పోస్ట్‌లు

యేసు ప్రభువును దేవాలయంలో అర్పించుట దైవ ధ్యానం | కార్మెల్ శోభ

చిత్రం
 యేసు ప్రభువును దేవాలయంలో ఆర్పించుట   లూకా 2: 22-35  మోషే చట్ట ప్రకారము వారు శుద్దిగావించు కొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలి చూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభువు ధర్మ శాస్త్రములో వ్రాయబడియున్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరుషలేమునకు తీసికొనిపోయిరి. చట్టప్రకారము "ఒక జత గువ్వాలనైనను, రెండు పావురముల పిల్లలనైనను" బలిసమర్పణ చేయుటకు అచటకు వెళ్ళిరి. యొరుషలేములో సిమియోను అను ఒక నీతిమంతుడు, దైవభక్తుడు  ఉండెను. అతడు యిస్రాయేలు ఓదార్పుకై  నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందుడెను. ప్రభువు వాగ్దానము చేసిన క్రీస్తును చూచువరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అపుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచారవిధులు నిర్వర్తించుటకు బాల యేసును లోనికి తీసుకొనిరాగా, సిమియోను ఆ బాలుని హస్తములలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను: "ప్రభూ! నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధనముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులారగాంచితిని. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు; నీ ప్రజలగు యిస్రాయేలీయ...

పునీత పేతురు పౌలు గార్ల మహోత్సవం దైవ ధ్యానం | కార్మెల్ శోభ

చిత్రం
 పునీత పేతురు, పౌలు గార్ల మహోత్సవం పేతురు గారు పవిత్ర గ్రంధంలో యేసు ప్రభువుని అపోస్తులులలో  ప్రముఖమైన శిష్యుడు. ఈయన బెత్సయిదా నుండి వచ్చిన ఒక జాలరి. బెత్సయిదా అంటే చేపల ఇల్లు అని అర్ధం. తరువాత ఆయన కపర్నాములో తన నివాసం ఏర్పారుచుకున్నాడు. పేతురు గారి తండ్రి గారి పేరు యోనా, ఇతనికి ఆంద్రెయ అను సోదరుడు కలడు. వీరు ఇద్దరు జాలరులే.  ఈయన మొదటిగా యేసు క్రీస్తును కలిసినది యోహను బాప్తిస్మం ఇస్తున్న యొర్ధాను నది తీరంలో ఉన్న  బేతానిలో. పేతురు మరియు ఆంద్రెయ గార్లు బాప్తిస్మ యోహను గారి యొక్క శిష్యులు. ఆంద్రెయ గారు యేసు ప్రభువు గురించి మొదట  పేతురు గారికి  తెలియచేశాడు. పేతురు అంటే రాయి అని అర్ధం. ఈయన అసలు పేరు సిమోను. సిమోను అంటే రెల్లు కాడలాంటి వాడు అని అర్ధం. పేతురు గారు కూడా మొదటిలో అలానే ఉన్నాడు. ఎవరు ఏమి మాటలాడిన వారికి భయ పడిపోయారు. కాని యేసు ప్రభువు ఆయనను దృడంగా మారుస్తున్నారు. ఆయనను పేతురును చేస్తున్నారు. తన సంఘానికి పునాదిగా చెస్తున్నాడు.  పేతురు గారు విలక్షణ లక్షణాలు కలిగిన వ్యక్తి. ఈయన జీవితాన్ని అనేక కోణాలులో విశదీకరించవచ్చు. సహజ సిద్దముగా ఈయన అ...

