కార్మెల్ మాత -నవ దిన ప్రార్ధనలు
Fr. Amruth Raju Vellaturi
జులై 07, 2026
కార్మెల్ సభ పునీతులుమరియ మాత భక్తి

కార్మెల్ మాత -నవ దిన ప్రార్ధనలు
పరిచయం
జూలై
16న జరుపుకొనే కార్మెల్ మాత (Our Lady of
Mount Carmel) పండుగకు ముందు, తొమ్మిది రోజుల పాటు ఈ నవదిన ప్రార్థనను భక్తితో చేయవచ్చు.
కర్మెలీయ సన్యాస కుటుంబానికి ఏలీయా ప్రవక్త నుండి, పరిశుద్ధ ఉత్తరీయం అందించిన వరం వరకు గల ఆధ్యాత్మిక
వారసత్వాన్ని ధ్యానిస్తూ, ప్రతిరోజూ ఒక పవిత్ర
గ్రంధ భాగాన్నిధ్యానిస్తూ ,
ఒక ప్రత్యేక విన్నపాన్ని కార్మెల్ మాతను వేడుకుందాం.
కార్మెల్ మాత చరిత్ర
కార్మెల్ పర్వతం
ఇశ్రాయేలు దేశంలోని ఒక పవిత్ర పర్వతం, పాత నిబంధన కాలం నుండి దేవుని సన్నిధికి చిహ్నంగా
గౌరవించబడింది. పదకొండు, పన్నెండవ
శతాబ్దలలో,
కొందరు సన్యాసులు ఏలీయా ప్రవక్త మాతృకను
అనుసరిస్తూ ఈ పర్వతంపై
ఏకాంతంగా జీవించి, ప్రార్థనలో నిమగ్నమయ్యారు. వారు తమ చిన్న ఆశ్రమానికి మధ్యలో పరిశుద్ధ
కన్యమరియకు అంకితం చేయబడిన ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించుకొని, ఆమెను తమ ప్రత్యేక
పోషకురాలిగా, తల్లిగా స్వీకరించారు. ఈ విధంగా కర్మెలీయ సన్యాస కుటుంబం (Carmelite
Order) ఆరంభమైంది. కాలక్రమేణా, ఐరోపా అంతటా ఈ సన్యాస కుటుంబం విస్తరించింది, మరియు
1251లో సెయింట్ సైమన్ స్టాక్, కార్మెల్ సన్యాస కుటుంబ విలువలు సన్నగిల్లిపోతున్నాయి అని బాధ
పడుచు ప్రత్యేకంగా మరియ మాతకు రోజు ప్రార్ధన చేస్తున్న సమయంలో ఆ మాత దర్శనమిచ్చి తన
ఉత్తరియాన్ని ఆయనకు ఇస్తూ, ఆ ఉత్తరీయం ధరించమని, ఆ సన్యాసం కుటుంబాన్ని ఎప్పుడు కాపాడుతానని,
ఆ ఉత్తరీయం ధరించి మరణించిన వారిని నిత్య నరకాగ్నికి పోకుండా పరలోక ప్రాప్తి కలుగుటకు పార్ధిస్తానని అభయమిచ్చారు. అప్పటి నుండి కార్మెల్ మాతపై, భక్తి
ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది విశ్వాసులు ఆమెను
'కార్మెల్ రాజ్ఞిగా
స్తుతిస్తూ, ఆమె స్కాపులర్‌ను భక్తితో ధరిస్తున్నారు. తెలుగు కర్మెలీయ కుటుంబం కూడా
ఈ ఆధ్యాత్మిక వారసత్వంలో భాగమై, ప్రతి సంవత్సరం జూలై 16న ఈ పండుగను వైభవంగా జరుపుకుంటుంది.
ప్రార్థనా విధానం
ప్రతిరోజూ:
1) ఇచ్చిన పవిత్ర గ్రంధ భాగాన్ని, ధ్యానాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవండి.
