సమరియా స్త్రీ దైవ ధ్యానం (తపస్సు కాలం - యోహాను 4) | కార్మెల్ శోభ
తపస్సు కాల మూడవ ఆదివారం యోహాను 4:5-42 యేసు సమరియాలోని సిఖారు పట్టణమునకు వచ్చెను. అది యాకోబు తన కుమారుడు యోసేపునకు ఇచ్చిన పొలము సమీపములో ఉన్నది. అక్కడ యాకోబు బావి ఉండెను. యేసు ప్రయాణపు బడలికచే ఆ బావి వద్ద కూర్చుండెను. అది మధ్యాహ్నపు వేళ. ఒక సమరీయ స్త్రీ నీటికొరకు అక్కడకు వచ్చెను. యేసు ఆమెను "నాకు త్రాగుటకు నీరు ఇమ్ము" అని అడిగెను. అయన శిష్యులు ఆహార పదార్ధములు కొనితెచ్చుటకు పట్టణమునకు వెళ్లియుండిరి. ఆ సమరీయ స్త్రీ యేసుతో, "యూదుడవైన నీవు సమరీయ స్త్రీనగు నన్ను నీరు ఇమ్మని ఎట్లు అడుగుచున్నావు?" అని అనెను. ఏలయన, యూదులకు సమరీయులతో ఎట్టి పొత్తునులేదు. అప్పుడు యేసు "దేవుని వరమును గ్రహించియున్న యెడల, 'త్రాగుటకు నీరు ఇమ్ము, అని అడుగుచున్నది ఎవరు అని తెలిసికొని ఉన్నయెడల, నీవే ఆయనను అడిగి ఉండెడిదానవు. అపుడు అయన నీకు జీవజలమును ఇచ్చి ఉండెడివాడు" అని సమాధాన మిచ్చెను. అపుడు ఆ స్త్రీ "అయ్యా! ఈ బావి లోతైనది. నీరు చెదుటకు నీయొద్ద ఏమియు లేదు. జీవ జలమును నీవు ఎక్కడినుండి తెచ్చెదవు? మా పితరుడగు యాకోబు మాకు ఈ బావిని ఇచ్చెను. అతడు, అతని కుమారులు, అతని...