త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం దైవ ధ్యానం (మత్తయి 28) | కార్మెల్ శోభ
త్రిత్వయిక సర్వేశ్వరుని మహోత్సవం సువిశేషము : యేసు అజ్ఞానుసారము పదునొకండుగురు శిష్యులు గలీలియాలోని పర్వతమునకు వెళ్లిరి. అపుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కాని కొందరు సందేహించిరి. యేసు వారి దగ్గరకు వచ్చి వారితో "ఇహపరములందు నాకు సర్వాధికారమీయబడినది. కనుక మీరు వెళ్ళి, సకల జాతి జనులకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నాన మోసగుచు, వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు అజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుందును" అని అభయ మొసగెను. మానవ జీవితములోని ప్రతి విషయం మనకు తెలియకుండానే దేవునితో ముడి పడి ఉంది. మానవ రక్షణ చరిత్ర చూసినప్పుడు ఇది మనకు తెలుస్తుంది. ప్రతి మానవుడు తన ఉనికి గురించి ఆలోచించినప్పుడు ఖచ్ఛితముగా దేవుని గురించి ఆలోచిస్తాడు, అతను దేవున్ని నమ్మిన లేక నమ్మకపోయిన దేవుని ఉనికి గురించి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. దేవుని యొక్క ఉనికి, స్వభావం, మరియు ఆయనతో మన సంబంధం గురించి ఆలోచించే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మానవుడు ఈ సమాజ...