17, డిసెంబర్ 2019, మంగళవారం

కార్మెల్ పర్వత ఆరోహణం


ఓ గాఢాంధకార  రాత్రి 
ప్రియుని మీద కోరిక తో దహించుకు పోతూ 
 ఓ ఆనంద సమయాన    
నేను బయటకు కనపడకుండా  పోయాను 
నా ఆత్మ మొతం నిశ్చలంగ ఉంది 

2   అంధకారం లో సురక్షితంగా ,
రహస్య నిచ్చెన తో మరువేషం లో
ఆ  అదృష్ట  భాగ్యం
అంధకారం లో  దాగిఉన్నా
నా ఆత్మ ఇప్పుడు నిచ్చలంగా ఉంది

3 ఆ సంతోషకర   రాత్రి
రహస్యంగా నన్నెవరు   చూడకుండా ,
నేను కూడా ఏమి చూడకుండా
ఏ దీపం  లేక మార్గ చూపరి  లేకుండా
నా హృదయములో రగిలే దీపం తప్ప

4 ఇది నన్ను నడిపించగా
మధ్యాన్నపు వెలుగు కంటే ఎక్కువుగా
అతను నా కోరకు వేచిఉన్న చోటుకు
ఆయన నాకు బాగా  తెలుసిన
ఎవరు కనపడని చోటుకు

5 ఓ మార్గచుపరి అయ్యిన రాత్రి
ఓ తోలి సంధ్య కంటే   అందమైన  రాత్రి
ఓ ఐక్యం చేసిన రాత్రి
ప్రేయసిని  తన ప్రియునితో
ప్రియురాలుని తన ప్రియునిలో  మారుతున్న రాత్రి

6 నా   పుష్పిస్తున్న ఏద మీద
నా ప్రియుని కోసమే నే ఉంచిన
చోట  తాను పడుకొని నిద్రిస్తుండ
 నేను తనను లాలన చేస్తుండగా
అక్కడ దేవదారు వీచగా  ఓ చిరు గాలిలో

7 ఎప్పుడు  ఆ చిరుగాలి బురుజు నుండి విచిందో
తన వెంట్రుకలు విగినప్పుడు
తాను నా మెడను గాయపరిచాడు
తన  మృదువువైన చేతితో
నా ఇంద్రియాలని స్తంభింపచేస్తూ

8 నన్ను  నేను పరీత్యంజించి మరియు మరిచిపోయి
నా ప్రియుని మీద నా మొమును వాల్చి
అన్నియు నిలిచిపోగా నా నుండి నేను వెడలిపోతిని
నా జాగ్రత్తలన్ని వదలి
లిల్లీల మధ్య  మరచిపోతిని 

ఆగమన కాలం మొదటి ఆదివారం

ఆగమన కాలం మొదటి ఆదివారం  యిర్మీయా 33:14-16, 1 తెస్స3:12,4:2, లూకా 21:25-28,34-36 ఈనాడు తల్లి శ్రీ సభ ఆగమన కాలమును ప్రారంభించినది. ఆగమన కాలంత...