26, ఫిబ్రవరి 2026, గురువారం

యేసు తో సమృద్ది

 5 వ సామాన్య ఆదివారం

యేసు తో సమృద్ది 

లూకా 5: 1-11 

 క్రీస్తు నాధుని యందు ప్రియ మిత్రులారా ,ఈనాటి  సువిశేషంలో యేసు ప్రభువు శిష్యులను ఎన్నుకోవడం చూస్తున్నాం. ఎందుకు యేసు ప్రభువు వీరిని ఎన్నుకున్నారు. వారికి ఉన్న లక్షణాలు ఏమిటి? వారు గొప్ప వారా ? లేక వారు ఎప్పుడు దేవుని మాటను ఖచ్చితముగా పట్టించేవారా ? వారు తెలివిగాలవారా? జ్ఞానవంతులా? అనేటువంటి ఈ ప్రశ్నలు అన్నింటికీ  సమాధానం కాదు అనే , అయిన యేసు ప్రభువు వారిని ఎన్నుకుంటున్నారు.ఈ లోకం దేనికి పనికి రారు అని చెప్పేవారిని దేవుడు ఎంనుకొంటున్నారు. వారి ద్వార గొప్ప కార్యాలు చేస్తున్నారు. 1 కోరింథీ 1:27 మనం చూస్తున్న. "వివేకవంతులను సిగ్గుపడునట్లు చేయుటకు, లోకముచే అవివేకులుగాభావింపబడువారిని దేవుడు ఎన్నుకొనేను."   యేసు ప్రభువు మొదటి శిష్యులు సంపూర్ణులు కారు వారిలో అనేక లోపాలు ఉన్నాయి. మొదటి పఠనంలో యోషయా తన అయోగ్యత వెల్లడి చేస్తున్నారు. కానీ దేవుని మాటలను చెప్పడానికి తాను సిద్దము అని చెబుతున్నారు. పేతురు కూడా తన అయోగ్యతను వెల్లడి చేస్తున్నారు, అది తెలియచేసి దేవుని అనుసరించదానికి సిద్దపడుతున్నాడు. 

యేసు ప్రభువు అనేక మందికి స్వస్థత ఇచ్చిన తరువాత ఇక్కడికి వస్తున్నారు. అందుకే  అక్కడ చాలా మంది ఉంటున్నారు. ఆయన మాటలు వినాలని, స్వస్థత పొందాలని వస్తున్నారు.  అక్కడ ఉన్న పడవలలో యేసు ప్రభువు కూర్చొని దేవుని వాక్కుని వినిపించారు. అక్కడ జాలరులు చేపలు పట్టుకున్న తరువాత ఏమి దొరకక వారి వలలను శుభ్రం చేసుకున్నారు. అంతకు ముందే యేసు ప్రభువు సిమోను పేతురు అత్త గారిని స్వస్థ పరిచారు, కనుక కృతజ్ఞత భావంతో వారి పడవను ఇచ్చి ఉండవచ్చు.

పేతురుకి యేసు ప్రభువు లోతుకి వెళ్ళి వల వేయమని అంటున్నారు. పేతురు చెబుతున్నారు. రాత్రి అంత కష్ట పడిన  ఉపయోగం లేదు కానీ నీవు చెప్పినట్లయితే చేస్తాను అని వల వేస్తున్నారు. పేతురుకి చాలా ఇబ్బందిగా ఉండవచ్చు, దేవుని వాక్కు విన్నా  కానీ తనకు రాత్రి మొత్తం పని చేసిన వారికి ఏమి దొరకలేదు. 

దేవుని పిలుపు చాలా విచిత్రముగా ఉంటుంది , ఎందుకంటే యేసు ప్రభువు జాలరి కాదు. పేతురు జాలరి చిన్నప్పటి నుండి చేపలు పడుతున్నాడు.  రాత్రి మొత్తం కష్ట పడ్డారు కాని ఏమి దొరకలేదు. అక్కడ చేపలు లేవు అని అనిపించవచ్చు. అయిన యేసు ప్రభువు అడుగుతున్నారు వల వేయమని, నేను జాలరిని , అదికాకుండా  రాత్రి మొత్తం పని చేశాను అక్కడ లేవు అని నాకు తెలుసు. నీవు దేవుని గురించి గొప్పగా చెప్పావు ఎందుకంటే నీవు బోధకుడవు  కనుక నీకు దేవుని గురించి బాగా చెప్పావు అని అనుకోని  ఉండవచ్చు.  చేపలు గురించి నీకు తెలియదులే అని అనుకోని ఉండవచ్చు కానీ యేసు ప్రభువు చెప్పినట్లు మాత్రం చేస్తున్నాడు. ఎందుకంటే నా కంటే నీవు గొప్ప వాడవు అని గ్రహించి. పేతురు గారికి ఇష్టం ఉండక పోవచ్చు.  కాని పేతరు దేవుని మాటను విధేయించారు. 