2) ఆ రోజుటి
విన్నపాన్ని హృదయపూర్వకంగా దేవుని ఎదుట ఉంచండి. 3) 1 పరలోక
జపము 3 మంగళ
వార్త జపములు ,
1 త్రీత్వ స్తోత్రం జపము
చెప్పండి. 4)
కార్మెల్ పతకం
లేదా ఉత్తరీయం ధరించి
ఉంటే, దానిని స్పృశిస్తూ ముగింపు ప్రార్థన చేయండి.
పండుగ దినాన సూచనలు (జూలై 16)
నవదిన
ప్రార్థన ముగిసిన తరువాత, జూలై 16న కార్మెల్
మాత పండుగను ప్రత్యేక
భక్తితో జరుపుకోవచ్చు. ఆ రోజు దివ్య పూజలో పాల్గొని, స్కాపులర్‌ను నూతనంగా ఆశీర్వదించుకొని
ధరించడం, కుటుంబ సభ్యులతో కలిసి జపమాల
ప్రార్థన చేయడం, పేదలకు
లేదా అవసరంలో ఉన్నవారికి ఏదైనా సహాయం అందించడం వంటి చిన్న చిన్న భక్తి కార్యక్రమాలు
ఈ పండుగను మరింత అర్థవంతం చేస్తాయి. వీలైతే, ఈ దినాన కర్మెలీయ పునీతుల జీవిత చరిత్రలను చదవడం
లేదా కుటుంబంలో వారి గురించి చిన్న ప్రసంగం ఇవ్వడం కూడా మంచి ఆచారంగా మారుతుంది.
మొదటి రోజు - కర్మెల పర్వతంపై ఏలీయా ప్రవక్త
పిత , పుత్ర , పవిత్రాత్మ నామమున ఆమెను
ప్రభువా మా మీద దయగా నుండండి
ప్రభువా మా మీద దయగా నుండండి
క్రీస్తువా మా మీద దయగా నుండండి
క్రీస్తువా మా మీద దయగా నుండండి
ప్రభువా మా మీద దయగా నుండండి
ప్రభువా మా మీద దయగా నుండండి,
పవిత్ర గ్రంధ పఠనం
1 రాజులు 18: 1-46 చదవండి
సారాంశం
|
పాత నిబంధనలో, ఏలీయా ప్రవక్త
కర్మెల పర్వతంపై నిలిచి, ఆకాశం నుండి చిన్న మేఘం లేచి వర్షం కురిపించడాన్ని చూశాడు
(1 రాజులు 18వ అధ్యాయం). ఆ చిన్న మేఘం, తరతరాలుగా, పరిశుద్ధ కన్యామరియను సూచించే
సూచనగా కర్మెలీయుల సంప్రదాయంలో పేర్కొనబడినది . ఎండిన పాపపు భూమిపై
దేవుని కృపను వర్షంగా
కురిపించే తల్లి.
|
ధ్యానం
కార్మెల్ పర్వతం మన సన్యాస కుటుంబానికి
పుట్టినిల్లు. ఏలీయా ప్రవక్త విశ్వాసంతో ఎదురుచూసినట్లే, మనం కూడా ఈ నవదిన ప్రార్థనలో
మరియ
మాత
సహాయాన్ని విశ్వాసంతో, ఓపికతో ఎదురుచూద్దాం. ఆమె వర్షం వలె మన జీవితాల్లోని ఎండినపోయిన బంధాలపై, దేవుని కృపను కురిపించమని
వేడుకుందాం. ఏలీయా ఏడుసార్లు తన సేవకుని సముద్రం వైపు పంపి ఎదురుచూసినట్లే, మనం కూడా
నిరుత్సాహపడకుండా, ఓపికతో ఈ తొమ్మిది రోజులూ ప్రార్థనలో కొనసాగుదాం.
