సొలొమోను మహారాజు జీవిత చరిత్ర: జ్ఞానం, వైభవం మరియు పతనం| కార్మెల్ శోభ
సొలొమోను మహారాజు
పరిచయం
సొలొమోను మహారాజు ఇశ్రాయేలు సంయుక్త రాజ్యానికి మూడవ మరియు చివరి రాజు. దావీదు రాజు, బత్షెబాల కుమారుడు. క్రీస్తుపూర్వం 970 నుండి 931 వరకు సుమారు 40 సంవత్సరాల పాటు ఇతని పరిపాలన కొనసాగింది, ఇతని పరిపాలన ఇశ్రాయేలు చరిత్రలోనే "సువర్ణ యుగం"గా పిలవబడుతుంది. సోలోమోను రాజు మానవ చరిత్రలోనే అత్యంత జ్ఞానవంతుడు, ఐశ్వర్యవంతుడైన రాజుగా అతను కీర్తించబడ్డాడు. కాని సొలొమోను జీవితం సజీవ దేవుని భక్తి నుండి విగ్రహారాధన వైపు మరలడంతో అతని పతనం ప్రారంభమైనది. అతని జీవిత మలి సంధ్య వేళలో సంభవించిన పశ్చాత్తాపం, మానవ స్వభావంలోని బలహీనతలను, చెంచలమైన మనస్తత్వాలను ఎత్తిచూపుతాయి.
జననం — పాపం నుండి వాగ్దానం వరకు
1. జననం
సొలొమోను చరిత్ర అతని తల్లిదండ్రుల పాపపు పునాదిపై మొదలవుతుంది. దావీదు రాజు హిత్తీయుడైన
ఊరియా భార్య బత్షెబాను మోహించి, ఆమెతో వ్యభిచారం చేశాడు (2 సమూయేలు 11:2-4). ఆ పాపాన్ని
కప్పిపుచ్చుకోవడానికి ఊరియాను యుద్ధరంగం నుండి బయటకు రాజ సౌదానికి పిలిచి ఇంటికి పొమ్మన్నాడు, కాని ఊరియా రాజ ప్రసాదంలోనే గడిపాడు. సైన్యం యుద్దం చేస్తుండగా తాను భార్యతో శయనించుట సబబు కాదని అనుకున్నాడు. అప్పుడు దావీదు ఊరియాను ప్రణాళికా బద్దంగా యుద్ద రంగానికి పంపించి, యుద్దంలో మొదటి వరసలో ఉండేలా చేయమని చెప్పి, కుట్రపూరితంగా చంపించాడు.
ఈ ఘోర
పాపానికి శిక్షగా, నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావిదును హెచ్చరించాడు. వారి మొదటి కుమారుడు
మరణించాడు. దావీదు హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడి, కన్నీరు కార్చాడు.
"దావీదు నాతానుతో నేను యావేకు ద్రోహముగా పాపము చేసితిని అనెను నాతాను " ప్రభువు నీ పాపము క్షమించెను. నీవు చావు తప్పి బ్రతుకుదువు." — 2 సమూయేలు 12:13
ఆ తరువాత, దేవుని క్షమాపణకు చిహ్నంగా దావీదు, బత్షెబాలకు మరొక కుమారుడు జన్మించాడు. ఆ కుమారునకు వారు సోలోమోను అని పేరు పెట్టారు. దేవుడు నాతాను ప్రవక్తను పంపి ఆ శిశువుకు యెదిద్యా అని పేరు పెట్టమని చెప్పాడు. ఆ బిడ్డను యావే ప్రేమించాడు.
- సొలొమోను అంటే శాంతి అని అర్ధం. దావీదు తన రాజ్యానికి వచ్చే శాంతి గురించి ఈ పేరు పెట్టాడు.
- యెదిద్యా
: దేవుడు ఆ బాలుని ప్రేమించి, ప్రవక్త
నాతాను ద్వారా అతనికి "యెదిద్యా" అని పేరు పెట్టాడు, దీని
అర్థం యావేకు ప్రియమైనవాడు (2 సమూయేలు
12:25).
2. బాల్యం
మరియు రాజభవన వాతావరణం
సొలొమోను
యెరూషలేము రాజభవనంలో పెరిగాడు. అతని బాల్యం ప్రశాంతంగా ఏమీ సాగలేదు.
