పోస్ట్‌లు

జనవరి 23, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

పేద విధవరాలి రెండు కాసులు – నిజమైన అర్పణ ఏమిటి? | లూకా 21:1-4 ధ్యానం

చిత్రం
  లూకా 21: 1-4  దేవాలయము కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనికులను యేసు చూచెను. ఒక పేద వితంతువు అందు రెండు కాసులను వేయుట యేసు గమనించి, "ఈ పేద వితంతువు అందరికంటెను ఎక్కువగా  ఇచ్చినదని మీతో చెప్పుచున్నాను. వారలు తమ సమృద్ధి నుండి కానుకలిచ్చిరి. కాని ఈమె తన  పేదరికంలో తన సమస్త జీవనమును సమర్పించినది" అని పలికెను.  ధ్యానము:  యేసు ప్రభువు దేవాలయంలో కానుకలను వేయుచున్న ధనికులను చూస్తున్నారు. అందరు వారి వారి సమృద్ధి నుండి అక్కడ కానుకలను వేయుచున్నారు. ఆ ధనము వారు దానం చేయడం వలన వారి జీవితంలో ఏమి లోటు ఉండదు. కానీ అక్కడ ఒక పేద వితంతువు ఉన్నది. ఆమె కూడా ఆ కానుకల పెట్టెలో రెండు కాసులను వేస్తుంది. యేసు ప్రభువు ఆ పేద వితంతువు వేసిన రెండు కాసులను గురించి  అందరి కంటే ఎక్కువ ఆమె ఇచ్చినది  అని చెబుతున్నారు.  ఈ రెండు కాసులు ఎందుకు ఎక్కువ అంటే, ఈ పేద విధవురాలు ఎన్నో అవరోదాలను అధిగమించింది అయినా తన భక్తిని కోల్పోలేదు. ఈమెకు స్త్రీగా ఆనాటి కాలం అనేక విధాలుగా అసమాజం ఆమెను బాధించింది. మరియు ఆమెకు ఆదరువు ఎవరు లేరు కారణం ఏమిటి అంటే ఆమె ఒక వితంతువు. అంతే క...