26, ఫిబ్రవరి 2026, గురువారం

అబ్రహాము జీవిత చరిత్ర

 అబ్రహాము జీవిత చరిత్ర 

అబ్రహాము తేరా చిన్న కుమారుడు. అబ్రహాము అసలు పేరు అబ్రం, ఆ పేరుకు గల అర్ధం ఉన్నతికి తండ్రి. దేవుడు అబ్రహాముకు అబ్రహాము అని పేరు మార్చినది తనకు లెక్కకు మిక్కుటముగా సంతానము కలుగ చేస్తాను అని చెప్పి తన పేరును మార్చి తనను అబ్రహాము అని పిలిచాడు, అనగా అనేక తెగలకు తండ్రి అని అర్ధం. 

అబ్రహాము దేవుని స్నేహితుడు 

అబ్రహామును దేవుడు ఒక క్రొత్త జీవన విధానానికి పిలుచుకున్నాడు. దేవుని మీద విశ్వాసముంచి జీవించే విధానం అబ్రహముతో మొదలవుతుంది. ఒక ఒడంబడిక విధానం కూడా అబ్రహాముతోనే మొదలవుతుంది. దేవునికి స్నేహితునిగా దేవునితో స్నేహితుని వలె మాటలాడిన మొదటి వ్యక్తిగా కూడా అబ్రహము ప్రసిద్ది చెందడం జరిగింది. 

అబ్రహాము తెరా ముగ్గురు కుమారులలో ఒకడు. మిగిలిన ఇద్దరు కుమారులు నహోరు మరియు హారను, హారను ఉరు పట్టణములోనే చనిపోయాడు. లోతు అను వాడు ఈ హారను కుమారుడు.   తెరా కల్దియుల దేశమైన ఉరు అనే ప్రాంతమునకు చెందిన వాడు. తరువాత కనాను దేశమునను వెళుతూ హారములో స్థిర పడిపోయారు. అబ్రహాము 73 సంవత్సరాల వయసులో ఉండగా దేవుని స్వరమును విన్నాడు. దేవుడు ఆయనతో తన దేశమును, పుట్టినింటిని, చుట్టపక్కాలను వదలి తాను చూపే దేశమునకు వెళ్ళమని చెప్పాడు. దాని ద్వారా ఆయనను ఒక గొప్ప జాతిగా తీర్చిదిద్దుతాను అని దేవుడు అబ్రహాముకు చెప్పడం జరిగింది. అబ్రహాము ఆ మాటలకు విలువనిచ్చి దేవుడు చెప్పినట్లు చేయడం జరిగింది. తాను హారనులో సంపాదించినది, తన సేవకులతో, భార్య సారా మరియు తన సోదరుని కుమారుడు  లోతుతో కలసి అబ్రహాము హారనును వదలినప్పుడు అబ్రహాము వయస్సు 75 సంవత్సరాలు. హారాను నుండి కనాను దేశములోని షెకెము అనే ప్రదేశం చేరి మోరే వద్ద సింధూర వృక్షము వద్ద ప్రభువు కనపడి ఈ దేశమును నీ సంతతికి ఇస్తాను అని చెప్పాడు. అక్కడ అబ్రహాము ఒక బలి పీఠము నిర్మించి బేతేలు , హాయికి మధ్య బలి పీఠము నిర్మించి దేవుని ఆరాధించి, అక్కడనుండి నెగెబు వెళ్ళాడు. అక్కడ కరువు రాగ ఐగుప్తు వెళ్ళి అక్కడ తన భార్య సారాను తన సోదరి అని చెప్పమని అడిగెను ఎందుకంటే ఆమె మిక్కిలి అందగత్తె, మరియు ఆమె నిమిత్తం అబ్రహము చంపుతారు ఏమో అని అతను భయపడెను. ఫరో రాజు వద్దుకు తన సేవకులు తీసుకోపొగా ఆమె వలన అతను అబ్రహాముకు మేలు చేయగా ఆయన గొర్రెలను  , పశువులను సంపాదించేను. దేవుడు ఆమెను కాపాడుటకు ఫరో రాజు కుటుంబంలో అనేక రోగముల పాలు చేయగా ఫరో నిజము తెలుసుకొని అబ్రహామును పిలిచి తన భార్యను తీసుకొని పొమ్మని చెప్పగా ఆయన అలాగే తన సంపద మొత్తం తీసుకొని అక్కడ నుండి మరల నెగెబుకు వెళ్ళి అక్కడ నుండి బేతెలు హాయికి మధ్య మొదట గుడారము ఏర్పాటు చేసిన ప్రదేశమునకు వచ్చెను. అక్కడ లోతు మరియు అబ్రహాము సేవకుల మధ్య గొడవలు జరుగగా కనుక అబ్రహాము లోతుతో మనము విడిపోవుట మేలు అని ఇక్కడ నుండి మన ముందు కావలసినంత నేల ఉంది. నీవు కుడి వైపుకు వెళ్ళిన నేను ఎడమ వైపు వెలుతాను, లేక నివు ఎడమ వైపు వెళ్ళిన కుడి వైపు వెలుతాను అని చెప్పగా లోతు యొర్దాను మైదానం వైపు చూచి అక్కడ నీటి వనరు ఉన్నదని గ్రహించి యొర్ధాను కోరుకొని అక్కడకు వెళ్ళడానికి కోరుకున్నారు. అబ్రహాము హెబ్రోనులో మమ్రె  వద్ద ఉండెను. 