 పేతురు అంటున్నారు ప్రభువా రాత్రి మొత్తం మేము పని చేశాము కానీ ఏమి దొరకలేదు. అక్కడ ఏమి ఉండకపోవచ్చు కానీ మీ మాట తీసువేయలేక మేము వల వేస్తాము, అని వల వేస్తున్నారు. పేతురు, యేసు ప్రభువు చెప్పినట్లు చేయక పోతే ఏమి జరుగుతుంది. వారికి దొరికే సమృద్ది దొరికేది కాదు. సమృద్ది ఉండేది కాదు, యేసు ప్రభువు మాటలలో అటువంటి శక్తి ఉంది. నీకు సమృద్ది దొరుకుతుంది, నీకు మాత్రమే కాదు నీ చుట్టూ ఉన్న వారికి అది ఉంటుంది. మరలా పేతురుని ఆయన ఎన్నుకుంటున్నారు. అంత కంటే గొప్ప పనికి. దేవుని వాక్కును ప్రజలకు తీసుకువెళ్లాడానికి. దైవ రాజ్యనికి అందరిని సిద్దంచేయడానికి ఎన్నుకుంటున్నారు. 

నీవు గొప్ప దైవ జనుడవు నీవు చెప్పిన మాటలు బాగున్నాయి, కానీ నేను జాలరీని నాకు తెలుసు అక్కడ చేపలు ఉన్నాయో , లేవో. నీ మాట మీద నమ్మకముంచి కాదు కానీ నీ మాట కాదనలేక వల వేస్తున్నాను అనుకోని వుండవచ్చు, అక్కడ జరిగిన దానికి అంటే వారికి వలలు చీనుగునన్ని చేపలు పడటం చూసి అనుకుంటున్నారు, ఈయన సాధారణ భోదకుడు కాదు.  ఈయన అసాధారణమైన వ్యక్తి అని అర్ధమై , మోకరించి నన్ను వదలి వెళ్ళు ప్రభువా నేను అపవిత్రుడను అని చెపుతున్నారు, తన నిజ స్వరూపం ఆయనకు  తెలుస్తుంది. నిజానికి నీవు ఎటువంటి వాడవు అని నీకు తెలిసేది యేసు ప్రభువు సమక్షంలోనే. ఇదే మొదటి పఠనంలో జరుగుతుంది. . నీవు అహం తో వున్నట్లయితే దాని అర్ధం నీవు ఇంకా దేవుడిని తెలుసుకోలేదు. మనం మన ప్రక్క వారి గురించి లేక చెడ్డ వారి గురించి పోల్చుకొని నేను మంచి వాడినే అని అనుకుంటున్నాము.  

వారి సొంత బలం మీద ఆదారపడినప్పుడు వారికి ఏమి దొరకలేదు, ఎప్పుడు అయితే వారు యేసు ప్రభువు మాట వింటున్నారో వారికి ఎప్పుడు దొరకనంత చేపలు దొరుకుతున్నాయి. ఎప్పుడైతే నీవు ఆయన మాటకు కట్టుబడుతావో నీ శక్తిని ,నీ ప్రతిభను నీవు పూర్తిగా వినియోగించవచ్చు, దేవుడు  నిన్ను పూర్తిగా తనకు అనుకూలముగా ఉపయోగించుకుంటారు. ఇది విశ్వాసంతో కూడిన విధేయత ఎందుకంటే అక్కడ చేపలు లేవని నా అనుభవం చెపుతుంది కానీ నేను వల వేస్తాను నీవు చెప్పావు కాబట్టి , ఆయన  విధేయత యొక్క ఫలితం అన్నీ చేపలు పడటం, పేతురు గారు ఎన్నడూ పట్టుకోలేనాన్ని చేపలు , ఇది పేతరు గారికి యేసు ప్రభువుని గొప్పతనం చూడటానికి ఉపయోగపడింది.  

