ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు Telugu | లూకా 18:9-14 | కార్మెల్ శోభ
ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు? లూకా 18:9-14 పిమ్మట యేసు తాము నీతిమంతుల మనియు, తక్కినవారు నీచులనియు ఎంచుకొను కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను: “ప్రార్ధనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు. మరొకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను ‘ఓ దేవా!నేను ఇతరులవలె లోభిని, అన్యాయము చేయువాడను, వ్యభిచారిని కాను ఈ సుంకరివంటివాడను కాను. అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు రెండుమారులు ఉపవాసముందును. నా ఆదాయము అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నాను’ అని ప్రార్థించెను. కాని సుంకరి దూరముగా నిలువబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ‘ఓ దేవా!ఈ పాపాత్ముని కనికరింపుము’ అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతునిగ పరిగణింపబడి , ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని ఆ పరిసయ్యుడు కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలయన తనను తాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును. తనను తాను తగ్గించుకొను వాడు హెచ్చింపబడును. ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి సువిశేషంలో ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అనే ప్రశ్నకు జవాబును చూస్తున్నాము. మనము మనకై ...