అబ్రహాము యుద్దము చేయుట 

సొదొమ రాజు, గోమోర రాజు , అద్మా రాజు, సెబోయీము రాజు, బెలారాజగు సోయారులు ఏకమై వారిని అనేక సంవత్సరాలు సామంతులుగా చేసిన ఎలాము, గోయీము, షీనారు , ఎల్లాసరు రాజుల మీద యుద్దానికి వెళ్ళి మరల ఓడిపోవడం చేత శత్రువులు సొదొమో, గోమోరలో ఉన్న ఆస్తిని తీసుకొని పొతు వారు సొదొమలో ఉన్న లోతుని కూడా బంధించి తీసుకెళ్లారు. అది తెలిసిన అబ్రహాము తన ఇంట ఉన్న వారిని మూడు వందల పద్దెనిమిది మందిని తీసుకొని పోయి రాత్రి వేళ వారిని ఎదురించి వారిని తరిమి కొట్టి లోతును అతని స్త్రీలను, ఆస్తిని విడిపించి తీసుకొని వచ్చారు. యుద్ధం నుండి పారిపోయిన సొదొమ రాజు అబ్రహాము చేసిన పని తెలుసుకొని అతని కలుసుకోవడానికి వచ్చి మనుషులను తనకి అప్పగించి వస్తువులను తీసుకోమని చెప్పినప్పుడు అబ్రహాము తన ప్రజలను మాత్రమే తీసుకొని మిగిలిన వాటిని సొదొమ రాజుకే ఇచ్చి భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు నేను అబ్రహామును ధనవంతున్ని చేసాను అని అనకూడదు అని మొత్తం ఇచ్చి వేశాడు. అబ్రహము  షాలేము రాజు మెల్కిసెదేకు రొట్టెను ద్రాక్షసారాయమును కొనివచ్చి అబ్రహాముకు ఆశ్వీరచనములు పలికాడు. 

యిష్మాయేలు 

అబ్రహాముకు సారాతో పిల్లలు పుట్టక పోవడం వలన ఆమెకు ఉన్న ఒక ఐగుప్తు దాసి కన్య హాగారును స్వీకరించి తనకు బిడ్డలు కలుగ జేయమని కోరింది. ఆమె గర్భం దరించినప్పటి నుండి సారాను  చులకనగా చూడటం మొదలు పెట్టేది. సారాయి తరువాత ఆమెను పలు విధాలుగా ఇబ్బంది పెట్టగా ఆమె పారిపోయినది. 

ఒడంబడిక - సున్నతి 

అబ్రామునకు తొంబది తొమ్మిది సంవత్సరాల వయసులో దేవుడు అబ్రాముతో ఒక ఒడంబడిక ఏర్పాటు చేసుకొని ఆయన పేరును మార్చి అబ్రహాము అని పెట్టెను. ఇక నిన్ను అనేక జాతులకు తండ్రిగా చేసెదను అని చెప్పెను. నేను నీకు కానను భూమిని నీకు నీ సంతతికి ఇస్తాను అని చెప్పాడు. ఈ ఒడంబడిక గుర్తుగా సున్నతి చేసుకొనవలయును అని చెప్పారు. అలానే సారాయి పేరును సారా అని మార్చారు. ఆమె సకల జాతులకు తల్లి అగును అని చెప్పారు. 

అబ్రహాము వేడుకోలు 

మమ్రే యొద్ద ఉన్న సింధూర వృక్ష వనమున అబ్రహము తన గుడారము దగ్గర వుండగా ముగ్గురు వ్యక్తులు అక్కడ ఆయన ముందు వున్నారు. అబ్రహము గుడారము వెళ్ళి వారిని తన ఇంటిని సందర్శించమని అడిగి వారికి అతిధ్యమిచ్చారు. వారు తరువాత సారా గురించి వాకబు చేసి ఆమె మరుసటి సంవత్సరానికి ఆమె ఒక కుమారుని కనును అని చెప్పిరి. అది తలుపు చాటున నిలచి విన్న సారా తనలో తాను నవ్వుకుంది. అక్కడ నుండి సొదొమ వైపు వారు వెళుతూ అబ్రహాముకు తాము పోవుచున్న పని గురించి చెప్పారు. అక్కడి ప్రజలు పాపపు జీవితము గురించి తన చెవిన పడిన విషయమును అబ్రహముతో చెప్పడం జరిగినది. అబ్రహాము దేవునితో చెడ్డ వారితో పాటు మంచి వారిని కూడా నాశనం చేయుదురా అని ప్రశ్నించెను. ఆ పట్టణములో ఏబది మంది మంచి వారు ఉన్నచో ఆ నగరమును నాశనము చేయక కాపాడవా అని అడుగగా దేవుడు ఆ పట్టణమున ఏబది మంది మంచి వారు ఉన్నట్లయితే వారిని కాపాడుతానని చెప్పెను. ఆ విధంగా అడుగుతూ చివరకు పది మంది మంచి వారు ఉన్న ఆ పట్టణమును పాడు చేయవద్దని చెప్పగా దేవుడు దానికి ఒప్పుకోని అక్కడ నుండి వెళ్ళి పోవడం జరిగింది. 

