27, ఫిబ్రవరి 2026, శుక్రవారం

19వ సామాన్య ఆదివారం

 19వ సామాన్య ఆదివారం 

1 రాజులు 19:4-8, ఎఫేసీ 4:30-5:2, యోహాను 6:41-51

ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు మరొకసారి దేవుని యొక్క దివ్య భోజనము గురించి బోధిస్తున్నాయి. గత మూడు వారముగా తల్లి శ్రీ సభ  దివ్యసప్రసాదం యొక్క ఔన్నత్యమును మనకు తెలియజేస్తూ ఉన్నది. 

ఈనాటి మొదటి పఠణంలో దేవుడు ఏలియా ప్రవక్తను రొట్టెతోను మరియు నీటితోనూ పోషించిన విధానం చదువుకుంటున్నాము. ఏలియా ప్రవక్త కార్మెల్ కొండపై 450 మంది బాలు ప్రవక్తలతో సవాలు చేసిన తర్వాత నిజమైనటువంటి దేవుని యొక్క సాన్నిధ్యం రుజువు చేసి ఆ 450 మంది బాలు ప్రవక్తలను హతమార్చారు దాని తరువాత ఆహాబు రాజు యొక్క భార్య అయిన యెసెబేలు రాణి తన సైనికులను పంపించి ఏలియాను ఏ విధముగానైనా సరే చంపాలని చూసింది. ఏలియా ప్రవక్త తాను ఈ వార్తను గ్రహించి తన యొక్క ప్రాణములను దక్కించుకొనుట నిమిత్తమై దూరముగా పారిపోవుచున్నారు. 
ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకున్నట్లయితే ఏలీయా ప్రవక్త 450 మంది ప్రవక్తలను చంపిన సమయంలో భయపడలేదు కానీ ఒక రాణి యొక్క మూర్ఖత్వము గ్రహించి ఆయన పారిపోతున్నారు. కొద్దిగా ఆలోచన చేసినట్లయితే ఎందుకని ఏలియా పారిపోతున్నారు? తన దేవుడి మీద నమ్మకం లేఖనా, లేదా ఇంకేమైనా కారణమా? ఎంతో ధైర్యంగా ఉన్న ఏలియా ఎందుకు ఒక్కసారిగా బలహీనపడుచున్నాడు? 
ఏలియా ప్రవక్త ఒక్కసారిగా తన యొక్క ప్రాణం మీదకు వచ్చినప్పుడు భయపడుచున్నారు. తన యొక్క కష్ట సమయంలో దేవుని యొక్క స్వరమును గుర్తించలేకపోయారు, దేవుని కార్యములు జ్ఞాపకం చేసుకోలేకపోయాడు. ఆయన నిరాశలో ఉంటున్నారు అందుకని ప్రాణభయం మీద ఉన్న ఒక ఆశ వలన దూరంగా ప్రయాణమై పోతున్నారు. మొదటి పఠణంలో మనము గ్రహించవలసిన కొన్ని అంశములు ఏమిటంటే;
1. ఏలియా ప్రవక్త యొక్క భయం. తన బలహీనత ద్వారా భయపడ్డారు కానీ ప్రభువు అతనికి దర్శనమిచ్చి, ధైర్యం నుంచి ముందుకు నడిపారు. ఏసుప్రభు మరణం తరువాత కూడా శిష్యులు భయపడిన సమయంలో ఏసుప్రభు పునరుత్థానమైన  తరువాత దర్శనం ఇచ్చి బలపరిచారు (యోహాను 20:19)
2. దేవుడు ఏలియాను విశ్రాంతి తీసుకోమని చెప్పుట. ఆయన దేవుని కార్యము ముగించే అలసట చింది ఉన్నారు కాబట్టి దేవుడు ఏలియాను కొద్దిపాటి సమయము విశ్రాంతి తీసుకోమని తెలుపుచున్నారు.  ఏసుప్రభు యొక్క శిష్యులు కూడా పరిచర్య చేసి అలసిపోయిన సందర్భంలో ఏసుప్రభు వారిని కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మని పలికారు (మార్కు 6:31). ప్రభువు మన యొక్క ఆరోగ్య పరిస్థితులను అర్థం చేసుకొని మనము సంతోషముగా ఉండుట నిమిత్తమై మనకు సహాయపడతారు.
