దైవ రాజ్యంలో గొప్పవారెవరు?: మార్కు 9:30-37 ధ్యానం | కార్మెల్ శోభ
25 వ సామాన్య ఆదివారం సొలొమోను జ్ఞానగ్రంధము 2 :12,17 -20) (యాకోబు 3 :16 -4 :3.) (మార్కు 9 :30 -37) ఈనాటి మొదటి పఠనముద్వారా క్రైస్తవుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ఏ విధముగా హింసను ఎదుర్కోవాలో తెలుసుకోవచ్చు. దేవుని వ్యతిరేకులు ఏ విధముగా మాటలాడుతారు అనేది మనము తెలుసుకుంటున్నాం. పూర్వం క్రైస్తవులను ప్రభుత్వాలు, పెద్దలు హింసించడము మొదలు పెట్టినప్పుడు కొంతమంది క్రైస్తవులు వారి విశ్వాసాన్ని వీడి జీవించారు మనము మొదటి పఠనములో యూదుల గురించి వింటున్నాము కానీ మొదటి రెండు ,మూడు శతాబ్ద క్రైస్తవులకు ఇటవంటి హింసలకు కూడిన జీవితం ఎక్కువుగా అనుభవించారు. కొంతమందిని అడవి మృగాలకు ఆహారముగా ఇచ్చారు, మరి కొంతమందిని ఘోరముగా హింసించి అగ్నికి ఆహుతి చేశారు, కొంతమందిని హింసించి చంపించారు. కానీ చాలా మంది వారి విశ్వాసములో గట్టిగా నిలబడ్డారు. ఈరోజు మనకు ఉన్న సవాలు ఏమిటి అంటే నేను క్రీస్తు విశ్వసిగా హింసకు గురి అయినట్లయితే, హింసను తట్టుకొని క్రీస్తు కోసము నిలబడగలనా ? అంత గొప్ప విశ్వాసము నాకు ఉన్నదా ? అన...