రాజకుటుంబంలోని అసూయలు, వ్యభిచారాలు, హత్యలు మరియు అధికార పోరాటాల మధ్య అతను పెరిగాడు.
అతని కళ్ల
ముందే జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలు:
- అమ్నోన్ తన మారు చెల్లి అయిన తామారును చెడచడం
- అబ్షాలోము తన అన్న అయిన అమ్నోన్‌ను చంపి, తండ్రి దావీదుపైనే తిరుగుబాటు చేసి, చివరికి దారుణంగా మరణించడం
- అదోనియ రాజును కావాలని ప్రయత్నించుట
ఈ భయంకర
కుటుంబ కలహాల మధ్య, నాతాను ప్రవక్త సొలొమోనుకు ఆధ్యాత్మిక, నైతిక మార్గదర్శకుడిగా, గురువుగా ఉన్నాడు. దావీదు కూడా
సొలొమోనును కాబోయే రాజుగా మనస్సులోనే నిశ్చయించుకుని, అతనికి
దైవభీతిని నేర్పాడు.
సింహాసనాన్ని అధిరోహించుట
1. అదోనీయా
కుట్ర మరియు సొలొమోను అభిషేకం
దావీదు
వృద్ధుడై, మంచాన పడినప్పుడు, అతని పెద్ద కుమారుడైన అదోనీయా తానే రాజును కావాలని ఆశించాడు. సైన్యాధిపతి
యోవాబు, యాజకుడైన అబ్యాతారుల మద్దతుతో ఎన్రోగెలు సమీపంలో సర్పశిల వద్ద గొర్రెలను, ఎడ్లను బలి
ఇచ్చి, విందు ఏర్పాటు చేసుకుని, తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు (1 రాజులు 1:5-9).
ఈ కుట్రను
గమనించిన నాతాను ప్రవక్త , బత్షెబాను హెచ్చరించాడు. బత్షెబా రాజు వద్దకు వెళ్లి, దావీదు సొలొమోనును రాజుగా చేస్తాను అని చెప్పిన ప్రమాణాన్ని గుర్తుచేసింది.
ఆమె "ప్రభూ మీ తరువాత నా కుమారుడు సోలోమోను రాజగునని అతడే మీ సింహాసనము పై కూర్చుండునని ప్రభువుల వారు యావే పేర బాస చేయలేదా? ." — 1 రాజులు 1:17
అపుడు దావీదు
వెంటనే స్పందించి, యాజకుడైన సొదోకును, నాతాను ప్రవక్తను పిలిచి, సొలొమోనును తన సొంత కంచరగాడిద మీద ఎక్కించి, గీహోనుకు తీసుకువెళ్లి రాజుగా అభిషేకించమని
ఆజ్ఞాపించాడు.
యాజకుడైన సాదోకు గుడారములోనుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు అభిషేకము చేసాడు; అప్పుడు
వారు బూర ఊదగా జనులందరు, రాజైన సొలొమోను చిరంజీవి అగుగాక అని కేకలు వేసారు."
