పోస్ట్‌లు

జనవరి 9, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

మ్రాని కొమ్మల ఆదివారం Telugu | Palm Sunday వివరణ | కార్మెల్ శోభ

చిత్రం
  ప్రజల ఆకాంక్ష - యేసు ప్రభుని కర్తవ్య నిర్వహణ  క్రీస్తు నాధుని యందు ప్రియమైన మిత్రులారా ! పవిత్ర ఆదివారము రోజున హోసన్న అనే నినాధాలతో ప్రజలు యేసు ప్రభువును యెరుషలేము నగరానికి ఆహ్వానిస్తున్నారు. ఎందుకు యేసు ప్రభువును వీరు అంతగా ఆహ్వానిస్తున్నారు? ఎందుకు ఈ జయ జయ నినాధాలు చేస్తున్నారు? ఏ విజయం వారు పొందారు? ఈ ప్రశ్నలను మనం అడిగినట్లయితే మనకు వారి జీవితాలలో వారు ఆశించినవి యేసు క్రీస్తు ద్వారా మాత్రమే జరుగుతాయి అని వారి అర్ధం చేసుకొని చేసినటువంటి జయజయ నినాధాలు ఇవి అని అర్ధం అవుతాయి.  ఇది కేవలం జయ జయ నినాదం మాత్రమే కాదు మరి ఏమిటి అంటే ఒక రకమైన వేడుకోలు. హోసన్న అంటే కూడా అర్ధం అదే. మమ్ములను ఇప్పుడు రక్షించు అని అర్ధం.  యేసు ప్రభువు ఈ భూమి మీద జీవించిన  చివరి వారము అంత్యంత ముఖ్యమైనటువంటి వారము. మానవ రక్షణ కార్యాన్ని పూర్తి చేసినటువంటి రోజులు.   అందుకే దీనిని మనము పవిత్ర వారము అంటున్నాము. క్రైస్తవులైన మనకు ఇది చాల ముఖ్యమైన వారము.  యేసు ప్రభువులో వారు ఏమి చూశారు  మొదటి శతాబ్దము 30 వ సంవత్సరములో జెరూసలెములో  రెండు  ఊరేగింపులు ...