క్రీస్తు దివ్య శరీర రక్తముల మహోత్సవం దైవ ధ్యానం | కార్మెల్ శోభ
యేసు క్రీస్తు దివ్య శరీర రక్తముల మహోత్సవం అదికాండం 14:18-20 1కోరింథీ 11:23-26 లూకా 9:11-17 సువిశేషం: జనసమూహములు ఈ విషయమును తెలిసికొని వారిని వెంబడించేను. యేసు వారిని చేరబిలిచి దేవుని రాజ్యమును గురించి వివరించుచు రోగులను స్వస్థపరచెను. ప్రొద్ధుగ్రుంక నారంభిచినప్పుడు పన్నిద్దరు శిష్యులు ఆయన వద్దకు వచ్చి , "ఇది నిర్జన ప్రదేశము. ఇక వీరిని పంపివేయుడు; పల్లె పట్టులకు వెళ్ళి, వారికి కావలసిన భోజనవసతులను చూచుకొందురు." అని ఆయనతో చెప్పిరి. "మీరే వీరికి భోజనము పెట్టుడు" అని ఆయన పలుకగా "మా యొద్ద ఉన్నవి అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే. మేము పోయి, వీరికి అందరకు కావలసిన ఆహార పదార్ధములు కొనితెత్తుమా?" అని శిష్యులు అడిగిరి. అచ్చట రమారమి అయిదువేలమంది పురుషులుండిరి . వారిని పంక్తులుదీర్చి, పంక్తికి ఏబది మంది చొప్పున కూర్చుండ బెట్టుడని ఆయన శిష్యులతో చెప్పగా వారు అట్లే కూర్చుండబెట్టిరి. పిమ్మట యేసు ఆ అయిదు రొట్టెలను, రెండు చేపలను తీసికొని, ఆకాశమువైపు చూచి , వానిని ఆశీర్వదించి , త్రుంచి ప్రజలకు వడ్డింపుడు అని శిష్యులకు ఇచ్చెను. వారందరు భుజించి , సంతృప...