నేటి
విన్నపం: విశ్వాసంలో స్థిరత్వం కొరకు.
1)
ఇచ్చిన పవిత్ర గ్రంధ
భాగాన్ని,
ధ్యానాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవండి. 2) ఆ
రోజుటి
విన్నపాన్ని హృదయపూర్వకంగా దేవుని ఎదుట ఉంచండి. 3) 1 పరలోక జపము 3 మంగళ
వార్త జపములు , 1 త్రీత్వ స్తోత్రం జపము
చెప్పండి. 4) కార్మెల్ పతకం లేదా ఉత్తరీయం ధరించి ఉంటే, దానిని
స్పృశిస్తూ ముగింపు ప్రార్థన చేయండి.
రెండవ రోజు - దేవదూత సందేశం
పిత , పుత్ర , పవిత్రాత్మ నామమున ఆమెను
ప్రభువా మా మీద దయగా నుండండి
ప్రభువా మా మీద దయగా నుండండి
క్రీస్తువా మా మీద దయగా నుండండి
క్రీస్తువా మా మీద దయగా నుండండి
ప్రభువా మా మీద దయగా నుండండి
ప్రభువా మా మీద దయగా నుండండి,
పవిత్ర గ్రంధ పఠనం
లూకా 1:26-38 చదవండి
సారాంశం
|
దేవదూత గాబ్రియేలు నజరేతులోని
కన్యక మరియ వద్దకు వచ్చి, ఆమె దేవుని కుమారుని తల్లి కాబోతున్నదని తెలియజేశాడు. మరియ మాత భయపడినా, తన హృదయాన్ని
పూర్తిగా దేవుని చిత్తానికి అప్పగిస్తూ, 'నేను ప్రభువు దాసురాలిని, నీ మాట చొప్పున
నాకు జరుగునుగాక' అని వినయంగా బదులిచ్చింది.
|
ధ్యానం
మరియ
మాత ,
నేను ప్రభువు దాసురాలిని, నీ మాత చొప్పునన
నాకు జరుగునుగాక, అనే ఈ మాట మన స్వంత జీవితానికి
మార్గదర్శకం. ఆమె అనిశ్చితిని, భయాన్ని విశ్వాసంతో అధిగమించింది. కార్మెల్ మాతా, మా జీవితంలో
దేవుని చిత్తాన్ని గుర్తించి, నీలాగే నిబ్బరంగా అంగీకరించే హృదయాన్ని మాకు నేర్పించు.
నేటి
విన్నపం: దేవుని చిత్తాన్ని వినయంగా అంగీకరించే హృదయం కొరకు.
1)
ఇచ్చిన పవిత్ర గ్రంధ
భాగాన్ని,
ధ్యానాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవండి. 2) ఆ
రోజుటి
విన్నపాన్ని హృదయపూర్వకంగా దేవుని ఎదుట ఉంచండి. 3) 1 పరలోక జపము 3 మంగళ
వార్త జపములు , 1 త్రీత్వ స్తోత్రం జపము
చెప్పండి. 4) కార్మెల్ పతకం లేదా ఉత్తరీయం ధరించి ఉంటే, దానిని
స్పృశిస్తూ ముగింపు ప్రార్థన చేయండి.
మూడవ రోజు - ఎలీసబెతును దర్శించుట
పిత , పుత్ర , పవిత్రాత్మ నామమున ఆమెను
ప్రభువా మా మీద దయగా నుండండి
ప్రభువా మా మీద దయగా నుండండి
క్రీస్తువా మా మీద దయగా నుండండి
క్రీస్తువా మా మీద దయగా నుండండి
ప్రభువా మా మీద దయగా నుండండి
ప్రభువా మా మీద దయగా నుండండి,
పవిత్ర గ్రంధ పఠనం
లూకా 1:39-45 చదవండి
సారాంశం
|
దేవదూత సందేశం తరువాత,
మరియ వెంటనే లేచి, తన బంధువు ఎలీసబెతమ్మను సేవించడానికి కొండ ప్రాంతానికి
వెంటనే వెళ్ళింది.
