సమూయేలు జీవిత చరిత్ర Telugu | Samuel Biography Telugu | కార్మెల్ శోభ
సమూయేలు చరిత్ర సమూవేలు పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చరిత్రలో సమూవేలు అనేక ముఖ్యమైన విధులను పోషించాడు. సమూవేలు ఒక యాజకునిగా, న్యాయాధిపతిగా, జీవితపు చివరి అంకంలో ఓక జాతికి గొప్ప నాయకునిగా జీవించాడు. ఒక ప్రవక్తగా యిస్రాయేలు మొదటి ఇద్దరు రాజులను అభిషేకించాడు. సమూవేలు యిస్రాయేలు ప్రజలకు మరియు దేవునికి మధ్యవర్తిగా మరియు వారి కోసం దేవుని అనుగ్రహం కోరేవానిగా పవిత్ర గ్రంథం తెలియజేస్తుంది. సమూవేలు జీవిత కాల సమయంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే యిస్రాయేలు ప్రజలు దేవునితో వారి సంబంధమును పునరుద్ధరించుకోవడంజరిగింది. ఈ కాలంలో దేవుని పట్ల వారు చూపిన విశ్వాసంతో ఎంతగా వారు లాభపడినది, తరువాత అవిశ్వాసంతో ఏమి కోల్పయింది సుష్పష్టంగా కనపడుతుంది. సమూవేలు అంటే దేవుడు విన్నాడు అని అర్ధం. సమూవేలు తన జీవితాంతం దేవునికి విశ్వాస పాత్రునిగా, విధేయునిగా జీవించాడు. సమూవేలు చిన్నప్పటి నుండ...