యేసు క్రీస్తును చూచుటయే దేవున్ని చూచుట - యోహాను 14:6-14 ధ్యానం
యేసు క్రీస్తును చూచుటయే దేవున్ని చూచుట యోహాను 14:6-14 అందుకు యేసు, నేనే మార్గం, సత్యము, జీవము. నా ములమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. మీరు నన్ను ఏరిగియున్నచో, నా తండ్రిని కూడా ఏరిగి యుందురు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు. మీరు ఆయనను చూచి ఉన్నారు " అని పలికెను. అప్పుడు పిలిప్పు "ప్రభూ! మాకు తండ్రిని చూపుము. మాకు అది చాలు" అనెను. అందుకు యేసు ఇట్లనెను: "పిలిప్పు! నేను ఇంతకాలము మీతో ఉంటిని. నన్ను తెలిసికొనలేదా? నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూపమని ఎట్లు అడుగుచున్నావు! నేను తండ్రి యందు, తండ్రి నా యందు ఉన్నామని నీవు విశ్వసించుటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుట లేదు. కాని, తండ్రి నా యందు నివసించుచు, తన కార్యములను నెరవేర్చు చున్నాడు. నేను తండ్రి యందు ఉన్నానని, తండ్రి నా యందు ఉన్నాడని మీరు విశ్వసింపుడు. లేనిచో ఈ క్రియలను బట్టియైన నన్ను విశ్వసింపుడు. నేను తండ్రి యొద్దకు వెల్లుచున్నాను. కనుక, నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును. అంతకంటేను గొప్ప క్రియాలను చేయును అని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. తండ్రి...