అబ్రహాము - అబీమెలెకు 

అబ్రహాము అక్కడ నుండి నేగేబునకు వెళ్ళి కాదేషు , షూరు మధ్య ఉన్న గెరారులో పరదేశివలే నివసిస్తూ ఉన్నాడు. తన భార్యను చెల్లెలిగా చెప్పి అక్కడ జీవించేవాడు. గెరారు రాజు అబీమెలెకు సారాను తన అంతఃపురమునకు చేర్చుకున్నాడు. కాని దేవుడు ఆ రాజుకు కలలో కనపడి ఆమె వివాహిత అని చెప్పి, ఆమె వలన నీవు చనిపోతావు అని చెప్పగా అందుకు ప్రభూ నేను నిర్ధోషిని అని చెప్పి, అబ్రహామే ఆమె తన చెల్లి అని చెప్పిన సంగతి ఆమె కూడా అబ్రహాము తన  సోదరుడు అని చెప్పినందుకు దేవుడు అతనిని మన్నించి అబ్రహాముకు సారాను అప్పగించమని చెప్పి అబ్రహాము గొప్పతనను గురించి ఆయన ప్రవక్త అని , ఆయన కొరకు విన్నపములు చేస్తాడు అని చెప్పి, సారాను అబ్రహాముకు అప్పగింపకపోతే తాను మరణిస్తాడు అని చెప్పెను. అబిమేలేకు అబ్రహాముకు సారాను అప్పగించి గొర్రెలను, గోడ్లను, దాసిదాసులను అబ్రహాముకు ఇవ్వడం జరిగింది. అప్పుడు అబిమెలేకు ఇంటిలో ఉన్న వారు గర్భం ధరించారు. అంతకు ముందు దేవుడు వారి గర్భములను మూసివేసేను. 

అబ్రహామునకు వాగ్ధాన ఫలం 

దేవుడు అబ్రహామునకు మాటఇచ్చినట్లే దేవుడు సారా పట్ల కనికరం చూపి ఆమె గర్భం దాల్చి కుమారున్నీ కనింది, ఆ కుమారుడే ఈసాకు. ఈసాకు పుట్టినప్పుడు అబ్రహాము వయసు 100 సంవత్సరాలు. సారా అబ్రహాముతో హాగారును మరియు యిష్మాయేలును ఇంటి నుండి పంపించి వేయమని అడుగగా ఆయన చాలా బాధ పడ్డాడు. దేవుడు ఆయనకు ఈసాకే  తన వారసుడు అని చెప్పగా అలానే చేశాడు. కాని దేవుడు వాగ్ధాన ఫలముగా ఉన్న ఈసాకును బలిగా అర్పించమని అడిగారు. మోరియా ప్రదేశమున అబ్రహాము దేవుడు చూపించిన కొండ దగ్గరకు ఈసాకును బలి ఇవ్వడానికి  ఉదయాన్నే , ఒక గాడిద మీద బలికి కావలసిన అన్ని వస్తువులను తీసుకొని ఇద్దరు సేవకులతో బయలుదేరి వెళ్ళాడు. తన సేవకులను క్రిందనే ఉంచి ఈసాకుకు కట్టెల మోపును ఇచ్చి తాను కత్తి మరియు నిప్పు తీసుకొని కొండమీదకు వెళ్ళాడు. మార్గ మధ్యలో ఈసాకు తమకు బలికి కావలసిన బలి వస్తువు కొరకు అడుగగా దేవుడే సమకూరుస్తాడు అని సమాధానం  చెబుతాడు. ఆ కొండ మీదకు పోయిన తరువాత అక్కడ బలి ఇవ్వడానికి బలి పీఠం ఏర్పాటు చేసి  మొత్తం సమకూర్చిన తరువాత కుమారున్నీ బంధించి బలి ఇవ్వడానికి కత్తిని తీసుకొనగా అప్పుడు యావే దూత అబ్రహామును ఈసాకును ఏమి చేయవద్దని చెప్పి, అబ్రహాము హృదయం  తనకు తెలుసు అని, తన కుమారున్నీ కూడా చంపడానికి వెనుకాడ లేదని అక్కడ బలి ఇవ్వడానికి ఒక పొట్టేలు పొదలో ఉన్నదని తెలియ చేస్తుంది. అప్పుడు ఆ పొట్టేలును బలిగా అర్పించడం జరుగుతుంది. అక్కడ నుండి వచ్చే సమయంలో మరల దేవుని దూత ఆయనను దీవిస్తుంది. బెర్షాబా వచ్చి మరణించే వరకు అక్కడే ఉన్నారు. 

