చు అనే విషయములు కూడా తెలుసుకుంటాము. శిష్యులతో యేసు ప్రభువు ఎటువంటి సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నారు. ఎలా దానిని శిష్యులు పొందవచ్చు అనే విషయం మనం తెలుసుకుంటాము. శిష్యులను ప్రభువు ఎంతలా ప్రేమిస్తున్నారు అనే విషయము కూడా ఈ సువిశేషం ద్వారానే మనం నేర్చుకుంటాము. 

ఎవరు ఈ యోహాను? యేసు ప్రభువు శిష్యులలో ఒకడు. జబదాయి కుమారుడు. ఈయన కడరా భోజన సమయమున యేసు ప్రభువు హృదయమునకు దగ్గరగా ఉన్నాడు. ఆయన  యేసు ప్రభువుకు అంతా దగ్గరగా ఉన్నాడు కనుక దేవుని గురించి ఇతర సువిశేషకారులు తెలుపని విషయాలను వివరిస్తున్నారు. హృదయము దగ్గరగా ఉన్నాడు అంటే ప్రభువు చేత కూడా ఈ శిష్యుడు ప్రేమించబడ్డాడు. అంతేకాదు శిష్యులు అందరు యేసు ప్రభువును బంధించినప్పుడు వెళ్ళి పోయినను ఈ శిష్యుడు మాత్రము ఆయనను ఎవరికి తెలియకుండా అనుసరిస్తున్నాడు. సిలువ క్రింద మరియమాతతో పాటు ఉన్నాడు. అందుకే యేసు ప్రభువు తన తల్లిని తన ప్రియయమైన శిష్యునకు అప్పగించాడు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్దన: ప్రభువా మీరు ప్రేమించిన మీ శిష్యున్ని జ్ఞానంతో నింపారు. కేవలం జ్ఞానంతో నింపటమే కాకుండా దేవుని గురించితెలుకొని నేర్పే వానిగా తీర్చిదిద్దారు. మీ మీరు చేసిన ప్రతి పని మీరు  దేవుడు అని తెలియజేస్తున్నది అని తెలుసుకోలేకపోయాము. మీ శిష్యుడు మిమ్ములను మాత్రమే పరిలించే విధంగా మీరు చేశారు కనుక మిమ్ములను మాత్రమే ధ్యానిస్తూ.మీగురించి నిగూడ సత్యాలను తెలుసకొనుటకు అవకాశం ఇస్తున్నారు. ప్రభువా మీరు చేసిన అధ్భుతాల ద్వారా మీరు దేవుడు అనే విషయాన్ని మాకు తెలియజేస్తున్నారు. అంతె కాక మేము ఏ విధంగా మీతో కలసి ఉండాలో చెబుతున్నారు. మీరు లేకుండా మేము ఏమి చేయలేము అని చెబుతున్నారు. మేము మీతో కలసి ఉండాలి అని కోరుతున్నారు. ప్రభువా! మమ్ములను కూడా మీ ప్రియమైన శిష్యున్ని ప్రేమించినట్లుగానే ప్రేమించండి. మమ్ములను కూడా మీ హృదయమునకు  దగ్గరగా ఉండనివ్వండి. దాని ద్వారా యోహాను వలె మేము కూడా మీ గురించి ఎక్కువగా తెలుసుకొని మీతో ఐక్యం అయ్యేలా మమ్ము దీవించండి. ఆమెన్. 

4, డిసెంబర్ 2025, గురువారం

నిష్కళంక మాత మహోత్సవం ధ్యానం: లూకా 1:26-38 | కార్మెల్ శోభ

 నిష్కళంక మాత మహోత్సవం

లూకా  1:26-38

తదుపరి ఆరవమాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలీయసీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక  యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికివచ్చి, ఆమెతో "అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఎలినవారు నీతో ఉన్నారు" అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలతచెంది ఆ శుభవచనము ఏమిటొ అని ఆలోచించుచుండగా దేవదూత "మరియమ్మా !భయపడకుము. నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో! నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై, మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు, తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు" అనెను. అంతట మరియమ్మ " నేను పురుషుని ఎరుగను కదా! ఈద్ ఎట్లు జరుగును?"  ఆ దూతను ప్రశ్నించేను. అందుకు ఆ దూత ఇట్లనెను: "పవిత్రాత్మ నీవపై వేంచేయును. సర్వోన్నతుని శక్తి నిన్ను అవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు  దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిశబేతమ్మను చూడుము. ఆమెకు వయస్సు  మళ్ళినది గదా! గొడ్రాలైన  ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము. ఏలయన, దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు" అంతట మరియమ్మ "ఇదిగో నేను ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక!" అనెను. అంతట  ఆ దూత వెళ్ళి పోయెను.

ఈరోజు నిష్కళంక మాత మహోత్సవం జరుపుకుంటున్నాము. ఏమిటి ఈ పండుగ అంటే మరియ మాత తన తల్లి గర్భంలో పడినప్పటి నుండి ఎటువంటి పాపం లేకుండ పుట్టింది. మరియమాతలో ఎటువంటి మలినం అనేది లేదు. మరియ మాతను  పాపంలో పడకుండా తన వరప్రసాదాలు ముందుగానే ఇచ్చి తల్లి గర్భంలో పడినప్పటి నుండి పాప రహితురాలుగా ఆమెను చేశాడు అని అర్ధం. 

ఈ ఆలోచన రెండవ శతాబ్దం నుండి తిరిసభలో ఉన్నది. కాని 4 శతాబ్దంలోనే ఒక పండుగలా చేయడం జరుగుతుంది. 1854 9 వ భక్తినాధ పోపు గారు ఈ పండుగను విశ్వవ్యాప్తం చేశారు. ఈ పండుగ మనకు  మరియమాతకు  తల్లి గర్భంలో పడతున్నప్పుడే, యేసు ప్రభువు శిలువ    శ్రమలు ,  మరణం, పునరుత్థానల ఫలితాన్ని ముందుగానే  ఇచ్చి ఆమెలో   జన్మ పాపం లేకుండా ఆమెను రక్షించారు అని భోదిస్తుంది. ఇది ఎలా సాధ్యము అంటే దేవుడు కాలనికి అతీతుడు. ఆయన అలా చేయగలడు. దీని అర్ధం మరియ మాతకు మెస్సీయ్యా అవసరం లేదు అని కాదు. ఆమెకు ఆయన రక్షణ ముందుగానే ఇవ్వబడింది.

పాపం లేకుండా ఎవరైన సృష్టించబడ్డారా? మొదట మానవుడు పాపం లేకుండానే సృష్టించబడ్డాడు. కాని తరువాత సాతాను మాటను స్త్రీ విని పాపం అంతకట్టుకున్నది.  మొదటి స్త్రీ ఏవను,  పడిపోయిన దేవదూత పాపం చేయడానికి ప్రోత్సహించినది. దేవుడు చేయవద్దని చెప్పిన పనిని చేపించి, పాపము చేసేలా చేసింది.  మరియ మాత దగ్గరకు వచ్చిన దేవదూత పడిపోయిన దేవదూత కాదు, గాబ్రియేలు దేవ దూత , ఈ దూత ప దేవున్ని  పూర్తిగా విధేయించిన దేవదూత. పడిపోయిన దేవ దూత వచ్చినప్పుడు దేవున్ని  విధేయించ వద్దు అని ఏవకు చెప్పింది. కాని , గాబ్రియేలు దేవదూత  వచ్చినప్పుడు దేవున్ని నమ్మమని. ఆయన ప్రణాళికకు సహకరించమని చెబుతుంది. మరియ మాత   తన జీవితం మొత్తం అలానే , ఆ ప్రణాళికకు సహకరిస్తూ జీవించినది. అందుకే తిరుసభ పితరులు ఆమెను రెండవ ఏవ అని పిలుస్తారు. దేవుడు మన  తల్లి తండ్రులను గౌరవించమని చెబుతున్నారు. ఇది దేవుని పది ఆజ్ఞలలో నలుగవది. యేసు ప్రభువు తన తల్లిని గౌరవించారు. మనం కూడా ఆమెను అలానే గౌరవించాలి. 

