పోస్ట్‌లు

డిసెంబర్ 2, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

నిత్య జీవము - ధనిక యువకుని వృత్తాంతం: మార్కు 10:17-30 | కార్మెల్ శోభ

చిత్రం
  28 వ సామాన్య ఆదివారం  సిరా 7:7-11, హెబ్రీ 4:12-13, మార్కు 10:17-30 ప్రియ మిత్రులారా గత ఆదివారం పరిసయ్యులు యేసు ప్రభువును విడాకుల గురించి ప్రశ్నించారు. ఈ రోజు ఒక యువకుడు యేసు ప్రభువును నిత్య జీవం పొందుటకు ఏమీ చేయాలి అని అడుగుతున్నాడు. యేసు ప్రభువు దైవ ఆజ్ఞలు పాటించమని చెప్పారు. ఆ యువకుడు నేను చిన్నప్పటి నుండి వాటిని పాటిస్తున్నానని      చెప్పుతున్నాడు. యేసు ప్రభువు దానికి నీవు చేయవలసి నది ఇంకొక్కటి ఉంది, నీకు ఉన్నదంతా అమ్మి,    పేదలకు    ఇచ్చి వచ్చి నన్ను అనుసరించు అని చెప్పారు. దానికి ఆ    యువకుడు నిరాశతో వెళ్ళిపోతున్నారు.  ఎందుకంటే అతనికి చాలా    సంపద, ఆస్తులు ఉన్నాయి వాటిని కోల్పోవడానికి సిద్దముగా లేడు.   ఎందుకు ఆ యువకుడు యేసు ప్రభువును అనుసరించడానికి రాలేదు పునరుత్థానము మీద ఆనాటి రోజులలో చాలా తక్కువ మందిలో    నమ్మకము ఉండేది.    పరిసయ్యులు పునరుత్థానము ఉంది అని భోదించేవారు. కానీ సద్దుకయ్యులు నమ్మేవారు కాదు.    యేసు ప్రభువు అందరికీ అంతిమ తీర్పు ఉందని విశ్వాసులకు నిత్య ...