పోస్ట్‌లు

క్రీస్తు కొరకు ప్రథమ హత సాక్షి పునీత స్తేఫాను చరిత్ర | కార్మెల్ శోభ

చిత్రం
  పునీత స్తేఫాను  స్తేఫాను అంటే కిరీటం అని అర్ధం. ఈయన అపోస్తులులు ఎన్నుకొన్న ఏడుగురు డీకనులలో ఒకరు. డీకనుగా స్తెఫాను అక్కడ ఉన్న ప్రజలకు సేవ చేయుటకు ఎన్నుకొనబడ్డాడు. స్తెఫాను జ్ఞానము కలిగి, పవిత్రాత్మతో నింపబడి, మంచి ప్రవర్తన కలవాడిగా అందరికీ తెలిసిన వ్యక్తి.  తన జ్ఞానం ద్వార దేవుని గురించి బోధించి, హింసించబడి చంపబడ్డాడు.  ఈయన భోదన యూదులను కోపమునకు గురిచేసింది. యూదులు ఆయన మీద చూపిన క్రోదాన్ని, ఆయనకు కీర్తిని తీసుకువచ్చేలా చేశాడు.  స్తేఫాను విశ్వాసం చాలా గొప్పది. ఆయన యూదుల చేత హింసించబడుతున్న అటువంటి అపనమ్మకం లేకుండా దేవుని  ఘనతను గురించి వారికి బోధించాడు.   ఎటువంటి పరిస్థితిలో కూడా దేవుని గురించి వివరిస్తూ ఎలా యూదులు తప్పుగా ఆలోచిస్తున్నారో వారికి తెలియజేయడంలో పూర్తిగా సఫలికృతం అయ్యారు. కాని ఆయనను వారు తప్పుగా అర్ధం చేసుకున్నారు. యేసు ప్రభువు బోధనలు ఈయన పాటించిన తీరు అందరు నేర్చుకోవాలి. తనను చంపుతున్న వారి కొరకు ప్రార్ధిస్తూ, ఆ పాపాన్ని వారి మీద వేయకండి అని వేడుకున్నాడు. మరణించే ముందు దేవుని ఇంత కష్టానికి గురిచేశాడని నిందించక, దేవునికి ...

క్రీస్తు శరీర రక్తముల మహోత్సవం: దివ్యసత్ప్రసాద విశిష్టత | కార్మెల్ శోభ

చిత్రం
     క్రీస్తు శరీర రక్తముల మహోత్సవము క్రిస్తునాదునియందు ప్రియ సహోదరులారా ఈ రోజు మనం క్రీస్తు శరీర రక్తముల మహోత్సవము  జరుపుకుంటున్నాం . ఇది    దివ్యసత్ప్రసాధ  దైవ సంస్కారానికి  సంభందిచ్చినది . ఈ పండుగ  యేసు ప్రభువుని దివ్య సాన్నిధ్యాన్ని అనుభవించాలి, ఆయనను నేను నా లోనికి ఆహ్వానించి, నాలో ఉండేలా  చేయాలనే కోరికతో    ఈ పండుగను చేసుకోవడము    జరిగినది. ఈ పండుగలో మనము  ముఖ్య ఉద్దేశం  క్రీస్తుని  అనుభవ పూర్వకంగా దివ్య సంస్కరము ద్వారా అనుభవించుడమే.  కడర భోజన సమ యాన యేసు ప్రభువు రొట్టెను తీసుకోని  ఇది నా శరీరము  మీరందరు దీనిని తీసుకోని  భుజించండీ అని చెపుతున్నారు.  ఒకరకంగా ఆయన తన శిష్యులను దేవుని స్వీకరించడానికి అర్హులుగా చేసున్నాడు.  కేవలము వారిని అర్హులుగా మాత్రమే కాక వారిని దేవున్నీ ఇతరులకు ఆందిచేవారిగా కూడా చేస్తున్నాడు. యేసు ప్రభువు వారి మద్య ఉండవలసీన  అవసరం ఉంది,  ఎందుకంటే  వారు ఎక్కువ తెలివి గలవారో , ఇతరులను ప్...

