క్రీస్తు కొరకు ప్రథమ హత సాక్షి పునీత స్తేఫాను చరిత్ర | కార్మెల్ శోభ
పునీత స్తేఫాను స్తేఫాను అంటే కిరీటం అని అర్ధం. ఈయన అపోస్తులులు ఎన్నుకొన్న ఏడుగురు డీకనులలో ఒకరు. డీకనుగా స్తెఫాను అక్కడ ఉన్న ప్రజలకు సేవ చేయుటకు ఎన్నుకొనబడ్డాడు. స్తెఫాను జ్ఞానము కలిగి, పవిత్రాత్మతో నింపబడి, మంచి ప్రవర్తన కలవాడిగా అందరికీ తెలిసిన వ్యక్తి. తన జ్ఞానం ద్వార దేవుని గురించి బోధించి, హింసించబడి చంపబడ్డాడు. ఈయన భోదన యూదులను కోపమునకు గురిచేసింది. యూదులు ఆయన మీద చూపిన క్రోదాన్ని, ఆయనకు కీర్తిని తీసుకువచ్చేలా చేశాడు. స్తేఫాను విశ్వాసం చాలా గొప్పది. ఆయన యూదుల చేత హింసించబడుతున్న అటువంటి అపనమ్మకం లేకుండా దేవుని ఘనతను గురించి వారికి బోధించాడు. ఎటువంటి పరిస్థితిలో కూడా దేవుని గురించి వివరిస్తూ ఎలా యూదులు తప్పుగా ఆలోచిస్తున్నారో వారికి తెలియజేయడంలో పూర్తిగా సఫలికృతం అయ్యారు. కాని ఆయనను వారు తప్పుగా అర్ధం చేసుకున్నారు. యేసు ప్రభువు బోధనలు ఈయన పాటించిన తీరు అందరు నేర్చుకోవాలి. తనను చంపుతున్న వారి కొరకు ప్రార్ధిస్తూ, ఆ పాపాన్ని వారి మీద వేయకండి అని వేడుకున్నాడు. మరణించే ముందు దేవుని ఇంత కష్టానికి గురిచేశాడని నిందించక, దేవునికి ...