అవినీతి పరుడైన గృహనిర్వహకుని యుక్తి | Luke 16:1-8 Telugu Homily - Carmel Shobha
లూకా 16: 1-8 యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను: "ఒక ధనవంతునివద్ద గృహనిర్వాహకుడు ఒకడు ఉండెను. అతడు యజమానుని సంపదను వృథా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడెను. యజమానుడు అతనిని పిలిచి, 'నిన్ను గూర్చి నేను వినుచున్నది ఏమిటి? లెక్కలు అప్పగింపుము. ఇకపై నీవు గృహనిర్వాహకుడుగా ఉండ వీలుపడదు' అని చెప్పెను. అతడు లోలోపల ఇట్లు అనుకొనెను: 'ఇపుడు నేనేమి చేయుదును? యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించుచున్నాడు. శ్రమించుటకు నాకు శక్తిలేదు. బిచ్చమెత్తుటకు నాకు సిగ్గుగా ఉన్నది. గృహనిర్వాహకత్వమునుండి తొలగింపబడినపుడు అందరివలన ఆశ్రయము పొందుటకు నేను ఇట్లు చేసెదను' అని యజమానుని ఋణస్థులను ఒక్కొక్కరిని పిలిపించి, మొదటివానితో 'నీవు నా యాజమానునికి ఎంత ఋణపడి ఉన్నావు? అని అడిగెను. వాడు 'నూరు మణుగుల నూనె' అని చెప్పెను. అపుడు అతడు వానితో 'నీ ఋణపత్రము తీసికొని, వెంటనే దానిపై ఏబది అని వ్రాసికొనుము' అని చెప్పను. అంతట అతడు రెండవ వానితో 'నీవు ఎంత ఋణపడి వుంటివి?' అని అడిగెను. వాడు నూరుతూముల గోధుములు' అని బదులుపలికెను. అపుడు వానితో 'నీ ఋణపత్రము తీసికొని, ఎను...