పోస్ట్‌లు

ఫిబ్రవరి 23, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

యేసు క్రీస్తుని బప్తిస్మం ఆధ్యాత్మిక సందేశం | Mark 1:7-11 Telugu Homily - Carmel Shobha

చిత్రం
 యేసు క్రీస్తుని బప్తిస్మం  మార్కు 1: 7-11  "నా కంటే శక్తిమతుడోకడు నా వెనుక రానున్నాడు. నేను వంగి ఆయన పాదరక్షలవారును విప్పుటకైనను యోగ్యుడనుకాను నేను మిమ్ము నీటితో స్నానము చేయించితిని. కాని, ఆయన మిమ్ము పవిత్రాత్మతో స్నానము చేయించును" అని యోహాను ప్రకటించుచుండెను. ఆ రోజులలో  గలిలీయ సీమలోని నజరేతు నుండి యేసు వచ్చి, యొర్ధాను నదిలో యోహనుచేత బప్తిస్మము పొందెను. ఆయన నీటినుండి వెలుపలికి వచ్చిన వెంటనే పరమండలము తెరువబడుట, పవిత్రాత్మ పావురము రూపమున తనపై దిగి వచ్చుట చూచెను. అపుడు పరలోకము నుండి ఒక వాణి "నీవు నా ప్రియమైన కుమారుడవు. నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను" అని వినిపించెను .  ధ్యానం: యేసు ప్రభువు బప్తిస్మము చాలా ప్రాముఖ్యత కలిగినది మన రక్షణ చరిత్రలో అందుకనే సువార్తికులందరు దీని గురించి రాసారు. మత్తయి 3:14-15 యేసు ప్రభుని బప్తిస్మము ఆయన పాపం చేసినందుకు కాదు దేవుని ఆజ్ఞలకు అనుకూలముగా స్వీకరించాడు అని తెలియచేస్తుంది. యోహాను , యేసు ప్రభువుల మధ్య సంభాషణ ద్వారా ఇది తెలుసుకుంటున్నాము. యోహాను బప్తిస్మము పాప జీవితానికి ముగింపును పలికి నూతన జీవితాన్ని సాగించడానికి...

పునీత ఆవిలాపురి తెరెసమ్మ జీవిత చరిత్ర | St. Teresa of Avila in Telugu - Carmel Shobha

చిత్రం
 పునీత ఆవిలాపురి   తెరెసమ్మ  తెరెసా ఔన్నత్యం -పుట్టుక మరియు బాల్యం  తెరెసా 1515వ సంవత్సరం ఆవిలాలో మార్చి 28న తేదీన     జన్మించారు. 1582 లో చనిపోయారు.  1622  సంవత్సరంలో  లో ఆమె చనిపోయిన 40 సంవత్సరాలకు ఆమె పునీతురాలుగా ప్రకటించబడింది. 1970 సెప్టెంబర్ 27 న ఆమె తిరుసభ పండితురాలుగా ప్రకటించబడింది. ఈమె ఒక సాధారణ స్త్రీ వలె కనపడిన అసాధారణమైన పట్టుదల, సాంఘిక అసమానతలను ఎదుర్కొని విజయాలను సాధించుటలో గొప్ప వ్యక్తిత్వాన్ని కనపరిచిన అరుదైన వ్యక్తి. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె జీవితంలో అనేక ఆటంకాలలో కూడా తాను అనుకున్న దానికి సాధించిన ఒక స్త్రీ మూర్తి. మనం ప్రేమించే వారి కోసం మనం ఎంత చేయవచ్చో చూపించిన ఒక గొప్ప స్త్రీ. తిరుసభలో వరకట్నం  లేకుండా సన్యాసినులను మఠంలోనికి తీసుకున్న మొదటి వ్యక్తి. అనేక నూతన సంప్రదాయాలకు అంకురార్పణ చేసిన వ్యక్తి. తీరుసభ మొదటి స్త్రీ పండితురాలు. ఒక వ్యక్తి తనలో ఉన్న లోపాలను ఎలా జయించగలమో నేర్పి, మానవుడు తనను తాను ఎలా జయించవచ్చో నేర్పించిన విజయాశీలి.  మానవునిలో ఉన్న దైవాన్ని ఎలా చేరుకోవాలో అంతరంగిక ప్ర...