క్రీస్తు రాజు పండగ | Christ the King Sunday Telugu | లూకా 23 | Carmel Shobha
క్రీస్తు రాజు మహోత్సవం లూకా 23:35-43 ప్రజలు అచట నిలుచుండి ఇది అంతయు చూచుచుండిరి. "ఇతడు ఇతరులను రక్షించెను. కాని, ఇతడు దేవుడు ఎన్నుకొనిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించు కొననిమ్ము" అని అధికారులు ఆయనను హేళనచేసిరి. సైనికులు కూడా ఆయనకు దగ్గరగా వచ్చి పిలిసిన ద్రాక్షరసమును ఇచ్చి , "యూదుల రాజువైనచో, నిన్ను నీవు రక్షించుకొనుము" అని పరిహాసించిరి. "ఇతడు యూదుల రాజు అని ఫలకమున వ్రాసి శిలువ పైభాగమున ఉంచిరి. సిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు నీవు క్రీస్తువు గదా అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షింపుము. అని ఆయనను నిందింపసాగెను. రెండవ వాడు వానిని గద్దించుచు నీవు దేవునికి భయ పడవా? నీవు కూడ అదే శిక్ష పొందుచున్నావు కదా!మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగుఫలము అనుభవించుచున్నాము. కాని ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంకకు తిరిగి, "యేసు!నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో నేడే నీవు నాతో కూడ పరలోకమున ఉందువు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఈ రో...