పోస్ట్‌లు

ఓ జీవ ప్రేమ జ్వాలా కవితా అంతరార్థం | St. John of the Cross Telugu - Carmel Shobha

చిత్రం
 ఓ  జీవ ప్రేమ జ్వాలా నా ఆత్మను  గాయపరచి  నాటి నుండి దాని నాభిలో నుండె  నీవు  క్రూరంగా లేవిప్పుడు నీ  ఇష్టమైతే నన్ను దహించిప్పుడు ఈ తెర  ఈ మధుర కలయికతో చీల్చు 2 ఓ స్వచ్ఛ మధురమా ఓ  ఆహ్లాదకర గాయమా ఓ మృదు హస్తమా  ఓ మృదు స్పర్శ నిత్య జీవాన్ని చవి చూపించే  ప్రతి అప్పు చెల్లించే నిన్ను హత్యచేయుటలో మరణం జీవ మయ్యే 3 ఓ అగ్ని దీపములారా ఎవరి శోభలో  నిగూడ గృహాల   భావనలో ఒకప్పుడు చీకటి  మరియు అంధత్వముండినను ఇప్పుడు   అసాధారణముగా  అద్భుతముగా వేడి మరియు వెలుతురుని తన ప్రియునికిస్తు 4 ఎంత మృదువుగా ప్రేమగా నీవు నా హృదయములో మేలుకొంటావు ఎక్కడ రహస్యముగా నీవు  నివసిస్తావో  నీ మధుర శ్వాస ద్వారా మంచి , మరియు మహిమతో నింపి ఎంత లేతగా నీవు నా హృదయాన్నీ  వ్యాపింప చేస్తావు  ఈ కవితా పంక్తులు క్రైస్తవ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఎంతో ప్రసిద్ధి చెందిన, పునీత సిలువ యోహాను (St. John of the Cross) గారు రాసిన "ఓ జీవ ప్రేమ జ్వాలా" (The Living Flame of Love / ¡Oh Llama de Amor Viva!) అనే ప్రసిద్ధ ఆధ్యాత్...

యేసు ప్రభువు పునరుత్థాన దర్శనాలు - మార్కు 16:9-15 |

చిత్రం
 యేసు ప్రభువు దర్శనములు  మార్కు 16: 9-15 ఆదివారము ప్రాతఃకాలమున పునరుత్తానుడైన యేసు, తాను ఏడూ దయ్యములను వెళ్లగొట్టిన మగ్ధలా మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను. ఆమె వెళ్లి ఆయనతో  ఉండినవారును, దుఃఖసాగరంలో మునిగియున్న ఆయన శిష్యులకును ఈ సమాచారమును అందచేసెను. ఆయన జీవించి ఉన్నాడనియు, ఆమెకు దర్శనమిచ్చెననియు విని వారు నమ్మరైరి. పిదప ఆయన ఒక గ్రామమునకు వెళ్లుచున్న ఇద్దరు శిష్యులకు వేరొక రూపమున దర్శనమిచ్చెను. వారు ఇద్దరు తిరిగి వచ్చి తక్కిన వారికి ఈ విషయమును తెలియపరచిరి. కానివారు నమ్మలేదు. తదుపరి పదునొకండుగురు శిష్యులు భోజనము చేయుచుండగా, యేసు వారికి ప్రత్యక్షమై, సజీవుడై లేచివచ్చిన తనను చూచిన వారి మాటలను కూడ  నమ్మనందున వారి అవిశ్వాసమునకును, హృదయకాఠిన్యముకును వారిని గద్దించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను: "మీరు ప్రపంచ మందంతట తిరిగి, సకలజాతి జనులకు సువార్తను బోధింపుడు.    ఈ వచనాలు యేసు ప్రభువు పునరుత్థానము నిద్ధారణము మరియు శిష్యులకు ఓదార్పును తెలియజేస్తూ, వారు చేయవలనసిన కర్తవ్యము గురించి తెలియజేస్తున్నాయి. ఈ దర్శనములు వారిలో ఉన్న అపనమ్మకమును తీసివేయుటకు ఆయన సువార్తను...

