మరియ ఫెలిసియా జీవిత చరిత్ర | కార్మెల్ సభ పునీతులు
పరాగ్వే లిల్లీ పుష్పం – మరియ ఫెలిసియా (చికితుంగ ) మరియ ఫెలిసియా గుగ్గియారి ఎచేవెరియా అనే కార్మెల్ సభ పునీతురాలు జనవరి 12 వ తేదీన , 1925 వ సంవత్సరంలో పరాగ్వే లోని వియారీక దె స్పిరితూ సంతోలో జన్మించింది. ఈమె కేవలం 34 సంవత్సరాలు మాత్రమే జీవించింది. ఈ 34 సంవత్సరాలలో కేవలం 4 సంవత్సరాలు మాత్రమే కార్మెల్ లో జీవించింది. ఆమెను తన తండ్రి చికితుంగ అనే ముద్దు పేరుతో పిలుచుకునేవాడు. ఆమె తండ్రి పేరు రామోన్ గుగ్గుయారీ మరియు తల్లి పేరు మరియ అర్మీండా ఎచేవెరియా . ఈమె ఏడుగురు సంతానంలో మొదటిగా బిడ్డగా జన్మించింది. 1929 వ సంవత్సరం ఫిబ్రవరి 28 వ తేదీన అంటే నాలుగు సంవత్సరాల ప్రాయంలో జ్ఞానం స్నానం పొందింది. 1937 వ సంవత్సరం డిసెంబర్ 8 వ తేదీన ప్రధమ దివ్య సత్ప్రసాదం స్వీకరించింది. ఈమె పరాగ్వే నుండి మొదటి పునీతురాలు. ఈమె బాల్యం నుండి కూడా పేదలకు సహాయం చేయుటకు ఎంతో శ్రద్ద చూపిస్తూ ఉండేది. వారి ఇంటిలో ఈమె ఆహారం కోసం లేక సహాయం కోసం వచ్చే వారికి కావలసిన వాటిని ఇచ్ఛే బాధ్యతను తీసుకొని ఎవరైనా సహాయం కోసం లేక ఆకలితో వచ్చిన వారికి తగిన వాటిని ఇస్తూ ఉండేది....