యేసు ప్రభువుని వినడానికి ప్రతి ఒక్కరు వచ్చారు, కష్టాలలో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు, బాదలలో ఉన్నవారు, మానసిక రొగులు, దేవుని వాక్కు కోసం వచ్చిన వారు ఇలా అన్నీ రకాల ప్రజలు ఉన్నారు. కానీ వారి మద్య మరియొక వర్గం వారు కూడా ఉన్నారు వారే రాత్రి మొత్తం పని చేసి కూడా ఏమి లేకుండా ఉన్నవారు, వారి పని ఉంది కానీ చేసిన తరువాత  ఫలితం మాత్రం శూన్యం. ఈ కోవలోని వారు పేతురు, మరియు మిగిలిన జాలరులు. ఒకరకమైన భాద ఇంటికి ఏమి తీసుకోపోవాలి అని , అంత శ్రమ వృధా అయ్యింది అని, వారు కూడా యేసు ప్రభువు మాటలు విన్నారు. యేసు ప్రభువు భోదన తరువాత వారితో మాటలాడుతున్నారు. మనలో అనేక మంది ఈ కోవలోని వారే. ఈ శూన్యత నుండి బయట పడాలి అంటే మనం ఆయనతో ఉండాలి. అప్పుడు మనం సమృద్దిని పొందుతాము. 

 ఈ అద్భుతం తరువాత ,ఆశ్చర్యం , భయం , వారి అయోగ్యత మొత్తం వారి ముందు కనపడుతున్నాయి, ఇతను ఎవరూ ? స్వస్థత ఇస్తున్నారు, సాతానును వెడలగొడుతున్నారు, చేయమన్నది చేయగానే లెక్కకు మిక్కుటముగా ఆ పని ఫలితం ఉంటుంది. ఇంతటి దైవ జనుడి వద్ద నేను ఉండవలసిన వాడిని కాదు అని  తన అయోగ్యతను వ్యక్త పరుస్తున్నారు, నా నుండి వెళ్ళమని చెబుతున్నారు. 

ప్రభు ! నా నుంచి వెళ్లిపో , నేను పాపాత్ముడను - ఎందుకు ఇలా అంటున్నారు,  యేసు ప్రభువును  గొప్ప తనం చూసిన తరువాత పేతురు  తన స్వరూపాన్ని చూసుకుంటున్నారు, ఎందుకంటే ఎప్పుడైతే దేవున్ని చూస్తామో అప్పుడు మన నిజ స్వరూపం మనకు తెలుస్తుంది. లేకపోతే మనం మనలను గొప్ప వారిగా చూసుకుంటాం. ప్రభు ! నేను పాపిని నన్ను విడిచి పెట్టుము. అని అంటున్నాడు.  మొదటి పఠనములో యోషయా ప్రవక్త ఒక దర్శనము చూస్తున్నారు. ఆ దర్శనం ద్వార ఒక విషయం తెలుసుకుంటున్నారు, పాపి దగ్గరకు కూడా దేవుడు వస్తారు అని తెలియ చేస్తున్నారు. అంటే దేవుడు  నేను పాపిని అని నన్ను దూరం చెయ్యరు అని తెలుస్తుంది. ఇక్కడ పేతరు గారు  మొదటి సారి యేసు ప్రభువుని కలుస్తున్నప్పుడు తనను తాను కలుసుకుంటున్నారు, తన గురించి తెలుసుకుంటున్నాడు. నన్ను గురించి నేను పూర్తిగా  తెలుసుకునేది  యేసు ప్రభువుని సమక్షంలోనే , ఆయన సమక్షంలో నేను ఏమిటో నాకు పూర్తిగా అవగతమవుతుంది. ఇక్కడ పేతురు గారికీ  దేవునికి తన మీద ఉన్న ప్రేమ తెలుస్తుంది. అంటే నేను ఈ విధంగా ఉన్న నన్ను ఆయన దూరం పెట్టారు అని ఆయన్ను అభిమానించడం, ప్రేమించడం మొదలు పెడుతున్నారు. 