మరియమాతకు ఈ అనుగ్రహం ఇవ్వవలసి అవసరం చాలా ఉంది,  ఎందుకంటే ఈ లోకం రక్షించబడాలి అనేది దేవుని సంకల్పం.  అందుకు దేవుని  కుమారుడు ఈ లోకానికి రావాలి.   ఎప్పుడైతే యేసు ప్రభువు ఈ లోకానికి వస్తారో, ఆ పవిత్రుడను ఎవరు ఆహ్వానించగలరు. కేవలం ఎవరు అయితే  ఏ పాపం లేకుండా ఉంటారో వారు మాత్రమే.  అప్పుడే  ఆయనకు ఏ మలినం అంటకుండా ఉంటుంది.  అంటే ఆయన తల్లిలో ఏ పాపం ఉండకూడదు, ఆమె పవిత్రంగా ఉండాలి.    అప్పుడే అది జరుగుతుంది. కనుక ముందుగానే మరియమాతను , తండ్రి దేవుడు  తన కుమారున్ని  ఈ లోకానికి తీసుకురావడానికి ఆమెలో ఎటువంటి పాపము లేకుండా ఆమెను  సిద్దపరుస్తున్నారు. 

ఆదికాండం 3: 15 లో దేవుడు సర్పముతో " నీకును, స్త్రీకిని, నీ సంతతికిని, ఆమె సంతటికిని మధ్య వైరము కలుగ చేయుదును. ఆమె సంతతి నీ తల చితుకగొట్టును. నీవేమో వాని మడమ కరిచేదవు." అని చెబుతున్నారు. ఇక్కడ సాతానుతో ఈ వైరం ఎప్పుడు ఉంటుంది.  ఒక వేళ మరియ మాతలో  పాపముకాని, లేక  చిన్న మలినం ఉన్న , సాతానుతో సహకరించినది అవుతుంది.  కనుక ఆమెలో ఏ పాపము ఉండకూడదు అందుకే ఆమెను దేవుడు జన్మ పాపము లేకుండా చేస్తున్నాడు. ఇవి అన్ని కూడా ఆమె కొరకు కాదు,  ఆమె ద్వారా ఈ లోకానికి వస్తున్నటువంటి తన కుమారుడు , పవిత్రుడు.  ఆ పవిత్రుడు ఈ లోకములోనికి రావాలి అంటే,  ఆయనను తీసుకు వచ్చే స్త్రీ కూడా పవిత్రురాలుగానే ఉండాలి. అపవిత్రతో ఈ ప్రభువును ముట్టుకొనుట అసాధ్యము. అపవిత్రంగా  దివ్య మందసాన్ని తాకుతున్న వారు చనిపోతున్నారు. ప్రభువును ఈ లోకానికి తీసుకువచ్చే తల్లి పవిత్రంగా ఉండాలి కనుక ప్రభువు ఆమెను ఎటువంటి మలినం అంటకుండా చేస్తున్నారు. 

మరియమాత జన్మపాపం లేకుండా జన్మించడం. ఆమె గొప్పతనం ఏమికాదు . ఆమె ఔన్నత్యము తరువాత ఆమె జీవించిన విధానం తెలుపుతుంది. తన జీవితాన్ని మొత్తాన్ని దేవునికి అర్పించినది. దేవుని దాసురాలిగా జీవించింది. ప్రభువును ధ్యానిస్తూ జీవించింది. తరువాత కూడా ఏ పాపము లేకుండ జీవించింది ఇక్కడ ఆమె ఔన్నత్యం తెలుస్తుంది. 


3, డిసెంబర్ 2025, బుధవారం

క్రీస్మస్ పండగ అర్థం | Christmas Telugu | యేసు జన్మ | Carmel Shobha

 యేసు క్రీస్తు జనన మహోత్సవం


లూకా 2:1-14 

తన సామ్రాజ్యమునందు జనాభా లెక్కలు సేకరింపవలెనని అగుస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను. అందులో పేర్లు వ్రాయించు కొనుటకు ప్రజలందరు తమ తమ పట్టణములకు వెళ్లిరి. యోసేపు , దావీదు వంశస్తుడైనందున గలిలీయ సీమలోని నజరేతు నుండి యూదయ సీమలో ఉన్న దావీదు పట్టణమగు బేత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకొనుటకై తనకు నిశ్చితార్ధము చేయబడిన , గర్భవతియునైన మరియమ్మను కూడా వెంటపెట్టుకొని వెళ్లెను. వారచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండ బెట్టెను. ఏలయన వారికి సత్రములో చోటు లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో గొర్రెల మందలను కాయుచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రతక్షమాయెను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయ భ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనెను: "మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు, ప్రభువు. శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుటమీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు" అనెను. 

దేవదూతల సందేశం : శాంతి సమాధానం మరియు ఆనందం 

 ఒక తార వెలసింది- భువి అంత వెలుగునింపింది. దేవుని మానవున్ని మధ్య సంబందం చిగురింపచేసింది. మానవుడు ఎల్లప్పుడూ  ఆనందంగా ఉండాలని కోరి, మానవ వికాసాన్ని పెంపొందేలా చేసిన పండుగ క్రీస్తు జననం.   నిజమైన సంతోషము సమాధానంకు చిరునామా క్రీస్తు జననం. ఒకరిని హింసించడం లేక మరణానికి గురిచేయడం కాకుండా కాపాడటానికి నాంది పలికేది ఈ పండుగ. దేవుడు మానవునితో ఉండాలని, మానవ స్వభావాన్ని పావనం చేయాడానికి దేవుడు చేసిన గొప్ప కార్యం ఈ క్రీస్తు   జన్మ దినము.  దేవుడే మానవునితో కలిసి జీవించడానికి రావడమే ఈ పండుగ. ప్రతి ఒక్కరు చిన్న, పెద్ద, పేదవాడు, ధనికుడు,  అనే తారతమ్యం లేకుండా కలిసి జీవించేందుకు నాంది ఈ పండుగ.  మానవున్నీ దేవుని కుమారునిగా చేసేది, దానికి మార్గం సుగమం చేయడమే క్రీస్తు జనన ఉద్దేశం. యేసు ప్రభువుని జననం, ప్రతి ఒక్కరికి శాంతి సమాధానము అనే సందేశమును మొదటిగా తెలుపుతుంది. దేవదూతలు ఈ వార్తను గొర్రెల కాపరులకు వినిపిస్తున్నారు. గొర్రెల కాపరులకు  ఆనాటి సమాజంలో ఎటువంటి శుభకార్యానికి ఆహ్వానము వీరికి ఉండదు. వీరిని దొంగలుగా చూసేవారు, అటువంటి వారికి శుభ వచనము, దేవుని రాక గురించి చెప్పడం ద్వార యేసు ప్రభువు జననము సమాజంలో అసమానతలను అనుభవించేవారికి, వారికి సమానత్వమును,  ఆనందం ఇచ్చే పండుగ అని తెలుస్తుంది.  

దేవుడు మానవుడు అగుట 

 యోహాను సువిశేషము మొదటి అధ్యాయం 12,  వచనంలో  దేవుడు ఎలా మనతో ఉండుటటకు ఇష్ట పడుతున్నాడు అని చదువుతాం. "అయన  ఈ లోకమున ఉండెను అయన మూలమున  ఈ లోకము సృజింపబడెను. అయినను లోకము ఆయనను తెలిసికొన లేదు. అయన తన వారి వద్దకు వచ్చెను తన వారే ఆయనను అంగీకరింపలేదు. "  యేసు ప్రభువు ఈ తన తండ్రి వద్దనుండి పరలోకం నుండి భూలోకమునకు వచ్చినది మనతో ఉండటానికి.  మానవునిలా జీవించడం, మానవుని కష్టాలు భరించడం దేవునికి ఏమి తెలుసు అనుకుంటూ ఉండేవారిని చూస్తూనే ఉంటాము. కాని యేసు ప్రభువు పరలోకం వదలి భూమి మీదకు ఒక సాధారణ వ్యక్తి వలె వచ్చి, మన మధ్య జీవించారు. మానవుడు పొందే అన్ని బాధలు కష్టాలు అనుభవిస్తున్నారు. దీనిద్వారా ఈ మానవ జీవితాన్ని పావనం చేస్తున్నారు. మానవున్ని దైవ పుత్రత్వం కలిగి ఉండేలా చేసుంది. 

