బైబిల్ వ్యక్తుల జీవిత చరిత్రలు

 బైబిల్ వ్యక్తుల జీవిత చరిత్రలు — పాత, కొత్త నిబంధన పాత్రల సంపూర్ణ కథలు తెలుగులో

బైబిల్ గ్రంథం కేవలం సిద్ధాంతాల సమాహారం కాదు — అది నిజ జీవిత మనుషుల, వారి పోరాటాల, వారి విశ్వాసపు ప్రయాణాల చరిత్ర. అబ్రాహాము నుండి యోబు వరకు, దావీదు నుండి పునీత స్తేఫాను వరకు — ప్రతి పాత్రలోనూ మనకు ఎదురయ్యే భయాలు, తప్పులు, పశ్చాత్తాపం, దేవుని కృప కనిపిస్తాయి. ఈ పేజీలో కార్మెల్ శోభ బ్లాగ్‌లో ఇప్పటివరకు రాసిన అన్ని బైబిల్ వ్యక్తుల సంపూర్ణ జీవిత చరిత్రలను ఒకేచోట, కాలక్రమానుసారంగా, తెలుగులో అందిస్తున్నాం. పితరులు, న్యాయాధిపతులు, రాజులు, ప్రవక్తలు, స్త్రీమూర్తులు, మరియు కొత్త నిబంధన శిష్యుల జీవితాల నుండి మీ విశ్వాస ప్రయాణానికి కావలసిన ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకోండి.

📜 పితరులు (Patriarchs)

అబ్రహాము సంపూర్ణ జీవిత చరిత్ర

దేవుని పిలుపు, పేరు మార్పు, లోతుతో విడిపోవుట, ఇస్సాకు బలి వృత్తాంతం — విశ్వాసులకు తండ్రిగా మారిన అబ్రహాము ఆధ్యాత్మిక ప్రయాణం.

పితరుడైన ఈసాకు సంపూర్ణ జీవిత చరిత్ర

మోరియా కొండపై బలియాగం, రిబ్కాతో వివాహం, యాకోబు-ఏసావుల జననం — నిశ్శబ్ద విశ్వాసానికి ప్రతీక అయిన ఈసాకు జీవితం.

యాకోబు సంపూర్ణ జీవిత చరిత్ర

అన్నను మోసగించుట నుండి పెనియేలులో దేవునితో పోరాడి ఇశ్రాయేలుగా మారే వరకు యాకోబు జీవిత పరివర్తన కథ.

యోసేపు జీవిత గాథ

సోదరుల ద్రోహం, చెరసాల శ్రమలను దాటి, దైవ సంకల్పంతో ఐగుప్తు సామ్రాజ్యానికే అధిపతిగా ఎదిగిన యోసేపు కథ.

యూదా జీవిత చరిత్ర

నైతిక పతనం, తామారు సంఘటన, బెన్యామీను కొరకు త్యాగం — మెస్సీయ వంశానికి మూలపురుషుడైన యూదా కథ.

మోషే జీవిత చరిత్ర

పుట్టుక నుండి మరణం వరకు — ఈజిప్టు విముక్తి, పది ఆజ్ఞలు, వాగ్దాన దేశపు యాత్ర సంపూర్ణ కథనం.

యెహోషువ జీవిత చరిత్ర

మోషే వారసుడు, వాగ్దాన దేశ విజయం, యెరికో పట్టణం పతనం — ధైర్యానికి, విధేయతకు నిదర్శనమైన యెహోషువ కథ.

⚖️ న్యాయాధిపతులు (Judges)

దెబోరా న్యాయాధిపతి జీవిత చరిత్ర

భయపడే సమయంలో నాయకత్వం వహించిన స్త్రీ దెబోరా కథ — ధైర్యం, విశ్వాసం, దేవుని నడిపింపు.

గిద్యోను జీవిత చరిత్ర – భయం నుండి విశ్వాసానికి ప్రయాణం

300 మంది సైనికులతో లక్షలాది మిద్యానీయులను ఓడించిన గిద్యోను కథ — భయం, సందేహం, విశ్వాసం, విజయం.

సంసోను పూర్తి చరిత్ర

అసాధారణ పరాక్రమ కార్యాలు, దెలీలా మోసం — బలవంతుడైన సంసోను జీవితం నుండి నేర్చుకోవలసిన పాఠాలు.

సమూయేలు జీవిత చరిత్ర

ఇశ్రాయేలు చివరి న్యాయాధిపతి, ప్రవక్త — దేవుని పిలుపు నుండి రాజును అభిషేకించే వరకు సమూయేలు గాథ.