3. దేవుడు పరిగెత్తే వారి వెనకాల వెళతారు. ఏలియా ప్రవక్త దూరంగా వెళ్లేటటువంటి సమయంలో దేవుడు అతడిని విడిచిపెట్టలేదు. తన యొక్క బలహీన సమయాలలో తోడుగా ఉన్నారు. తాను పరిగెత్తే సమయంలో తన వెనకాలే వస్తున్నారు. యోనా ప్రవక్త కూడా దేవునికి దూరంగా వెళ్లే సమయంలో దేవుడు అతని వెంట వస్తున్నారు. (యోనా 1:3, 2:10)
4. ప్రభువు ఇచ్చిన ఆహారము ద్వారా ఏలీయా ప్రవక్త 40 రోజుల పాటు శక్తిని పొందుకొని తన యొక్క గమ్యమును చేరుకున్నారు. ప్రభువు ప్రసాదించే ఆహారము మన అందరి యొక్క బలహీనతను తొలగించి మనకు బలమును ఒసగుతుంది.
5. దేవుడు మనల్ని ఎన్నటికీ మరువరు. మనము ఉన్నటువంటి అపాయములో ప్రభువు మనకు చేరువలోనే ఉంటారు. దేవుని యొక్క కనుల నుండి మనము దూరముగా వెళ్లలేము ఆయన మనలను పరిశీలిస్తూనే ఉంటారు. ఏలియా ప్రవక్త కూడా తాను ఉన్నటువంటి పరిస్థితిలో అతనిని విడిచి పెట్టకుండా తన చెంతకు వచ్చి తనను ఆదుకుంటున్నారు.
ఈనాటి రెండవ పఠణంలో పవిత్రాత్మను విచారణమున ఉంచరాదని పౌలు గారు తెలుపుతున్నారు. పవిత్ర ఆత్మ మనలను బలపరచి ఈ లోకంలో ఎన్ని శోధనలను ఎదుర్కొనటానికి సహాయపడతారు. దేవుడు ఒసగిన ఆత్మ ద్వారా మనందరం కూడా దేవునికి చెందిన వారముగా మరియు దేవుడు మన యొక్క యజమానిగా ఉంటారు కాబట్టి మనము మన యొక్క జీవితములో ఒకరి ఎడల ఒకరు దయను చూపించుకునే విధంగా, అందరితో మంచిగా మాట్లాడుతూ, ఒకరిని ఒకరు క్షమించుకుంటూ, ప్రేమించుకుంటూ దేవుడిని పోలిన వ్యక్తులుగా జీవించమని పౌలు గారు తెలుపుచున్నారు. దేవుని పోలిన వ్యక్తులుగా అనగా దేవుని యొక్క వాక్యమును మన జీవితంలో ఆచరించి పాటించి జీవించటం.
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు తానే జీవాహారము అని ప్రజలకు తెలిపిన విధానము చదువుకుంటున్నాం. ఏసుప్రభు తాను జీవాహారము అని పలికిన సందర్భంలో చాలామంది ఆయన ఈ లోక సంబంధమైన ఆహారం ఇస్తారు అని భావించారు కానీ ఆయన ఆధ్యాత్మిక సంబంధమైన ఆహారమును గురించి తెలిపారన్న సత్యమును గ్రహించలేకపోయారు. ప్రభువు ఏ విధంగా మనకు జీవాహారము అవుతారు అంటే;
1. ఆయన యొక్క వాక్కును వినుట ద్వారా, విశ్వసించుట ద్వారా, ఆచరించుట ద్వారా మనకు జీవాహారముగా మారతారు. 
2. ప్రభువు యొక్క శరీర రక్తములను స్వీకరించుట ద్వారా ప్రభువు మనకు జీవాహారమవుతారు. ఆయన దివ్య శరీర రక్తములు మనలను ఆధ్యాత్మికంగా బలపరుస్తాయి. 
3. ప్రార్థించుట ద్వారా. ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మనలో ఉన్నటువంటి కొరతను తొలగించి మనలను తన యొక్క సాన్నిద్యంతో నింపుతారు. 
4. దేవుని మీద మనసును హృదయమును లగ్నము చేసి ఆయన కొరకు జీవించినట్లయితే ప్రభువు మన యొక్క జీవాహారము అవుతారు. 
ఈ విధముగా ప్రభువును మన హృదయంలోనికి స్వీకరించినట్లయితే ఇక మనకి ఈ లోక సంబంధమైన ఎటువంటి ఆకలి ఉండదు ఎందుకనగా దేవుడే మనలను తనతో నింపుతారు. కాబట్టి పరలోకము నుండి దిగి వచ్చి మనకు ఆహారమైన క్రీస్తు ప్రభువును స్వీకరించటానికి మనము ప్రతినిత్యం కూడా సిద్ధముగా ఉండాలి. 
Fr. Bala Yesu OCD