దేవుని ఉదారత 

"ఆయనను అంగీకరించి, విశ్వసించిన వారందరికి అయన దేవుని బిడ్డలగు భాగ్యమును ప్రసాదించెను. ఈ దైవ పుత్రత్వము వారికి దేవుని వలన కలిగినదే కానీ , రక్తము వలన కాని శరీరేచ్ఛవలన కాని మానవ సంకల్పము వలన గాని కలిగినది కాదు." క్రీస్తు జననం మనకు ఏమి ఇస్తుంది. యేసు ప్రభువు లేక దేవుడు మానవునిగా మానవు రూపంలో ఈలోకంలో పుట్టుట ద్వారా మన మానవ జీవితాన్ని పవిత్ర మొనర్చడామె కాకుండా దాన్ని దైవీకం చేస్తున్నాడు. దీనిద్వారా దేవుడు తనను తాను మనకు అర్పించుకుంటున్నాడు. దేవుడు మన మధ్యకు వచ్చి నివసించి మనకు దైవ ఔన్నత్యన్నీ చూపిస్తున్నాడు. మనము ఎంత గొప్పగా జీవించ వచ్చు అనేది నేర్పుతున్నారు.   దీనినే మనం యోహాను సువిశేషం మొదటి అధ్యాయం 12 వ వచనములో చూస్తున్నాము. దేవుడు తనని తాను, మనకు ఒక బహుమానంగా ఇస్తున్నాడు. ఆయనను స్వీకరించే వారు దానికి సిద్ధముగా ఉండాలి. ఇది దేవుడు మననుండి ఏమి ఆశించకుండా మనకు ఒక బహుమానంగా ఇస్తున్నాడు. దీనిని మనము నేర్చుకోవాలి. 

మానవ స్వభావం - దైవ స్వభావంగా మారుటకు నాంది 

ఏ విధంగా యేసు ప్రభువు ఈ మానవ జీవితాన్ని దైవికం చేస్తున్నాడు అంటే మొదటిగా తాను ఈ లోకంలో మానవునిగా పుట్టుట ద్వారా ఆయన మానవ స్వభావాన్ని పంచుకోవాడమే కాకుండా దానికి మరియొక లక్షణాన్ని ఇస్తున్నాడు. అది ఏమిటి అంటే దైవత్వం కలిగిఉండేలా చేయడం.  ఇది చేయడం వలన ప్రతి వ్యక్తి కేవలం మానవునిగా మాత్రమే కాక ఈ మానవ స్వభావాన్ని దైవికంగా మార్చుకోవడానికి నాంది పలకడం జరిగింది. ప్రతి మానవ భావాన్ని , లక్షణాన్ని దైవికం చేసే అవకాశం మనకు కూడా ఇస్తున్నాడు. 

పరలోక వాణి 

క్రీస్తు జననం - ప్రతి ఘడియ పరలోక వాణి  అని తెలియజేస్తుంది. ఏమిటి పరలోక వాణి  అంటే యిస్రాయేలు ప్రజలు పరలోకానికి భూమికి మద్య ఒక ఎడబాటు ఉంది అని విశ్వసించేవారు. ఈ ఎడబాటు ఎప్పుడు అయితే పరలోక వాణి వినపడుతున్నదో అప్పుడు తీసివేయబడుతుంది అని వారు నమ్మేవారు. ఈ ఎడబాటు తీసివేయడం అంటే పరలోకం మరియు భూమి ఏకమవుతున్నవి అని అర్ధం, అంటే దేవుడు మానవుని దగ్గరకు వచ్చాడు అని అర్ధం. యేసు ప్రభువుని జననంతో ఈ పరలోక వాణి ప్రతి నిత్యం, మానవుడు పొందే భాగ్యం పొందాడు అని అర్ధం. మొదటి మానవునితో కలిసి నడిచిన దేవుడు మరల ఇప్పుడు ప్రతి మానవునికి దేవునితో  కలిసి జీవించడానికి అవకాశం ఇస్తున్నాడు.

దేవుని యొక్క సంపూర్ణత తెలుసుకొనే అవకాశం 

 దేవుడు మనుష్య రూపేణా అంటే అది  కేవలం యేసు ప్రభువు మాత్రమే అవుతారు,  ఎందుకంటే మనం ఆయన జీవితంలో ఎటువంటి అపరిపక్వత లేక అసంపూర్ణం అనేది చూడం.  ఈలోకములోని  ఎంతటి గొప్ప వ్యక్తి అయిన కాని అతనిలో  ఏదో ఒక అసంపూర్ణత మనం చూస్తూనే ఉంటాము. యేసు ప్రభువు జననము దేవుని సంపూర్ణతను తెలుసుకొనేలా చేస్తుంది. అంతే కాక ఆయన పరిపూర్ణతలో మనము భాగము ఎలా పొందలో తెలుసుకొని మార్గమునకు అంకురార్పణ జరిగినది ఈ రోజు. కనుక మనకు దేవుని సంపూర్ణతను తెలుసుకోవటమే కాక దేవుని కలుసుకొనే అవకాశం పొందటం జరుగుతుంది. దేవున్ని అనుభవించడం, కలుసుకోవడం అనేక విధాలుగా మనం బైబుల్లో చూస్తాము. మోషే మండుతున్న పొదలో దేవున్ని కలుసుకోవడం, దివ్య మందసంలో దేవున్ని కలుసుకోవడం ఇవన్నీ ఒక భాగం కాని క్రీస్తు పుట్టుక వీటన్నింటికన్నా  పరిపూర్ణత సంతరించుకున్నది. కనుక మానవుడు దేవుని పరిపూర్ణతను యేసు క్రీస్తు ద్వారా తెలుసుకుంటున్నాడు. 

యేసు జననం దేవుని ప్రణాళికా ప్రకటన 

మానవునికి సంభందించి దేవుడు ఎలా ఉంటాడు, ఆయన ప్రణాళికా ఏమిటి? మానవునితో కలసి ఉండుటకు దేవుడు సిద్ధంగా ఉంటాడా? మానవునికి దేవునికి మధ్య తెగిపోయిన సంబంధమును దేవుడు బాగుచేయుటకు సిద్ధంగా ఉన్నాడని తెలియచేస్తుంది, యేసు ప్రభువు జననం. అంతే కాదు, తెగిపోయిన  దైవ-మానవ సంబంధం సరిచేయడం మరియు మానవుని రక్షణకు పరిపూర్ణ అంకురార్పణ జరిగింది అని తెలియజేస్తుంది. దేవుడు మనతో ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు అని చెబుతున్నాడు. 

 దేవుడు ఇచ్చే పాప క్షమాపణ -  చూపే పరి పూర్ణ ప్రేమను సంపూర్తిగా అర్ధం చేసుకునే మార్గం సుగమమం 

దేవుని ప్రేమ మానవుడు పరిపూర్ణంగా తెలుసుకునే మార్గం మనకు తెలిసేది కేవలం యేసు ప్రభువు ద్వారానే. ఎందుకంటే ఆయనే దేవుని ప్రేమను సంపూర్ణముగా మనకు తెలియజేయడం జరిగినది. ఎంతో మంది దేవుని ప్రేమ గురించి దేవుడు క్షమించే విధం గురించి చెప్పిన యేసు ప్రభువు వలె ఎవరు అంత పరిపూర్ణంగా ఆ ప్రేమను కాని, దేవుని క్షమాపణ గురించి ఎవరు యేసు ప్రభువులా చెప్పలేదు. అందుకే ఈ రోజు దేవుని ప్రేమ క్షమాపణ పూర్తిగా తెలుసుకోవడానికి అంకురార్పణ జరిగిన రోజు ఇది. కనుక ఈ మానవ స్వభావాన్ని దేవుని అనుగ్రహంతో పావనము చేయుటకు ప్రయత్నించుదాం.  ఆమెన్ 

Fr. Amruth


2, డిసెంబర్ 2025, మంగళవారం

నిత్య జీవము - ధనిక యువకుని వృత్తాంతం: మార్కు 10:17-30 | కార్మెల్ శోభ

 28 వ సామాన్య ఆదివారం 

సిరా 7:7-11, హెబ్రీ 4:12-13, మార్కు 10:17-30

ప్రియ మిత్రులారా గత ఆదివారం పరిసయ్యులు యేసు ప్రభువును విడాకుల గురించి ప్రశ్నించారు. ఈ రోజు ఒక యువకుడు యేసు ప్రభువును నిత్య జీవం పొందుటకు ఏమీ చేయాలి అని అడుగుతున్నాడు. యేసు ప్రభువు దైవ ఆజ్ఞలు పాటించమని చెప్పారు. ఆ యువకుడు నేను చిన్నప్పటి నుండి వాటిని పాటిస్తున్నానని   చెప్పుతున్నాడు. యేసు ప్రభువు దానికి నీవు చేయవలసి నది ఇంకొక్కటి ఉంది, నీకు ఉన్నదంతా అమ్మి,  పేదలకు  ఇచ్చి వచ్చి నన్ను అనుసరించు అని చెప్పారు. దానికి ఆ  యువకుడు నిరాశతో వెళ్ళిపోతున్నారు.  ఎందుకంటే అతనికి చాలా  సంపద, ఆస్తులు ఉన్నాయి వాటిని కోల్పోవడానికి సిద్దముగా లేడు. 