నిన్ను చేపలు పట్టువానిగా కాక మనుషులను పట్టు వానిగా చేయుట అంటే  ఏమిటి? ఇది ఏవిధముగా జరుగుతుందో ఒకసారి ఆలోచించండి? పునీత పేతురుగారు  ద్వార అనేకమంది  జ్ఞాన స్నానం పొందుతున్నారు. అపోస్తుల కార్యాలు 2 వ అధ్యాయం 41 వ వచనం మనం చదువుతాం. ఆయన భోధన విని రమారమి 3000 మంది జ్ఞానస్నానం పొందారు. 4 వ అధ్యాయం లో 5000 మంది అవుతున్నారు. ఆయన దైవ రాజ్యమునకు మనుషులను పట్టే వానిగా మారుతున్నారు. అంతే కాదు దానిలో సమృద్దిని సాధిస్తున్నారు. ప్రియ మిత్రులారా ఈ సువిశేషం ద్వార మనం దేవునితో ఉంటే మనకు సమృద్దిగా ఆయన అన్నీ ప్రసాదిస్తారు అని తెలుసుకుంటున్నాం కనుక ఆవిధంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. ఆమెన్ 

యేసు ప్రభువు బాప్తిస్మ ఆదివారం

 యేసు ప్రభువు బాప్తిస్మ ఆదివారం 

యెషయా 40:1-5, 9-11, తీతు 2:11-14,3:4-7, లూకా 3:15-16,21-22

యేసు ప్రభువు బప్తిస్మము చాలా ప్రాముఖ్యత కలిగినది మన రక్షణ చరిత్రలో అందుకనే సువార్తికులందరు దీని గురించి రాసారు. మత్తయి 3:14-15 యేసు ప్రభుని బప్తిస్మము ఆయన పాపం చేసినందుకు కాదు దేవుని ఆజ్ఞలకు అనుకూలముగా స్వీకరించాడు అని తెలియచేస్తుంది. యోహాను , యేసు ప్రభువుల మధ్య సంభాషణ ద్వారా ఇది తెలుసుకుంటున్నాము. యోహాను బప్తిస్మము పాప జీవితానికి ముగింపును పలికి నూతన జీవితాన్ని సాగించడానికి కానీ యేసు ప్రభువు స్వీకరించిన బాప్తిస్మము ఒక నూతన కార్యాన్ని స్వీకరించడానికి, అంటే తన పెంపుడు తండ్రి అయినా యేసేపు గారి పని అయిన వడ్రంగి పనిని వదలి ఒక నూతన కార్యాన్ని స్వీకరిస్తున్నారు లేక మొదలు పెడుతున్నారు. ఆ నూతన కార్యం ఏమిటి అంటే మానవ రక్షణ కార్యం. ఈ రక్షణ కార్యం మొదలు పెట్టడానికే యేసు ప్రభువు బాప్తిస్మము తీసుకుంటున్నారు. 

యేసు ప్రభువు బప్తిస్మము తీసుకున్నప్పుడు జరిగిన విషయాలు మనము గురించి ఈ రోజు మనము వింటున్నాము. అవి ఏమిటి అంటే 1. పరలోకం తెరవబడుతుంది. పరలోకం తెరవబడటం అనే మాట దర్శన గ్రంధం లోని భాషలా ఉంది. పరలోకం తెరవ బడటం అంటే  యుదయా ప్రజలు పరలోకానికి భూలోకానికి మధ్య ఒక విభజన ఉంది అని, అవి ఇప్పుడు వేరు చేయ బడినవి  అని నమ్మారు.  అంటే ఇప్పుడు పరలోకానికి , భూలోకానికి ఒక అడ్డు ఉందని అది కొన్ని ప్రత్యేక సంధర్భాలలో తొలగించబడుతుంది అని వారి నమ్మకం. ఎప్పుడు  ఈ ప్రత్యేక సంధర్భం లేక ఎప్పుడు ఇది జరుగుతుంది అంటే పాత నిబంధనలో ప్రవక్తలు , దీర్ఘ దర్శులు దేవ రహస్యాలను చూస్తారు కాబట్టి వారి దృష్టిలో పరలోకం భూలోకం ఏకమవుతాయి. అంటే దేవుడు భూలోకానికి వస్తున్నాడు అని అర్థం. పరలోకం మరియు భూలోకం మధ్య సంగమం ఏర్పడుతుంది. 

