క్రీస్తు – నిత్యజీవ ప్రధాత మన కాపరి | యోహాను 10:22-30 ధ్యానం
క్రీస్తు -నిత్యజీవ ప్రధాత మన కాపరి యోహాను 10:22-30 యెరూషలేములో దేవాలయ ప్రతిష్టోత్సవము జరుగుచుండెను. అది శీతకాలము. యేసు దేవాలయమున సోలోమోను మంటపమున నడుచుచుండెను. యూదులు ఆయన చుట్టు గుమికూడి, "నీవు ఎంత కాలము మమ్ము సందిగ్ధావస్థలో ఉంచేదవు? నీవు క్రీస్తువా? మాకు స్పష్టముగ చెప్పుము" అని అడిగిరి. అందుకు యేసు వారితో, "నేను మీకు చెప్పితిని. కాని, మీరు నమ్ముట లేదు. నా తండ్రి పేరిట నేను చేయు క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మీరు నా గొర్రెలలో చేరినవారు కారు. కనుక, మీరు నమ్ముట లేదు. నా గొర్రెలు నా స్వరమును వినును. నేను వానిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్యజీవము ప్రసాదింతును. కనుక, అవి ఎప్పటికీ నాశము చెందవు. వానిని ఎవడును నా చేతి నుండి అపహరింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరి కంటే గొప్పవాడు. కనుక, వానిని నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు. నేను, నా తండ్రి ఏకమైయున్నాము" అని చెప్పెను. ఎందుకు యిస్రాయేలు కాపరులు విఫలం అయ్యారు? "యెరూషలేములో దేవాలయయెరూషలేములో దేవాలయ ప్రతిష్టోత్సవము జరుగుచుండెను. అది శీత...