— 1 రాజులు 1:39
ఈ వార్త
విన్న అదోనీయా మరియు అతని అనుచరులు భయంతో పారిపోయారు. అదోనీయా బలిపీఠం కొమ్ములను
పట్టుకుని ప్రాణభిక్ష వేడగా, సొలొమోను అతనికి షరతులతో కూడిన క్షమాభిక్ష పెట్టాడు.https://www.carmelshobha.com/2026/04/daaveedu-raju-jeevitha-charitra-king-david-story-telugu.html
2. పరిపాలన
స్థిరీకరణ మరియు ప్రక్షాళన
దావీదు
మరణశయ్యపై ఉన్నప్పుడు, సొలొమోనుకు కొన్ని రాజనీతి సూత్రాలను, హెచ్చరికలను ఇచ్చాడు (1 రాజులు 2:1-9). రాజ్యాన్ని
అంతర్గత శత్రువుల నుండి రక్షించడానికి సొలొమోను కఠినమైన ప్రక్షాళన చర్యలు
చేపట్టాడు:
|
శత్రువు |
చేసిన
నేరం / కారణం |
తీసుకున్న
చర్య |
బైబుల్ సమాచరం |
|
అదోనీయా |
సోలోమోను తల్లి ద్వారా దావీదు చివరి భార్య అబీషగును వివాహమాడాలని కోరుట, తిరిగి రాజ్యం కొరకు పన్నాగంగా సోలోమోను గుర్తించుట |
మరణశిక్ష
విధించబడింది |
1 రాజులు 2:25 |
|
యోవాబు |
అబ్నెరు, అమాసాల
నిరపరాధ రక్తాన్ని చిందించాడు; అదోనీయాను సమర్థించాడు |
బలిపీఠం
వద్దే చంపబడ్డాడు |
1 రాజులు 2:34 |
|
అబ్యాతారు |
అదోనీయాను రాజుగా చేసే కుట్రలో భాగస్వామి అయ్యాడు |
యాజకత్వం
నుండి తొలగించి, అనాదోతుకు బహిష్కరించబడ్డాడు |
1 రాజులు 2:27 |
|
షిమీ |
దావీదును
శపించిన బెన్యామీనీయుడు; సరిహద్దు నిబంధనను ఉల్లంఘించాడు |
మరణశిక్ష
విధించబడింది |
1 రాజులు 2:46 |
ఈ చర్యల ద్వారా సొలొమోను రాజ్యం స్థిరపరచబడింది. రాజ్యము లోపల లేక అంతర్గత శత్రువులు ఎవరు లేకుండా చేశాడు సోలోమోను.
జ్ఞానం — అసాధారణమైన దైవిక వరం
1. గిబియోను
అనుభవం మరియు దైవిక దర్శనం
సొలొమోను రాజు మొదటి రోజులలో దేవునికి బలి అర్పించుటకు గిబ్యోను లోని బలి పీఠం వద్దకు వెళ్లారు. అక్కడ వెయ్యి దహనబలులను అర్పించాడు. ఆ రాత్రి దేవుడు అతనికి కలలో కనిపించి నీకు ఏమి కావాలో కోరుకోమన్నాడు. అపుడు సొలొమోను సంపదను, శత్రువుల నాశనాన్ని లేదా దీర్ఘాయువును కోరలేదు. బదులుగా వినయంతో ఇలా ప్రార్థించాడు:
"నీ సేవకునకు మంచి చెడ్డలెంచి పాలించు వివేకమును ప్రసాదించుము. లేదేని నీ వెన్నుకొనిన ఈ మహా ప్రజను పాలించుట నా తరము కాదు అనెను. " 1 రాజులు 3:9
సొలొమోను చేసిన ఈ ప్రార్ధన దేవునికి చాలా ప్రీతిని కలిగించినది. యావే సోలోమోనుతో "నీవు దీర్ఘాయువునో, సిరి సంపదలనో, శత్రువినశనమునో కోరుకోవైతివి. ప్రజలను న్యాయ బుద్దితో పాలించుటకు వివేకము మాత్రము అడుగుకోంటివి. నేను నీ కోర్కెను తప్పక తీర్తును. నీ ముందటి వారిలోగాని, నీ తరువాతి వారిలోగాని ఎవ్వరికీ లేని వివేకము, విజ్ఞానము నీకు ప్రసాదింతును. నీవు అడుగకున్న ఈ వరమునుగూడ నీకిత్తును. ఏ రాజుకు లభింపని ఐశ్వర్యము, ప్రఖ్యాతి జీవిత కాలమెల్ల నీకు లభించును" 1 రాజులు 3:11-13 సోలోమోను లేచి ఇది కల అని గ్రహించి, యెరుషలేము వచ్చి దేవుని మందసము ముందు దహన బలులను అర్పించాడు.
2. సొలొమోను తీర్పు
సొలొమోనుకు
లభించిన జ్ఞానము ఎంత గొప్పదో మనకు సోలోమోను ఇచ్చిన ఒక తీర్పు వలన స్పష్టం అవుతుంది. ఆ రాజ్యంలో ఇద్దరు స్త్రీలు పడుపు వృత్తిలో ఉండేవారు. వారు ఒకే ఇంట్లో నివసిస్తూ, మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు మగపిల్లలను కన్నారు. రాత్రి వేళ ఒక స్త్రీ తన
బిడ్డపై పడుకోవడం వల్ల ఆ బిడ్డ చనిపోయింది. ఆమె అర్ధరాత్రి లేచి, సజీవంగా
ఉన్న అవతలి స్త్రీ బిడ్డను మార్చేసింది. ఉదయాన్నే ఈ వివాదం రాజు ముందుకు వచ్చింది.
