పాపకారణమగుట దేవునికి అయిష్టం - మార్కు 9:41-50 ఆత్మీయ ధ్యానం
మార్కు 9:41-50 మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి, ఎవ్వడు మీకు నా పేరిట చెంబెడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని మీతో నిశ్చయముగచెప్పుచున్నాను" అనెను. "నన్ను విశ్వసించు ఈ చిన్న వారిలో ఏ ఒక్కడైన పాపి అగుటకు కారకుడగుటకంటె, అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. నీ చేయి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. రెండు చేతులతో నిత్య నరకాగ్నిలోనికి పోవుటకంటె ఒక్క చేతితో నిత్యజీవము పొందుట మేలు. నీ కాలు నీకు పాపకారణమైనచో, దానిని నరికి పారవేయుము. రెండుకాళ్ళతో నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క కాలితో నిత్య జీవమున ప్రవేశించుట మేలు. నీ కనులు నీకుపాప కారణమైనచో దానిని పెరికి పారవేయుము. రెండుకన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుటకంటె ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరకలోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. ప్రతి ఒక్కనికి ఉప్పదనము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే కాని అది తన ఉప్పదనమును కోల్పోయిన, తిరిగి మీరు ఎట్లు దానిని సారవంతము చేయగలరు? కావున, మీరు ఉప్పదనమును కలిగి ఒకరితో ఒకరు సమాధానముతో ఉండుడు" అనెను. ...