మోషే జీవిత చరిత్ర Telugu | Moses Biography Telugu | కార్మెల్ శోభ
మోషే సంపూర్ణ జీవిత చరిత్ర మోషే అంటే నీటి నుండి తీసుకొనబడిన వాడు. మోషే అమ్రాము యోకెబెదుల చిన్న కుమారుడు. హెబ్రీయుల గొప్ప నాయకుడు మరియు ధర్మ శాస్త్రమును ప్రజలకు ఇచ్చినవాడు. యిస్రాయేలీయుల నాశనమును ఐగుప్తు రాజు నిర్ణయించిన సమయంలో పుట్టిన వాడు, యిస్రాయేలీయుల కుటుంబాలలో పుట్టిన మగ బిడ్డలను సంహరించాలని రాజు నిర్ణయించిన కాలంలో పుట్టి దేవుని కృపతో ఆ విపత్తు నుండి తప్పించుకున్నవాడు. మోషేను కూడా చంపుతారు అని అతని తల్లిదండ్రులు భయపడ్డారు. ఒక బుట్ట తీసుకువచ్చి అతనిని దానిలో పెట్టి నీటిలో వదిలారు. ఫరో కూతురు మోషేను నీటి నుండి కాపాడి అతనికి మోషే అనే పేరు పెట్టి ఆయనను దత్తత తీసుకుంది. ఫరో కూతురు కుమారుడిగా, యువరాజుగా ఆయన అన్ని విద్యలలో నేర్పరి అయ్యాడు. మోషే గొప్పతనం గురించి ఎంత చెప్పిన అది తక్కువే అవుతుంది. ఆయన చరిత్రకారుడిగా , నాయకునిగా, రాయబారిగా, శాసనకారుడిగా, దేవునికి మానవునికి మద్యవర్తిగా, సంప్రదాయ దేశభక్తునిగా నిర్వహించిన భాధ్యతలు ఆయన గొప్ప వ్యక్తిత్వాన్ని తెలుపుతాయి. దేవుని యొక్క స్నేహితునిగా ఆయన పిలువబడ్డాడు. ఈయన 120 సంవత్...