ఎందుకు ఆ యువకుడు యేసు ప్రభువును అనుసరించడానికి రాలేదు

పునరుత్థానము మీద ఆనాటి రోజులలో చాలా తక్కువ మందిలో  నమ్మకము ఉండేది.  పరిసయ్యులు పునరుత్థానము ఉంది అని భోదించేవారు. కానీ సద్దుకయ్యులు నమ్మేవారు కాదు.  యేసు ప్రభువు అందరికీ అంతిమ తీర్పు ఉందని విశ్వాసులకు నిత్య జీవం ఉందని బోధించారు. యేసు ప్రభువు బోధనలు  వారిలో నిత్య జీవానికి ఒక ఆశను రేకెత్తించాయి. ఆ కాలములో అందరూ దీనిని నమ్మలేదు, నిత్య జీవం ఉంటే మంచిది , నాకు దేవుడు ఇస్తే దానిని తీసుకోవడానికి సిద్దమే కాని దాని కోసము ఇప్పుడు ఉన్న ఏ ఆనందాన్ని  వదులుకోవడానికి సిద్దముగా లేను.

నిత్య జీవము పొందడానికి నేను ఏమీ చేయాలి అడిగినప్పుడు నీకు ఉన్నదంతయు  వదలి వేయాలనే  సవాలు తీసుకోవడానికి వెనకాడుతున్నాడు. ఈ యువకునికి నిత్య జీవము కావాలని ఉంది కాని  తన ఆస్తిని విడిచి వుండటానికి అతనికి ఇష్టం లేదు, తనకు ఉన్న ఆస్తి ఒక ఆశ్రయం అవుతుంది, బలం అవుతుంది, అనుకుంటున్నాడు.   తనకున్న ఆధారాన్ని వదలివేయడానికి అతనికి ఇష్టం లేదు.

ధర్మ శాస్త్ర బోధనలకు  అనుకూలముగా జీవించిన ఒక యువకుడు యేసు ప్రభువును అనుసరించలేక పోతున్నాడు. ఎందుకు  అంటే మనము పరిశుద్ద గ్రంధములో వినినట్లు , దేవుడే నా ఆశ్రయ  దుర్గము, నా కోట , లేక నా కొండయు ఆయనే అనే మాటలు, అన్నీ ఆపదలనుండి నన్ను కాపాడు వాడు దేవుడే అని మనము చెప్పుతుంటాము.  కానీ నిజానికి మన ఆధారం , ఆశ్రయము అన్నీ డబ్బే అని మనము జీవిస్తున్నాము.  అదే ఈ యువకుడు కూడా చేస్తున్నాడు. నేను అన్నీ చిన్నప్పటి నుండి చేస్తున్నాను అని చెప్పుతున్నప్పటికీ తన ఆశ్రయం, ఆధారం , అన్నీ డబ్బే అన్నట్లుగా జీవిస్తున్నాడు.  

ప్రపంచంలో ప్రజలు   సంపదను వారికి ఆసరా అనుకుంటారు. వారి ముఖ్యమైన పని ఆది సంపాదించడం అదే వారిని రక్షిస్తుంది అని వారు నమ్ముతారు. మనకు తెలుసు ఎంత సంపద ఉన్న మనలను అది కాపాడలేదు అని మనం ఈరోజుల్లో ఎక్కువగా దానిని చూస్తున్నాము. కరోనా సమయములో సంపదలు కాపాడలేకపోయాయి. కానీ ఇంకా దానికోసమే పరుగెడుతుంటాము. నీ ఆశ్రయం, నీ అండ , నీ ఆసరా దేవుడు అయితే యేసు ప్రభువును అనుసరించటము తేలికవుతుంది. లేక పోతే యువకునిలా వెనక్కు వెళ్లిపోతాము.

నిత్య జీవం పొందటము ఎందుకు కష్టము

యేసు ప్రభువు ధనిక యువకుడిని నిత్య జీవం పొందడానికి ఆ యువకుని లో ఉన్న లోపం గుర్తిస్తూ   రెండు షరతులను పెడుతున్నారు, మొదటగా తన ఆస్తులను తనకున్నదంత వదిలివేయాలని అంటున్నారు,  అనేకమంది క్రైస్తవులు ఈ పని చేసి వారికి యేసు మీద ఉన్న ప్రేమ చూపించారు.  రెండవ షరతు నన్ను అనుసరించు అని అంటున్నారు. యేసు ప్రభువు ఆ యువకుడిని  తన శిష్యుడుగా కావాలనుకున్నాడు.  కానీ  ఆ యువకుడు బాధతో, నిరాశతో వెళ్లిపోతున్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి మొత్తము వదలి యేసును అనుసరిస్తారో అప్పుడు అతడు యేసు శిష్యునిగా ఉండటానికి తగిన వాడు  అవుతాడు, తనకు తెలియకుండానే యేసు క్రీస్తు పనిలో పాలుపంచుకుంటాడు.  శిష్యులకు యేసు ప్రభువు దీని గురించి వివరిస్తూ ధనవంతులకు దేవుని రాజ్యములోనికి ప్రవేశించడానికి ఎదురయ్యే సవాళ్లు గురించి చెప్పారు.  ధనవంతునికి పరలోక రాజ్యములో ప్రవేశించుట ఎంత కష్టము? అని యేసు ప్రభువు అనగానే శిష్యులు అంటున్నారు ఇంకా ఎవరు ప్రవేశించగలరు? అందుకే యేసు ప్రభువు చెప్పుతున్నారు మానవులకు   అది అసాధ్యము కానీ దేవునికి సాధ్యము ఎందుకంటే అది ఇచ్చేది  దేవుడు. నీ సంపదలతో దానిని నీవు కొనలేవు. మానవుని ప్రయత్నాలు ఏవి కూడా ఆయనకు నిత్య జీవాన్ని  తీసుకురాలేవు. కేవలము  అది దేవుని వరమే. ఎందుకు పర లోక రాజ్యములో ప్రవేశించుట కష్టము అంటే ధనవంతుడు తన సంపద తనకు అన్నీ సమకూరుస్తుంది అని దేవుని ఆజ్ఞలను పాటించక సంపద లోనే తన సర్వాన్ని చూసుకుంటాడు, వాటిని తన ప్రాణా ప్రాయంగా చూసుకుంటాడు, కొన్ని సార్లు వాటి వలనే తనకు విలువ ఉంటుంది అనుకుంటాడు, సంపదల వలన కొన్ని సార్లు ఎవరిని లెక్క చేయడు , దేవునికి దూరమవుతాడు, మనము పవిత్ర గ్రంధములో చూసే, నాబాలు, ధనవంతుడు లాజరు, కథలో ధనవంతుడు  ఈ కోవకు చెందినవారే. కానీ కొంతమంది తనకు దేవుడు ఇచ్చిన సంపదను మంచిగా వాడుకొని దేవుని మీద ఆధారపడి జీవించేవారు ఉన్నారు.