ఇది చాలా కాలం తరువాత యేసు ప్రభువు బాప్తిస్మము రోజున జరుగుతుంది. మనం యెషయా  64:1 లో చూసినట్లయితే యెషయా ప్రవక్త "ఓ దేవా ! నీవు పరలోకం చీల్చి క్రిందికి దిగి రమ్ము" అని అంటున్నారు. ఈ ప్రార్ధన అర్ధం దేవుడు ఆయన్ను పూర్వ కాలంలో వలే తెలియ పరచాలి అని, నిర్గమ 19:16-19 , ఇక్కడ దేవుడు పర్వతము నుండి వస్తారు. అంటే దేవుడు పరలోకం నుండి భూలోకానికి వస్తూంటారు. ఎప్పుడు ఇది జరుగుతుంది అంటే దేవుడు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియ చేసే సమయంలో లేక కొన్ని గొప్ప కార్యాలు ప్రారంభించే సమయములో జరుగుతుంది.  

యేసు ప్రభువు బాప్తిస్మము లో జరుగుతుంది కూడా ఇదే. ఇక్కడ సంభాషణ  జరుగుతుంది యేసు ప్రభువుకి మరియు దేవునికి మద్యలో, అందుకే యేసు ప్రభువు ప్రారంభించే పని, సరి అయినది అని దేవుని ఆమోదం పరలోక వాణి ద్వార మరియు పవిత్రాత్మ  యేసు ప్రభువు  మీద పావుర రూపమున దిగి రావడం ద్వార తెలుస్తుంది. రక్షణ కార్యాన్ని ప్రారంభించడానికి  దేవుని అనుగ్రహం ఇక్కడ జరుగుతుంది. పవిత్రాత్మ ఈ కార్యానికి తోడ్పాటు అందిస్తుంది. 

 పరలోక వాణి  : బాప్తిస్మము జరుగుతున్న సమయములో పరలోకము నుండి ఒక వాణి  వినబడుతుంది.  ఇక్కడ జరిగిన ఈ సందర్భంలో మిగిలిన వారు నిజముగా అక్కడ ఉన్న వారందరికీ వినబడింది లేనిది మనకు తెలియదు. ఎందుకంటే యేసు ప్రభువు పౌలుకు  డమాస్కస్ (అ. చ 9:7,22:9) దర్శన మిచ్చిన సమయములో పౌలుతో ఉన్న ప్రజలు వెలుగును మాత్రమే చూసారు, శబ్దం విన్నారు కానీ ఆ మాటలను గుర్తు పట్టలేదు. యేసు ప్రభువుకు మాత్రము ఇక్కడ తండ్రి మాటలు ఊరటను బలాన్ని ఇస్తున్నాయి. 

దేవుడు ప్రజలతో మాట్లాడటం మనం పాత నిబంధనలో కూడా  చూస్తాం. ద్వితీ 4:10-12, నిర్గమ 3:4 కనుక పరలోక వాణి అనేది యిస్రాయేలు ప్రజలకు తెలుసు. నీవు నా ప్రియమైన కుమారుడవు పరలోక వాణి పలుకుతుంది  అని వింటున్నాము.  అంటే ఈ మాటలు యేసు ప్రభువు కొరకు వచ్చినవి. ఈయన దేవుని కుమారుడు అని అదే విధముగా ఈయన చేసే పని దేవుని కార్యము అని తెలియచేస్తుంది. అంటే ఈయన చేయబోయే పనికి తండ్రి ఆమోదం ఉంది అని తెలియచేస్తుంది. 