తిరు కుటుంబ మహోత్సవం Telugu | Holy Family Telugu | కార్మెల్ శోభ

చిత్రం
 తిరు కుటుంబ మహోత్సవం లూకా 2:22-40  మోషే చట్ట ప్రకారము వారు శుద్దిగావించు కొనవలసిన దినములు వచ్చినవి.  ప్రతి తొలి చూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభువు ధర్మ శాస్త్రములో వ్రాయబడియున్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరుషలేమునకు తీసికొనిపోయిరి. చట్టప్రకారము "ఒక జత గువ్వాలనైనను, రెండు పావురముల పిల్లలనైనను" బలిసమర్పణ చేయుటకు అచటకు వెళ్ళిరి. యొరుషలేములో సిమియోను అను ఒక నీతిమంతుడు, దైవభక్తుడు  ఉండెను. అతడు యిస్రాయేలు ఓదార్పుకై  నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందుడెను. ప్రభువు వాగ్దానము చేసిన క్రీస్తును చూచువరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అపుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచారవిధులు నిర్వర్తించుటకు బాల యేసును లోనికి తీసుకొనిరాగా, సిమియోను ఆ బాలుని హస్తములలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను: "ప్రభూ! నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధనముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులారగాంచితిని. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు; నీ ప్రజలగు యిస్రాయేలీయులకు మహిమను చేకూర్చు ...

ధనవంతుడు లాజరు ఉపమానం దైవ ధ్యానం (లూకా 16) | కార్మెల్ శోభ

చిత్రం
  సంపదను దైవ రాజ్యప్రవేశానికి మార్గంగా చేసుకోవచ్చు లూకా 16: 19-31  ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో, వినోదములతో కాలము గడుపు చుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడియుండెను. అతని దేహామంతయు వ్రణములతో నిండియుండెను. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడు మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకు చుండెను. ఆ నిరుపేద మరణింపగా. దేవదూతలు  అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడ చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు బాధ పడుచు పాతాళము నుండి సుదూరములో అబ్రహాము రొమ్మున ఆనుకొని వున్న లాజరును కన్నెత్తి చూచెను. అతడు అంగలార్చుచు 'తండ్రి అబ్రహామా!నన్ను కనికరింపుము. నేను ఈ మంటలలో మాడి పోవుచున్నాను. తన వ్రేలికొనను నీటిలో ముంచి, నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము ' అనెను.  అందుకు అబ్రహాము , కుమారా ! మరువకుము. నీ  జీవితములో  నీవు సకల సంపదలను అనుభవించు చుండ, లాజరు అష్ట కష్టములను అనుభవించేను. అందుచే నీవు ఇపుడు కష్టపడుచుండ, అతడు సుఖ పడుచున్నాడు. అంతేకాక, మన మధ్య దాటుటకు వీలులేని అగాధము ఉన్నది. అందువలన ఆచాటివారు ఇచ్చ...

ప్రవక్తి అన్నమ్మ జీవితం దైవ ధ్యానం (లూకా 2) | కార్మెల్ శోభ

చిత్రం
 దేవుని సన్నిదిలో జీవించే వారి జ్ఞానం  లూకా 2:36-40  అపుడు అచట అన్నమ్మయనెడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనూయేలు పుత్రిక. ఆమె కడువృద్ధురాలు. వివాహమైన పిదప ఏడు సంవత్సరాలు సంసారము చేసి, ఆ తరువాత ఎనుబదినాలుగు సంవత్సరాలుగా  విధవరాలై దేవాలయముచెంతనే ఉండిపోయను. ఉపవాసములు, ప్రార్ధనలు చేయుచు, రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగియుండెను. ఆమె  ఆక్షణముననే దేవాలయమునకు వచ్చి, దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరుషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభువు అజ్ఞానుసారము అన్ని విధులు  నెరవేర్చి, గలిలీయప్రాంతములోని  తమ పట్టణమగు నజరేతునకు తిరిగివచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై, పరిపూర్ణ జ్ఞానము కలవాడాయెను. దేవుని అనుగ్రహము ఆయనపై  ఉండెను.  ధ్యానం: అన్నమ్మ ఒక ప్రవక్తి , తన జీవితంలో ఎక్కువ సంవత్సరాలు ఆమె విధవరాలుగా, దేవలయంలోనే ఉన్నది. ఆమె ఫనుయేలు కుమార్తె అని చదువుతున్నాము.  అంటే తన భర్త పేరు కాకుండా తండ్రి పేరుతో ఆమెను పరిచయం చేస్తున్నారు అంటే ఆమె భర్త కన్నా ఆమె తండ్రి ఎక్కువ కాలం బ్రతికిఉంటాడు. ఆ రోజులలో యు...