ఆమె రాకతో ఎలీసబెతమ్మ గర్భంలోని శిశువు (బాప్తిస్మ
యోహాను) ఆనందంతో గంతులు వేసింది.
|
ధ్యానం
మరియమాత ఇతరుల అవసరాలను చూసి
వెంటనే స్పందించింది, ఇది
సేవాభావానికి, ప్రేమకు మాతృక.
కార్మెల్ మాత,
మా చుట్టూ ఉన్నవారి అవసరాలను గమనించి, నిస్వార్థంగా సేవ చేసే హృదయాన్ని మాకు దయచేయి.
నేటి
విన్నపం: కుటుంబ సభ్యుల శ్రేయస్సు కొరకు.
1)
ఇచ్చిన పవిత్ర గ్రంధ
భాగాన్ని,
ధ్యానాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవండి. 2) ఆ
రోజుటి
విన్నపాన్ని హృదయపూర్వకంగా దేవుని ఎదుట ఉంచండి. 3) 1 పరలోక జపము 3 మంగళ
వార్త జపములు , 1 త్రీత్వ స్తోత్రం జపము
చెప్పండి. 4) కార్మెల్ పతకం లేదా ఉత్తరీయం ధరించి ఉంటే, దానిని
స్పృశిస్తూ ముగింపు ప్రార్థన చేయండి.
నాలుగవ రోజు -మరియ స్తుతిగీతం
పిత , పుత్ర , పవిత్రాత్మ నామమున ఆమెను
ప్రభువా మా మీద దయగా నుండండి
ప్రభువా మా మీద దయగా నుండండి
క్రీస్తువా మా మీద దయగా నుండండి
క్రీస్తువా మా మీద దయగా నుండండి
ప్రభువా మా మీద దయగా నుండండి
ప్రభువా మా మీద దయగా నుండండి,
పవిత్ర గ్రంధ పఠనం
లూకా 1:46-55 చదవండి
సారాంశం
|
ఎలీసబెతమ్మ ఇంట్లో మరియమాత తన ఆత్మ ప్రభువును కీర్తించుచున్నదని,
తన ఆత్మ తన రక్షకుడైన దేవునియందు ఆనందించుచున్నదని పాడింది. దీనులను హెచ్చించి, ఆకలిగొన్నవారిని
మేలులతో
నింపే దేవుని కృపను ఆమె కీర్తించింది.
|
ధ్యానం
మరియ
మాత స్తుతిగీతం వినయం,
కృతజ్ఞత గల హృదయం నుండి పుడుతుంది. మనం కూడా మన జీవితంలో దేవుడు చేసిన మేళ్ళను మరచిపోకుండా,
ప్రతిదినం కృతజ్ఞతతో జీవించాలని కార్మెల్
మాత
మనకు నేర్పుగాక.
నేటి
విన్నపం: కృతజ్ఞత గల హృదయం కొరకు, పేదల, బాధితుల కొరకు.
1)
ఇచ్చిన పవిత్ర గ్రంధ
భాగాన్ని,
ధ్యానాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవండి. 2) ఆ
రోజుటి
విన్నపాన్ని హృదయపూర్వకంగా దేవుని ఎదుట ఉంచండి. 3) 1 పరలోక జపము 3 మంగళ
వార్త జపములు , 1 త్రీత్వ స్తోత్రం జపము
చెప్పండి. 4) కార్మెల్ పతకం లేదా ఉత్తరీయం ధరించి ఉంటే, దానిని
స్పృశిస్తూ ముగింపు ప్రార్థన చేయండి.