ఇద్దరూ బ్రతికి ఉన్న బిడ్డ, తమ బిడ్డే అని వాదించారు.
సొలొమోను రాజు సేవకునితో ఒక కత్తిని తెప్పించి, "ఈ బిడ్డను రెండు తుండెములుగా నరికి ఒక ముక్కను ఈమెకిమ్ము. ఇంకొక ముక్కను ఆమెకిమ్ము" అని చెప్పాడు. 1 రాజులు 3:25
అప్పుడు నిజమైన తల్లి హృదయం కరిగిపోయి, "అయ్యా, ఆ బిడ్డను చంపవద్దు, ఆమెకే ఇచ్చేయండి" అని ఏడ్చింది. కానీ దొంగ తల్లి, "నాకూ వద్దు, నీకూ వద్దు, బిడ్డను నరికి వేయాలిసిందే" అన్నది. సొలొమోను అసలు తల్లి ఎవరో గ్రహించి, బిడ్డను ఆమెకు అప్పగించాడు. ఈ తీర్పు చూసి ఇశ్రాయేలీయులందరు రాజు నందు దేవుని జ్ఞానముందని రాజుకు భయభక్తులు చూపేవారు.
3. జ్ఞాన
సాహిత్య రచయిత మరియు శాస్త్రవేత్త
సొలొమోను
కేవలం పాలకుడు మాత్రమే కాదు, గొప్ప కవి, తత్వవేత్త, ప్రకృతి శాస్త్రవేత్త.
- అతను 3,000 సామెతలను చెప్పాడు, మరియు 1,005 కీర్తనలను/పాటలను రచిం చాడు
(1 రాజులు 4:32).
- బైబిల్
గ్రంథ రచనలు: 1. సామెతల
గ్రంథము : యువతకు
ఆచరణాత్మక దైవ జ్ఞానాన్ని బోధిస్తుంది. "యావే పట్ల భయభక్తులు చూపుటాయే విజ్ఞానమునకు తోటి మెట్టు. " (సామెతలు
1:7).
2. ఉపదేశకుడు : లోకసంబంధమైన
ప్రతిదీ వ్యర్థమని నిరూపించే తాత్విక గ్రంథం. "వ్యర్థము
వ్యర్థము... సమస్తమును వ్యర్థమే" (ఉపదేశకుడు1:2).
3. పరమగీతము : వైవాహిక
ప్రేమను, దేవునికి ఆయన ప్రజలకు మధ్య గల ప్రేమను వర్ణించే అద్భుత ఆధ్యాత్మిక
కావ్యం.
- వృక్ష, జంతు
శాస్త్రాలు: లెబానోను దేవదారు వృక్షం
మొదలుకొని గోడలో మొలిచే హిస్సోపు మొక్క వరకు, మృగములు, పక్షులు, ప్రాకేడి జంతువులు, చేపల గురించి ఆయన కూలంకషంగా బోధించేవాడు (1 రాజులు
4:33).
నిర్మాణాలు, సంపద మరియు
రాజ్య విస్తరణ
1. ప్రథమ యెరూషలేము దేవాలయ నిర్మాణం
సొలొమోను
జీవితంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కార్యం దేవునికి ఆలయాన్ని నిర్మించడం.
దావీదు సమకూర్చిన ఐశ్వర్యంతో, తన పరిపాలన యొక్క నాల్గవ సంవత్సరంలో ఈ నిర్మాణాన్ని ప్రారంభించి, 7 సంవత్సరాలలో పూర్తి
చేశాడు (1 రాజులు 6:38).
తూరు రాజైన
హీరాము ఈ నిర్మాణానికి అవసరమైన దేవదారు మ్రానులను, నిపుణులైన శిల్పులను పంపి సహాయం చేశాడు.