సత్యము కోసం నిలబడుట | Mark 6:14-29 Telugu Homily - Carmel Shobha

చిత్రం
  మార్కు 6 : 14 – 29 ప్రభువు పేరు ప్రసిద్ధికెక్కెను. హేరోదు రాజు అది వినెను. "స్నాపకుడగు యోహాను మృతులలో నుండి లేచెను. అందువలననే ఇతనియందు అద్భుత శక్తులు కార్యరూపములు తాల్చుచున్నవి" అని కొందరు "ఇతడు ఏలీయా" అని మరికొందరు, "ఇతడు ప్రవక్తలలో ఒకనివలె ఉన్నాడు" అని ఇంక కొందరును చెప్పుకొనుచుండిరి. కాని, అది వినిన హేరోదు "నేను శిరచ్చేదనము గావించిన యోహానే మృతములనుండి లేపబడెను" అని పలికెను. తన తమ్ముడగు ఫిలిప్పు భార్య హేరోదియా నిమిత్తము హేరోదు యోహానును పట్టి, బంధించి, చెరసాలలో పడవేసెను. ఏలయన, అతడు హేరోదియాను వివాహమాడియుండెను. అంతే కాక యోహాను "నీవు నీ సహోదరుని భార్యను వివాహమాడుట సరికాదు" అని హేరోదును హెచ్చరించుచుండెను. హేరోదియా యోహానుపై పగబట్టి అతనిని చంపదలచెను. కాని, ఆమెకు అది సాధ్యము కాకపోయెను. ఏలయన , యోహాను నీతిమంతుడు, పవిత్రుడు అని హేరోదు ఎరిగి, అతనికి భయపడి అతనిని కాపాడచూచెను. అతని హితోపదేశములకు హేరోదు కలతచెందినను వానిని ఆలకింప మనస్సు కలవాడై ఉండెను. తుదకు హేరోదియాకు ఒక చక్కని అవకాశం కలిగెను. హేరోదు తన జన్మ దినోత్సవము కొలువులోని ప్రధాన...

నీటివలన ఆత్మవలన నూతన జన్మ: యోహాను 3:1-8 ధ్యానం

చిత్రం
   నీటివలన ఆత్మ వలన నూతన జీవం   యోహాను 3:1-8 పరిసయ్యులలో నికోదేము అను యూదుల అధికారి ఒకడు ఉండెను. అతడు ఒకరాత్రి యేసు వద్దకు వచ్చి "బోధకుడా! నీవు దేవుని యొద్దనుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. ఏలయన, దేవునితోడు లేనియెడల నీవు చేయుచున్న అద్భుత సూచకక్రియలను ఎవడును చేయలేడు" అని పలికెను. యేసు అందుకు అతనితో, "మనుష్యుడు నూతనముగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." అని పలికెను అందుకు నికోదేము, "వృద్ధుడైన మనుష్యుడు మరల ఎటుల జన్మింపగలడు? అతడు తల్లిగర్భమున రెండవ పర్యాయము ప్రవేశించి జన్మింపగలడా?" అని అడిగెను. అపుడు యేసు,"ఒకడు నీటివలన, ఆత్మవలన జన్మించిననేతప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరములముగ జన్మించినది శరీరమును, ఆత్మమూలముగ జన్మించినది ఆత్మయునైయున్నది. నీవు మరల జన్మింపవలయునని  నేను  చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనటుల వీచును. నీవు దాని శబ్దమును వినెదవే కాని అది ఎక్కడనుండి వచ్చునో, ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మ వలన జన్మించు ప్రతివాడును అటులనే ఉండును...

