పోస్ట్‌లు

జనవరి 8, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

పవిత్ర గురువారం విశిష్టత: ప్రేమ ఆజ్ఞ మరియు దివ్యసత్ప్రసాద స్థాపన | కార్మెల్ శోభ

చిత్రం
పవిత్ర గురువారం  ప్రియ మిత్రులారా  పవిత్ర వారంలోని 5 వ రోజు పవిత్ర గురువారం. ఈ రోజుకు అనేక పేర్లు ఉన్నాయి. ఈరోజు యేసు ప్రభువు నూతన ఆజ్ఞ ఇస్తున్నారు. ఈరోజు దివ్య సత్ప్రసాద స్థాపన జరుగుతుంది. మరల ఈరోజు గురుత్వ స్థాపన జరుగుతుంది.  ఇవి మూడు కూడా యేసు ప్రభువు మరణ పునరుత్థానముల తరువాత యేసు ప్రభువును ఈలోకంలో మనం కలుసుకోవడానినికి, ఆయన సన్నీది పొందడానికి ఇవి మూడు కూడా సాధనాలు.  దీనిని పవిత్ర ఆజ్ఞ గురువారం అని అంటారు. ఈ రోజు యేసు ప్రభువు శిష్యులకు ప్రేమ ఆజ్ఞ ఇస్తున్నారు.   నేను మిమ్ములను ప్రేమించినట్లు మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనండి . దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకు యేసు ప్రభువు ఇలా చెప్తున్నారు. ఇది యేసు ప్రభుని చివరి భోధ. దీని తరువాత ఆయన భోదించలేదు.  నూతన ఆజ్ఞ - ప్రేమ ఆజ్ఞ   దీనిని నుండి మనము ఏమి నేర్చుకోవాలని యేసు ప్రభువు కోరుతున్నారు?   యేసు ప్రభువు తన  శిష్యుల కాళ్ళు కడగడం ద్వారా మనం ఏ విధంగా ఉండాలో  ఒక సంకేతం ఇస్తున్నారు.  ఇది యేసు ప్రభువుని ప్రేమను వ్యక్త పరచిన సంఘటన. ఈ సంఘటన వినయంతో కూడిన ఒక పని. ఎంద...