దైవ రాజ్యంలో గొప్పవారెవరు?: మార్కు 9:30-37 ధ్యానం | కార్మెల్ శోభ

చిత్రం
 25 వ సామాన్య ఆదివారం   సొలొమోను జ్ఞానగ్రంధము 2 :12,17 -20) (యాకోబు 3 :16 -4 :3.) (మార్కు 9 :30 -37)  ఈనాటి మొదటి పఠనముద్వారా  క్రైస్తవుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ఏ విధముగా హింసను ఎదుర్కోవాలో తెలుసుకోవచ్చు. దేవుని వ్యతిరేకులు ఏ విధముగా  మాటలాడుతారు అనేది మనము తెలుసుకుంటున్నాం.    పూర్వం  క్రైస్తవులను ప్రభుత్వాలు, పెద్దలు హింసించడము మొదలు పెట్టినప్పుడు  కొంతమంది క్రైస్తవులు వారి విశ్వాసాన్ని వీడి జీవించారు మనము మొదటి పఠనములో యూదుల గురించి వింటున్నాము కానీ మొదటి రెండు ,మూడు  శతాబ్ద క్రైస్తవులకు ఇటవంటి  హింసలకు కూడిన జీవితం ఎక్కువుగా  అనుభవించారు. కొంతమందిని అడవి మృగాలకు ఆహారముగా ఇచ్చారు, మరి కొంతమందిని ఘోరముగా హింసించి అగ్నికి ఆహుతి చేశారు, కొంతమందిని హింసించి చంపించారు.  కానీ చాలా మంది వారి విశ్వాసములో గట్టిగా నిలబడ్డారు. ఈరోజు మనకు ఉన్న సవాలు ఏమిటి అంటే  నేను క్రీస్తు విశ్వసిగా  హింసకు గురి అయినట్లయితే, హింసను తట్టుకొని   క్రీస్తు కోసము నిలబడగలనా ? అంత గొప్ప విశ్వాసము నాకు ఉన్నదా ? అన...

దైవ ప్రేమలో సహనము - పాప హేతువు: మార్కు 9:38-48 ధ్యానం | కార్మెల్ శోభ

చిత్రం
  26 వ సామాన్య ఆదివారం  ( సంఖ్యా   11:25-29)   ( యాకోబు   5:1-6 ) (మార్కు 9:38-43,45, 47-48)     ఈనాటి సువిశేషము సహనము, దేవుని అనుగ్రహాలు పొందటము, పాప హేతువు కాకుండా ఉండాలని      బోధిస్తుంది. సహనము అంటే    మనకు సంబంధం లేని వేరే వ్యక్తులను కూడా    భరించడమని      మనము అనుకుంటాము. మనము    వారికి ఎటువంటి హాని చేయకుండా వారి విశ్వాసాలను వారు పాటించుటకు ఆటంకం కలిగించకుండా , ఇతరులను సమస్యగా చూపక    ఉండటము అనుకుంటాము.     యేసు ప్రభువు సహనం గురించి చెబుతున్నప్పుడు అది    మనము అనుకుంటున్నట్లు    కాదని అర్దము అవుతుంది.    ఆయన దృష్టిలో సహనము అంటే ఒక వ్యక్తి పట్ల    సంపూర్ణమైన సానుభూతి    కలిగి ఉండటము. మరియు ఆ వ్యక్తిని పూర్తిగా    అర్దము చేసుకొని అంగీకరించడము మనలో ఒకరిగా      చేసుకోవటము.    దేవుని సహనము ఎలా ఉంటుంది దేవుని సహనము చాలా గొప్పది. అది ఎంత గొప్పది అంటే, పూర్వ నిబంధనల...

నిజమైన క్రీస్తు శిష్యుని లక్షణాలు: లూకా 14:25-33 | కార్మెల్ శోభ

చిత్రం
   23 వ సామాన్య ఆదివారం  లూకా 14:25-33   అప్పుడు గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను: నన్ను వెంబడింపగోరి ,తన తల్లిదండ్రులను, భార్యను,బిడ్డలను అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు. గోపురము కట్ట దలచిన వాడు కూర్చుండి వ్యయము గుణించి, దానిని పూర్తి చేయు సాధన సంపత్తి తన వద్ద ఉన్నదా, లేదా అని పర్యాలోచన చేయడా?అటుల కాక, పునాది వేసిన పిదప, నిర్మాణము పూర్తి చేయజాలని యెడల చూచు వారు, ఇతడు ఆరంభశూరుడే కాని కార్య సాధకుడు కాలేకపోయెను అని పరిహసించెదరు. ఒక రాజు యుద్దమునకు వెళ్ళుటకు ముందు, ఇరువది వేల సేనతో తన పై దండెత్తి వచ్చు శత్రురాజును తన పదివేల సేనతో ఎదుర్కొనగలనా అని ఆలోచింపడా? అంత బలము లేని యెడల, శత్రురాజు సమీపించక పూర్వమే రాయబారము పంపి అతనితో సంధి చర్చలు జరుపును. కనుక తన సమస్తము త్యజియించిన తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు.  "అప్పుడు గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను." యేసు ప్రభువు చేసే పనులను చూసి ఆయన ...

