పితరుడైన యాకోబు చరిత్ర | Life Story of Jacob in Telugu
యాకోబు సంపూర్ణ జీవిత చరిత్ర పరిచయం ఈసాకు,రెబ్కాల రెండవ కుమారుడు యాకోబు, ఏసావుని కవల సోదరుడు. యాకోబు రక్షణ చరిత్రలో చాల ప్రముఖమైన వ్యక్తి. తాను సాధించాలి అనుకున్నదానిని, ఎంత కష్టించి అయిన సాధించుకోవుటలో, పట్టు విడువకుండ ఉండుటలో , నిరాశ దరిచేరనివ్వని ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. యాకోబు స్వభావం యాకోబులో రెండు రకాల స్వభావాలు మనం చూస్తాము. ఇతనిలో మంచి మరియు చెడు రెండు స్వభావాలు మనకు కనబడుతాయి. ఆయన తన జీవితంలో మంచి, చెడు చేసే విషయాలలో పడిపోతూ, లేస్తూ ఉంటాడు. తను పడిపోయిన కాని దేవుని చేత ఎన్నుకొనబడ్డాడు. మరియు ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు, తన బలహీనతలు మరియు శక్తి సామర్ధ్యాలు ఇవన్నీ కూడా ఆయన జీవితాన్ని చాలా ఆసక్తి కలిగిస్తాయి. ఇతని జీవితం బాహుముఖాలు కలిగిఉంది. ఈనాటి మానవ స్వాభావానికి సరిగ్గా సరిపోతాడు. యాకోబులో లోపాలు ఉన్నాయి కాని ప్రార్ధన పరుడు. నిలకడలేనితనం ఉంది కాని చివరిలో చాలా మార్పు చెందనివాడు అయ్యాడు. తన జీవిత మొదటి భాగంలో మంచి చెడులు ఉన్నాయి. ఆయన వ్యక్తిత్వం చాలా ఆసక్...