ఆలయ నిర్మాణ
ప్రత్యేకతలు:
- ఆలయ
గోడల లోపలి భాగమంతా రాయి కనబడకుండా దేవదారు పలకలతో కప్పి, వాటిపై మేలిమి బంగారమును పొదిగారు.
- నిర్మాణం: ఆలయము కట్టబడుచున్నప్పుడు
చెక్కుడు రాళ్లను తెచ్చి కట్టారు గనుక, సుత్తె గొడ్డలి మొదలైన ఇనుప
ఆయుధముల చప్పుడు ఆలయములో వినబడలేదు (1 రాజులు
6:7).
ఆలయ
ప్రతిష్ఠాపన సమయంలో, సొలొమోను మోకరిల్లి, ఆకాశం వైపు చేతులెత్తి చేసిన ప్రార్థన బైబిల్లోనే అత్యంత ప్రసిద్ధమైనది:
"దేవుడు భూమి మీద వసించునా? ప్రభో మహా ఆకాశమే నిన్నిముడ్చుకొ జాలదనిన ఇక నేను కట్టిన ఈ కొద్దిపాటి దేవాలయమున నీవిముడుదువా ?......" — 1
రాజులు 8:27
ప్రార్థన ముగియగానే, ఆకాశం నుండి అగ్ని దిగి దహనబలులను కాల్చివేసింది, మరియు యావే మహిమ మందిరాన్ని నింపగా, యాజకులు లోపలికి వెళ్లలేకపోయారు.
2. ఇతర నిర్మాణాలు
ఆలయంతో పాటు
సొలొమోను దేశవ్యాప్తంగా అనేక నిర్మాణాలను చేపట్టాడు:
- రాజభవనం: తన కొరకు ఒక రాజ సౌదాన్ని కట్టుకోవడానికి 13 సంవత్సరాలు పట్టింది.
అందులో 'లెబానోను అరణ్య గృహము', 'స్తంభముల
మంటపము', మరియు న్యాయతీర్పు తీర్చడానికి 'సింహాసన
మంటపము' ఉన్నాయి.
- కోటలు మరియు ప్రాకారాలు: యెరూషలేము నగర రక్షణ కొరకు
కోటలను, ప్రాకారాలను కట్టించాడు.
- సైనిక
నగరాలు: హజోరు, మెగిద్దో, గెజెరు
వంటి వ్యూహాత్మక నగరాలను రథములకు, గుర్రములకు నిలయాలుగా
మార్చాడు.
3. ఆర్థిక
వైభవం మరియు వాణిజ్యం
సొలొమోను
కాలంలో ఇశ్రాయేలు సామ్రాజ్యం ఐగుప్తు సరిహద్దు నుండి యూఫ్రటీస్ నది వరకు
విస్తరించింది.
- బంగారము: ఒక సంవత్సరంలో సొలొమోనుకు వచ్చిన బంగారం సుమారు 66 బారువుల లేక మనుగుల బంగారం వచ్చేది.
- ఓడల
వ్యాపారం: గెబెరు
రేవు నుండి ఓఫీరు దేశానికి ఓడలను పంపి, అక్కడ నుండి బంగారం, చందనపు
మ్రానులను, రత్నాలను తెప్పించాడు.
- నగరంలో
వెండి రాళ్లంత చులకనైపోయాయి, దేవదారు మ్రానులు అడవి
మేడిచెట్లంత విస్తారమయ్యాయి (1 రాజులు
10:27).
- అతని
సింహాసనం ఏనుగు దంతముతో చేయబడి, మేలిమి బంగారముతో
ముంచబడింది. దానికి ఆరు మెట్లు, మెట్ల ఇరుప్రక్కలా పన్నెండు
సింహాల బొమ్మలు ఉన్నాయి.
- సోలోమోను వైభవం ఎంత చెప్పుకున్న తక్కువగానే ఉండేది.