అబ్రహాము పండు ముసలి వయసుకు వచ్చినప్పుడు తన కుమారుడు పెండ్లి చేయావలేనని సంకల్పించి తాను తన తండ్రి స్వదేశమున ఒక అమ్మాయిని తన కుమారునికి ఇవ్వాలి అని సంకల్పించిన తాను వెళ్లలేని పరిస్తితిలో తన దగ్గర ఉన్న ప్రధాన సేవకుడిని పిలిచి తన తండ్రి ఇంటికి వెళ్ళి తన చుట్టాలలో ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి ఈసాకు పెండ్లి చేయాలి అని కోరడం జరిగింది. అయితే ఒక వేల అక్కడ ఎవరు ఇష్ట పడక పోయిన యెడల నీ కుమారుని అక్కడకు తీసుకువెల్లమందురా అని అడిగినప్పుడు అబ్రహాము దేవుడు అతనికి చేసిన వాగ్ధానం గుర్తు చేసుకొని దేవుడు తనను వదలి పెట్టి రమ్మనిన ప్రదేశమునకు మరల తిరిగి తన కుమారుని పంపించడానికి ఒప్పుకోలేదు. 

అబ్రహాము భార్యలు - మరణం 

సారా కనానులో హెబ్రోనులో  నూట ఇరవై ఏడేండ్లు వయసులో మరణించినది, ఆమెను మక్ఫెలాలో సమాది చేశారు.  అబ్రహాము చివరిగా కతూరా అను స్త్రీ ని వివాహమాడగా ఆమె అతనికి ఆరుగురు బిడ్డలను కన్నది. అబ్రహాము తనకు ఉన్నది అంతయు ఇస్సాకునకు ఇచ్చి మిగినలిన వారికి బాహుమనములను ఇచ్చి వారిని తూర్పు వైపుగా తూర్పు దేశము వైపు పంపి వేశాడు. ఆయన చనిపోయే సమయానికి అబ్రహాము వయస్సు నూట డెబ్బై ఐదు సంవత్సరాలు. అబ్రహామును ఈసాకు , యిష్మయేలు  మమ్రేకు తూర్పున ఉన్న మక్ఫెలా గుహలో పాతిపెట్టారు. అతని భార్య సారాను కూడా అక్కడే పాతి పెట్టిరి. 

యోహాను 14:1-12

 యోహాను 14:1-12 

యేసు వారితో "మీ హృదయములను కలవరపడనియకుడు. దేవుని విశ్వసింపుడు. నన్నును విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు. లేకున్నచో నేను మీతో అటుల చెప్పను. నేను మీకొక నివాసస్థానమును సిద్దము చేయబోవుచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరచి, మరల వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును. నేను వెళ్ళు స్థలమునకు మార్గమును  మీరు ఎరుగుదురు." అనెను. తోమా ఆయనతో "ప్రభూ! మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు. ఇక మార్గమేట్లు ఎరుగుదుము?" అనెను. అందుకు యేసు, "నేనే మార్గమును, సత్యమును, జీవమును నా మూలముననే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. మీరు నన్ను ఎరగియున్నచో, నా తండ్రిని కూడా ఏరిగి యుందురు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు.  మీరు ఆయనను చూచి ఉన్నారు. అని పలికెను. అప్పుడు ఫిలిప్పు "ప్రభూ! మాకు తండ్రిని చూపుము. మాకు అది చాలును" అనెను. అందుకు యేసు ఇట్లనెను: "ఫిలిప్పు! నేను ఇంత కాలము మీతో  ఉంటిని. నన్ను తెలిసికొనలేదా? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూపుమని ఏట్లు అడుగుచున్నావు! నేను తండ్రియందు, తండ్రి నా యందు ఉన్నామని నీవు విశ్వసించుట లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుట లేదు. కాని, నా తండ్రి నా  యందు నివసించుచు, తన పనులను నెరవేర్చుచున్నాడు. నేను తండ్రి యందు ఉన్నాననియు, తండ్రి నా యందు ఉన్నాడనియు మీరు విశ్వసింపుడు. లేనిచో ఈ క్రియలను బట్టియైనను నన్ను విశ్వసింపుడు. నేను తండ్రి యొద్దకు వెల్లుచున్నాను. కనుక, నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 