ఐదవ రోజు — కానా వివాహ విందు
పిత , పుత్ర , పవిత్రాత్మ నామమున ఆమెను
ప్రభువా మా మీద దయగా నుండండి
ప్రభువా మా మీద దయగా నుండండి
క్రీస్తువా మా మీద దయగా నుండండి
క్రీస్తువా మా మీద దయగా నుండండి
ప్రభువా మా మీద దయగా నుండండి
ప్రభువా మా మీద దయగా నుండండి,
పవిత్ర గ్రంధ పఠనం
యోహాను 2:1-11 చదవండి
సారాంశం
|
కానాలో జరిగిన వివాహ విందులో
ద్రాక్షారసం అయిపోయినప్పుడు, మరియమాత యేసు ప్రభువుతో
'వారికి ద్రాక్షారసం లేదు' అని చెప్పి, సేవకులతో 'ఆయన చెప్పినట్లు చేయండి'
అని పలికింది. ఇది యేసు ప్రభువు చేసిన మొదటి అద్భుతానికి
కారణమైంది.
|
ధ్యానం
మరియ మాత మన అవసరాలను గమనించి,
తన కుమారుని వద్దకు తీసుకువెళ్ళే మధ్యవర్తి. ఆమె సేవకులకు ఇచ్చిన సలహా నేటికీ మనందరికీ
వర్తిస్తుంది .
'ఆయన చెప్పినట్లు
చేయండి.' కార్మెల్ మాత,
మా అవసరాలను నీ కుమారుని ఎదుట ఉంచుము.
నేటి
విన్నపం: ప్రత్యేక కుటుంబ అవసరాలు, ఉద్యోగ, ఆరోగ్య సమస్యల కొరకు.
1)
ఇచ్చిన పవిత్ర గ్రంధ
భాగాన్ని,
ధ్యానాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవండి. 2) ఆ
రోజుటి
విన్నపాన్ని హృదయపూర్వకంగా దేవుని ఎదుట ఉంచండి. 3) 1 పరలోక జపము 3 మంగళ
వార్త జపములు , 1 త్రీత్వ స్తోత్రం జపము
చెప్పండి. 4) కార్మెల్ పతకం లేదా ఉత్తరీయం ధరించి ఉంటే, దానిని
స్పృశిస్తూ ముగింపు ప్రార్థన చేయండి.
ఆరవ రోజు — సిలువ చెంత మరియ
పిత , పుత్ర , పవిత్రాత్మ నామమున ఆమెను
ప్రభువా మా మీద దయగా నుండండి
ప్రభువా మా మీద దయగా నుండండి
క్రీస్తువా మా మీద దయగా నుండండి
క్రీస్తువా మా మీద దయగా నుండండి
ప్రభువా మా మీద దయగా నుండండి
ప్రభువా మా మీద దయగా నుండండి,
పవిత్ర గ్రంధ పఠనం
యోహాను 19:25-27 చదవండి
సారాంశం
|
యేసు సిలువపై మరణించుచుండగా,
ఆయన తల్లి సిలువ చెంత నిలిచింది. యేసు తన శిష్యుడైన యోహానుతో 'ఇదిగో నీ తల్లి' అని
పలికి, మరియను మనందరికీ తల్లిగా అప్పగించాడు.
|
ధ్యానం
మరియమాత బాధలో కూడా విశ్వాసంతో
నిలిచిన 'బాధాసహిత మాత.' ఆమె మన బాధల్లో మనతో పాటుగా నిలుస్తుంది. కార్మెల్ రాజ్ఞి, కార్మెల్ మాత ,
మా కష్టకాలంలో మాకు ధైర్యాన్ని, ఓదార్పును దయచేయి.
నేటి
విన్నపం: బాధపడుతున్నవారు, రోగులు, మరణశయ్యపై ఉన్నవారి కొరకు.