4. షెబా రాణి సందర్శన
సొలొమోను జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని , కీర్తిని గురించి విన్న షెబా దేశపు రాణి, దానిలో ఉన్న నిజాన్ని తెలుసుకొనుటకు గూఢార్థముగల ప్రశ్నల చేత అతనిని శోధించడానికి గుర్రాలు, ఒంటెలు, అపారమైన సుగంధ ద్రవ్యాలు, బంగారంతో యెరూషలేముకు వచ్చింది (1 రాజులు 10:1-2).ఆమె సోలోమోనును అనేక ప్రశ్నలు అడిగినది. ఆమె అడిగిన ప్రశ్నలన్నింటికీ సొలొమోను ప్రత్యుత్తరమిచ్చాడు. అతని జ్ఞానాన్ని, భవన వైభవాన్ని, బలులను చూసి ఆమె ఆశ్చర్యచకితురాలై ఇలా అంది:
" నిన్ను గూర్చి , నీ విజ్ఞానమును గూర్చి నేను మా దేశమున విన్న వార్తలేళ్ల నిజములే, కాని, నేను ఇచ్చటకు వచ్చి నా కళ్ళతో చూచువరకు ఆఆ వార్తలను నమ్మలేదు. ఐనను, వారు నాకు నీ గొప్ప తనములో సగమైన తెలుపలేదు. నీ విజ్ఞానము, నీ వైభవం నేను విన్న దానికంటే ఎక్కువగా నున్నవి." — 1 రాజులు 10:6-7
పతనం - విగ్రహారాధన మరియు తిరుగుబాటు
1. స్త్రీల మోహం మరియు ఆజ్ఞల ఉల్లంఘన
సొలొమోను
వైభవం ఎంత గొప్పదో, అతని పతనం అంతకంటే భయంకరమైనది. మోషే ధర్మశాస్త్రంలో దేవుడు రాజుల కొరకు
విధించిన స్పష్టమైన నిబంధనలను సొలొమోను ఉల్లంఘించాడు:
"ఇంకను రాజునకు పెక్కు మంది భార్యలు ఉండరాదు. వారు ప్రభువు నుండి అతని హృదయమును వైదొలగింతురు. మరియు అతడు వెండి బంగారములను విస్తారముగా కూడా బెట్టరాదు " — ద్వితీయోపదేశకాండము
17:17
అయితే సొలొమోనుకు 700 మంది రాజకుమార్తె లైన భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉన్నారు (1 రాజులు 11:3). ఐగుప్తు, మోయాబు, అమ్మోను, ఎదోము, సీదోను దేశాలకు చెందిన అన్యస్త్రీలతో అతను మోహ బంధాలు ఏర్పరచుకున్నాడు. తన మోహబంధాలలో బంధిలా అయిపోయాడు.
2. విగ్రహారాధన
మరియు దైవద్రోహం
సొలొమోను
వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయాన్ని అన్యదేవతల వైపుకు త్రిప్పారు. యావేకు ఆలయం కట్టిన అదే చేతులతో, యెరూషలేము ఎదుట ఉన్న కొండపై అన్యదేవతలకు పూజా స్థలాలను కట్టించాడు.
సొలొమోను
సీదోనీయుల దేవతయైన అష్తారోతును, అమ్మోనీయుల దేవతయైన మిల్కోమును అనుసరించాడు ... మోయాబీయుల దేవతయైన కెమోషునకును, అమ్మోనీయుల దేవతయైన మోలెకునకును ఆరాధన మందిరములను కట్టించాడు. 1 రాజులు 11:5-7
దేవునికి
అత్యంత అసహ్యమైన, నరబలులు (పిల్లలను అగ్నిలో కాల్చడం) కోరే 'మోలెకు' దేవతకు కూడా సొలొమోను బలిపీఠాలు కట్టడం అతని ఆధ్యాత్మిక పతనానికి పరాకాష్ఠ.
3. దేవుని కోపం
మరియు శిక్షా ప్రవచనం
రెండుసార్లు సోలోమోనుకు దేవుడు ప్రత్యక్షమై దేవుని త్రోవ నుండి సోలోమోను తొలగిపోయిన విధానాన్ని వెల్లడిచేస్తూ హెచ్చరించాడు.