పితరుడైన ఈసాకు సంపూర్ణ జీవిత చరిత్ర | కార్మెల్ శోభ

చిత్రం
 ఈసాకు  సంపూర్ణ జీవిత చరిత్ర  వాగ్ధాన ఫలం  అబ్రహాము సారాలు అనేక సంవత్సరాలు సంతానం కోసం ఎదురుచూశారు. అబ్రహాము సారాలను  దేవుడు ఆశీర్వాదించి వారికి ఒక బిడ్డను వారి వృద్ధాప్యంలో ప్రసాదించాడు. ముసలితనంలో సారాకు  ఈసాకు జన్మించాడు. ఈసాకు జన్మించినప్పుడు అబ్రహాము వయసు 100 సంవత్సరాలు. ఈసాకు అను పేరును ఆయన పుట్టక పూర్వమే దేవుడు వారికి సూచించాడు. ఈసాకు  అంటే  "ఆయన నవ్వాడు" అని అర్ధం. సారా  జీవితంలో జరిగిన ఈ సంఘటన తనకు కూడా ఒక వింతలా ఉన్నది. అసంభవం అయినటువంటి సంఘటనకు ఆమెకే నవ్వు వచ్చింది. ఈ వయసులో  నేను గర్భం దాల్చడం ఏమిటో అనే ఆలోచనతో ఆమె నవ్వుకుంది.  పుట్టుకతోనే తల్లిని ఈసాకు నవ్వించినవాడు. ఈసాకు ఒడంబడిక పుత్రుడు మరియు దైవ వాగ్ధాన ఫలం.  సారా తన కుమారుడే అన్నింటికీ వారసుడు కావాలి అని అనుకున్నది అందుకే, ఆమె యిష్మాయేలును అక్కడ నుండి పంపించమని చెప్పినందుకు, అబ్రహము దానికి ఇష్ట పడకపోయిన దేవుడు ఆయనకు సారా చెప్పినట్లు చేయమని చెప్పారు.  తండ్రి మాటకు కట్టుబడే  కుమారుడు  అబ్రహము  బలి అర్పించటానికి మోరియా వెళుతున్నప్ప...

క్రీస్తు రాజు మహోత్సవం: అంతిమ తీర్పు - మత్తయి 25:31-46 | కార్మెల్ శోభ

చిత్రం
 క్రీస్తు రాజు మహోత్సవం    మత్తయి 25:31-46   "మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చునప్పుడు తన మహిమాన్విత సింహాసనంపై  ఆసీనుడగును. అపుడు సకలజాతులవారు అయన సముఖమునకు చేర్చబడుదురు. గొర్రెలకాపరి మేకలను, గొర్రెలను వేరు పరుచునట్లు అయన వారిని వేరుపరచును.  అయన గొర్రెలను తన కుడి ప్రక్కన, మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును. అపుడు సింహాసనాసీనుడైన రాజు తన కుడిప్రక్కన ఉన్న వారితో 'నా తండ్రిచే దీవింప బడిన  వారలారా! రండు. ప్రపంచ ప్రారంభమునుండి మీకై సిద్దపరుపబడిన రాజ్యమును చేకొనుడు. ఏలయన నేను ఆకలిగొనినప్పుడు మీరు ఆహారము నొసగితిరి, దప్పికగొనినపుడు దాహము తీర్చితిరి, పరదేశినై యున్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడనైయున్నపుడు వస్త్రములను ఇచ్చితిరి, రోగినై ఉన్నపుడు నన్ను దర్శింపవచ్చితిరి' అని పలుకును. అపుడు ఆ నీతిమంతులు 'ప్రభూ!నీవు  ఎపుడు ఆకలిగొనియుండుట చూచి, భోజనము పెట్టితిమి? దప్పికగొని యుండుట చూచి దాహము తీర్చితిమి?ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితిమి ?వస్త్ర హీనుడవై యుండుట చూచి వస్త్రములను ఇచ్చితిమి?ఎప్పుడు రోగివైయుండుట చూచి, పర...