యేసు ప్రభువు రూపాంతరీకరణ దైవ ధ్యానం (మత్తయి 17) | కార్మెల్ శోభ
తపస్సు కాల రెండవ ఆదివారం మత్తయి 17: 1-9 ఆరు దినములు గడిచిన పిమ్మట యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడగు యోహానును తనవెంట తీసుకొని, ఒక ఉన్నత పర్వతముపైకి ఏకాంతముగా వెళ్లెను. అచట వారి యెదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. అయన వస్త్రములు వెలుగు వలె తెల్లగానయ్యెను. ఆయనతో మోషే, ఏలీయాలు సంభాషించుచున్నట్లు వారికి కనబడిరి. అప్పుడు పేతురు "ప్రభూ !మనము ఇచటనుండుట మంచిది. నీకు అనుమతియైనచో నేను నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఎలియాకు మూడు శిబిరములను నిర్మింతును" అని పలికెను. అంతలో ఓక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో ఆ మేఘము నుండి "ఈయన నా కుమారుడు, నాకు ప్రియమైనవాడు. ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని. ఈయనను ఆలకింపుడు", అను వాని వినిపించెను. ఇది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోరగిలపడిరి. అప్పుడు యేసు వారి కడకువచ్చి, వారిని తట్టి , "లెండు , భయపడకుడు"అని పలికెను. అంతట వారు కనులెత్తిచూడగా వారికి యేసు తప్ప మరెవ్వరును కనిపించలేదు. వారు ఆ పర్వతమునుండి దిగి వచ్చుచుండగా యేసు వారితో " మనుష్య కుమారుడు మృతులనుండి లే...