ఆదిమ క్రైస్తవులు ఏ విధముగా సంపదలను ఆస్తులను పరిగణించారు

 ఆదిమ క్రైస్తవులు  సంపదలను ఏ విధముగా చూసేవారో మనము కూడా అలానే సంపదలను చూడగలిగామా ?  ఒకసారి ఆలోచించండి. వారు ఆస్తులు పెంచుకోవాలి అనుకోకుండా పంచుకోవాలి అని అనుకున్నారు అపోస్తుల కార్యాలలో మనము ఇది చూస్తున్నాము. మనము కూడా దీనిని ఆదర్శము గా తీసుకోవాలి.  వారిలో ఒకరు పెద్ద ఒకరు చిన్న ఏమీ లేరు, వారిలో బలహీనులను వారు ఆదరముతో చూసేవారు.

 ఎందుకు మనం సంపదలను కోరుకుంటున్నాము - మానవుని కి ఏమీ కావాలి

ఈనాటి మొదటి పఠనములో సోలోమోను జ్ఞానము కోసము అడుగుతున్నాడు. దేవుడు చాలా సంతోషించాడు, సోలోమోనును చూసి  ఎందుకంటే ఆయన ఆస్తులకోసం అడగక ప్రజలను పాలించడానికి కావలసిన జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతున్నాడు.  విచక్షణ,  జ్ఞానం అనే వరాలను మనము అడగాలి, అంతేకానీ డబ్బు ,సంపద ,పేరు, అధికారం లౌకిక అందలాలను మనము అడగకూడదు, మనకు కావాల్సిన వాటి కోసము మనము దేవుడని అడుగవచ్చు. కానీ ముఖ్యమైనది ఏమిటి అంటే జ్ఞానము, దానిని అడగాలి.


మనసు ఏ విధముగా ఉంది ఎంత నిర్మలముగా ఉంది


రెండవ పఠనములో హెబ్రీయులకి రాయబడిన లేఖలో ఇటువంటి ఒక వాదనను మనము చూస్తున్నాము. దేవుని వాక్కు మన హృదయాంతరంగాలు తెలుసుకోగలదని చెప్పుతుంది. అంటే మన హృదయంలో ఉన్న వాటిని శుద్ది చేసి  మంచి ఆలోచనలు కలిగేలా ఆయన చేయగలడు. ఈనాటి సువిశేషము నిజమైన ధనవంతుడు ఎవడూ అంటే కేవలము దైవ జ్ఞానము కల వాడు అని నేర్పుతుంది, ఈలోక సంపదలు ఈ జ్ఞానాన్ని పొందటానికి అవి  ఆటంకముగా ఉన్నాయి. 


సంపదల మీద గల ప్రేమ వలన ఏమి కోల్పోతున్నాము

ఆ యువకుడు తన సంపదల మీదే ఎనలేని ప్రేమను పెంచుకున్నాడు. అతనికి ఉన్న సమస్య మొత్తము కూడా ఒకటే తన సంపదలు. ఈ లౌకిక  విషయాలు లేక వస్తువులు మనల్ని నిత్య జీవితం నుండి దూరం చేయడాన్ని మనము అంగీకరించకూడదు. ఈ ప్రాపంచక వస్తువులు, ఆస్తులు సంపదల మీద మనకు ఉన్న ప్రేమ మనము యేసు  ప్రభువుని అనుసరించడానికి అనేక సార్లు ఆటంకముగా  ఉంటున్నాయి. సంపదల మీద అమితమైన  ప్రేమ కలిగి ఉంటే అప్పుడు దేవుని నుండి  దూరం కావడానికి మనము సిద్దపడుతున్నాము అని గుర్తుంచుకోవాలి.

యేసు ప్రభువు తన ప్రాణాన్ని అడగలేదు, కేవలము తన ఆస్తిని కోల్పోవడానికి సిద్దపడమన్నాడు. కానీ నేను అమితముగా అభిమానించే ఆస్తిని నేను కోల్పోవడానికి సిద్దముగా లేను. చివరికి అది నాకు నిత్య జీవితమును ఇచ్చినా కానీ, అంటే సంపదల మీద ప్రేమ వలన నిత్య జీవితాన్ని కూడా వదులుకుంటున్నాం. ఇటు వంటి ఆలోచనలు మనలో కూడా ఉన్నాయి. ఇక్కడ ఆస్తి , సంపద  అనేది ప్రశ్న కాదు. నీవు  క్రీస్తుని అనుసరించడానికి ఏమీ నీకు  అడ్డముగా ఉన్నదో దానిని వదలిపెట్టడానికి  నీవు  సిద్దముగా ఉన్నావా  లేదా అనేది  ముఖ్యం. మనకు కూడా అనేక సార్లు ఈ నిత్య  జీవం కావాలి అని ఉంది కానీ నాకు ఇష్టమైన దానిని ఈ నిత్య  జీవము కోసము కోల్పోవడానికి నేను సిద్దం కావడము లేదు. నిత్య జీవితం కావాలనే కోరిక సన్నగిల్లి పోతుంది.  ప్రయోజనము లేని సంపదను ఉంచుకుంటున్నాము క్రీస్తుని పోగొట్టుకుంటున్నాము మనకు ఇష్టమయిన దాని కోసము. నిరాశ లో బాధలో కుమిలిపోతున్నాము.

సంపద అనేది మానవుని కి ఉన్న ఒక బలహీనత. ఇక్కడ  యేసు ప్రభువు మనలను పేద వారిగా ఉండటానికి పిలవటము లేదు ఆయన అనుచరులుగా ఉండటానికి పిలుస్తున్నాడు, ఆయన శిష్యులుగా ఉండటానికి పిలుస్తున్నాడు. వచ్చి నన్ను అనుసరించు అంటున్నారు. యువకుడు సంపద యేసు  ప్రభువు కన్నా  గొప్పది కాదు  అనే సత్యాన్ని తెలుసుకోవాలి. పునీత శిలువ యోహను గారు యేసు ప్రభువుని  పొందటం కోసం సమస్తాన్ని నేను కోల్పోవాలి అంటారు. నీవు క్రీస్తుని కలిగి ఉంటే సమస్తం నీకు ఉన్నట్లే కనుక క్రీస్తు కోసము ఏమైనా  ఆనందముగా చేయడానికి సిద్దంగా ఉండాలి. ఆమెన్   

1, డిసెంబర్ 2025, సోమవారం

గొప్పతనానికి మార్గం: 29 వ సామాన్య ఆదివారం దైవ సందేశం - carmel shobha

 29 వ సామాన్య ఆదివారం

(యెషయా 53:10-11, హెబ్రీ 4:14-16, మార్కు 10:35-45 )

ప్రియ సహోదరులారా ఈనాటి సువిశేషము మరియు పఠనాలు ఒక వ్యక్తి గొప్ప వానిగా ఎదగాలంటే ఏమీ చేయాలి అని చెబుతున్నాయి .  లోక పోకడలను బట్టి కాక దేవుని దృష్టిలో గొప్పతనం ఏమిటని మనం తెలుసుకుంటున్నాంమొదటి పఠనం యెషయా ప్రవక్త బాధామయ సేవకుడు ఏవిధంగా అనేక కష్టాలను  అనుభవించి తన జీవితాన్ని అనేక మంది రక్షణకు కారకుడు అవుతాడు అని  తెలియచేస్తుంది.

ప్రవక్తలు ఎందుకు  కష్టాలను అనుభవించారు

  ప్రవక్తల జీవితాలు  విధముగా  యిస్రాయేలు  ప్రజలను దేవుని వైపు నడుపాయొ మనకు  తెలుసుమోషే ఎన్నో  కష్టాలు అనుభవించారు దేవుని ప్రజలను నాయకునిగా నడపడానికి,అయినకానీ, ప్రజలు ఆయన మీద తిరగబడుతున్నారుయెషయా  ప్రవక్త అనేక కష్టాలు  పడుతున్నారు. యిర్మీయా ప్రవక్త  నేను నా ముఖమును  చెకుముకి రాయి వలె చేసుకుంటిని అని అంటున్నాడు కష్టాలు పడటము ద్వార వారికి వచ్చే లాభం ఏమి లేదుమరి ఎందుకు వీరు ఇన్ని కష్టాలు పడుతున్నారుమొదటిగా దేవుని మీద వారికి గల ప్రేమ వలన,  మరల తమ  ప్రజలు ఆనందమైన జీవితం జీవించాలనిఆమోసు ప్రవక్త  నేను పొట్ట కూటి కోసం  దేవుని వాక్కు  ప్రకటించుట లేదు అని అమాస్య తో చెప్పారుఎందుకంటే వారు  దేవునికి తగిన విధముగా  జీవించకుండా వారికి ఇష్టమైన రీతిలో జీవిస్తూ నిజమైన ఆనందాన్ని కోల్పోతున్నారు. ప్రవక్తల జీవితాల ద్వారా వారు తమ ప్రజలకోసం అన్నీ కష్టాలు అనుభవించడానికైనా సిద్దంగా ఉన్నారు అని మనం తెలుసుకుంటున్నాంవీరు కష్టాలుబాదలు వేరే వారిని ఆనందమైన జీవితం జీవించేలా చేస్తున్నాయిప్రజలు అంత తెలివి గల వారు కారుచాలా సార్లు అనేక మోసాలకుస్వల్ప ఆనందాలకు జీవితాలను నాశనం చేసుకుంటున్నారువారిని కాపాడటానికి ప్రవక్తలు బాదలు అనుభవించారుఇది ప్రవక్తల గొప్పతనంవారు దీని ద్వార ఎటువంటి లాభాన్ని ఆశించలేదుపొందనూ లేదు.