మత్తయి 4:13-21

 మత్తయి 4:13-21

క్రిస్తునాధునియందు ప్రియమైన స్నేహితులారా ! ఈనాడు మనం మొదటి పఠనములో యాజకుడైన పషూరు యిర్మీయా ప్రవక్తను బాధించినప్పుడు యిర్మీయా తన బాధను, కష్టాన్ని దేవునికి పిర్యాదు చేస్తున్నాడు. మనము పషూరు యిర్మీయా చెప్పిన ప్రవచనములు విని యిర్మీయాను కొట్టించి, బంధించాడు. అప్పుడు ప్రభువు యాజకుడైన పషూరుతో ఇట్లాంటున్నాడు. శత్రువులు నిన్నును నీ కుటుంబమును బంధీలనుఁగా కొనిపోవుదురు. నీవచటనే చత్తువు అచటనే నిన్ను పాతి పెట్టుదురు. నీవు ఇన్ని కల్లబోల్లి ప్రవచనములు చెప్పి మోసపుచ్చిన నీ ఈ మిత్రులకు  ఇదే గతి పట్టును. 

యిర్మీయా ప్రవక్త తనకు జరిగిన అవమానం మరియు ఆయన ప్రభువు సందేశమును వినిపించగా జనులు ఆయనను గెలిచేయుచున్నారని ఎగతాళి చేస్తున్నారని ఎంతో బాధతో, కోపంతో దేవుణ్ణి దూషిస్తున్నారు. దేవునిపై గొంతెత్తుహి అరుస్తూ ఇలా అంటున్నాడు. ప్రభూ!నీవు నన్ను చెరచితివి, నేను చెడితిని. నీవు బలవంతుడవైనన్ను వశము చేసుకొంటివి. నీ సందేశమును చెప్పినందుకుగాను దినమెల్ల నన్ను చూసి నవ్వుచు గెలిచేస్తున్నారు. నేను ఇక నిన్ను జ్ఞప్తియందు ఉంచుకొనను. నీ పేరు మీదుగా మాట్లాడను అని అంటూ నేను ఎంత ప్రయతామ్ చేసిన నా వాళ్ళ కావటంలేదు. నీ వాక్కు నా హృదయంలో అగ్నివలె మండుచున్నది దానిని నేనిక ఆపుకోజాలను. ప్రభువు నీవు నా పక్షమున ఉండుము. నా వ్యాజ్యెమును నీకు అప్పగించితిని, దుష్టుల బారి నుండి నన్ను విడిపించుము అని యిర్మీయా ప్రవక్త దేవునికి మనవి చేసుకుంటున్నాడు. మరి మన జీవితాలలో మంకు కష్టాలు బాధలు అవమానాలు హేళనలు వచ్చినప్పుడు మనము నవ్వుల పాలు అయినప్పుడు చాలా సార్లు మనము కూడా యిర్మీయా వాలే దేవుణ్ణి నిందిస్తాం. దేవునిపై కోపపడుతాం, దేవునిపై అరుస్తూ ఉంటాం. కానీ మన దేవుడు బలాఢ్యుడని, సైన్యములకు అధిపతిఅని ఆయన నరులను న్యాయబుద్ధితో పరిశీలిస్తాడని మర్చిపోతాం. మనము ఏమి చేయాలంటే మన సమస్తాన్ని దేవునికి అప్పగించి ప్రార్ధిస్తే దేవుడు మనలను రక్షించి మన శత్రువులను శిక్షిస్తారు. 