సమరియా స్త్రీ దైవ ధ్యానం (తపస్సు కాలం - యోహాను 4) | కార్మెల్ శోభ

చిత్రం
 తపస్సు కాల మూడవ ఆదివారం   యోహాను 4:5-42 యేసు సమరియాలోని సిఖారు పట్టణమునకు వచ్చెను. అది యాకోబు తన కుమారుడు యోసేపునకు ఇచ్చిన పొలము సమీపములో ఉన్నది. అక్కడ యాకోబు బావి ఉండెను. యేసు ప్రయాణపు బడలికచే  ఆ బావి వద్ద కూర్చుండెను. అది మధ్యాహ్నపు వేళ. ఒక సమరీయ స్త్రీ  నీటికొరకు  అక్కడకు వచ్చెను. యేసు ఆమెను "నాకు త్రాగుటకు నీరు ఇమ్ము" అని అడిగెను. అయన శిష్యులు  ఆహార పదార్ధములు కొనితెచ్చుటకు పట్టణమునకు వెళ్లియుండిరి. ఆ సమరీయ స్త్రీ యేసుతో, "యూదుడవైన నీవు సమరీయ స్త్రీనగు నన్ను నీరు ఇమ్మని ఎట్లు అడుగుచున్నావు?" అని అనెను. ఏలయన, యూదులకు సమరీయులతో ఎట్టి పొత్తునులేదు. అప్పుడు యేసు "దేవుని వరమును గ్రహించియున్న యెడల, 'త్రాగుటకు నీరు ఇమ్ము, అని అడుగుచున్నది ఎవరు అని తెలిసికొని  ఉన్నయెడల, నీవే ఆయనను అడిగి ఉండెడిదానవు. అపుడు అయన నీకు జీవజలమును ఇచ్చి ఉండెడివాడు" అని సమాధాన మిచ్చెను. అపుడు ఆ స్త్రీ "అయ్యా! ఈ బావి లోతైనది. నీరు చెదుటకు నీయొద్ద ఏమియు లేదు. జీవ జలమును నీవు ఎక్కడినుండి  తెచ్చెదవు? మా పితరుడగు యాకోబు మాకు ఈ బావిని ఇచ్చెను. అతడు, అతని కుమారులు, అతని...

యేసు ప్రభువు రూపాంతరీకరణ దైవ ధ్యానం (మత్తయి 17) | కార్మెల్ శోభ

చిత్రం
తపస్సు కాల రెండవ ఆదివారం  మత్తయి 17: 1-9  ఆరు దినములు గడిచిన పిమ్మట  యేసు  పేతురును, యాకోబును, అతని సహోదరుడగు యోహానును తనవెంట తీసుకొని, ఒక ఉన్నత పర్వతముపైకి  ఏకాంతముగా వెళ్లెను. అచట వారి యెదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. అయన వస్త్రములు వెలుగు వలె తెల్లగానయ్యెను. ఆయనతో మోషే, ఏలీయాలు సంభాషించుచున్నట్లు వారికి కనబడిరి. అప్పుడు పేతురు "ప్రభూ !మనము ఇచటనుండుట మంచిది. నీకు అనుమతియైనచో నేను నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఎలియాకు మూడు శిబిరములను నిర్మింతును" అని పలికెను. అంతలో ఓక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో ఆ మేఘము నుండి "ఈయన నా కుమారుడు, నాకు ప్రియమైనవాడు. ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని. ఈయనను ఆలకింపుడు", అను వాని వినిపించెను. ఇది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోరగిలపడిరి. అప్పుడు యేసు వారి కడకువచ్చి, వారిని తట్టి , "లెండు , భయపడకుడు"అని పలికెను. అంతట వారు కనులెత్తిచూడగా వారికి యేసు తప్ప మరెవ్వరును కనిపించలేదు. వారు ఆ పర్వతమునుండి దిగి వచ్చుచుండగా యేసు వారితో " మనుష్య కుమారుడు మృతులనుండి లే...