పోస్ట్‌లు

జనవరి 10, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

మరణాన్ని జయించిన మృత్యుంజయుడు: ఈస్టర్ పండుగ ధ్యానం | కార్మెల్ శోభ

చిత్రం
 క్రీస్తు పునరుత్థాన మహోత్సవం  ప్రియమైన మిత్రులారా!అందరికి క్రీస్తు పునరుత్థాన మహోత్సవ శుభాకాంక్షలు. మానవ రక్షణ చరిత్రలో అంత్యంత ముఖ్యమైన పండుగ ఇది. ఇది మరణం మీద యేసు ప్రభువు యొక్క విజయం. సృష్టి ఆరంభం నుండి ఒకే ఒక సమాధి తెరువబడి ఖాళీగా ఉండి,  అక్కడ సమాధి చేయబడిన వ్యక్తిని ఆ సమాధి  బందించి అక్కడ ఉంచలేక పోయింది అని తెలుపుతుంది . ఆ సమాధి ఆయనను భందించలేక పోయింది. అందుకే పునీత పౌలు గారు మరణాన్ని అడుగుతున్నారు, మరణమా నీ విజయం ఎక్కడ ? భాదించగల నీ ముల్లు ఎక్కడ ? 1 కోరింథీ15 :55  అందరు నీకు దాసులే అని విర్ర వీగినా నీ గర్వం ఎక్కడ? అని అడుగుతున్నారు.  ఈ రోజు మనందరికీ ఆనందించే రోజు? ఎందుకంటే యేసు ప్రభువు మరణాన్ని జయించాడు. మరణానికి ఆయన మీద ఎటువంటి అధికారం లేదు, అని నిరూపించాడు. అంతే కాదు ఆయన వలె మనం కూడా, ఒక రోజు మరణం నుండి లేవవచ్చు అని నిరూపించాడు. తన శ్రమలు, మరియు మరణం యొక్క  ఫలితం ఈ రోజు మనకు చూపించాడు.  ఈ పునరుత్థానం ఆయన కొరకు కాదు మన కొరకు ఆయన దేవుడై ఇన్ని బాధలు , కష్టలు ఎందుకు అనుభవిస్తున్నారు? దాని ఉపయోగం ఏమిటి ? అని మనం ప్రశ్నిస్తే ? మనకు ...

నేనే గొర్రెలకు ద్వారమును: యోహాను 10:1-10 | కార్మెల్ శోభ

చిత్రం
 పాస్క కాలపు నాలుగవ ఆదివారం    యోహను 10:1-10  సువిశేషం : నేను మీతో నిశ్చయముగా చెప్పుట ఏమనగా గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కి వచ్చువాడు దొంగ , దోపిడికాడునై  ఉన్నాడు. ద్వారమున ప్రవేశించు వాడు గొర్రెల కాపరి. కావలి వాడు వానికి తలుపు తీయును: గొర్రెలు వాని స్వరమును  గుర్తించును. అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి, బయటకు తొలుకొని పోవును. తన గొర్రెలను అన్నింటిని బయటకు తొలుకొని వచ్చిన పిదప, వాడు వానికి ముందుగ నడచును. గొర్రెలు వాని స్వరమును గుర్తించును. కనుక, అవి  వాని వెంట పోవును. అవి పరాయి వాని స్వరమును ఎరుగవు. కనుక, అవి వాని  వెంట వెళ్ళక  దూరముగ పారిపోవును. యేసు వారికి ఈ దృష్టాంతమును వినిపించెను. కాని, ఆయన చెప్పుచున్నదేమో వారు గ్రహింపలేక పోయిరి. అందుచే యేసు మరల ఇట్లు చెప్పెను: "గొర్రెలు పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. నాకు ముందుగ వచ్చిన వారందరు దొంగలు, దోపిడి గాండ్రు, గొర్రెలు వారి ఆలకింపలేదు. నేనే  ద్వారమును! ఎవడేని నా ద్వార ప్రవేశించిన యెడల వాడు రక్షణ పొందును. అతడు వచ్చుచు పోవుచ...