గొప్పవారు ఎలా ఉంటారు

 లోకములో గొప్పవారికి,  దేవుని దృష్టిలో గొప్పవారికి గల వ్యత్యాసం గురించి  యేసు ప్రభువు  విధంగా అంటున్నారు.  అన్య జనుల రాజులు  వారిపై అధికారం చెలాయింతురువారి అధికారులు ఉపకారులు అని పిలవబడుతున్నారుకానీ మీరు అటుల చేయవలదుమీలో గొప్పవాడు చిన్న వానివలెనునాయకుడు సేవకునివలె ఉండాలి అని చెబుతున్నారులూకా 22:25,26. యేసు ప్రభువుమనుష్య కుమారుడు సేవించడానికే కానీ సేవించబడటానికి రాలేదు అని చెబుతున్నారు. మార్కు 10:45. గొప్ప వ్యక్తి ఎప్పుడు కూడా ఇతరులకు, అల్పులకు  ప్రాముఖ్యతను ఇస్తారుమనకు ఉన్న బహుమానాలుఅవార్డులుడబ్బులుఆస్తుల ద్వార మనం గొప్పవాళ్లు కాము దేవుని దృష్టి లో  గొప్పతనం మన ప్రవర్తన మీద  ఆధారపడి ఉంటుందిమనము ఎంత  సేవ చేయడానికి సిద్ధముగా ఉన్నాము, అనే దానిమీద ఆధారపడి ఉంటుంది.

శిష్యులు ఎందుకు ప్రత్యేక స్థానాలు అడుగుతున్నారు

యాకోబు యోహనులు యేసు ప్రభువుని ఒక కోరిక కోరుతున్నారు, మార్కు 10:37 మీరు మీ రాజ్యములో మహిమాన్విత సింహాసనముపై ఆసీనులైనప్పుడు మమ్ము మీ కుడిఎడమల కూర్చుండ అనుగ్రహింపుడు అని అడుగుతున్నారు యేసు ప్రభువు రూపాంతరీకరణ జరిగినప్పుడు ఆయనతో పేతురు,యోహను ,యాకోబులు ఉన్నారువారికి తెలుసు అది ఎంత గొప్పగా ఉన్నది అనిమత్తయి 19 అధ్యాయము 28 వచనములో మనము చూస్తాము మనుష్య  కుమారుడు తన సింహాసనము మీద కూర్చుండినప్పుడు మీరు కూడా 12 సింహాసనముల మీద కూర్చుంటారు అని చెప్పారుకానీ శిష్యులు దానిని  లోక అధికారములాంటిది అని అనుకుంటున్నారుఅందుకే ప్రభువు  పరలోక భూలోక అధికార వ్యత్యాసం గురించి చెబుతున్నారు లోకములో ఉన్న  పాలకులువేరే వారి మీద అధికారం చూపించడానికి , పెత్తనం చేయించడానికి చూస్తారు, కానీ మీరు అలా కాకుండా సేవ చేయటానికి ముందు ఉండాలి అని చెబుతున్నారుఅది అర్దము కానీ శిష్యులు పరలోకం  కూడా ఈ లోక సింహాసనం లాంటిది అనుకుంటున్నారువారికి కావలసినది లోక  సింహాసనాలుఅంతే కానీ పరలోక విధానము తెలిసి కాదు వారు అడిగేదిత్వరగా వారు అందరి చేత గొప్ప వారిగా పరిగణించబడాలి అని మాత్రమే అనుకుంటున్నారు.

యేసు ప్రభువు ఎటువంటి బలి అవుతున్నారు

 యోహను యాకోబులు అడిగిన దానికిమీరు ఏమి కోరుతున్నారో మీరు ఎరుగరునేను పానము చేయు పాత్రమునుండి  మీరు పానము చేయగలరానేను పొందబోవు బాప్తిస్మమును మీరును పొందగలరాఅంటున్నారుఏమిటి  పాన పాత్ర ? పాన పాత్ర అంటే చాలా శ్రమలుతో కూడిన జీవితముయెషయా 51:17  నీవు ప్రభువు కోపము అను పాత్రము నుండి  పానీయము త్రాగి పడిపోతివి అంటున్నారుకొన్ని సార్లు దీనిని ప్రవక్తల పాత్రము అంటారు. పాత్ర ఒక సంజ్ఞ గా ఉండేది ప్రవక్తలకు వారి గమ్యం తెలియ చేస్తూ ఉంటుంది పాన పాత్రంవారి గమ్యం  కష్టాలతో కూడుకొని ఉంటుంది ఇది  వారు పొందిన బాధలు  తెలియచేస్తుందిదేవుని కోపాన్ని తెలియచేస్తుందిఅంటే దేవునికి అయిష్టమైనదానిని తీసివేయడానికి పూనుకోవాలిప్రవక్తలు పొందిన కష్టాలు దేవునికి అయిష్టమైనదానిని తీసివేయడానికే  యేసు ప్రభువుమత్తయి  26 లో  పాత్రనునానుండి తీసి వేయమని అడుగుతున్నారు, అంటే అది చాలా  కష్టాలతో కుడినదిదానికి భరించడానికి మనము చాలా కష్ట పడాలియేసు ప్రభువు  బాప్తిస్మము  గురించి  చెప్పుతున్నారుఇక్కడ మనము తీసుకునే బాప్తిస్మము  గురించి కాదు కానీ చాలా కష్టముతో కూడిన శ్రమలలో  తీసుకునే బాప్తిస్మము  గురించి చెప్పుతున్నారుయేసు ప్రభువు జ్ఞానస్నానం  యొర్ధాను నదిలో మొదలై  గెత్సమని తోటలో ముగుస్తుంది.  తన తండ్రి చిత్తానికి తలవంచి శ్రమల పాన పాత్రను అంగీకరించాడు యేసు ప్రభువు.

క్రీస్తు ప్రభువుదైవత్వాన్ని వదలి  తనను తాను రిక్తుని  చేసుకొని మనలను కాపాడటానికి వచ్చాడుఅన్నీ వదులుకోవడానికి ఆయన సిద్దపడ్డారుదేవునితో తన సమానత్వాన్ని వదలి , మర్త్య మానవ రూపాన్ని స్వీకరించాడు.

మనము  విధముగా ఉన్నాం

మనము ఎలా ఉన్నాముకేవలము పాపం చేయకుండా ఉండటానికే ప్రాముఖ్యత ఇస్తూ మంచి చేయటము పట్టించుకోవము ?  ఈనాటి సువిశేషము మార్కు 10: 34,35 వచనాలు కేవలము మిమ్మల్ని మీరు కీర్తించుకోకుండాక్రీస్తు వలె జీవించమని చెబుతున్నాయిఇతరులను రక్షించడానికి మనము ప్రవక్త లె  క్రీస్తు వలె ష్టపడటానికి సిద్దముగా ఉన్నమా మిగిలిన పది మంది  శిష్యులు   మాటలను విన్నప్పుడు   ఇద్దరు శిష్యులు మీద అసూయ పడుతున్నారువారికి కూడా మొదటి స్థానాలు  కావాలి అనుకున్నారు యేసు ప్రభువు   ఇటువంటి  వారితో దేవుని రాజ్యాన్ని స్థాపించాలనుకొన్నారుఅందుకే వారికి ముందుగానే చెబుతున్నారుతన రాజ్యంలో ఎలా ఉంటుంది అని లోక పాలకుల వలె ఉండకూడదు అని అంటున్నారుఆ ఇద్దరి శిష్యుల మీద మిగిలిన శిష్యులు అసూయతో ఉన్నారుఎందుకంటే శిష్యులకు వారి వారి  స్వలాభాలు కోరికలు ఉన్నాయి.  యేసు ప్రభువు చేసే పనులు చూస్తున్నప్పుడు వారు ఆయన ఆదికారంలో పాలు పంచుకోవచ్చు అనుకుంటున్నారుమన ఆలోచనలు  విధంగానే ఉన్నాయి.