సువిశేష పఠనములో మనము వింటున్నాం. ప్రజలు కాలినడకన క్రీస్తుప్రభువును వెంబడించారు. కాపరిలేని మందవలె ఉన్నవారిని చూసి జాలిపడి వారిలో వ్యాధిగ్రస్తులను స్వస్థ పరిచారు. అంతే కాకుండా వారికి ఆధ్యాత్మిక ఆహారాన్ని అనగా దేవుని వాక్కుని అందించి వారికి భౌతిక ఆహారాన్ని అందించాడు. ఓకే చిన్న బాలుడు తన కొరకు తెచ్చుకొన్న ఐదుచేపలను రెండుచేపలను తీసుకొని వచ్చి అర్పించాడు. క్రీస్తు ప్రభువు ఐదు రొట్టెలను రెండు చేపలనూ తీసుకొని ఆశీర్వాదించి వారందరు సంతృప్తు చెందినంతగా వడ్డించగా 12 గంపలు ముక్కలు మిగిలాయి. భుజింహ్సి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు పిల్లలు కాక దాదాపు ఐదువేల  మంది పురుషులు ఉన్నారు. 

మనము ఏమి అర్ధం చేసుకోవాలంటే మనము క్కూడా దేవుని యొద్దకు వచ్చి తన సన్నిధిలో ఉంటామో క్రీస్తు ప్రభువుని యొక్క జాలి, దయ మనపై మన కుటుంబాలపై ఉంటుంది. అయన మం వ్యాధి బాధలనుండి మనలను స్వస్థపరుస్తాడు. మనము ఆత్మల ఆహారాన్ని మం ఆధ్యాత్మిక ఆహారాన్ని మనకు అందిస్తాడు అని మనము తెలుసుకోవాలి. మానవుడు కేవలము రొట్టె వలనకాక దేవుని నోటినుండి వచ్చు ప్రతిమాట వలన జీవిస్తాడు అని వాక్యయమ్ తెలియజేస్తుంది. 

మంకు ఉన్న దానిని దేవుని చేతిలో ఉంచితే దేవుడు దానిని ఏంటో మందికి ఆశీర్వాదకరంగాను  దీవెనకరంగాను మార్చుతాడు అని ఈనాటి సువిశేష పఠనములో మనాకు విశదమొనర్చుచున్నారు దేవుడు. కాబట్టి ప్రియ మిత్రులారా మనము మంకు ఉన్న దానిని దేవునికి మరియు మన తోటి వారికి ఇట్సె అది ఎంతో గొప్ప ఆశీర్వాదం. ఆనాడు నాయుడు రొట్టెలు రేణు చేపలు ఐదు వేళా మందికి ఆశీర్వాదంగా మారెను, మనం మన జీవితాల ద్వారా ఎంతో మందికి ఆశీర్వాదాహముగా మారాలి. అవిద్యాగం మారడానికి ప్రయత్నించుదాం. 

ప్రార్ధన : ఓ కరుణామయుడా!ఎన్నో సార్లు మేము కూడా మా బాధల్లో, కష్టాలలో నిందలలో అవమానంతో నిన్ను దూషించి ఉన్నాము. మమ్ము క్షమించండి. ప్రభువా నీవు నా పక్షమున ఉన్నవని మార్చిపోయి భయపడిపోతున్నాం. మాకు బలాన్ని ధైర్యాన్ని దయచేయండి,అప్పుడు మేము నీసేవను ధైర్యంగా చేయగలము. ప్రభువా! నీవు దయమయుడవు కాబట్టి మాపై దయచూపి మమ్ము స్వస్థ పరచి, ఆశీర్వదించుము, మా జీవితాలు ఇతరులకు ఆశీర్వాదంగా మార్చుము. ఆమెన్ 

లూకా 5: 33-39

 లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తి...