మీ హృదయములను కలవరపడనియకుడు 

యేసు ప్రభువు తన శిష్యులతో మీ హృదయములను కలవరపడనియకుడు అని చెబుతున్నారు. శిష్యులు కలవరపడవలసిన పరిస్తితి ఎందుకు వచ్చినది? ఎందుకంటే యేసు ప్రభువు వారి నుండి వెళ్లిపోతున్నాను అని చెప్పారు. మూడు సంవత్సరాలు వారు యేసు ప్రభువుతో కలిసి జీవించారు. ఆయన చేసిన అన్ని అద్భుతకార్యములకు, ఆయన చూపిన కారుణ్యమునకు వీరు సాక్షులు. శిష్యులకు ఆయన జీవితం భరోసా అయ్యినది. అటువంటి ప్రభువు ఇప్పుడు వారి నుండి వెళ్లిపోతున్నారు. ఇంకా ఎందుకు వీరు కలవరపడుతున్నారు? యేసు ప్రభువుకి పరిసయ్యులు, ధర్మ శాస్త్ర భోదకులు కొంత మంది సద్దుకయ్యులు శత్రువులుగా మారిపోయారు. ఇప్పుడు యేసు ప్రభువు వీరి నుండి వెళ్లిపోతే యేసు ప్రభువు శిష్యులు వారికి శత్రువులుగా మారిపోతారు. ఎందుకంటే వారికి యేసు ప్రభువు అంటే ఇష్టం లేదు. వారు యేసు ప్రభువు వారి నుండి వెళ్ళిన తరువాత వీరిని   శిక్షిస్తారు అని కలవరం వారికి ఉండవచ్చు.  యేసు ప్రభువుకు మరియు శిష్యులకు ఉన్న సంబంధం చాలా అన్యోన్యత కలిగిఉన్నది. ఈ అన్యోన్యత తెగిపోతుంది అని వారు కలవరపడి ఉండవచ్చు. యేసు ప్రభువుతో కలిసి వారు భుజించారు, కలిసి భుజించడం వారి సామాజిక పరిస్థితుల ప్రకారం వారి మధ్య ఉన్న అన్యోన్యత మరియు వారి స్నేహానికి గుర్తు. యేసు ప్రభువు శిష్యులను స్నేహితులులా చూశారు. ఈ స్నేహం తెగిపోబోతుంది. ఇవన్నీ వారి కలవరానికి కారణాలు. 

యేసు ప్రభువుతో పేతురు, తన గురువు కోసం  మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, అందరు వెళ్ళిపోయిన తాను వదలి వెళ్ళను అని అన్నాడు, దానికి యేసు ప్రభువు, పేతురు యేసు ప్రభువు ఎవరో కూడా తెలియదు అని చెప్పడానికి  కూడా వెనుకాడడు అని చెప్పారు. తనను యేసు ప్రభువు నమ్ముట లేదు అని, ఏమి జరుగబోవుతుందో అని కలవరపడిఉండవచ్చు.  తమ గురువును వారే అమ్మబోవుతున్నారు అని యేసు ప్రభువు చెబుతున్నారు, అది తలచుకొని వారు కలవరపడి ఉండవచ్చు. ప్రతి ఒక్కరికీ ఒక్కో కారణం ఉండి ఉండవచ్చు కలవరపడటానికి, అది వారికి యేసు ప్రభువుకు మధ్య ఉన్న అన్యోన్యత మరియు ప్రేమ మీద ఆధారపడుతుంది. యేసు ప్రభువు వీరికి కలవరపడవద్దు అని చెబుతున్నారు. 

నిత్యము మనలను కాపాడి  మన మధ్య ఉండే ప్రభువు - మనలను తనతో తీసుకుపోతారు 

యేసు ప్రభువు తన శిష్యులు కలవరపడకుండా ఉండుటకు ఆయన కారణం చెబుతున్నారు.  ఆయన వారి నుండి  పోవుతున్నది వారి కోసమే అని చెబుతున్నారు. వారు ఎందుకు కలవరపడనవసరం లేదంటే, ఆయన వారి నుండి వెల్లుతున్నది వారికి ఒక నివాసస్థానం ఏర్పాటు చేయడానికి. మరలా ఆయన వారి వద్దకు వచ్చును. ఆయన వుండే చోటూనే వీరు కూడా ఉండే విధంగా ఆయన చేస్తారు. కనుక వారు కలవరపడనవసరం లేదు. "నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు. లేకున్నచో నేను మీతో అటుల చెప్పను. నేను మీకొక నివాసస్థానమును సిద్దము చేయబోవుచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరచి, మరల వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును." ఈ నివాస స్థానం పరలోకమే. దేవుని నివాస స్థానమే. అది మనకు నిజమైన, శాశ్వతమైన నివాసం. ఇది తండ్రి  మరియు కుమారునికి మధ్యగల సంబంధం తెలియజేస్తుంది. తండ్రి దగ్గర ఏమి ఉంది అనేది తెలిసినది పూర్తిగా కుమారునికి మాత్రమే.  అందుకే ఆయన "నా"తండ్రి గృహమున అనేక నివాసములు కలవు అని చెబుతున్నారు. ఈ సంబంధం గురించి ఆయన అనేక సార్లు చెప్పుటకు కారణం ఏమిటి అంటే తన తండ్రిని ఆయన అంతగా ప్రేమిస్తున్నారు అని తెలియచేయడమే, ఆయనే పనులను మాత్రమే కుమారుడు చేస్తున్నాడు. తండ్రికి తెలియకుండా ఏమి చేయుటలేదు. ఆయన తన తండ్రి గృహమున మనకు ఒక నివాసాన్ని ఏర్పాటుచేయడానికి కల్వరి కొండమీద శిలువ మరణం ద్వారా మనకు సిద్దపరుస్తున్నాడు. మూడు రోజులు భూగర్భంలో ఉండి మనకు నివాసాన్ని ఏర్పాటుచేస్తున్నాడు. 

"నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును." యేసు ప్రభువు ఇక్కడ చేసిన ఈ వాగ్ధానం తన శిష్యులకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఆయన తన శిష్యులను వదలి వేయడం లేదు. ప్రత్యేకంగా వీరి కొరకు వస్తాను అని చెబుతున్నారు. ఇది లోకాంతంలో కాదు. ఇది తన శిష్యులు ఎప్పుడు కూడా ఆయన సాన్నిధ్యం పొందేలా చేస్తుంది. అంతేకాక వీరిని తన వద్దకు చేర్చుకుంటాను అని చెబుతున్నారు. యేసు ప్రభువు తన శిష్యులను , మరియు తన శిష్యుల ద్వారా ఆయన అనుచరులు అయిన వారికి ఇచ్చిన ఒక గొప్ప వరం ఇది. నేను ఉండు స్థలమునే మీరును ఉండునట్లు నా వద్దకు చేర్చుకొందును అనే వాగ్ధానం మరల ఆయన శిష్యులు ఎవరు నీరుత్సాహంలో లేకుండే చేసే వాగ్ధానం. కాని దీనిని ఎల్లప్పుడు గుర్తుంచుకోవడంలో మనం విఫలం  చెందుతున్నాము. యేసు ప్రభువు చేసిన ప్రతి వాగ్ధానం మనం గుర్తు చేసుకొని మనం జీవించినచో మన జీవితంలో ఎటువంటి అపాయంలో కూడా మనం కలవరపడకుండా ఉండగలం. 

తండ్రి మన గమ్యం కుమారుడే మార్గం- ఈ మార్గమే గమ్యం -దేవున్ని ఎలా తెలుసుకోవాలి? ఎలా దేవుని దగ్గరకు వెళ్ళాలి?

తోమా ఆయనతో "ప్రభూ! మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు. ఇక మార్గమేట్లు ఎరుగుదుము?" అనెను. తోమస్సు యేసు ప్రభువు చెప్పిన మాటలు అర్ధం చేసుకోలేక పోయాడు. అందుకే ఆయనే  ఎక్కడకు వెళుతున్నారో తెలియదు అని చెబుతున్నారు. తోమసు మొదటి నుండి తనకు అర్ధం కాని విషయములను అడుగుటకు సిగ్గుపడలేదు. ప్రభువు ముందు తనను ఏప్పుడు గొప్పవాడిగా లేక మొత్తం తెలిసిన వానిగా చూపించుకోవాలని చూడలేదు, తన నిజ స్తితి ఎప్పుడు బహిర్గతం చేస్తునే ఉన్నాడు. అందుకే ప్రభూ మీరు ఎక్కడకు వెళుతున్నారో మాకు తెలియదు, ఇక మార్గం ఎట్లు ఎరగుదుము అని అంటున్నారు. అందుకు ప్రభువు నేనే మార్గము సత్యము జీవము. నా మూలమునే తప్ప ఎవడును తండ్రి దగ్గరకు రాలేడు అని చెబుతున్నాడు. యేసు ప్రభువు జీవితం మొత్తం కూడా తండ్రిని తెలియపరచడమే. తండ్రి ఎలా ప్రేమిస్తారు, తండ్రి ఎలా క్షమిస్తారు, తండ్రి ఎలా మనలను దగ్గరకు తీసుకుంటారు, తండ్రి ఎలా మన కోసం పరితపిస్తారు అనే విషయాలు యేసు ప్రభువు ద్వారానే మనం తెలుసుకుంటున్నాము. ఈ విషయాలు ఇంతకు ముందు చెప్పిన అవి వారికి అర్ధం కాలేదు. మరలా యేసు ప్రభువు వారికి తెలియజేస్తున్నారు. యేసు ప్రభువు ద్వారా మాత్రమే మనం తండ్రిని ఆయన పూర్తి ప్రేమను తెలుసుకోగలం, యేసు ప్రభువు నేనే మార్గం అని చెబుతున్నారు. 