క్రీస్తు వలె  జీవించాలి

శిష్యులకి యేసు ప్రభువు మాటలు పూర్తిగా అర్దము కాలేదుమార్కు 10:43  వచనములో యేసు ప్రభువు చెబుతున్నారుశిష్యులు ఎంచుకోవాల్సిన  మార్గం , సేవా మార్గంతనను తాను త్యజించుకోవాల్సిన మార్గంయోహను 18: 36  లో యేసు ప్రభువు అంటున్నారు ,  తన రాజ్యం  లోక సంబంధమైనది కాదు అని చెప్పారుఎవరైతే   గొప్ప వారు కావాలనుకుంటారో వారు సేవకులుగా ఉండాలి అని యేసు ప్రభువు చెబుతున్నారు పిలిప్పీయులకు రాసిన లేఖలో 2; 3-9.  విధముగా ఆయన తనను తాను బలిగా అర్పించుకున్నారు అని తెలుసుకుంటున్నాం. మార్కు

గొప్పతనానికి మార్గం

(యెషయా 53:10-11, హెబ్రీ 4:14-16, మార్కు 10:35-45 )

ప్రియ సహోదరులారా ఈనాటి సువిశేషము మరియు పఠనాలు ఒక వ్యక్తి గొప్ప వానిగా ఎదగాలంటే ఏమీ చేయాలి అని చెబుతున్నాయి .  లోక పోకడలను బట్టి కాక దేవుని దృష్టిలో గొప్పతనం ఏమిటని మనం తెలుసుకుంటున్నాంమొదటి పఠనం యెషయా ప్రవక్త బాధామయ సేవకుడు ఏవిధంగా అనేక కష్టాలను  అనుభవించి తన జీవితాన్ని అనేక మంది రక్షణకు కారకుడు అవుతాడు అని  తెలియచేస్తుంది.

ప్రవక్తలు ఎందుకు  కష్టాలను అనుభవించారు

  ప్రవక్తల జీవితాలు  విధముగా  యిస్రాయేలు  ప్రజలను దేవుని వైపు నడుపాయొ మనకు  తెలుసుమోషే ఎన్నో  కష్టాలు అనుభవించారు దేవుని ప్రజలను నాయకునిగా నడపడానికి,అయినకానీ, ప్రజలు ఆయన మీద తిరగబడుతున్నారుయెషయా  ప్రవక్త అనేక కష్టాలు  పడుతున్నారు. యిర్మీయా ప్రవక్త  నేను నా ముఖమును  చెకుముకి రాయి వలె చేసుకుంటిని అని అంటున్నాడు కష్టాలు పడటము ద్వార వారికి వచ్చే లాభం ఏమి లేదుమరి ఎందుకు వీరు ఇన్ని కష్టాలు పడుతున్నారుమొదటిగా దేవుని మీద వారికి గల ప్రేమ వలన,  మరల తమ  ప్రజలు ఆనందమైన జీవితం జీవించాలనిఆమోసు ప్రవక్త  నేను పొట్ట కూటి కోసం  దేవుని వాక్కు  ప్రకటించుట లేదు అని అమాస్య తో చెప్పారుఎందుకంటే వారు  దేవునికి తగిన విధముగా  జీవించకుండా వారికి ఇష్టమైన రీతిలో జీవిస్తూ నిజమైన ఆనందాన్ని కోల్పోతున్నారు. ప్రవక్తల జీవితాల ద్వారా వారు తమ ప్రజలకోసం అన్నీ కష్టాలు అనుభవించడానికైనా సిద్దంగా ఉన్నారు అని మనం తెలుసుకుంటున్నాంవీరు కష్టాలుబాదలు వేరే వారిని ఆనందమైన జీవితం జీవించేలా చేస్తున్నాయిప్రజలు అంత తెలివి గల వారు కారుచాలా సార్లు అనేక మోసాలకుస్వల్ప ఆనందాలకు జీవితాలను నాశనం చేసుకుంటున్నారువారిని కాపాడటానికి ప్రవక్తలు బాదలు అనుభవించారుఇది ప్రవక్తల గొప్పతనంవారు దీని ద్వార ఎటువంటి లాభాన్ని ఆశించలేదుపొందనూ లేదు.

గొప్పవారు ఎలా ఉంటారు

 లోకములో గొప్పవారికి,  దేవుని దృష్టిలో గొప్పవారికి గల వ్యత్యాసం గురించి  యేసు ప్రభువు  విధంగా అంటున్నారు.  అన్య జనుల రాజులు  వారిపై అధికారం చెలాయింతురువారి అధికారులు ఉపకారులు అని పిలవబడుతున్నారుకానీ మీరు అటుల చేయవలదుమీలో గొప్పవాడు చిన్న వానివలెనునాయకుడు సేవకునివలె ఉండాలి అని చెబుతున్నారులూకా 22:25,26. యేసు ప్రభువుమనుష్య కుమారుడు సేవించడానికే కానీ సేవించబడటానికి రాలేదు అని చెబుతున్నారు. మార్కు 10:45. గొప్ప వ్యక్తి ఎప్పుడు కూడా ఇతరులకు, అల్పులకు  ప్రాముఖ్యతను ఇస్తారుమనకు ఉన్న బహుమానాలుఅవార్డులుడబ్బులుఆస్తుల ద్వార మనం గొప్పవాళ్లు కాము దేవుని దృష్టి లో  గొప్పతనం మన ప్రవర్తన మీద  ఆధారపడి ఉంటుందిమనము ఎంత  సేవ చేయడానికి సిద్ధముగా ఉన్నాము, అనే దానిమీద ఆధారపడి ఉంటుంది.

శిష్యులు ఎందుకు ప్రత్యేక స్థానాలు అడుగుతున్నారు

యాకోబు యోహనులు యేసు ప్రభువుని ఒక కోరిక కోరుతున్నారు, మార్కు 10:37 మీరు మీ రాజ్యములో మహిమాన్విత సింహాసనముపై ఆసీనులైనప్పుడు మమ్ము మీ కుడిఎడమల కూర్చుండ అనుగ్రహింపుడు అని అడుగుతున్నారు యేసు ప్రభువు రూపాంతరీకరణ జరిగినప్పుడు ఆయనతో పేతురు,యోహను ,యాకోబులు ఉన్నారువారికి తెలుసు అది ఎంత గొప్పగా ఉన్నది అనిమత్తయి 19 అధ్యాయము 28 వచనములో మనము చూస్తాము మనుష్య  కుమారుడు తన సింహాసనము మీద కూర్చుండినప్పుడు మీరు కూడా 12 సింహాసనముల మీద కూర్చుంటారు అని చెప్పారుకానీ శిష్యులు దానిని  లోక అధికారములాంటిది అని అనుకుంటున్నారుఅందుకే ప్రభువు  పరలోక భూలోక అధికార వ్యత్యాసం గురించి చెబుతున్నారు లోకములో ఉన్న  పాలకులువేరే వారి మీద అధికారం చూపించడానికి , పెత్తనం చేయించడానికి చూస్తారు, కానీ మీరు అలా కాకుండా సేవ చేయటానికి ముందు ఉండాలి అని చెబుతున్నారుఅది అర్దము కానీ శిష్యులు పరలోకం  కూడా ఈ లోక సింహాసనం లాంటిది అనుకుంటున్నారువారికి కావలసినది లోక  సింహాసనాలుఅంతే కానీ పరలోక విధానము తెలిసి కాదు వారు అడిగేదిత్వరగా వారు అందరి చేత గొప్ప వారిగా పరిగణించబడాలి అని మాత్రమే అనుకుంటున్నారు.