"యావే అతనితో నీవు నా నిబంధనమును మీరి, నా అజ్ఞలను జవదాటితివి; గనుక నేనీ రాజ్యమున నీ ఆధీనము నుండి తొలగించి నీ సేవకునికి ఇచ్చి వేసేదను. ఐనను నీ తండ్రి దావీదు పై గల అభిమానముచే నీ కాలమున కాదుగాని నీ కుమారుని పరిపాలన కాలమున ఈ కార్యమును జరిగింతును ." 1 రాజులు 11:11-12
4. అంతర్గత మరియు బయట శత్రువుల ఆవిర్భావం
శాంతికి
ప్రతీకగా నిలిచిన సొలొమోను రాజ్యము అతని చివరి రోజుల్లో దేవుడు అతనికి విరోధులను లేపాడు:
- హదాదు
(ఎదోమీయుడు): ఐగుప్తులో శరణు పొంది, దావీదు
మరణానంతరం తిరిగి వచ్చి ఏదో muసొలొమోనును ఎదోము సరిహద్దుల నుండి వేధించాడు.
- రెసొను
(సిరియా రాజు): దమస్కులో రాజై, ఇశ్రాయేలుకు
విరోధిగా మారి నిరంతరం హాని చేశాడు.
- యరొబాము : సొలొమోను వద్ద పనిచేసే
శ్రామిక అధికారి. అహీయాప్రవక్త తన క్రొత్త వస్త్రాన్ని 12 ముక్కలుగా
చింపి, అందులో 10 ముక్కలను యరొబాముకు ఇచ్చి, యావే "ఈ రాజ్యమును సోలోమోను నుండి తొలగించి దానిలో పది గోత్రములను నీ పరము చేసేదను " అని
ప్రవచించాడు (1 రాజులు
11:29-31).
ఈ విషయం
తెలిసి, జ్ఞానియైన సొలొమోను దేవుని తీర్పుకు లొంగక, యరొబామును చంపడానికి ప్రయత్నించాడు. యరొబాము
ఐగుప్తుకు పారిపోయాడు.
పశ్చాత్తాపం
సొలొమోను
చివరి రోజుల్లో పశ్చాత్తాపపడ్డాడా లేదా అనేదానికి బైబిల్లో స్పష్టమైన చారిత్రక
వచనం లేనప్పటికీ, సాంప్రదాయకంగా అతను తన జీవిత చరమాంకంలో రాసిన ఉపదేశకుడు గ్రంథం దీనికి అద్దం పడుతుంది.
అన్ని
భోగాలను, సుఖాలను, అనుభవించి, విగ్ర ఆరాధన చేసిన ఒక వృద్ధ రాజు, లోక జ్ఞానం ఎంత వ్యర్థమో గ్రహించి రాసిన ఆత్మకథ
ఇది.
- "నేనీ లోకమున నరులు చేయు కార్యములెల్ల గమనించితిని. కాని అంతయు వ్యర్ధమే. అంతయు నీరుపయోగమే. " — ఉపదేశకుడు 1:14
- ద్రవ్యమును
ప్రేమించువాడు ద్రవ్యముచేత తృప్తిపడడు అని గ్రహించాడు (ఉపదేశకుడు 5:10).
ఈ గ్రంథం
యొక్క ముగింపు వచనాలు సొలొమోను తిరిగి తన మూలాల్లోకి, పశ్చాత్తాపంలోకి
వచ్చాడని రుజువు చేస్తాయి:
"ఇంతవరకు చెప్పినదాని సారాంశమేమనగా -దేవునికి భయపడి అతని ఆజ్ఞలను పాటింపుము, నరుని ప్రధాన ధర్మము ఇదియే. నరులు చేసిన పనులు మంచివి కావచ్చును, చెడ్డవి కావచ్చును. కాని వానికి అన్నిటికిని దేవుడు తీర్పు తీర్చును." ఉపదేశకుడు 12:13-14
మరణం మరియు పరిణామాలు
1. సొలొమోను మరణం
సొలొమోను
యెరూషలేమునుండి ఇశ్రాయేలీయులందరిని నలువది సంవత్సరాలు పరిపాలించిన తరువాత, తన పితరులతో
కూడ నిద్రించి, దావీదు నగరమందు సమాధి చేయబడ్డాడు (1 రాజులు 11:42-43). అతని మరణంతో
ఒక అద్భుతమైన సామ్రాజ్య యుగం ముగిసింది. అయితే, అతను విడిచిపెట్టిన విలాసవంతమైన జీవితం, కట్టడాల
కొరకు ప్రజలపై వేసిన భారీ పన్నులు దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయి.