1)
ఇచ్చిన పవిత్ర గ్రంధ
భాగాన్ని,
ధ్యానాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవండి. 2) ఆ
రోజుటి
విన్నపాన్ని హృదయపూర్వకంగా దేవుని ఎదుట ఉంచండి. 3) 1 పరలోక జపము 3 మంగళ
వార్త జపములు , 1 త్రీత్వ స్తోత్రం జపము
చెప్పండి. 4) కార్మెల్ పతకం లేదా ఉత్తరీయం ధరించి ఉంటే, దానిని
స్పృశిస్తూ ముగింపు ప్రార్థన చేయండి.
ఏడవ రోజు -
పరిశుద్ధాత్మ దిగివచ్చుట
పిత , పుత్ర , పవిత్రాత్మ నామమున ఆమెను
ప్రభువా మా మీద దయగా నుండండి
ప్రభువా మా మీద దయగా నుండండి
క్రీస్తువా మా మీద దయగా నుండండి
క్రీస్తువా మా మీద దయగా నుండండి
ప్రభువా మా మీద దయగా నుండండి
ప్రభువా మా మీద దయగా నుండండి,
పవిత్ర గ్రంధ పఠనం
అపొస్తలుల కార్యములు 1:14 చదవండి
సారాంశం
|
యేసుప్రభువు మోక్షరోహనం తరువాత, అపొస్తలులు మరియమాతతో కలిసి ఏకమనస్సుతో ప్రార్థనలో
నిమగ్నమై, పరిశుద్ధాత్మ కొరకు ఎదురుచూశారు. పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ వారిపై
దిగివచ్చినప్పుడు, మరియమాత తిరుసభ తల్లిగా వారి మధ్య నిలిచియుండెను.
|
ధ్యానం
మరియమాత తొలి శ్రీ సభ ప్రార్థనలో మార్గదర్శిగా
నిలిచింది. కార్మెల్ సన్యాసులకు, ఆమె ఎల్లప్పుడూ
ప్రార్థనా జీవితానికి మాతృకగా
ఉంటుంది. ఆమె సహాయంతో,
మనం కూడా నిరంతర ప్రార్థనా జీవితాన్ని పెంపొందించుకుందాం.
నేటి
విన్నపం: సంఘం కొరకు, గురువులు, సన్యాసుల కొరకు, నూతన మత దీక్షల కొరకు.
1)
ఇచ్చిన పవిత్ర గ్రంధ
భాగాన్ని,
ధ్యానాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవండి. 2) ఆ
రోజుటి
విన్నపాన్ని హృదయపూర్వకంగా దేవుని ఎదుట ఉంచండి. 3) 1 పరలోక జపము 3 మంగళ
వార్త జపములు , 1 త్రీత్వ స్తోత్రం జపము
చెప్పండి. 4) కార్మెల్ పతకం లేదా ఉత్తరీయం ధరించి ఉంటే, దానిని
స్పృశిస్తూ ముగింపు ప్రార్థన చేయండి.
ఎనిమిదవ రోజు సూర్యుని ధరించిన స్త్రీ
పిత , పుత్ర , పవిత్రాత్మ నామమున ఆమెను
ప్రభువా మా మీద దయగా నుండండి
ప్రభువా మా మీద దయగా నుండండి
క్రీస్తువా మా మీద దయగా నుండండి
క్రీస్తువా మా మీద దయగా నుండండి
ప్రభువా మా మీద దయగా నుండండి
ప్రభువా మా మీద దయగా నుండండి,
పవిత్ర గ్రంధ పఠనం
దర్శన గ్రంధం 12 వ అధ్యాయం చదవండి
సారాంశం
|
ప్రకటన గ్రంథంలో, సూర్యుని
ధరించి, చంద్రుని పాదాక్రాంతం చేసుకొని, పండ్రెండు నక్షత్రాల కిరీటం ధరించిన స్త్రీ
కనిపిస్తుంది. కర్మెలీయ సంప్రదాయంలో ఈ దర్శనం పరలోక రాణిగా మరియ మాత మహిమను సూచించే చిత్రంగా
గౌరవించబడింది.
|
ధ్యానం
కార్మెల్ రాణిగా మాతగా మరియ మాతను
మనం గౌరవిస్తాము,
ఆమె
మనలను చీకటి శక్తుల నుండి కాపాడే తల్లి, రక్షణ కవచం వంటిది. స్కాపులర్ ధరించే ప్రతి
విశ్వాసి ఆమె రక్షణలో ఉన్నట్లు నమ్ముతారు.