👑 రాజులు (Kings)

ఇశ్రాయేలు మొదటి రాజు సౌలు చరిత్ర: అసూయ ఎలా అతణ్ణి నాశనం చేసింది?

జననం, అద్భుత విజయాలు, ఆత్మీయ పతనం, గిల్బోవా యుద్ధంలో అంతిమ ముగింపు — సౌలు రాజు కథ.

దావీదు జీవిత చరిత్ర: గొల్యాతు వధ, పాపం, పశ్చాత్తాపం

గొర్రెల కాపరి నుండి ఇశ్రాయేలు రాజు వరకు — దావీదు జీవితంలోని విజయాలు, తప్పులు, దేవుని కృప.

సొలొమోను మహారాజు జీవిత చరిత్ర: ప్రపంచంలోనే అత్యంత జ్ఞానవంతుడు ఎలా పతనమయ్యాడు?

జ్ఞానంతో ప్రారంభమై పతనంతో ముగిసిన సొలొమోను రాజు జీవితం — వైభవం, తప్పులు, పాఠాలు.

🌸 స్త్రీమూర్తులు (Women of Faith)

రూతు మరియు నవొమి: విశ్వసనీయత మరియు దేవుని కృప

విశ్వసనీయత, దేవుని కృప, ఆశ్చర్యకరమైన విమోచన గురించి తెలిపే పాత నిబంధన బైబిలు గాథ.

ఎస్తేరు: ప్రమాదకర సమయంలో ధైర్యం చూపిన స్త్రీ

ప్రాణాపాయ సమయంలో కూడా విశ్వాసంతో నిలబడిన రాణి ఎస్తేరు కథ — భయాన్ని జయించే ధైర్యానికి ప్రేరణ.

🙏 బాధలో నిలిచిన విశ్వాసం

యోబు జీవిత చరిత్ర - బాధలో నిలిచిన విశ్వాసం

నీతిమంతుడైన యోబు ఎదుర్కొన్న బాధలు, సాతాను సవాలు, స్నేహితుల వాదనలు, దేవుని జవాబు, రెట్టింపు ఆశీర్వాదంతో పునరుద్ధరణ.

✝️ కొత్త నిబంధన పాత్రలు

క్రీస్తు కొరకు ప్రథమ హత సాక్షి పునీత స్తేఫాను చరిత్ర

ప్రథమ డీకన్ పునీత స్తేఫాను జీవిత చరిత్ర, యూదుల న్యాయసభ ముందు సాక్ష్యం, క్రీస్తు కొరకు అమరవీరుడైన గాథ.

సువార్తకారుడైన పునీత యోహాను చరిత్ర మరియు విశిష్టత

యేసుక్రీస్తుకు అత్యంత ప్రియమైన శిష్యుడైన పునీత యోహాను జీవిత విశేషాలు, ఆయన సువార్త ప్రత్యేకత.

పునీత పేతురు పౌలు గార్ల మహోత్సవం

క్రీస్తు సంఘ స్తంభాలైన పునీత పేతురు, పౌలు గార్ల పరివర్తన మరియు రక్షణ సేవ.

మరియ మగ్దలేన జీవిత చరిత్ర

పాపం నుండి పరివర్తనకు, పునరుత్థాన సాక్షిగా — మరియ మగ్దలేనా జీవితం విశ్వాసాన్ని బలపరుస్తుంది.

మార్త, మరియ, లాజరు జీవిత చరిత్ర

బేతనియలో యేసు ప్రభువుతో అనుబంధం, సేవా-ఆరాధనల సమతుల్యత, లాజరు పునరుత్థానం నుండి పాఠాలు.

📲 కొత్త బైబిల్ జీవిత చరిత్రలు ప్రచురించినప్పుడు మీకు తెలియజేయాలి?

WhatsApp Channel Join చేయండి

ఈ జాబితా ప్రతి కొత్త బైబిల్ వ్యక్తుల జీవిత చరిత్ర పోస్ట్ ప్రచురించిన వెంటనే అప్‌డేట్ చేయబడుతుంది. మీరు ఏదైనా ప్రత్యేక బైబిల్ పాత్ర గురించి (ఉదా: నోవహు, కయీను-హేబెలు, రాహాబు, దానియేలు) తెలుసుకోవాలనుకుంటే, Contact Us పేజీ ద్వారా మాకు తెలియజేయండి.