ఈ క్రీస్తు బాప్తిస్మము మనకు ఏమి తెలియ చేస్తుంది? అని అంటే మొదటిగా దేవుని ప్రణాళిక అమలు చేయడానికి నేను సిద్దముగా ఉండాలి అని తెలియ చేస్తుంది. ఎందుకంటే పునీత బాప్తిస్మ యోహను గారు యేసు ప్రభువు బాప్తిస్మము స్వీకరించడానికి వచ్చినప్పుడు, నేను నీకు బాప్తిస్మము ఇవ్వడానికి అర్హుడను కాను నేనే నీ వద్ద బాప్తిస్మము స్వీకరించ వలసిన వాడను అని అంటున్నారు. కాని యేసు ప్రభువు ఇప్పడు నిర్ణయించబడిన విధముగా జరగనివ్వమని చెబుతున్నాడు. అంటే దేవుని యొక్క ప్రణాళిక చేయడానికి ఆయన తన గొప్పతనం  లేక దేనినైనా కూడా వదులు కోవడానికి సిద్దముగా ఉన్నాడు అని తెలియచేస్తున్నారు. ఈనాటి సువిశేషంలో యేసు ప్రభువు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు అని మనం చూస్తున్నాం. ఈ రోజుతో తన రక్షణ కార్యాన్ని ప్రారంభిస్తున్నారు. ఆయన పరిచర్య , స్వస్థత చేయటం, క్షమించడం, దేవుని నుండి దూరముగా వెళ్ళిన వారిని వెదకి  తీసుకురావడం మొదలు పెట్టబోవుచున్నారు. వానికి ముందుగా  బాప్తిస్మ యోహను దగ్గరకు వస్తున్నారు. యోహను పాప క్షమాపణ పొందడానికి పశ్చాతాపం కలిగి జీవించమని పిలుపు ఇచ్చారు, వారికి బాప్తిస్మము ఇస్తున్నారు. 

ఎందుకు యేసు ప్రభువు బాప్తిస్మము తీసుకుంటున్నారు?  యోహను ఇచ్చే బాప్తిస్మము పాప క్షమాపణకు మరి యేసు ప్రభవులో ఎటువంటి పాపం లేదు కదా ! యేసు ప్రభువుకి ఈ బాప్తిస్మము అవసరం లేదు, అందుకే యోహను యేసు ప్రభవుతో  నేనే నీ వద్ద బాప్తిస్మము తీసుకోవలసిన వాడిని, నేను నీకు బాప్తిస్మము ఇవ్వడమా ? అని అంటున్నారు. కానీ యేసు ప్రభువు ఇప్పటికీ ఇటులనే కానిమ్ము, సంకల్పమును మనము ఇప్పుడు ఈ రీతిగా నెరవేర్చుట సమంజసము అని చెపుతున్నారు.  దాని అర్దము దేవుని సంకల్పమును నెరవేర్చుటకు నేను ఏమి చేయడానికి అయిన సిద్దమే అని తెలుపుతున్నారు. యేసు ప్రభువు జీవితము మొత్తము కూడా తండ్రి దేవుని సంకల్పమును నెరవేర్చడమే. అది చేయడము కోసము యేసు ప్రభువు ఎంత వరకు అయిన వెళతారు. తన కంటే తక్కువ వాడైన యోహను దగ్గర పాప క్షమాపణకు ఇచ్చే బాప్తిస్మము తీసుకుంటున్నారు. తన శిష్యుల కాళ్ళు కడుగుతున్నారు, తన ప్రాణాన్ని ఇస్తున్నారు.  దేవునితో తన సమానత్వాన్ని వదలి మానవునిగా మన మధ్యకి వస్తున్నారు. కారణం ఏమిటి అంటే దేవుని సంకల్పం నెరవేరాలి. యేసు ప్రభువు ఒక అనమకునిగా ఎందుకు జన్మించాలి, ఎందుకు మరణించాలి, పాపుల చేత ఎందుకు నిందించబడాలి, ఎందుకు వారి చేత శిక్షించబడాలి , అన్నిటికీ సమాదానం యోహానుకు యేసు ప్రభువు ఇస్తున్నారు. దేవుని సంకల్పం నెరవేరుటకు ఈ విధముగా జరుగనివ్వు అని అంటున్నారు. దేవుని చిత్తం నెరవేర్చడానికి నేను ఏమైనా చేస్తాను అని చెబుతున్నారు. 

ఈ రోజు యేసు ప్రభువు బాప్తిస్మము ద్వార ఈ సుగుణాన్ని అలవర్చుకోవాలి దేవుని చిత్తము నెరవేర్చడానికి నేను ఏమి చేయడానికైనా సిద్దముగా ఉండాలి. మనము కూడా ఆ విధంగా జీవించడానికి సిద్దముగా ఉందాం. ఆమెన్ 

Fr. Amruth 


లూకా 5: 33-39

 లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తి...