దేవున్ని మనం ఎలా తెలుసుకోగలము? ఆయన దగ్గరకు మనం ఎలా వెళ్లగలము? ఆయన ఎవరు? అనే ప్రశ్నలకు యేసు ప్రభువు మాటలలో మనకు సమాధానం దొరకుతుంది. అంతేకాక ఆ సమాధానం ఆయనే అవుతున్నారు. యేసు ప్రభువే తండ్రి దగ్గరకు వెళ్ళుటకు మార్గం, మరియు ఆయన మన గమ్యంగా ఉంటారు, ఎందుకంటే ఆయనను చేరుకున్నప్పుడు తండ్రిని చేరుకున్నట్లే, ఆయన తండ్రి యందు తండ్రి ఆయన యందు ఉన్నారు. ఆయనే సత్యము, ఆయన కేవలం సత్యమును తెలియజేయుటకు మాత్రమే రాలేదు, ఆయనే సత్యం, ఆయన మాత్రమే నిత్యుడు, ఆయన మనకు జీవం ఇచ్చువాడు మాత్రమే కాదు ఆయనే జీవము. కనుకనే యేసు ప్రభువు మాత్రమే తండ్రి దేవుని దగ్గరకు మార్గం, ఆయన ద్వారా మాత్రమే మనం తండ్రిని చేరుకోగలం. 

ప్రభువే మార్గం 

నేనే మార్గం, సత్యం, జీవం. నా ములమున తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు.  యేసు ప్రభువు ఇక్కడ తోమసు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతున్నారు. నేనే మార్గం అని చెబుతున్నారు. తండ్రి దగ్గరకు పోవుటకు యేసు ప్రభువు మాత్రమే మార్గం. ఎందుకంటే తండ్రి గురించి పూర్తిగా తెలిసినది కుమారునికి మాత్రమే. యేసు ప్రభువు ఇతర ప్రవక్తల వలె, నాయకుల వలె, న్యాయాధిపతుల వలె కాక తండ్రి ప్రేమను, కరుణను, కృపను, తండ్రి అయిన దేవున్ని చూపించడంలో విఫలం చెందక, పూర్తిగా దానిలో సఫలీకృతం అయ్యి తండ్రిని తన మాటల ద్వారా, పనుల ద్వారా మరియు అద్భుతాల ద్వారా, కరుణ ద్వారా మరియు తాను చూపించిన ప్రేమ ద్వారా తెలియ పరిచారు. ఎవరు ఈ తండ్రి అని తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం యేసు ప్రభువు జీవితం ద్వారా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చేసిన పనులన్నీ తండ్రి ద్వారానే చేశారు, తానకై తాను చేయక, తండ్రి ఇష్టప్రకారమే అన్ని చేశాడు. అలా తండ్రిని తన ద్వారా చూపించాడు. ఆ తండ్రి దేవున్ని తెలుసుకోవడానికి మార్గం కేవలం యేసు ప్రభువు మాత్రమే. యేసు ప్రభువు దేవున్ని తెలుసుకోవడానికి మార్గం మాత్రమే కాదు, ఆయన గమ్యం కూడా. ఈ మార్గం మనలను ఎక్కడకు తీసుకుపుతున్ననది, అంటే తండ్రి దగ్గరకు. తండ్రి మరియు కుమారుడు ఎప్పుడు ఏకమై ఉన్నారు. ఆ విధంగా ఆయనే మనం మార్గం మరియు గమ్యంగా ఉన్నారు. ఆయనను అనుసరించినచో మనము ఎప్పటికీ మార్గమును తప్పక, ఆయనను అనుసరించిన ప్రతి ఒక్కరూ గమ్యం చేరుకుంటారు.

యేసు ప్రభువు సత్య స్వరూపుడు  

యేసు ప్రభువు నేనే సత్యం అని చెబుతున్నారు. ఏమిటి ఈ సత్యం? యేసు ప్రభువును సత్యమనగా ఏమిటి? అని పిలాతు అడుగుతున్నారు. యేసు ప్రభువు తనను తాను లోకమునకు  వెలుగు అని చెబుతున్నారు. ఆయనలో అంధకారం అనేది ఏమి లేదు.  నేనే సత్యం అని యేసు ప్రభువు చెబుతున్నప్పుడు ఆయనలో అసత్యం అనేది ఏమి లేదు. ఆయన పూర్తిగా సత్యం. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా సత్యం. ప్రతిదీ కూడా జరిగితీరుతుంది. మన మాటలలో అనేక అసత్యాలు ఉంటాయి కాని యేసు ప్రభువు సత్యం. ఈ లోకంలో ఉన్న ఏ వ్యక్తి కూడా యేసు ప్రభువు వలె సత్యం కాదు, వారి వారి జీవితాలలో అనేక సార్లు అసత్యం అడినవారే. సత్యం మనలను స్వతంత్రులను చేస్తుంది. సత్యం మనకు దేవున్ని తెలియపరుస్తుంది. సత్యమును అన్వేషించే ప్రతి వారు కూడా దేవున్ని అన్వేషించే వారే. దేవుడు సత్య స్వరూపుడు. అందుకే యేసు ప్రభువు తాను సత్యమును అని చెపుతున్నారు.  అసలు సత్యం అంటే ఏమిటి? తత్వశాస్త్రంలో అరిస్టాటిల్ సత్యం గురించి  ఉన్నదానిని ఉన్నది అని చెప్పడం, తెలుసుకోవడం సత్యం అని చెబుతారు. పునీత  అక్విన  తోమసు గారు సత్యం గురించి నిత్యం ఉండునది సత్యం అని చెబుతున్నారు. కేవలం దేవుడు మాత్రమే నిత్యం ఉండేది. అందుకే యేసు ప్రభువు నేనే సత్యము అని చెబుతున్నారు. 