యేసు ప్రభువు ఎటువంటి బలి అవుతున్నారు

 యోహను యాకోబులు అడిగిన దానికిమీరు ఏమి కోరుతున్నారో మీరు ఎరుగరునేను పానము చేయు పాత్రమునుండి  మీరు పానము చేయగలరానేను పొందబోవు బాప్తిస్మమును మీరును పొందగలరాఅంటున్నారుఏమిటి  పాన పాత్ర ? పాన పాత్ర అంటే చాలా శ్రమలుతో కూడిన జీవితముయెషయా 51:17  నీవు ప్రభువు కోపము అను పాత్రము నుండి  పానీయము త్రాగి పడిపోతివి అంటున్నారుకొన్ని సార్లు దీనిని ప్రవక్తల పాత్రము అంటారు. పాత్ర ఒక సంజ్ఞ గా ఉండేది ప్రవక్తలకు వారి గమ్యం తెలియ చేస్తూ ఉంటుంది పాన పాత్రంవారి గమ్యం  కష్టాలతో కూడుకొని ఉంటుంది ఇది  వారు పొందిన బాధలు  తెలియచేస్తుందిదేవుని కోపాన్ని తెలియచేస్తుందిఅంటే దేవునికి అయిష్టమైనదానిని తీసివేయడానికి పూనుకోవాలిప్రవక్తలు పొందిన కష్టాలు దేవునికి అయిష్టమైనదానిని తీసివేయడానికే  యేసు ప్రభువుమత్తయి  26 లో  పాత్రనునానుండి తీసి వేయమని అడుగుతున్నారు, అంటే అది చాలా  కష్టాలతో కుడినదిదానికి భరించడానికి మనము చాలా కష్ట పడాలియేసు ప్రభువు  బాప్తిస్మము  గురించి  చెప్పుతున్నారుఇక్కడ మనము తీసుకునే బాప్తిస్మము  గురించి కాదు కానీ చాలా కష్టముతో కూడిన శ్రమలలో  తీసుకునే బాప్తిస్మము  గురించి చెప్పుతున్నారుయేసు ప్రభువు జ్ఞానస్నానం  యొర్ధాను నదిలో మొదలై  గెత్సమని తోటలో ముగుస్తుంది.  తన తండ్రి చిత్తానికి తలవంచి శ్రమల పాన పాత్రను అంగీకరించాడు యేసు ప్రభువు.

క్రీస్తు ప్రభువు దైవత్వాన్ని వదలి  తనను తాను రిక్తుని  చేసుకొని మనలను కాపాడటానికి వచ్చాడుఅన్నీ వదులుకోవడానికి ఆయన సిద్దపడ్డారుదేవునితో తన సమానత్వాన్ని వదలి , మర్త్య మానవ రూపాన్ని స్వీకరించాడు.

మనము  విధముగా ఉన్నాం

మనము ఎలా ఉన్నాముకేవలము పాపం చేయకుండా ఉండటానికే ప్రాముఖ్యత ఇస్తూ మంచి చేయటము పట్టించుకోవము ?  ఈనాటి సువిశేషము మార్కు 10: 34,35 వచనాలు కేవలము మిమ్మల్ని మీరు కీర్తించుకోకుండాక్రీస్తు వలె జీవించమని చెబుతున్నాయిఇతరులను రక్షించడానికి మనము ప్రవక్త లె  క్రీస్తు వలె ష్టపడటానికి సిద్దముగా ఉన్నమా మిగిలిన పది మంది  శిష్యులు   మాటలను విన్నప్పుడు   ఇద్దరు శిష్యులు మీద అసూయ పడుతున్నారువారికి కూడా మొదటి స్థానాలు  కావాలి అనుకున్నారు యేసు ప్రభువు   ఇటువంటి  వారితో దేవుని రాజ్యాన్ని స్థాపించాలనుకొన్నారుఅందుకే వారికి ముందుగానే చెబుతున్నారుతన రాజ్యంలో ఎలా ఉంటుంది అని లోక పాలకుల వలె ఉండకూడదు అని అంటున్నారుఆ ఇద్దరి శిష్యుల మీద మిగిలిన శిష్యులు అసూయతో ఉన్నారుఎందుకంటే శిష్యులకు వారి వారి  స్వలాభాలు కోరికలు ఉన్నాయి.  యేసు ప్రభువు చేసే పనులు చూస్తున్నప్పుడు వారు ఆయన ఆదికారంలో పాలు పంచుకోవచ్చు అనుకుంటున్నారుమన ఆలోచనలు  విధంగానే ఉన్నాయి.

క్రీస్తు వలె  జీవించాలి

శిష్యులకి యేసు ప్రభువు మాటలు పూర్తిగా అర్దము కాలేదుమార్కు 10:43  వచనములో యేసు ప్రభువు చెబుతున్నారుశిష్యులు ఎంచుకోవాల్సిన  మార్గం , సేవా మార్గంతనను తాను త్యజించుకోవాల్సిన మార్గంయోహను 18: 36  లో యేసు ప్రభువు అంటున్నారు ,  తన రాజ్యం  లోక సంబంధమైనది కాదు అని చెప్పారుఎవరైతే   గొప్ప వారు కావాలనుకుంటారో వారు సేవకులుగా ఉండాలి అని యేసు ప్రభువు చెబుతున్నారు పిలిప్పీయులకు రాసిన లేఖలో 2; 3-9.  విధముగా ఆయన తనను తాను బలిగా అర్పించుకున్నారు అని తెలుసుకుంటున్నాం. మార్కు 10: 45  వచనంలో దేవుని కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు అని మనం వింటున్నాం.

యేసు ప్రభువు మన పాపములకు ప్రాయశ్చిత్త  వెల గా వచ్చాడుమన పాపాలను తీసివేయడానికి ఆయన చనిపోవడానికి కూడా సిద్దపడ్డారుమనలను మనం సేవకునిగా చేసుకోవటంక్రీస్తుని మన సుమాతృకగా తీసుకోవడం మనం చేయవలసిన పని 

యేసు ప్రభువు యొక్క సందేశం చాలా స్పష్టంగా  ఉంది.  యెషయా  ప్రవక్త  బాదామయ సేవకుని ద్వార ప్రభువు ఎటువంటివారు  అని చెప్పారు . ప్రభువు  తన కష్టాల ద్వార   లోకాన్ని రక్షించాలి అని నిర్ణయించుకున్నారు మానవుడు  శ్రమలను  ప్రేమ కోసం భరించినప్పుడు వాటికి  రక్షణ విలువ  ఉంటుందిదేవుని అధికారం వేరే  వారి మీద ఆధిపత్యం చెలాయించడం కాదు.  అది ప్రేమ చూపించడం, అంగీకరించడం, రక్షించడము మరియుసేవించడము. ఆవిధముగా జీవించుదాం.

10: 45  వచనంలో దేవుని కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు అని మనం వింటున్నాం.

యేసు ప్రభువు మన పాపములకు ప్రాయశ్చిత్త  వెల గా వచ్చాడుమన పాపాలను తీసివేయడానికి ఆయన చనిపోవడానికి కూడా సిద్దపడ్డారుమనలను మనం సేవకునిగా చేసుకోవటంక్రీస్తుని మన సుమాతృకగా తీసుకోవడం మనం చేయవలసిన పని 

యేసు ప్రభువు యొక్క సందేశం చాలా స్పష్టంగా  ఉంది.  యెషయా  ప్రవక్త  బాదామయ సేవకుని ద్వార ప్రభువు ఎటువంటివారు  అని చెప్పారు . ప్రభువు  తన కష్టాల ద్వార   లోకాన్ని రక్షించాలి అని నిర్ణయించుకున్నారు మానవుడు  శ్రమలను  ప్రేమ కోసం భరించినప్పుడు వాటికి  రక్షణ విలువ  ఉంటుందిదేవుని అధికారం వేరే  వారి మీద ఆధిపత్యం చెలాయించడం కాదు.  అది ప్రేమ చూపించడం, అంగీకరించడం, రక్షించడము మరియుసేవించడము. ఆవిధముగా జీవించుదాం.

 

 


పవిత్ర గ్రంధంలో ఉపవాసం Telugu | Fasting in Bible Telugu | కార్మెల్ శోభ

 లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యుల...