పోస్ట్‌లు

జనవరి 26, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

ఫిలిప్పు మరియు నతనయేలుల మనస్తత్వం - యోహాను 1:43-51 ధ్యానం

చిత్రం
  ఫిలిప్పు మరియు  నతనయేలుల మనస్తత్వం యోహాను 1: 43-51  మరునాడు యేసు గలిలీయా వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. ఫిలిప్పును కనుగొని అతనితో "నన్ను అనుసరింపుము" అని పలికెను. ఫిలిప్పు కూడఆంద్రెయ పేతురుల నివాసమగు బేత్సయిదా పుర నివాసియే. ఫిలిప్పు నతనయేలును కనుగొని, "మోషే ధర్మశాస్త్రమునందును, ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడిన వానిని మేము కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడును, నజరేతు నివాసియునగు యేసు" అని చెప్పెను. "నజరేతునుండి ఏదైనా మంచి రాగలదా?" అని నతనయేలు  అడుగగా వచ్చి చూడుము" అని పిలిప్పు పలికెను. నతనయేలు తన యొద్దకు వచ్చుటను చూచి, అతనిని గూర్చి యేసు "ఇదిగో!కపటము లేని నిజమైన యిస్రాయేలీయుడు" అని చెప్పెను. "మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు" అని నతనయేలు అడుగగా యేసు, "ఫిలిప్పు నిన్ను పిలువకపూర్వమే, నీవు అంజూరపు చెట్టుక్రింద ఉండుటను నేను చూచితిని"అని సమాధానమిచ్ఛెను. "బోధకుడా! నీవు దేవుని కుమారుడవు, యిస్రాయేలు రాజువు"అని నతనయేలు  పలికెను. "నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచితిని, అని చెప్పినందువలన నీవు నన్ను విశ్వసించుచున్నవా...