నేటి
విన్నపం: శోధనలు, ప్రమాదాల నుండి రక్షణ కొరకు.
1)
ఇచ్చిన పవిత్ర గ్రంధ
భాగాన్ని,
ధ్యానాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవండి. 2) ఆ
రోజుటి
విన్నపాన్ని హృదయపూర్వకంగా దేవుని ఎదుట ఉంచండి. 3) 1 పరలోక జపము 3 మంగళ
వార్త జపములు , 1 త్రీత్వ స్తోత్రం జపము
చెప్పండి. 4) కార్మెల్ పతకం లేదా ఉత్తరీయం ధరించి ఉంటే, దానిని
స్పృశిస్తూ ముగింపు ప్రార్థన చేయండి.
తొమ్మిదవ రోజు పవిత్ర ఉత్తరియా అనుగ్రహం
పిత , పుత్ర , పవిత్రాత్మ నామమున ఆమెను
ప్రభువా మా మీద దయగా నుండండి
ప్రభువా మా మీద దయగా నుండండి
క్రీస్తువా మా మీద దయగా నుండండి
క్రీస్తువా మా మీద దయగా నుండండి
ప్రభువా మా మీద దయగా నుండండి
ప్రభువా మా మీద దయగా నుండండి,
సైమన్ స్టాక్ అనే పునీతునికి మరియ మాత ఉత్తరియాన్ని బహు కరించుట.
నా ప్రియ కుమారుడా, నీ సన్యాస కుటుంబానికి నీ ఈ ఉత్తరియాన్ని స్వీకరించు , ఇది నీకు మరియు కార్మెల్ సన్యాసులందరికి లభించు ప్రత్యేక వరం, ఈ ఉత్తరీయన్ని ధరించి మరణించే ఏ వ్యక్తి అయిన నిత్య నరకాగ్నికి గురికాడు. ఇది రక్షణకు చిహ్నం, అపదల్లో రక్షణ కవచం. శాంతి కి హామి.
సారాంశం
|
సంప్రదాయం ప్రకారం,
1251లో ఇంగ్లాండులో సెయింట్ సైమన్ స్టాక్ అనే కర్మెలీయ సన్యాసికి పరిశుద్ధ కన్యామరియ
దర్శనమిచ్చి, ఉత్తరీయం
అందించి,
దానిని భక్తితో ధరించువారికి ప్రత్యేక సంరక్షణ వాగ్దానం చేసింది. అప్పటి నుండి స్కాపులర్
కర్మెలీయ భక్తికి, మరియ రక్షణకు చిహ్నంగా నిలిచింది.
|
ధ్యానం
ఈ
తొమ్మిదవ రోజున, మనం రాణి మాత రక్షణలో నివసించాలని, ఆమె ఉత్తరియాన్ని ధరించిన ప్రతి ఒక్కరూ
ఆమె బిడ్డలుగా జీవించాలని ప్రార్థిద్దాం. కార్మెల్
మాత నీ రక్షణ వస్త్రం క్రింద
మమ్మల్ని ఎల్లప్పుడూ చేర్చుకో, ఉత్తరీయం కేవలం ఒక వస్త్రం కాదు,
అది మరియ తల్లికి మనం చేసుకున్న ఒక అంకితభావ వాగ్దానం, ఆమెలాగే జీవించాలనే నిత్య జ్ఞాపికగా
మనం దానిని భావించాలి.