యేసు ప్రభువే జీవం 

నేనే జీవం అని యేసు ప్రభువు చెబుతున్నారు. దేవుడు జీవం, మనందరికీ జీవం ఉంది. కాని దేవుడు జీవం. మన నుండి ఈ జీవం వెళ్ళి పోతుంది. కాని దేవుడే జీవం కాబట్టి ఆయన నుండి అది వెళ్లిపోదు, అందుకే మనం ఆయనను స్వయంబు అని చెబుతున్నాము. తాను జీవించుటకు ఎవరి మీద ఆధారపడలేదు. కాని మనం మన జీవించుటకు వేరే వారి మీద ఆదరపడిఉంటాం.  మనం కూడా ఈ జీవంతో ఎల్లప్పుడు  ఉండాలి అనే కోరిక ఉంటుంది అది ఆయన మనకు ఇస్తాడు ఎందుకంటే ఆయన జీవం కాబట్టి. అందుకే యేసు ప్రభువు నేనే జీవం అని చెబుతున్నారు. యేసు ప్రభువు ఈ విషయం గురించి అనేక సార్లు చెప్పారు. పాత నిబంధనలో కూడా దేవుని గురించి మోషే అడుగుతున్నప్పుడు దేవుడు ఆయన ఎవరు అని చెబుతున్నారు. మోషే , దేవునితో నిన్ను ఎవరు పంపారు, ఆయన పేరు ఏమిటి అని అడిగితే నేను ఏమి చెప్పాలి అని అడుగుతున్నప్పుడు దేవుడు ఆయనకు చెబుతున్నారు. "నేను ఉన్నవాడను" అని. ఇక్కడ ఉన్నవాడు అంటే కలకాలం ఉండేవాడు అని అర్ధం. ఆయన గతించిన కాలంలో ఉన్నాడు, భవిష్యత్తు కాలంలో ఉంటాడు, మరియు వర్తమాన కాలంలో ఉన్నాడు అని అర్ధం. ఇలా ఎందుకు అంటే ఆయన జీవం కాబట్టి. ఏవరు అయితే కలకాలం ఉండాలి అంటే ఆయన దగ్గరకు వెళ్ళాలి. 

ఇవి  అన్ని కూడా దేవుని లక్షణాలు,   యేసు ప్రభువు తన జీవితం ద్వారా తండ్రిని మనకు తెలియజేస్తున్నాడు. అందుకే యేసు ప్రభువు మాత్రమే దేవుని దగ్గరకు మనలను తీసుకువెలుతారు, ఎందుకంటే యేసు ప్రభువుకు మాత్రమే తండ్రి పూర్తిగా తెలుసు. అందుకే యేసు ప్రభువు ములమునే మనం తండ్రి దగ్గరకు వెల్లగళం. తండ్రిని మనం తెలుసుకోవాలి అనుకున్న, లేక తండ్రిని చూడాలి అని అనుకున్నా మనం యేసు ప్రభువును తెలుసుకోవాలి, మరియు చూడాలి. అందుకే పిలిప్పు తండ్రిని చూపించమని అడుగుతున్నప్పుడు యేసు ప్రభువు, పిలిప్పు నీవు నన్ను చూడలేదా? అని అడుగుతున్నారు. యేసు ప్రభువు మాటలు మొత్తం తండ్రి మాటలు, యేసు ప్రభువు పనులు మొత్తం తండ్రి పనులు. ఇక్కడ యేసు ప్రభువు ఇంకొక మాట చెబుతున్నారు. అది ఏమిటి అంటే నేను తండ్రి యందు మరియు తండ్రి నా యందు ఉన్నాము అని చెబుతున్నారు. యేసు ప్రభువు అనేక సార్లు తండ్రితో తన ఐక్యత గురించి చెప్పారు. యేసు ప్రభువు తన శిష్యులను ఆయన చేసిన పనులను బట్టి అయిన తనని విశ్వసించమని చెబుతున్నారు. ఆయనను విశ్వసించిన వారి ద్వారా మరియు తన శిష్యుల ద్వారా ఆయన అనేక మంచి పనులను చేస్తారు. ఆయన శిష్యులు ఆయనను ఏమి అడిగిన అది దయచేస్తాను అని వాగ్ధానం చేస్తున్నారు. 


లూకా 5: 33-39

 లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తి...