నూతనంగా జన్మించుట మరియు క్రీస్తు ఎత్తబడటం: యోహాను 3:7-15

చిత్రం
 నూతనంగా  జన్మించుట యోహాను 3: 7-15 నీవు మరల జన్మింపవలయునని నేను చెప్పిన్నందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనటుల వీచును. నీవు దాని శబ్దమును వినెదవే కాని అది ఎక్కడనుండి వచ్చునో, ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మవలన జన్మించు ప్రతివాడును అటులనే ఉండును" అనెను. "ఇది ఎటుల సాధ్యమగును?" అని నికోదేము అడిగెను. అందులకు యేసు: "నీవు యిస్రాయేలు బోధకుడవైయుండియు దీనిని ఎరుగవా? మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము. చూచినదానికే సాక్ష్యమిచ్చుచున్నాము. కాని, మా సాక్ష్యమును మీరు అంగీకరింపరు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పిన మీరు నమ్ముట లేదు. ఇక పరలోక సంబంధమైన విషయములు చెప్పిన యెడల ఎట్లు నమ్మెదరు. పరలోకము నుండి దిగివచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు. "మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్యజీవము పొందుటకు అట్లే మనుష్యకుమారుడును ఎత్తబడవలెను.  నూతన జీవితం - క్రీస్తు ఎత్తబడటం  ఈ సువిశేష భాగంలో నూతన జీవితం ఎలా మొదలవుతుంది, దానికి ఏమి చేయాలి అని మరియు ఏవిధంగా క్రీస్తు మోషే కంచు సర్పమ...

నిత్య జీవము మరియు శాశ్వత భోజనము: యోహాను 6:22-29 ధ్యానం | కార్మెల్ శోభ

చిత్రం
నిత్య జీవము ఎలా వస్తుంది యోహాను 6: 22-29  మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యేసు వెళ్లలేదనియు, శిష్యులు మాత్రమే వెళ్ళుటకు చూచిరి. అయినను యేసు ధన్యవాదములు సమర్పించి, ప్రజలకు రొట్టెను పంచి ఇచ్చిన స్థలముచెంతకు తిబెరియానుండి కొన్ని పడవలువచ్చెను. అక్కడ యేసుగాని, శిష్యులుగాని లేకుండుటను చూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫర్నామునకు పోయిరి. ప్రజలు సరస్సు ఆవలివైపున యేసును కనుగొని "బోధకుడా! మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితిరి?" అని అడిగిరి. "మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్నువెదకుచున్నారు. నా సూచక క్రియలను చూచి కాదు అని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్యజీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్యకుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలయన తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసియున్నాడు" అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు "దేవుని కార్యములను వేరవేర్చుటకు మేము ఏమి చేయవలయును?" అని వారడుగగా, యేసు, దేవుడు పంపినవానిని విశ్వసింపుడు. అదియ...

దేవుడు తన కుమారుణ్ణి ఎందుకు పంపాడు? | యోహాను 3:16-21 దైవ ధ్యానం

చిత్రం
  దేవుడు తన కుమారున్ని ఎందుకు పంపాడు?  యోహాను 3: 16-21  దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు  ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై  అటుల చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కాని, దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలయన, దేవుని ఏకైక  కుమారుని నామమున అతడు విశ్వాసమునుంచలేదు. ఆ తీర్పు ఏమన, లోకమున వెలుగు అవతరించినది. కాని మనుష్యులు దుష్క్రియలు చేయుచు, వెలుగు కంటె చీకటినే ఎక్కువగ ప్రేమించిరి. దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. అతడు తన దుష్క్రియలు బయల్పడకుండునట్లు వెలుగును సమీపింపడు. కాని, సత్యవర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగ చేయబడినవని ప్రత్యక్షమగుటకు వెలుగును సమీపించును" అని సమాధానమిచ్చెను.  ఈ వాక్యాలు దేవుడు ఎంతగా ఈ లోకమును ప్రేమించినది, అదేవిధంగా మానవుడు నాశనము చెందకుండా తన కుమారుణ్ణి పంపిన విషయం, ఆ కుమారుణ్ణి విస్వసించుట ద్వారా వారు నిత్యజీవము పొందుతారని, ప్రభువు లోకమునకు వెలుగుగా వచ్చార...