2. సామ్రాజ్య విభజన
సొలొమోను
మరణానంతరం అతని కుమారుడైన రెహబాము రాజయ్యాడు. షెకెము నగరంలో ప్రజలు మరియు ఐగుప్తు నుండి తిరిగి వచ్చిన
యరొబాము రెహబామును కలిసి, నీ తండ్రి సొలొమోను మా మీద మోపిన కఠిమైన కాడిని
కాస్త తగ్గించు అని వేడుకున్నారు.
రెహబాము పెద్దల నైతిక సలహాలను పక్కనబెట్టి, తనతో పెరిగిన యవ్వనస్థుల మాటలు విని, ప్రజలతో కఠినంగా మాట్లాడాడు:
"మా తండ్రి మీ పై పెద్ద బరువును మోపినచో నేనంత కంటే పెద్ద బరువును మోపెదను.అతడు మిమ్ము చంద్ర కొలలతో కొట్టిచ్చినచో నేను మిమ్ము కొరడాలతో బాధించెదను ." 1 రాజులు 12:14
ఈ మూర్ఖత్వ చర్యతో ఇశ్రాయేలు సామ్రాజ్యం దేవుని ప్రవచనం ప్రకారం రెండుcగా చీలిపోయింది: ఉత్తర భాగం 10 గోత్రాలు, ఇశ్రాయేలు, దక్షణమున యూదా ఒక గోత్రము.
సొలొమోను వారసత్వం మరియు ఆధ్యాత్మిక పాఠాలు
సొలొమోను
జీవితం మానవాళికి నాలుగు ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది:
- జ్ఞానము కంటే విధేయత మిన్న: లోకంలోనే అత్యంత జ్ఞానవంతుడైనప్పటికీ, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపని నాడు ఆ జ్ఞానం పతనానికి దారి తీస్తుంది. జ్ఞానం కలిగి ఉండడం వేరు, ఆచరించడం వేరు.
- హృదయ
సంరక్షణ అవసరం: "నీ
హృదయమును భద్రముగా కాపాడుకొనుము" (సామెతలు
4:23) అని రాసిన సొలొమోనే, వృద్ధాప్యంలో
లౌకిక బంధాల వల్ల తన హృదయాన్ని కాపాడుకోలేకపోయాడు.
- లౌకిక
ఆకర్షణల వ్యర్థత: సంపద, అధికారం, అందం, భోగాలు
మనిషికి తాత్కాలిక సంతోషాన్ని ఇస్తాయే తప్ప, ఆత్మకు
నిజమైన తృప్తిని ఇవ్వలేవు.
- దేవుని
కృప మరియు హెచ్చరిక: దేవుడు దావీదుకు ఇచ్చిన
నిబంధనను బట్టి సొలొమోనును పూర్తిగా విడనాడలేదు, కానీ
పాపానికి గల శిక్షను రాజ్య విభజన మాత్రం తప్పించలేదు.
ముగింపు
సొలొమోను
మహారాజు జీవితం ఒక గొప్ప కావ్యం లాంటిది. అది అత్యున్నత శిఖరాలను మరియు అత్యంత లోతైన అగాధాలను ఒకేసారి చూపిస్తుంది. బైబిల్ గ్రంథంలో
యేసుక్రీస్తు స్వయంగా సొలొమోను వైభవాన్ని ప్రస్తావిస్తూ, లిల్లీ పుష్పముల అందం సొలొమోను వైభవం కంటే గొప్పదని, అలాగే "సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు" (మత్తయి 12:42) అని తన
గురించి చెప్పుకున్నారు.
శతాబ్దాలు దాటినా, సొలొమోను జీవితం మరియు ఆయన రాసిన జ్ఞాన వాక్యాలు, ప్రతి మనిషి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే జీవిత పరమార్థమని చాటిచెబుతూనే ఉన్నాయి. జ్ఞానమైన, సంపదలైన బంధములైన ప్రభువు మార్గమున మనము నడిచినంత వరకే మనకు ఉపయోగపడుతాయి, తరువాత అవే పతనానికి కారణం అవుతాయి.
Fr. Amruth
Raju Vellaturi, OCD
Comments
మీ అభిప్రాయాలు, ప్రశ్నలు క్రింద రాయండి:
Post a Comment