నేటి
విన్నపం: నవదిన ప్రార్థన చేసిన వారందరి ప్రత్యేక విన్నపాల కొరకు.
1)
ఇచ్చిన పవిత్ర గ్రంధ
భాగాన్ని,
ధ్యానాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవండి. 2) ఆ
రోజుటి
విన్నపాన్ని హృదయపూర్వకంగా దేవుని ఎదుట ఉంచండి. 3) 1 పరలోక జపము 3 మంగళ
వార్త జపములు , 1 త్రీత్వ స్తోత్రం జపము
చెప్పండి. 4) కార్మెల్ పతకం లేదా ఉత్తరీయం ధరించి ఉంటే, దానిని
స్పృశిస్తూ ముగింపు ప్రార్థన చేయండి.
ముగింపు ప్రార్థన
ఉత్తరీయ
వాగ్దానం
కర్మెలీయ
సంప్రదాయం ప్రకారం, స్కాపులర్‌ను భక్తితో ధరించి, మరియ తల్లికి తమ జీవితాన్ని అంకితం
చేసుకున్న విశ్వాసులకు ఆమె ప్రత్యేక సంరక్షణ, మరణ సమయంలో ఓదార్పు వాగ్దానం చేసినట్లు
తరతరాలుగా విశ్వసించబడింది. అయితే ఈ వాగ్దానం కేవలం వస్త్రధారణతో మాత్రమే కాక, మరియ మాత మాతృకను
అనుసరించి, పవిత్రమైన,
ప్రార్థనాపూర్వక జీవితాన్ని జీవించాలనే నిబద్ధతతో ముడిపడి ఉంటుంది. ఈ నవదిన ప్రార్థన
ముగింపులో, ప్రతి విశ్వాసి తన హృదయాన్ని పునరుద్ధరించుకుంటూ, కార్మెల్
రాజ్ఞి, మరియు తల్లి అయిన ఆమె బాటలో మరింత దగ్గరగా
నడవాలని నిశ్చయించుకోవాలి.
తుది వేడుకోలు
|
ఓ కార్మెల్ మాత ,
తరతరాలుగా నీ బిడ్డలైన కర్మెలీయ కుటుంబానికి తల్లిగా, రక్షణ కవచంగా నిలిచిన మాతా,
ఈ నవదిన ప్రార్థన ముగింపులో మా హృదయాలను నీ పాదాల చెంత ఉంచుచున్నాము. తెరేసమ్మ, సిలువ
యోహాను, చిన్న తెరేసమ్మ, సైమన్ స్టాక్ వంటి కర్మెలీయ పునీతులు నడయాడిన బాటలో మమ్మల్ని
నడిపించు. మా కుటుంబాలను, మా అవసరాలను, ముఖ్యంగా ఈ నవదిన ప్రార్థనలో మేము నీ ఎదుట
ఉంచిన విన్నపాలను దయతో ఆలకించి, నీ కుమారుని యెదుట మా పక్షాన మధ్యవర్తిత్వం వహించు.
నీ ఉత్తరియ రక్షణలో మమ్మల్ని జీవితాంతం కాపాడుము. ఆమెన్.
|
కార్మెల్ సభ పునీతులుమరియ మాత భక్తి
Fr. Amruth Raju Vellaturi, OCD
Discalced Carmelite Priestకార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబుల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పునీతుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.
📚 నిత్య పోస్ట్‌లను అందుకోండి
మా బ్లాగుకు సబ్‌స్క్రైబ్ చేసుకోండి — ప్రతి నిత్య వ్యాసం మీ ఈమెయిల్‌కు వస్తుంది.
మీరు సబ్‌స్క్రైబ్ చేసిన తర్వాత, నిర్ధారణ లింక్ ఈమెయిల్ వస్తుంది.
లేదా, RSS రీడర్ ద్వారా సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
RSS Feed
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి