పోస్ట్‌లు

జనవరి 15, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

మనుష్యులను పట్టు జాలరులు: లూకా 5:1-11 | కార్మెల్ శోభ

చిత్రం
 లూకా 5: 1-11 యేసు ఒక పర్యాయము గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచియుండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయనయొద్దకు నెట్టుకొనుచు వచ్చిరి. ఆయన అచట రెండు పడవలను చూచెను. జారరులు వాని నుండి దిగి తమ వలలను శుభ్రపరచుకొనుచుండిరి. అందులో ఒకటి సీమోను పడవ. యేసు ఆ పడవనెక్కి దానిని ఒడ్డుననుండి లోనికి త్రోయమని, అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించెను. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సీమోనుతో "మీరు పడవను ఇంకను లోతునకు తీసికొని వెళ్లి చేపలకై మీ వలలను వేయుడు" అనెను అందుకు సీమోను "బోధకుడా! మేము  రాత్రి అంతయు శ్రమించితిమి. కాని ఫలితము లేదు. అయినను మీ మాట మీద వలలను వేసెదము" అని ప్రత్త్యుత్తరము ఇచ్చెను. వల వేయగనే,  వల చినుగునన్ని చేపలు పడెను. అంతట జాలరులు రెండవ పడవలోనున్న తమ తోటి వారికి, వచ్చి సహాయము చేయుడని ప్రాధేయపడగా, వారు వచ్చి రెండు పడవలను చేపలతో నింపగనే పడవలు మునుగునట్లు ఉండెను. సీమోను పేతురు ఇది  చూచి యేసు పాదములపై పడి "ప్రభూ ! నేను పాపాత్ముడను. నన్ను విడిచిపొండు" అని పలికెను. ఇన్ని చేపలు పడుట చూచి సీమోను, అతని తోటి వారు ఆశ్చర్యపడిరి. సీమోనుతో ఉన్న జెబదాయి...